ఒక గ్రామాన్ని ఎప్పుడు విద్యుద్ధీకరణ గ్రామంగా పిలుస్తారంటే అక్టోబరు 1997 కు ముందు ఒక రెవిన్యూ గ్రామ పరిధిలోనే విద్యుత్ ను ఎలాంటి అవసరం కోసమైనా వినియోగిస్తున్న గ్రామాన్ని విద్యుద్ధీకరణ గ్రామంగా పిలువడం జరిగింది. అక్టోబరు 1997 తరువాత ఒక రెవిన్యూ గ్రామ పరిధిలో నివాసమున్న ప్రాంతమంతా విద్యుద్ధీకరణ చేసి, ఎలాంటి అవసరము కోసమైనా విద్యుత్ ను వినియోగించుకుంటుంటే ఆ గ్రామాన్ని విద్దుద్ధీకరణ గ్రామంగా భావిస్తారు. 2004-05 నుంచి అమలులోకి వచ్చిన విద్దుద్ధీకరణ గ్రామానికి కొత్త నిర్వచనం (విద్యుత్ శాఖా మంత్రిత్వ శాఖచే విడుదలైన ఉత్తర్వులు మరియు ఉత్తరం సంఖ్య. 42/1/2001-D(RE) తారీఖు ఫిబ్రవరి 5, 2004 మరియు దానికి సంబంధించిన ఉత్తరాలు సంఖ్య 42/1/2001-D(RE) తారీఖు ఫిబ్రవరి 17, 2004.) కొత్త నిర్వచనం ప్రకారం ఒక గ్రామాన్ని విద్యుద్ధీకరణ గ్రామమని నిర్ధారించాలంటే : విద్యుత్ పంపిణీకి అవసరమైన ట్రాన్స్ ఫార్మరు, పంపిణీకి అవసరమైన తీగలు, స్థంబాలు మరియు ఆ గ్రామంతో పాటు ఆ గ్రామానికే చెందిన హరిజన కాలనీకి కూడా అందించే విధంగా విద్యుత్ కు సంబంధించిన ప్రాథమిక మౌళిక వసతులు కలిగి ఉండాలి. పాఠశాలలు, పంచాయితీ కార్యాలయము, ఆరోగ్య కేంద్రాలు, వైద్యశాలలు, సామాజిక కేంద్రాలు మొదలగు సామాజిక పరమైన భవనాలుకు విద్యుత్ సరఫరా ఉండాలి. ఆ గ్రామంలోని మొత్తం కుటుంబాల సంఖ్యతో పోల్చి చూసినప్పుడు విద్యుద్దీకరణ పొందిన కుటుంబాల సంఖ్య కనీసం 10 శాతం అయిన ఉండి ఉండాలి. జాతీయ విద్యుచ్ఛక్తి కార్యా చరణ విధానం - 2005 జాతీయ విద్యుచ్ఛక్తి కార్యాచరణ విధానం, (National Electricity Policy), సాధించదలచుకున్న లక్ష్యాలు దిగువ పేర్కొనబడ్డాయి. విద్యుచ్ఛక్తి అందుబాటు (Access to Electricity) :- రాబోయే ఐదు సంవత్సరాలలో, అన్ని గృహాలకు అందుబాటులో (చేరువలో) విద్యుచ్ఛక్తి ని తీసుకుని రావడం. అందుబాటులో విద్యుత్త్ :- 2012 సంవత్సరానికి పూర్తిగా విద్యుచ్ఛక్తి అవసరాలను తీర్చగలగడం. అత్యావశ్యక సమయాల్లో విద్యుచ్ఛక్తి ప్రసారంలో వచ్చే గరిష్ట ప్రమాణ కొరతలను అధిగమించడం, మరియు విద్యుచ్ఛక్తి ప్రవాహ అదనపు నిలువలను అందుబాటులో ఉంచడం. మన్నిక శ్రేష్టత గల విద్యుచ్ఛక్తి, కొన్ని నిర్ధిష్ట ప్రమాణాలననుసరించి, మంచి సామర్ధ్యంతో సమంజసమైన ధరలలో సరఫరా చేయడం. 2012 సంవత్సరానికి ప్రతీ వ్యక్తీకి అందుబాటులో ఉండే విద్యుచ్ఛక్తి 1000 యూనిట్లు కు పెంచగలగడం. 2012 సంవత్సరానికి, కనీస వినియోగం / యూనిట్ / 1 గృహానికి ఒక రోజుకు అన్న లక్ష్యం కలిగి ఉండడం. విద్యుత్ రంగాన్ని ఆర్ధిక పరిపుష్టి మరియు వ్యాపారపరంగా విజయం సాధించేటట్లు చేయడం. వినియోగదారుల అవసరాలను కాపాడడం. సుదూర గ్రామాల విద్యుధీకరణ కార్యక్రమం సుదూరంగా ఉన్న జనాభా కలిగిన అన్ని గ్రామాలకు విద్యుధీకరణ చేయడం, మరియు సౌరశక్తి చిన్న జల విద్యుత్ కేంద్రం, వృక్షజాలవ్యర్థాల శక్తి ఉత్పత్తి, పవనశక్తి, సంకీర్ణ వ్యవస్థలు మొదలైనవాటి వంటి సంప్రదాయ శక్తి వనరులుకాని వనరుల ద్వారా, విద్యుధీకరణ చేయబడిన జనాభా కలిగిన గ్రామాలలోని మారుమూల పల్లెలకు విద్యుధీకరణ చేయడం, సుదూర గ్రామాల విద్యుధీకరణ కార్యక్రమం (ఆర్ వి ఇ) యొక్క ముఖ్య ఉద్దేశం. విద్యుధీకరణ కాని సుదూరంగా ఉన్న జనాభా గల గ్రామాలు, మరియు విద్యుదీకరణ చెందిన జనాభా గల గ్రామాలలోని మారుమూల పల్లెలపై దృష్టి సారించడం ద్వారా, విద్యుచ్ఛక్తి యొక్క ఫలితాలను దేశంలోని బాగా వెనుకబడిన, వనరులు లేని ప్రాంతాల ప్రజలకు అందజేయడం ఈ కార్యక్రమం తన లక్ష్యంగా పెట్టుకుంది. లక్ష్యం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం క్రింద పేర్కొనబడినది. అన్ని సుదూరంగా గల జనాభా కలిగిన, విద్యుధీకరణ చెందని గ్రామాలన్నిటికి, 2007 సంవత్సరాంతానికి విద్యుధీకరణ విద్యుధీకరణ చెందిన జనాభా గల గ్రామాలలోని విద్యుదీకరణ చెందని మారుమూల పల్లెలకు, 2012 సంవత్సరాంతానికి విద్యుధీకరణ సుదూరంగా ఉన్న జనాభా కలిగిన గ్రామాలు మరియు పల్లెలలోని అన్ని ఇండ్లకూ, 2012 సంవత్సరాంతానికి విద్యుధీకరణ చేయడం. అన్ని విద్యుధీకరణ చెందని సుదూర జనాభా కలిగిన గ్రామాలు లేదా విద్యుధీకరణ చెందిన జనాభా గల గ్రామాలలోని మారుమూల పల్లెలు, పదకొండో పంచవర్షప్రణాళికాంతానికి (2012) సంప్రదాయ వనరుల ద్వారా విద్యుధీకరణ చేయబడవు అని, సంబంధిత విద్యుత్ శాఖ/రాష్ట్ర విద్యుత్ మండలి ధృవీకరించిన పక్షంలో, ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది. ఈ పథకాలకు కేంద్ర ఆర్ధిక సహకారం మంత్రిత్వశాఖ, ముందుగా నిర్ణయింపబడిన గరిష్ట ధరల ప్రకారం, ఉపయోగించే వివిధ పునరుత్పాదక శక్తి పరికరాలు/వ్యవస్థలకు అయ్యే ఖర్చులో 90 శాతం రాయితీనిస్తుంది. ఇంతేకాకుండా, రాష్ట్ర కార్యాచరణ సంఘాలకు చాలా ఇతర ప్రోత్సాహ సహకారాలు మరియు తగిన మొత్తం లో సేవా ఛార్జీలు ఇస్తుంది. ఆధారము: http://mnre.gov.in/ రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుద్ధీకరణ పథకం అమలులో ఉన్న అన్ని పథకాలను సమ్మిళితము చేసి రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుద్ధీకరణ పథకాన్ని (ఆర్ జి జి వివై ) ఏప్రిల్ 2005లో ప్రారంభించారు. ఈ పథకం క్రింద, భారత ప్రభుత్వం 90శాతము సహాయాన్ని మరియు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కోర్పరేషన్ (ఆర్ ఇ సి) ద్వారా 10శాతము ఋణము రాష్ట్ర ప్రభుత్వాలకి ఇచ్చారు. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కోర్పరేషన్ (ఆర్ ఇ సి) ఈ పథకానికి మూల కేంద్రం గ్రామీణ విద్యుద్ధీకరణకి నిర్వచనం ఒక గ్రామం విద్యుద్ధీకరించబడింది అని ప్రకటించాలంటే: ప్రవాస ప్రాంతాలలో మరియు దళిత బస్తీ ఉండేచోట డిస్ట్రిబ్యూషన్ టాన్సఫార్మర్ మరియు డిస్ట్రిబ్యూషన్ లైన్లు వంటి మౌలిక ఉపకరణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలి పాఠశాల, పంచాయతి కార్యాలయము, ఆరోగ్య కేంద్రాలు,మందుల అంగళ్ళు, కమ్యూనిటీ కేంద్రాలు మొదలైన ప్రాంతాలకు విద్యుత్తుని ఏర్పాటు చేయాలి. గ్రామంలోని మొత్తం ఇళ్ళలో కనీసం 10 శాతం ఇళ్ళకు విధ్యుత్తుని అందించాలి. ఆర్ జి జి వై లక్ష్యాలు క్రొత్త నిర్వచనం ప్రకారం అన్నిగ్రామాలను, ప్రవాస ప్రాంతాలను విద్యుద్ధీకరణ చేయడం. అన్నిగ్రామీణ ప్రాంత ఇళ్ళకి విద్యుత్తు అందుబాటులో వుండేటట్లు అనుమతిని ఏర్పాటు చేయడం దారద్ర్యరేఖకి దిగువనున్న కుటుంబాల(బి పి ఎల్)కి ఉచితంగా విద్యుత్తు కనెక్షన్ ఇవ్వడం ఆర్ జి జి వై క్రింద ఉపకరణ సౌకర్యాలు రూరల్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ బ్యాక్ బోన్ (ఆర్ ఇ డి బి) సరిపోయేంత సామర్థ్యంగల 33/11 కెవి (లేదా 66/11 కెవి) సబ్ స్టేషన్లతో లేని బ్లాకులలో వాటి ఏర్పాటు గ్రామాలలో /ప్రవాస ప్రాంతాలలో తగిన సామర్థ్యంగల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ తో గ్రామీణ విద్యుద్ధీకరణ ఉపకరణ సౌకర్యం (వి ఇ ఐ) గ్రిడ్ సరఫరా సాధ్యంకాని లేదా లాభదాయకంగా లేని చోట సాంప్రదాయక & అసాంప్రదాయక శక్తి వనరుల ఆధారముగా వికేంద్రీకృత డిస్ట్రిబ్యూషన్ ఉత్పత్తి (డి డి జి) విధానాలు ఆర్ జి జి వై అమలు పరచే విధానము మరియు నిబంధనలు: టర్న్ కీ విధానంలో ఆచరించటానికి అనువుగా జిల్లా ఆధారిత సవిస్తారమైనా ప్రణాళిక నివేదికలను తయారు చేయడం కొన్ని ప్రణాళికలను అమలు చేయడంలో విద్యుత్ శక్తి మంత్రిత్వ శాఖ యొక్క కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను నిమగ్నం చేయడం సంబంధిత గ్రామ పంచయితీల ద్వారా గ్రామాలు విద్యుద్ధీకరించ బడినవని ధృవపరచడం. మెరుగైనా వినియోగదారుల సేవలకి మరియు నష్టాల్ని తగ్గించే యాజమాన్యానికి కంపెనీ తరపు నుండి ఫ్రాంచైస్ నియుక్తించడం. ఆర్ జి జి వై నెట్ వర్కులో రోజుకు కనీసం 6- 8 గంటలు విద్యుత్తుని సరఫరా చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించడం రాష్ట్రం ద్వారా అవసరమైన రాబడి రాయితీలని ఏర్పాటు చేయడం వ్యాపారపరంగా విజయం సాధించే విధంగా ప్రభుత్వం తరపు నుండి నియక్తించే కంపెనీకి బల్క్ సప్లై టరీఫ్ (బి ఎస్ టి) సరఫరా ధరని నిర్ణయించడం. మూడు శ్రేణుల నాణ్యతగల పర్యవేక్షణ విధానాన్ని XI ప్లాన్ పథకాలకు తప్పని సరి చేయడం. ప్రగతిని వెబ్ ఆధారిత పర్యవేక్షణ చేయడం. ముందుగా నిర్ణయించిన ముఖ్యమైన మైలు రాళ్ళను సాధించుటకు లింకు చేయబడిన నిధులను విడుదల చేయడం కంట్రాక్టర్ల స్థాయి వరకు నిధులను ఎలక్ట్రానిక్ ట్రాన్స్ ఫర్ చేయడం. రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా గ్రామీణ విద్యుద్ధీకరణ ప్రణాళికల నోటిఫికేషన్ ని ఇవ్వడం. 100 కన్నా ఎక్కువ జనాభా వున్న ప్రవాసాలు ఈ పథకంలోనికి వస్తారు. XI ప్రణాళిక సమయంలో, 49,383 గ్రామాల విద్యుద్ధీకరణకు మరియు దారిద్ర్య రేఖకు దిగువనున్న ఇళ్ళకి 162 లక్షల విధ్యుత్ కనెక్షన్లు ఇవ్వాడానికి రూ. 16,268 కోట్ల రూపాయల ఖర్చుతో 327 ప్రణాళికలు మంజూరు చేయబడ్డాయి. ఆర్ జి జి వై పథకంలో, అండమాన్ & నికోబార్ దీవులు, చంఢీఘర్, దాద్రి & నగర్ హవేలి, డమన్ & డయ్యూ, ఢిల్లీ, గోవా, లక్షద్వీప్, పుడుచ్ఛెర్రీ పాల్గొనడం లేదు. ఆధారము: http://rggvy.gov.in/rggvy/rggvyportal/index.htmlని సందర్శించండి గ్రామాల్లో ప్రత్యామ్నాయ ఇంధన శక్తి వనరులు - పరీక్షాత్మక ప్రాజెక్ట్‌లు లక్ష్యం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం ఏమిటంటే, కేవలం విద్యుద్ధీకరణ, గ్రిడ్ విస్తరణల వల్ల జరగని పునరుత్పత్తి శక్తి వనరులయిన బయోమాస్ ద్వారా సుదూర గ్రామాల్లోని ప్రజలు వంట వండుకోవడానికి, విద్యుత్‌కు ఇతర గృహ అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ గ్రామీణప్రత్యామ్నాయ ఇంధన శక్తి వనరులపరీక్షాత్మక అమలు చేయడంలో భాగంగా తగిన అనుభవాన్ని ప్రజలకు ఇ వ్వడం, స్థానిక ప్రజలను చైతన్య పరచడం, ఇతర సంస్థలతో సంబంధాలు నెలకొల్పడం సాధ్యమని చూపడానికై ఆరంభించారు. ప్రాజెక్టుల పరిధి ఈ పరీక్షాత్మక ప్రాజెక్ట్‌లను విద్యుదీకరించని మరుముల గ్రామాల్లో సంప్రదాయిక పద్ధతుల్లో విద్యుదీకరించలేని చోట్ల చేపట్టడం జరుగుతుంది. పరీక్షాత్మక ప్రాజెక్టు అమలుకు మార్గదర్శకాలు ఈ పరీక్షాత్మక ప్రాజెక్ట్‌లను గ్రామపంచాయితీలు చేపడతాయి. దీనికై, డిఆర్డిఏలు, అటవీశాఖ, సేవాసంస్థలు, పెట్టుబడిదారులు, సంస్థలు, సహకార సంస్థలూ వగైరాలు పంచాయితీలకు తమవంతు తోడ్పాటునిస్తాయి పరీక్షాత్మక ప్రాజెక్ట్‌లకు ప్రతిపాదనలు తయారు చేయడానికి మార్గదర్శకాలు గ్రామాలను, వాడలను గుర్తించడం గుర్తించిన గ్రామాలూ, వాడలూ బాగా సుదూరంగా ఉండి ఒక తెగకు సంబంధించిన లేదా అటవీ ప్రాంత గ్రామంగా, గూడెం లేదా వాడగా ఉండాలి. సరైన రీతిలో చెట్ల పెంపకానికి సాధారణ లేదా వ్యవసాయం చేయని భూమి ఉండాలి. సరైన ప్రగతిశీలక సమాజ నిర్మాణం ఉండాలి. కనీసంగా 25, గరిష్టంగా 200 ఇళ్లు ఉండాలి. గుర్తించేటపుడు, అటవీశాఖ, గిరిజన శాఖ, గ్రామీణాభివృధ్ది సంస్థలను సంప్రదించి గుర్తించాలి. ప్రాథమిక ప్రతిపాదనలను తయారుచేయడం . ఒక గ్రామాన్ని లేదా వాడని ఎంచుకొన్నాక ఒక ప్రాథమిక ప్రతిపాదనను తయారుచేసి, దాన్ని సదరు రాష్ట్ర నోడల్ ఏజన్సీతో ధృవీకరణ చేయించి దానిని సిద్ధాంత ప్రకారం ఆమోదం పొందడానికి మంత్రిత్వ శాఖకు పంపాలి. బయోమాస్ ద్వారా గ్రామాల్లోరక్షిత ఇంధన శక్తి వనరులు గా ప్రాథమిక ప్రతిపాదనను తయారు చేయడానికి రూప కల్పన పత్రం. అమలు చేయబోయే ఏజన్సీ పేరు, పూర్తి చిరునామా : (అటవీ శాఖ, డి ఆర్డిఏ, ఎన్జిఓ) రాష్ట్ర నోడల్ ఏజన్సీ పేరు, పూర్తి చిరునామా : గ్రామ పంచాయితీ పేరు, బ్లాక్, జిల్లా : గ్రామ పంచాయితీలోని గ్రామాల సంఖ్య : ప్రాజెక్టుకు ఎంపిక చేసిన గ్రామం /వాడ పేరు : గ్రామ సెన్సస్ కోడ్ : దగ్గరలోని ప్రధాన రహదారినించి దూరం : గ్రిడ్నించి దూరం : గ్రామం /వాడలోని మొత్తం జనాభా : పురుషుల /స్త్రీల నిష్పత్తి : అక్షరాస్యత రేటు : గృహాల సంఖ్య : గ్రామంలోని వాడల/ దళిత బస్తీల సంఖ్య : సాంఘిక నిర్మాణ పద్ధతి : ప్రజా భవనాలు - బడి, పిహెచ్సి, పందాయితీ భవనం వగైరా : ప్రధాన వృత్తి, ధనపంటలను సూచించాలి : బయోమాస్ వనరుల లభ్యత - ఏరకం బయోమాస్, : స్థానిక వంటచెరకు, నూనె గింజలుని రకాలు వగైరా సాగుచేయని, వ్యర్థ భూమి వగైరాలు శక్తి ప్లాన్టేషన్లకై లభ్యత : నీటి లభ్యత : శక్తి అవసరాల సూచనాప్రాయపు అంచనా : గృహావసరాలు - వంట, దీపాలు, ఇతరాలు ప్రజా సేవలు - వీధి దీపాలతో సహా నీటిపారుదల/ వ్యవసాయ పనులు వ్యాపరం పరిశ్రమలు ప్రస్తుత శక్తి ఇంధన అవసరాలు, వాడకం, నెలసరి ఖర్చు : (ఒక్కో ఇంటి చొప్పున) గ్రామంలో ప్రస్తుతం వాడుకలోపునరుత్పాదక శక్తి సాధనాలుంటే, వాటి వివరాలు : వాడటానికి ప్రతిపాదించిన బయోమాస్ పరిజ్ఞాన వివరాలు : వ్యవస్థల సూచనాప్రాయ సామర్థ్యం : ప్రణాళిక, నిర్వహణ, రెవిన్యూ నిర్వహణలో స్థానిక సమాజం పాత్ర : గ్రామం / వాడతో ఇప్పటికే సంబంధం గల సేవాసంస్థ ఏదన్నా : ఉంటే, దాని వివరాలు ఇతర సమాచారం గ్రామ శక్తి ప్రణాళికను తయారు చేయడం మంత్రిత్వ శాఖనుంచి సూత్రప్రాయ ఆమోదం పొందాక, ఒక గ్రామ శక్తి ప్రణాళికను రూపొందించడం జరుగుతుంది. దాని తయారీలో స్థానిక సమాజ సభ్యులు చురుగ్గా పాల్గొంటారు. మొత్తం శక్తి అవసరాలను అంచనావేయడం శక్తి అవసరాల సూచనాప్రాయపు అంచనా కింది అవసరాలను లెక్కలోకి తీసుకోవాలి.: గృహావసరాలు - వంట, దీపాలు, వినోదం. సామాజిక సేవలు - దుకాణాలు,వీధి దీపాలు, అంగళ్లు, అరోగ్య కేద్రం, పిండిమరలు, సమాచారప్రసార సాంకేతిక పరిజ్ఞానం. నీటిపారుదల/ వ్యవసాయ పనులకై నీటిని తోడటం. గ్రామీణ కుటీర పరిశ్రమలు కనీస శక్తి అవసరాలను తీర్చే సేవలలో వంట, దీపాలు, వీధి దీపాలు, తాగడానికై నీటిని తోడటం, బడులలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దీపాలు, ఫ్యానులు కోసం సేవలు ఖచ్చితంగా అందేలా చూడాలి. స్థానికంగా లభ్యమయ్యే బయోమాస్ వనరుల ను అంచనావేయడం వీటిలో పేడ, వ్యవసాయ వ్యర్థాలు, అటవీ పరిశ్రమలు వగైరాలు చోటుచేసుకోవాలి. శక్తి అవసరాలను తీర్చేందుకు ప్రణాళికలు గ్రామ శక్తి ప్రణాళికద్వారా అన్నిటికన్నా ముఖ్యంగా బయోమాస్ వనరులను వాడటాన్ని శోధించాలి. తగిన విధంగా వేగంగా పెరిగే నూనెగింజలొచ్చే చెట్ల రకాలను గుర్తించాలి. వంటచెరకు, వెజిటబుల్ నూనె, ఇతర ముడిపదార్థాలు ఉత్పత్తి చేసే చెట్లను పెంచే ప్రణాళికను రూపొందించాలి ఈ చెట్ల రకాలు ప్రతి ఏడాదికీ పెరిగి తద్వారా ముడిపదార్థాలు లభ్యమయ్యేదాకా బయోమాస్‌తో వంటకు ఇంధనాన్ని రూపొందించేలా చూసుకోవాలి. బయోమాస్ లభించకపోయినా, చెట్లను పెంచలేకపోయినా - ఆస్థితిలో మాత్రమే మినా హైడల్ లేదా సోలార్ శక్తి వంటి పువరుత్పాదక వనరులను వాడే ప్రయత్నం చేయాలి. మొత్తం శక్తి అవసరాల ఆధారంగా, స్థానికంగా దొరికే వనరులనుబట్టి, మొత్తంపైన శక్తి ఉత్పత్తి వ్యవస్థను క్రమబద్ధీకరించుకోవాలి. బయోమాస్ ఆధారిత శక్తి ఉత్పత్తి వ్యవస్థ కోసం, సరైన మిశ్రమ పరిజ్ఞానాన్ని లభ్యమౌతున్న బయోమాస్ మార్పిడి పరిజ్ఞానాల నుంచి ఎంచుకోవాలి. అంటే, వృక్షాధారిత రసాయన పదార్థాలను, కూరగాయల వ్యర్థాలను, వంటింటి వ్యర్థాలను వగైరాలను వాడి ఏక ద్వి దశలలో బయోగ్యాస్ ఉత్పత్తి చేయడం బయోమాస్‌ను గ్యాస్‌గా మార్పిడిచేయడానికి 100 శాతం గ్యాస్ ఇంజన్లను లేదా రెండు ఇంధనాలతోనూ నడిచే ఇంజన్లను డీజల్తోగాక బయో ఇంధనాలతో నడిచేలా చేయడం. స్థిరంగా ఉండే డీజల్ ఇంజన్లను నేరుగా వెజిటబుల్నూనెతోలేదాబయోగ్యాస్తో పనిచేయించడం. విద్యుత్ సరఫరాను స్థానికంగా ఉండే మినీ గ్రిడ్ తో ప్రధానంగా అందరికీ అందేలా చేయాలి. ముఖ్యంగా సూక్ష్మ వ్యవస్థ అభివృద్దికి, సూక్ష్మ ఋణ సాయంతోబాటు ఉత్పత్తి కార్యకలాపాలకు శక్తినందించడానికే ప్రాధాన్యతనివ్వాలి.దానివల్ల ఉద్యోగాలు పెరగడం, ఆదాయాన్ని పెంచడం, కొనుగోలు శక్తిని పెంచడం, వలసను అరికట్టడం సాధ్యమౌతుంది. గ్రామ శక్తి సంఘాన్ని ఏర్పాటుచేయడం ఆరంభంనించీ గ్రామంలోని సమాజం పూర్తిస్థాయిలో పాల్గొనేలా చూసుకోవాలి. ఒక గ్రామ శక్తి కమిటీని గ్రామ సభద్వారా ఏర్పాటు చేయించాలి. దాన్ని గ్రామ ఉపసభగా లేదాశాశ్వత కమిటీగా తగిన పంచాయితీరాజ్ యాక్టులో ఇచ్చిన అధికారాలతో ఏర్పాటు చేయాలి. పంచాయితీకి ఎన్నికైన సభ్యులనుమాజీ అఫీషియో సభ్యులుగా ఉండేలా చూసుకోవాలి. గ్రామ శక్తి నిధి ని ఏర్పాటుచేయడం గ్రామ శక్తి నిధిని రాష్ట్ర పంచాయితీరాజ్చట్టం లో ఇచ్చిన అధికారాలతో ఏర్పాటు చేయాలి. ఆరంభంలో లబ్దిదారుల చందాలతో నిర్వహించుకొనేలా చేయాలి. క్రమంగా నెలవారీ, సంవత్సరంవారీ యూజర్ ఛార్జీలు ఈ అకౌంటుకు డిపాజిట్ చేయాలి గ్రామీణాభివృద్ధి, అటవీ, తెగల అభివృద్ధి వగైరా ప్రభుత్వ కార్యక్రమాలు లభిస్తూన్నట్లైతే, వాటిని కూడా ఈ అకౌంట్లోనే ఉంచాలి. దీనిని ప్రాజెక్టు పనిచేయడానికి, నిర్వహణకు వాడుకోవచ్చు. నిధులను గ్రామీణ శక్తి కమిటీలు ఇద్దరు సంతకంచేయడానికి నియమించి వారిద్వారా నిర్వహించాలి. వీరిద్దరిలో ఒకరి కమిటీ ఎక్స్ అఫిషియో సభ్యుడైన గ్రామ పంచాయితీ సభ్యులై ఉండాలి. ఒక మూల నిధిని కూడా ఏర్పాటు చేయాలి. శక్తి ఉత్పత్తి సాధనాలను ఏర్పాటుచేయడానికి అవసరమయ్యే ధనాన్ని ఇందులో డిపాజిట్ చేయాలి. ఈ మూలనిధిని కూడా విఇసి జోడు సంతకాల పద్ధతిలోనే నిర్వహించాలి. ఇది గ్రామీణ శక్తినిధిని నియంత్రిస్తుంది. విఇఎఫ్, విఇసి మూల నిధి - ఈ రెండూ కూడా గ్రామ పంచాయితీకి సంబంధించిన ఖాతాలు కాబట్టి అవి చ్టటాల పరిధిలో ఉంటాయి. వాటికి ఖాతా నిర్వహణ, ఆడిటింగ్ వర్తిస్తాయి. విఇసి నిధులను ఖర్చుచేసేటపుడు, పంచాయితీరాజ్ చట్టం, విధుల ప్రకారం గ్రామ పంచాయితీలకు నెలసరి సమావేశాల్లో తెలియజేయాలి. విఇసి గ్రామ పంచాయితీ స్టాండింగ్ కమిటీకి ఉప కమిటీ కావడంవల్ల సమాచారాన్ని పొందే హక్కు చట్టం కింద సమాచారాన్ని కోరినపుడు ఇవ్వాల్సి ఉంటుంది. విఇసి గ్రామ పంచాయితీకివినియోగ ధృవీకరణ పత్రం సర్టిఫికేట్‌ను ఇస్తుంది. దానిని గ్రామ పంచాయితీ జిల్లా స్థాయిలో సంబంధిత అధికారికి అందజేస్తుంది. విఇసి స్థాయిలో గ్రామ పంచాయితీల ద్వారా వివిధ ఏజన్సీలు అంటేె, సేవాసంస్థలు లేదా అమలు చేసే ఏజన్సీల ద్వారా సాంకేతిక సహాయం, సామర్థ్య నిర్మాణం చేయడానిపై దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. ప్రతిపాదనలను సమర్పించడం పరీక్షాత్మక ప్రాజెక్ట్‌ల ప్రతిపాదనలను రాష్ట్ర నోడల్ ఏజన్సీ ద్వారా మంత్రిత్వశాఖకు పంపాలి. ప్రతిపాదనలో కింది సమాచారాన్నివ్వాలి :- గ్రామ సెన్సస్ కోడ్ సంఖ్య గ్రామ శక్తి ప్రణాళిక గ్రామ శక్తి కమిటీ, నిధి -వీటి ఏర్పాటు గురించిన నిశ్చయాత్మక సమాచారాన్నివ్వాలి. శిక్షణా ప్రణాళిక అమలుచేసే తీరు ఓ & ఎం ఏర్పాట్లు 10 శాతం మిగులు ఆరంభ పెట్టుబడి, అమలు, నిర్వహణలకు కావలసిన నిధుల గురించిన నిబద్ధత. ప్రణాళికను అమలు చేయడం ప్రాజెక్ట్‌ను గ్రామప్రజలు తమదిగా ఉంచుకోవాలి. దాని అమలు, నిర్వహణలకు బాధ్యత వహించాలి. ఐతే, అవసరమైనపుడు అమలు చేసే ఏజన్సీ వారికి రెండేళ్ల సాయం చేయవచ్చు. ఈ సమయంలోఅమలు చేసే ఏజన్సీ ప్రాజెక్ట్ అమలు, నిర్వహణలలో స్థానిక యువతకు శిక్షణ నిస్తుంది. ఆ తర్వాత విఇసి దాని బాధ్యతని చేపడుతుంది. విఇసి ఈ సేవలను లీజుకివ్వచ్చు లేదా వారి సేవలను అద్దెకు తీసుకోవచ్చు. పువరావృత శక్తిపై జిల్లా సలహా కమిటీలు ఈ పరీక్షాత్మక ప్రాజెక్ట్‌ల అమలులో పాలుపంచుకోవాలి. ఈ కమిటీలకు జిల్లా కలెక్టర్లు ఛైర్మన్‌గా, డిర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ మెంబర్ సెక్రటరీగా ఉండేలా, వివిధ జిల్లా శాఖల అధిపతులు, పుర ప్రముఖులు పాల్గొనేలా చూడాలి. సంబంధిత రాష్ట్ర నోడల్ ఏజెన్సీలు ఈ ప్రాజెక్ట్‌ల అమలు తీరును జాగ్రత్తగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. అవి ఆరంభం అయ్యేదాకా మంత్రిత్వ శాఖకు ప్రతినెలా ప్రాగ్రెస్ రిపోర్ట్‌లను పంపుతూండాలి. ఆ తర్వాత వారు వాటి పనితీరుపై త్రైమాసిక రిపోర్టులను, ఏవైనా సలహాలుంటే వాటితోబాటు మంత్రిత్వ శాఖకు పంపుతూండాలి. మంత్రిత్వ శాఖ కూడా క్షుణ్ణంగా పర్యవేక్షిస్తూ, ఇతర ఏజన్సీల ద్వారా ఆయా ప్రాజెక్టులను స్వతంత్రంగా ముల్యంకనము చేయాలి. పరీక్షాత్మక ప్రాజెక్ట్‌లకు కేంద్ర ఆర్థిక సాయాన్ని పొందడానికి మార్గదర్శ కాలు పరీక్షాత్మక ప్రాజెక్ట్‌లకు అయ్యే పెట్టుబడి ఖర్చులో 90% కేంద్ర గ్రాంటు ద్వారా భరించడం జరుగుతుంది. దీనికి గృహావసరాలకు, సమాజ శక్తి అవసరాలకు సరిపోయేలా ఇంటికి 20,000రు. చొప్పున ఉండేలా చూడాల్సి ఉంటుంది. మిగిలిన 10% పెట్టుబడికయ్యే ఖర్చును సమాజం ద్వారా, అమలుచేసే ఏజన్సీ ద్వారా, రాష్ట్ర నోడల్ ఏజన్సీ ద్వారా సమీకరించుకోవాలి. పెట్టుబడికయ్యే ఖర్చు కోసం కేంద్ర ఆర్థిక సహాయం(సిఎఫ్ఏ) గ్రామ శక్తి కమిటీ పెట్టుబడి ఖాతాలోకి విడుదల చేస్తుంది. దానికి కింది విధానాన్ని అనుసరిస్తుంది. :- శాంక్షన్ ఆర్డర్‌తో తొలి విడత విడుదల చేసేది - 50% సైట్లో పరికరాలు వచ్చాక రెండో విడతగా విడుదల చేసేది - 25% విజయవంతంగా అమర్చాక చివరి విడతగా విడుదల చేసేది - 25% అంగీకరించిన కాంట్రాక్టు నియమానుసారం,నిబంధన ప్రకారం ఒకనెల నిర్వహణతోబాటు . సిఎఫ్ఏ కింది వాటికి కూడా ఇవ్వడం జరుగుతుంది:- నడిపించడం, పోషణ, నిర్వహణా ఖర్చులను వసూలైన యూజర్ ఛార్జీలనుంచి భరించాలి. ఐతే, ప్రాజెక్ట్ నిలదొక్కుకోవడానికి, దాని నిర్వహణకు డబ్బు అత్యంతవసరం అయితే మాత్రం, నడిపించడం, పోషణ, నిర్వహణా ఖర్చులను భరించేవిధంగా సాయం అందించడం జరుగుతుంది. ఐతే, ఈ సాయం గరిష్టంగా పెట్టుబడి వ్యయంలో 10%కి పరిమితం చేయడం జరుగుతుంది. దీనికి, యూజర్ ఛార్జీలను వసూలు చేయడానికి తీవ్రంగా కృషిచేస్తున్నట్లు ఆధారాలు చూపాలి. అమలు చేసే ఏజన్సీలకు వివిధ సేవలకు పెట్టుబడి వ్యయంలో 20% వృత్తి ఖర్చుల కింద ఇస్తారు. దీనికి 4 లక్షల రూపాయల గరిష్ట పరిమితి ఉంది. రాష్ట్ర నోడల్ ఏజన్సీలకు పెట్టుబడి వ్యయంలో 20% సేవా ఖర్చుల కింద ఇస్తారు. ఒక గ్రామానికి 2 లక్షల రూపాయల గరిష్ట పరిమితి ఉంటుంది. గ్రామాలలో ఈప్రాజెక్టుల అమలు పర్యవేక్షణ, ప్రగతి గురించిన రిపోర్టింగ్లకై, ఫీడ్బాక్లివ్వడానికై దీన్నివ్వడం జరుగుతుంది. అవగాహన కల్గించడానికి, శిక్షణ శిబిరాలను నిర్వహించడానికి, సెమినార్లు, వర్క్‌షాప్‌లు నిర్వహించడానికి కేసునిబట్టి నిధులనివ్వడం జరుగుతుంది. అమలు చేసే ఏజన్సీలకు ఇచ్చే వృత్తి ఖర్చులను నేరుగా ఆ ఏజన్సీలకే ఇస్తారు. అలాగే, రాష్ట్ర నోడల్ ఏజన్సీలకు ఇచ్చే సేవా ఖర్చులు ప్రాజెక్టు పూర్తికాగానే నేరుగా ఆ ఏజన్సీలకే ఇస్తారు. నడిపించడం, పోషణ, నిర్వహణా ఖర్చులను భరించడానికి అవసరమయ్యే సిఎఫ్ఏను అవసరాలనుబట్టి విడుదల చేయడం జరుగుతుంది. ఒక ప్రాజెక్ట్‌ను విజయవంతంగా అమలుచేసిన తర్వాత ఆ మేరకు మంజూరీ ఉత్తర్వు ప్రకారం రాష్ట్ర నోడల్ ఏజన్సీ ఒక ధృవీకరణ పత్రాన్ని విఇసినుంచి తీసుకొని చివరి విడత నిధులను మంజూరుచేసేముందు మంత్రిత్వశాఖకు అందజేయాలి. గ్రామ పంచాయితీ లేదాసంయక్త అటవీ నిర్వహణా కమిటీ - ఏదైతే అది విఇసి నిర్వహించే అన్ని అకౌంట్లను ఆడిట్ చేయిస్తుంది. దానిని నియమిత యుటిలైజేషన్ సర్టిఫికేట్‌తో జోడించి మంత్రిత్వశాఖకు పంపమని రాష్ట్ర నోడల్ ఏజన్సీకి అందజేస్తుంది. జాతీయ గ్రామీణ విద్యుధీకరణ పథకాలు- 2006 సంబంధిత సంగ్రహములు : అన్ని గృహాలకి, 2009 సంవత్సరాంతానికి విద్యుచ్ఛక్తి అందుబాటులో ఉండడం, 2012 సంవత్సరం నాటికి, నాణ్యత మరియు సరసమైన ధరలలో విశ్వాసభరితమైన విద్యుత్ సరఫరా చేయడం, జీవితకాల వినియోగానికి కనిష్టంగా ఒక ఇంటికి, రోజుకు, ఒకయూనిట్ విద్యుత్తుని ఇవ్వగలగడం వంటివి లక్ష్యాలలో ఉన్నాయి. విద్యుత్ కేంద్రం నుండి అనుసంధానం సాధ్యం కానప్పుడు లేదా పెట్టే ధన వ్యయం లాభసాటి కానప్పుడు, గ్రామాలకు/ప్రవాస ప్రాంతాలకు, విద్యుదుత్పాదక కేంద్రం అవసరం లేని పరిష్కారాలు, స్థిరమైన వ్యవస్థ కలిగినవి, విద్యుత్ సరఫరాకు తీసుకొనవచ్చు. ఇవన్నీ కూడ సాధ్యం కానప్పుడు మరియు ఉన్న ఒకే ఒక ప్రత్యామ్నాయం అయిన సోలార్ ఫోటోవోల్టాయిక్ వంటి ప్రత్యేకమైన కాంతి ప్రసార, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించవచ్చు. అయినప్పటికిని, అటువంటి గ్రామాలు విద్యుధీకరణ చేయబడ్డాయని అనకపోవచ్చు. రాష్ట్రప్రభుత్వం, ఆరునెలల లోపు, ఒక గ్రామీణ విద్యుధీకరణ పథకాన్ని, విద్యుధీకరణ చేసే వ్యవస్థ యొక్క అన్ని అంశాలతో సంగ్రహంగా తయారు చేసి ప్రకటించాలి. జిల్లా అభివృద్ధి పథకాలతో పాటు ఈ పథకాన్ని కలపి లింకు చేయవచ్చు. మరియు ఈ పథకం గురించి, సంబంధించిన సంఘానికి తెలియజేయాలి. ఒక గ్రామం విద్యుధీకరణ అయ్యిందని ప్రకటించడానికి అర్హత కలిగినప్పుడు, మొదటి ధృవపత్రం గ్రామ పంచాయితి విడుదల చేయాలి. దీనిననుసరించి, గ్రామపంచాయితి ప్రతి సంవత్సరం మార్చి 31 నాటికి, ఆ గ్రామాల యొక్క విద్యుధీకరణ స్థితిని అధికారికంగా ధృవపరచాలి. జిల్లా పంచాయితీ యొక్క అధ్యక్షుడి అధ్యక్షతన, జిల్లాస్థాయి సంస్థలు వినియోగదారుల సంఘాలు, ముఖ్య మైన భాగస్వాములు, తగినంత మంది స్త్రీల ప్రాతినిధ్యంతో ఒక జిల్లాస్థాయి సంఘాన్ని రాష్ట్రప్రభుత్వం, మూడు నెలల లోపు ఏర్పరచాలి. జిల్లా సంఘం, తమ జిల్లాలోని విద్యుధీకరణ విస్తరణను వినియోగదారుల సంతృప్తిని మొదలగువాటిని సమన్వయ పరచి పరిశీలిస్తుంది. పంచాయితీ రాజ్ సంఘాలు పర్యవేక్షణ/ సలహాలు యిచ్చే పాత్రని పోషిస్తాయి. సంప్రదాయబద్ధంకాని శక్తి వనరుల పై ఆధారపడి చేసే వ్యవస్థలకు, సహాయ సేవలు, సాంకేతిక సహకారం అందించే సంస్థాగతమైన ఏర్పాట్లు రాష్ట్రప్రభుత్వం చేస్తుంది. ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు