2014 - 15 కేంద్ర బడ్జెట్లో విద్యుత్ రంగానికి బడ్జెట్ కేటాయింపులు : 2014-15 సంవత్సరం కేటాయింపులు రూ.9,543.90 కోట్లు కాగా 2013-14 బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.5,410.86 కోట్లు. దేశాభివృద్థిలో విద్యుత్ రంగం అత్యంత కీలకమని భావిస్తున్న మోడీ ప్రభుత్వం తన తొలి బడ్జెట్లో పునరుత్పాదక, పర్యావరణహిత విద్యుదుత్పత్తికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. భారీ స్థాయిలో సౌరవిద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు, పార్కులు నెలకొల్పడానికి అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రయత్నించింది. దీనికోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.వెయ్యి కోట్లు కేటాయించారు. విద్యుదుత్పత్తి, పంపిణీ, సరఫరా రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించేలా పదేళ్లపాటు పన్ను మినహాయింపులనూ ప్రకటించారు. సూర్యరశ్మి బాగా ఉండే రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, జమ్ము కాశ్మీర్‌లోని లడక్‌లలో అత్యధిక సామర్థ్యం ఉన్న (అల్ట్రా మెగా) సౌర విద్యుత్ ప్రాజెక్టులను స్థాపించాలని నిర్ణయించారు. దీనికోసం ప్రత్యేకంగా రూ.500 కోట్లు కేటాయించారు. వ్యవసాయానికి, తాగునీటి పంపింగ్‌కు వినియోగిస్తున్న సాధారణ మోటార్ల స్థానంలో సౌరవిద్యుత్‌తో నడిచే మోటార్లను వినియోగించడం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇలాంటి లక్ష మోటార్లను మార్చాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందుకు రూ.400 కోట్లు కేటాయింపు. కాలువ గట్లపై మెగావాట్ సామర్థ్యంగల సౌరవిద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు రూ.100 కోట్లు కేటాయించారు. గుజరాత్ తరహాలో నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఫీడర్లను వ్యవసాయ, గృహ వినియోగ రకాలుగా విభజించనున్నారు. 'దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన'గా పిలిచే ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు. దీనికి రూ.500 కోట్లు కేటాయించారు. విద్యుత్ కోతలతో సతమతమవుతున్న ఢిల్లీలో విద్యుత్ సంస్కరణల కోసం రూ.200 కోట్లు కేటాయింపు. 2017, మార్చి 31 నాటికి విద్యుదుత్పత్తి పంపిణీ, సరఫరా ప్రారంభించే సంస్థలకు ఏడాది ప్రాతిపదికన కాకుండా పదేళ్లపాటు పన్ను విరామాన్ని (ట్యాక్స్ హాలిడే) విస్తరించడానికి ప్రతిపాదన. సంప్రదాయ, పునరుత్పాదక విద్యుత్‌ల అనుసంధానానికి గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టు ప్రారంభం. తద్వారా పవన, సౌర విద్యుత్‌ను ఎక్కడ ఉత్పత్తి చేసినా దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావొచ్చన్నది ప్రభుత్వ యోచన. సౌర విద్యుత్ ఉత్పత్తిలో వినియోగించే ఫొటోవోల్టాయిక్ సెల్స్ దిగుమతుల ప్రోత్సాహక విధానంలో మార్పులు తీసుకురానున్నారు. ఫొటోవోల్టాయిక్ రిబ్బన్లలో వాడే రాగి తీగ తయారీదారులకు దిగుమతి సుంకాల్లో మినహాయింపులు. సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించే యంత్రాలు, యంత్ర పరికరాలపై విధించే దిగుమతి సుంకాల తగ్గింపు 5 శాతం వరకూ విస్తరణ. 2015 మార్చి నాటికి విద్యుదుత్పత్తి ప్రారంభించే థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నింటికీ బొగ్గు సరఫరా సమస్య లేకుండా చూడటం. ఆధారము: అద్య స్టడీ బ్లాగ్