నిత్య జీవితంలో భాగమైన వంటగ్యాస్ వాడకం పట్ల నిర్లక్ష్యం చేస్తే పెద్ద ప్రమాదమే. ఇంట్లో ఉండే ప్రమాదకర సిలిండర్ పట్ల ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. గ్యాస్ అవసరం లేకుంటే కట్టేయడం, సిలిండర్ పరిసరాల్లో మంట కారకాలు ఉంచడం మంచిదికాదు. సిలిండర్ వాడకంలో మెలకువలు సిలిండర్ నిలువుగా పెట్టి ఉంచాలి. సూర్యరశ్మీకి, వర్షానికి, వేడి తగిలేటట్లు ఉంచరాదు. మూసి ఉంచిన బీరువాలో కానీ అలమరాలో గానీ ఉంచితే ప్రమాదమే. గ్యాస్ సిలిండర్, రబ్బర్, ట్యూబ్, రెగ్యులేటర్ మార్చడానికి స్థలం ఖాళీగా ఉంచాలి. సిలిండర్ దగ్గర్లో కిరోసిన్, గుడ్డ సంచులు, కాగితాలు మొదలగు వస్తువులు ఉంచరాదు. సేప్టిక్యాప్ సిలిండర్‌కు ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ప్రెషర్ రెగ్యులేటర్ నుంచి తగు ప్రెషర్ వస్తుందో లేదో తెలుసుకోవాలి. సరైన కండీషన్లో ఉందా లేదా చెక్ చేయించుకోవాలి. ఐఎస్ఐ అనుమతి ఉన్న పరికరాలే వాడాలి. గ్యాస్‌స్టవ్ మొదలు, రెగ్యులేటర్, ట్యూబ్, లైటర్ అన్ని నాణ్యమైన పరికరాలు వాడాలి. రబ్బరు ట్యూబ్ పాడవకుండా చూసుకోవాలి. పగుళ్లు రాకుండా చూసుకోవాలి. మీటరు నుంచి మీటరున్నర పొడవు ఉండేటట్లు చూసుకోవాలి. తయారు నుంచి 30 నెలలు మించి వాడరాదు. వలయ ఆకారంలో అమర్చుకోవాలి. గ్యాస్ పొయ్యి సిలిండర్ కంటే ఎత్తులో ఉంచాలి. తరచూ పొయ్యిని శుభ్రం చేసుకోవాలి. సర్వీసింగ్ చేసిన తర్వాత బర్నల్, సిమ్మర్ క్రమంలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. వంట గదిలో తగినంత వెలుతురు ఉండేటట్లు చూసుకోవాలి. వంట గదిలో పూజకు సంబంధించిన దీపం తదితరాలు ఉంచరాదు. రిప్రిజిరేటర్ తదితర వస్తువులు ఉంచితే ప్రమాదమే. ప్రెష్ రెగ్యులేటర్ బిగించడం, తదితర విషయాలపై అవగాహన ముఖ్యం. రాత్రి పడుకొనే ముందు రెగ్యులేటర్ స్విచ్ ఆపేయాలి. మరికొన్ని విషయాలు సిలిండర్ ఇంటికి చేర్చాక ఆ రశీదులో ఉన్నటువంటి ఫోన్ నెంబర్లు, అడ్రస్ ప్రకారం ఉన్న సెల్‌ఫోన్ నెంబర్లు విడిగా రాసుకుని ఉంచడం మంచిది. ఏదైనా సిలిండర్, గ్యాస్ సంబంధమైన సమస్యలు వచ్చినప్పుడు ముందుగా సంబంధిత ఏజెన్సీవారికి ఫోన్ చేయాలి. వారు స్పందించనిపక్షంలో అధికా రులకు ఫిర్యాదు చేయవచ్చు. ఉండాల్సిన గ్యాస్ ఇలా వాణిజ్య సిలిండర్‌లో ఉండాల్సిన గ్యాస్ 19 కిలోలు గృహ అవసరాల ఎల్పిజి సిలిండర్‌లో ఉండాల్సిన గ్యాస్ 14.20 కిలోలు గ్సాన డెలివరీ బారు విధిగా తమతోపాటు వెయిట్ మిషన్ తేవాల్సి ఉంది. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు