సహజ వనరులు సహజ వనరులు (భూమి లేక ముడి పదార్ధాలగా సూచించబడినవి) ఈ వాతావరణంలో మానవ ప్రభావం లేని ప్రదేశాలలో సహజంగా ఏర్పడతాయి. సహజ వాతావరణము ప్రకృతి పరిసర ప్రాంతాలు, వాటి జీవన వైరుధ్యాల్ని బట్టి సహజ వనరులను వర్ణించవచ్చు. సహజ వనరుల నిర్వహణ సహజ వనురులైన భూమి, నీరు, వృక్షాలు మరియు జంతువులను ప్రస్తుతము మరియు భవిష్యత్తులో వాటి ఎదుగుదలకు, నాణ్యతకు సంబంధించిన విధులను పర్యవేక్షించుటను సహజ వనరుల నిర్వహణగా పేర్కొనవచ్చు. ఈ సహజ వనరుల నిర్వహణ ను "సస్టైనబుల్ డెవలప్మెంట్" అను సూత్రముతో పోల్చవచ్చు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనగా ప్రస్తుత మానవాళి తనకు కావలసిన అవసరాలను తీర్చు కొనుటకు ఈ వాతావరణము, సహజ వనరులైన భూమి, గాలి, నీరు, వృక్షాలపై ఆధారపడతారు. ఇలా ఆధారపడుతూనే భవిష్యత్తులో మానవాళి మనుగడకు ఎటువంటి ఆటంకము కలుగకుండా, సహజ వనరుల అభివృద్ధికి ఎటువంటి ఆటంకం కలుగకుండా సహజ వనరుల నాణ్యత ఈ మాత్రము తగ్గకుండా చూసుకోవడము అని చెప్పవచ్చు. నగర యోజనము మరియు పర్యావరణ నిర్వహణలకు విరుద్దంగా సహజ వనరుల నిర్వహణ ప్రత్యేకంగా శాస్త్రీయ మరియు సాంకేతికమైన అర్తంతో ముడి పడి వున్నది. సహజవనరుల తగ్గుదల గత కొన్ని సంవత్సరాలుగా, సహజవనరుల తగ్గుదల మరియు భరించేగలిగే వికాసంకోసం అభివృద్ధి సంస్థలప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ప్రత్యేకంగా వర్షపు ప్రాంతాలలో, ఎక్కడ భూమి సహజ సంపద వుందో అక్కడ తీవ్ర ఆందోళన కలిగించే విషయం. సహజ పెట్టుబడిసంస్థల, పర్యవణరాల, భూగృహశాస్త్ర కదలిక సంస్థల మరియు పచ్చరాజకియాల దృష్టి అంతా సహజవనురుల సంరక్షణ పైనే వుంది. కొందరు ఇలాంటి తగ్గుదలని ఎదుగుతున్న దేశాలలో వుండే సాంగిక అవిశ్రాంత మరియు సంఘర్షణలను కారణాలుగా చూస్తారు. తవ్వకాలు, సిలతైయలలు, నిష్కర్జనాలు, చేపలవేట, వేట మరియు అడవిశాస్త్రాలు సాధారణంగా సజహవనరుల పరిశ్రమలగా గుర్తిస్తారు. వ్యవసాయము మానవవనరంగా గుర్తిస్తారు. థియోడోర్ రూస్వెల్ట్, ప్రముఖ నికేషేకపుడు మరియు అగ్రరాజ్య రాష్ట్రపతి అసంబందిత సహజవనరుల నిష్కర్జనాలకు వ్యతిరేకం. అగ్రరాజ్య పరిరక్షసంబందమైన పరిశోదనల ప్రకారం దేశానికి ఖనిజాలు శక్తి, భూమి, నీరు,సహజసంపదలే నిజమైన సహజవనరలుగా పిలువబడతాయి. సహజ వనరుల పరిరక్షణ పరిరక్షణ జీవశాస్త్రం , ప్రకృతి మరియు భూమి నానాజ్యతి మరియు వాటిలో వుండే జీవిలు, వాటి నివసప్రాంతలును తగ్గుదల నుంచి సంరక్షించే శాస్త్రం. ఇది శాస్త్రం, ఆర్ధికం మరియు సహజవనరుల నిర్వహణలతో ముడిపడిన శాస్త్రము. జీవశాస్త్ర పరిరక్షణ అనే పదం సం దిఎగోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలంలో 1978లో బ్రూస్ విల్కొక్ష్ మరియు మైఖేల్ సౌలె అధ్యక్షతన జరిగిన సమావేశంలో పరిచయం చెయ్యబడింది. జీవశాస్త్ర నివాసం అనగా పరిరక్షణ, రక్షణ మరియు నిబదత్త , జీవనివసాలు, ముఖ్యంగా అరుదైన జీవిలు, వాటి యొక్క పరిరక్షణ, వాటి తగ్గుదల యొక్క భూమిపరిరక్షణ విధానం. చాలా సంస్థలకు ఇది ప్రధమ తత్వం. ఆధారము: వికీపీడియా సహజ వనరులు ప్రజల సంపద ఇంధనం అంటే ఇంధనం అంటే శక్తి, వనరు. ఇదే దేశ ఆర్థికాభివృద్ధికి ప్రధాన కారణం. యాంత్రికీకరణ యుగంలో ఇంధనానికి (పెట్రోలు, డీజిల్, సహజ వాయువు, బొగ్గు మొ||) అత్యంత ప్రాధాన్యత కలదు. ఇది ప్రకృతి సంపద. ఇంధన వనరులు పుష్కలంగా వున్న దేశాలు ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాలుగా గుర్తింపు పొందాయి. కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతం మన రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతం అపారమైన సహజ సంపదను కలిగి వుంది. గోదావరి నది పరీవాహక ప్రాంతం (ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలు) అపారమైన బొగ్గు నిక్షేపాలకు నిలయం, కృష్ణానది పరీవాహక ప్రాంతం సహజవాయువు నిక్షేపాలకు ప్రసిద్ధి. ఇదే కృష్ణా గోదావరి బేసిన్. కృష్ణా, గోదావరి బేసిన్ ఇష్యూ ఏంటి? వివాదం ఏంటి? దాని ద్వారా మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి? రాష్ట్రానికి ప్రజలకు జరుగుతున్న అన్యాయం ఏమిటి? ఇలాంటి అనేక ముఖ్యమైన ప్రశ్నలు జనంలో ఉన్నాయి. కృష్ణా గోదావరి బేసిన్ అంటే? కృష్ణా, గోదావరి నదుల పరివాహక ప్రాంతం. నదులు సముద్రంలో కలిసే ప్రాంతంలో 1999లో న్యూ ఎక్స్‌ఫ్లోరేషన్ లైనింగ్ పాలసీ అనే దాని పేరిట కొన్ని బ్లాక్‌లను చమురు, సహజవాయువుల అన్వేషణ, ఉత్పత్తుల కోసం ప్రైవేటు కంపెనీలకు ఆనాటి ప్రభుత్వం ధారాదత్తం చేసింది. ఈ న్యూ ఎక్స్‌ఫ్లోరేషన్ లైనింగ్ పాలసీ 1999కి ముందే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. ఎన్డిఏ ప్రభుత్వం తు.చ.తప్పకుండా కొనసాగించింది. ఈ కార్యక్రమం క్రింద ప్రైవేట్ కంపెనీలని ఆహ్వానించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్, ఓ.ఎన్.జి.సి. ఇతర మల్టీ నేషనల్ సంస్థలు వచ్చాయి. అందులో డి6 బ్లాక్‌లో రిలయన్స్ కంపెనీకి గ్యాస్ దొరికింది. ఉత్పత్తి కూడా మొదలు పెట్టారు. ఇది కృష్ణా, గోదావరి నదుల బేసిన్ ప్రధానమైన సమస్య. ఆనాడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు ఉండి వుంటే ఒక కార్పొరేషన్ పెట్టి గ్యాస్ ఉత్పత్తిలో పాల్గొని వుంటే గుజరాత్‌కు చెందిన ప్రభుత్వరంగ కంపెనీకి ఎలా గ్యాస్ దొరికిందో అలాగే మన కంపెనీకి కూడా గ్యాస్ దొరికి వుండవచ్చు. అంతటి ముందుచూపు ఆనాటి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కొన్ని వేల కోట్లు ఖర్చు పెడితే గ్యాస్ దొరుకుతుందో, దొరకదో? అనే భయం కావచ్చు. ఇదంతా మనమెందుకు చేయాలి, గ్యాస్ వచ్చాక ఆలోచిద్దాం అనే నిర్లక్ష్యం కావచ్చు. కారణాలు ఏమైనా ఆ రోజు వున్న ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం కూడా 2004 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏ ప్రయత్నమూ చేయలేదు. అన్నదమ్ముల పంచాయితీ: ఈ విషయం ఇప్పుడే ఎందుకు సమస్యగా ముందుకు వచ్చిందంటే, అంబానీల పంచాయితీల వల్ల అనిల్ అంబానీకి మద్ధతుగా ఒక పార్టీ, ముఖేష్ అంబానీకి మద్ధతుగా మరొక పార్టీ నిలవడం వల్ల ఈ వివాదం వార్తలకి ఎక్కింది. 1999లో ఈ గ్యాస్ అన్వేషణ ఉత్పత్తికి కాంట్రాక్ట్ పొందిన రోజు రిలయన్స్ ఉమ్మడి కంపెనీ. తరువాత అన్నదమ్ముల వాటాల పంపకంలో రిలయన్స్‌లో ఇండస్ట్రీస్ రెండుగా విడిపోయి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ముఖేష్ అంబానీ), రిలయన్స్ నేచురల్ రిసోర్సెస్ లిమిటెడ్ (అనిల్ అంబానీ)గా విడిపోయాయి. ఆ ఇద్దరి మధ్య ఒక అవగాహన కుదిరింది. గ్యాస్ ఉత్పత్తి అయిన తరువాత 1 ఎం.ఎం.బి.టి.యు పరిమాణం గల గ్యాస్‌ను 2.34 డాలర్లకు అనిల్‌కు అమ్మే విధంగా ముఖేష్ ఒప్పందం చేసుకున్నాడు. అయితే మనం ఖతార్ దేశం నుండి 1 ఎం.ఎం.బి.టి. పరిమాణం గల గ్యాస్‌ను 6 డాలర్లకు దిగుమతి చేసుకుంటున్నాం. సహజంగా 2.34 డాలర్లు అంటే చాలా చౌక. ఈ ఒప్పందం 2006లో కుదిరింది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు. 2009 వచ్చే వరకు యూనిట్‌కు 4.5 డాలర్లుగా ఇవ్వాలని రిలయన్స్ కోరింది. గ్యాస్ ధరను నిర్ణయించేది రిలయన్స్ కంపెనీ కాదు. గ్యాస్ ఉత్పత్తి మాత్రమే దాని బాధ్యత. ధర నిర్ణయించటానికి ఒక ఎంపవర్డ్ గ్రూప్ అఫ్మినిస్ట్రీస్ ఉంటుంది. ప్రణబ్ ముఖర్జీ దీనికి నాయకుడు. ఆయన నాయకత్వంలోని కమిటీలో చిదంబరం, మురళీదేవర సభ్యులు, ఆ కమిటీ కూర్చొని రిలయన్స్ వారి 4.5 డాలర్ల ప్రతిపాదనను తోసిపుచ్చుతూ, 4.2 డాలర్ల రేటు ఇస్తామని తెలిపారు. రిలయన్స్ కంపెనీ, ఎంపర్డ్ గ్రూప్ కమిటీ తనకు 4.2 డాలర్లకు అమ్ముకోవాలని అవకాశం ఇచ్చినందున ముందుగా కుదుర్చుకున్నట్లుగా 2.34 డాలర్లకు అనిల్ అంబానీకి ఇవ్వడం కుదరదని అన్నారు. ఈ విషయంపై అనిల్ అంబానీ కోర్టుకు వెళ్ళాడు. కోర్టులు కూడా ఎంత దారుణంగా ఉన్నాయంటే, మీ అమ్మ దగ్గర పంచాయితీ తీర్చుకోండి అని అన్నాయి. దేశ సంపద సమస్యను కుటుంబంలో తేల్చుకోవాలని చెప్పడం అత్యంత దారుణం. తరువాత కేంద్ర ప్రభుత్వం నిద్రలేచి కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. దేశ సంపదను ప్రైవేటు వ్యక్తులైన ఇద్దరు ఎలా పంచుకుంటారు? అని ప్రభుత్వం వాదించింది. అయితే ఈ విషయంపై 2006లోనే సిపిఎం పార్టీ ఎం.పి. చిత్తబ్రత మజుందార్ పార్లమెంట్లో ఒక ప్రశ్న అడిగారు. అంతేకాక ఆనాటి కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా వ్రాసాడు. ఇలా అన్నదమ్ములు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిసింది. ఈ ఒప్పందం నిజమేనా? న్యాయమేనా? అని ప్రశ్నిస్తూ గ్యాస్ వెలికి తీసేందుకు రిలయన్స్ గ్రూప్ ఒక కాంట్రాక్టర్ మాత్రమే, ఓనర్ కాదు అని పేర్కొన్నారు. అయితే ఆయన ప్రశ్నకు 2009 సం|| వరకు పొరపాటున కూడా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. ఈ మధ్య సిపిఐ (ఎం) వెబ్సైట్లో కూడా ఆ లెటర్ పెట్టారు. దానికి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ కూడా చూపుతున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం తెలిసి కూడా అన్నదమ్ములు పంచుకుంటుంటే అడ్డుపడలేదు. అది ఒక వివాదం. ఈ గ్యాస్‌ను రిలయన్స్ తన ఇష్టమైన ధరకు, తన యిష్టమైన వాళ్ళకు అమ్ముకుంటాను అని అంటుంది. దీన్ని రాజ్యాంగం కూడా అంగీకరించదు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 297 ప్రకారం ఏ సహజ వనరులపైన అయినా అధిపత్యం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. కావాలంటే ఒక రెగ్యులేటర్ వుంటాడు. ఉత్పత్తి చేసిన కంపెనీ తన వాదనని వినిపించుకోవచ్చు. తనకి ఇంత ఖర్చయ్యింది అని చెబితే దానిపైన రేట్‌ని నిర్ణయిస్తారు. రియలన్స్ కంపెనీకే కేంద్రం వత్తాసు: కృష్ణా, గోదావరి నదుల బేసిన్లో దొరికే గ్యాస్ నిక్షేపాలపై రిలయన్స్ కంపెనీ వాదనలను ప్రశ్నిస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రికి అనేక లేఖలు వ్రాసింది. కానీ మన ప్రభుత్వం చేసిన ఏ వాదనను ప్రణమ్ముఖర్జీ కమిటీ అంగీకరించకుండా, రిలయన్స్ వాదనలే కరెక్టు అని తీర్పు చెప్పింది. కానీ మన రాష్ట్ర ప్రయోజనాలు మాత్రం వార్తలలోకి ఎక్కలేదు. కృష్ణా, గోదావరి బేసిన్లో దొరికే గ్యాస్ నిక్షేపాల యొక్క సంపద విలువ 36 లక్షల కోట్ల రూపాయలు. గ్యాస్ నిక్షేపాల వెలికితీతకు ముఖేష్ అంబానీ మొదట్లో పెట్టిన పెట్టుబడి విలువ 2000 కోట్లని తర్వాత ఆ ఉత్పత్తి ఖర్చు 40 వేల కోట్లకు పెరిగిందని ఇప్పుడు పేర్కొంటున్నాడు. ఆ లెక్కల ప్రకారమైనా సరే ఎక్కడ 40 వేల కోట్లు, ఎక్కడ 36 లక్షల కోట్లు. అంటే పెట్టిన పెట్టుబడికి అనేక వందల రెట్ల శాతం లాభం గడించే అవకాశం వుంది. అందువల్ల మన రాష్ట్రానికి ఈ సంపదలో న్యాయమైన వాటా వస్తే, న్యాయమైన ధరకి వస్తే మనకు అనేక ప్రయోజనాలున్నాయి. రాష్ట్రానికి ఒనగూడే ప్రయోనాలు: కృష్ణా, గోదావరి బేసిన్లో లభించే సహజవాయువులో మిధేన్ అధికంగా వుంటుంది. ఇది బహుళ ప్రయోజనాలకి ఉపయోగ పడుతుంది. ఉదా|| మన వంటింట్లో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ బదులుగా ఈ గ్యాస్ వాడచ్చు. పైప్‌లైన్ ద్వారా రాష్ట్రంలో వున్న అన్ని పట్టణాలకు మంచినీళ్ళు సరఫరా చేస్తున్నట్లు ఇంటింటికి గ్యాస్‌ను సరఫరా చేయొచ్చు. రు. 100/-కే గ్యాస్ సిలిండర్‌ను అందించవచ్చు. ఇదే గ్యాస్‌ను కాకినాడ నుండి 1350 కిలోమీటర్లు తీసుకెళ్ళి గుజరాత్లో ఇంటింటికి పైప్‌లైన్ ద్వారా రు. 100/-కే ఇవ్వడానికి ఆ ప్రభుత్వం సిద్ధపడుతుంది. సిద్ధపడటమే కాదు నరేంద్రమోడీ హైదరాబాద్‌కు వచ్చి ఒక మాట అన్నాడు. ఎక్కడ గుజరాత్, ఎక్కడ ఆంధ్రప్రదేశ్? మీ సముద్ర తీరంలోకి మేము వచ్చి గ్యాస్ వెదికి తీసుకువెళుతుంటే మీరు, మీ ప్రభుత్వం చేతులు ముడుచుకుని, సిగ్గులేకుండా కూర్చున్నారా? అని ఘాటైన వ్యాఖ్యానం చేశాడు. పారిశ్రామిక పెట్టుబడి అంటే సిఎస్జిగా బస్సులలో రవాణాకి ఇంధనంగా వాడొచ్చు. ఈ గ్యాస్‌లో కొద్ది వాటా కనుక మనకు లభిస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో వున్న ప్రతి వాహనానికి డీజిల్, పెట్రోల్ స్థానే గ్యాస్‌ను అమర్చవచ్చు. ఇది కాలుష్యరహిత మైనది. గ్యాస్ ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి చెయ్యొచ్చు పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది. యూరియా ఉత్పత్తిలో ఫీడోస్టార్టుగా ఈ గ్యాస్‌ను వాడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ఉత్పత్తిలో ఈ గ్యాస్‌నే వాడుతున్నారు. రసాయనాల ఉత్పత్తిలో ఈ గ్యాస్‌ను వాడొచ్చు. విశాఖ ఉక్కు పరిశ్రమలో ఫర్నేస్ అయిల్‌కి బదులుగా ఈ గ్యాస్‌ను ఉపయోగిస్తే ఉత్పత్తి 3 రెట్లు పెరుగుతుంది. అంటే ఈ గ్యాస్ వలన మనకు అనేక విధాలైనటువంటి ప్రయోజనాలు వున్నాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ సంస్థ వారు ధృవీకరణ ప్రకారం మొత్తం గ్యాస్ నిక్షేపాలు 200 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ ఫర్ డే (ఎంఎంసిఎండి) అని తేలింది. ఇంకా ఎంతుందో ఎవరికి తెలియదు. 1 ఎంఎంసిఎండి గ్యాస్‌తో 1000 కోట్ల పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించవచ్చు అని అంచనా. అంటే మొత్తం 2 లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించటానికి అవకాశం వుంది. పారిశ్రామిక అభివృద్ధికి మూలాధారం గ్యాస్: బాంబే బేసిన్లో గ్యాస్ దొరికాకనే గుజరాత్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. భారతదేశానికి విదేశీ పెట్టుబడులు అధికంగా వస్తున్న రాష్ట్రాలలో గుజరాత్‌ది 2వ స్థానం. పారిశ్రామికవేత్తల బ్యాంక్ పరపతి అత్యధికంగా పొందుతున్న రాష్ట్రాలలో చైనా 10% వృద్ధి రేటు సాధిస్తుందని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ, గుజరాత్ చాలాకాలం నుంచే 10% వృద్ధి రేటు సాధిస్తోంది. గుజరాత్ ఇలా అభివృద్ధిని సాధించటానికి గల కారణాలలో ఈ గ్యాస్ నిక్షేపాల లభ్యత కూడా ఒక ప్రధాన కారణం. బాంబే హైలో గ్యాస్ దొరకడం వల్ల గుజరాత్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. యూనిట్ 6 డాలర్లకు ఖతార్ నుంచి మనం గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటున్నాం. ఇరాన్ నుంచి పైప్లైన్వేసి పాకిస్థాన్ మీదుగా భారత దేశానికి గ్యాస్ తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నాం. మధ్య ఆసియా నుంచి తుర్కుమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా, పాకిస్థాన్ మీదుగా భారతదేశానికి గ్యాస్ తేవాలనుకుంటున్నాం. రష్యాలోని సకాలిన్ అయిల్ ఫీల్డ్స్‌లో మన ఓఎస్‌జిసి విదేశీ లిమిటెడ్ వెళ్ళి అక్కడి గ్యాస్ నిక్షేపాలను వెలికి తీస్తున్నది. వియత్నాంలోని లిన్టిన్ లాండ్ అయిల్ ఫీల్డ్స్‌లో కూడా ఓఎన్జిసి వెళ్ళి గ్యాస్ నిక్షేపాలను వెలికితీస్తున్నది. మయన్మార్‌లోని లేటిన్ వేలీలో కూడా అన్వేషణ జరుపుతున్నారు. లాటిన్ అమెరికా దేశమైన వెనిజులా దేశాధ్యక్షుడు చావెజ్, అమెరికాని గడగడలాడించ గలుగుతున్నాడంటే అందుకు కారణం అక్కడ లభ్యమయ్యే చమురు నిక్షేపాలే. ఆఖరికి న్యూయార్క్ నగరంలోని పేదల ఇళ్ళకి రాత్రిపూట దీపాలు వెలిగించుకునేందుకు అయిల్ను ఉచితంగా సరఫరా చేసాడు. అంత పవర్ఫుల్ వెపన్ ఈ గ్యాస్. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఇంధనం ఉంటే అక్కడ యుద్ధాలు జరుగుతాయి. అమెరికా ఇరాక్‌లో తిష్టవేయడానికి కారణం ప్రపంచంలో వున్న మొత్తం చమురు, వాయు నిక్షేపాలలో 11 శాతం ఇరాక్‌లో వుంది. 25 శాతం సౌదీ అరేబియాలో వుంది. అందుకే సౌదీ రాజు దుర్మార్గుడు, మతోన్మాది అయినా వాడిని కౌగిలించుకుంటారు జార్జిబుష్, బిల్ క్లింటన్లు. భారత దేశం ప్రక్కన బంగ్లాదేశ్ వుంది. అది అతి చిన్న దేశం. బిల్ క్లింటన్ బంగ్లాదేశ్ కూడా వెళ్ళి వచ్చాడు. ఎందుకు? అక్కడ గ్యాస్ వుంది. ఆఫ్ఘనిస్తాన్‌లో ఎందుకు తిష్టవేశాడు? అది ఇప్పటికీి గిరిజన ఆదిమ తెగలు నివసిస్తున్న ప్రాంతం. అయినా ఎందుకు వెళ్ళాడు? తుర్క్మెనిస్తాన్, కిర్జినిజియా, కజకిస్తాన్, ఉబ్జెకిస్తాన్, మొదలగు దేశాలలో పుష్కలంగా సహజవాయు నిక్షేపాలు వున్నాయి. వాటిని కొల్లగొట్టాలంటే ఇరాన్ ఒక ముఖద్వారం, ఆఫ్ఘనిస్తాన్ మరొక ముఖద్వారం. ఇరాన్ ముఖ ద్వారం నుంచి వెళ్ళటానికి అవకాశం లేదు. ఇరాన్ అమెరికాకు వ్యతిరేక దేశం. కనుక ఆఫ్ఘనిస్తాన్‌లో తిష్టవేసింది అటునుంచి వెళ్ళడానికే. ప్రపంచ రాజకీయం, ప్రపంచ అర్థ శాస్త్రం అంతా ఇంధనం చుట్టూనే తిరుగుతుంది. ఇంధనం అంత ప్రభావ వంతమైంది. ఆఫ్ఘనిస్తాన్‌లో మన ఇంజీనీర్లు వెళ్ళి రోడ్లు వేస్తున్నారు. చాలామందికి ఆశ్చర్యం అక్కడికి వెళ్ళి మనవాళ్ళు రోడ్లు వేస్తున్నారేమిటి? అని ఒకటి ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణానికి సహకరించాలన్నది భారతదేశం లక్ష్యం. అందులో అనుమానం లేదు. దాంతోబాటు ఉన్నది ఏమిటంటే పాకిస్తాన్‌ను బైపాస్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ నుంచి తుర్కుమెనిస్తాన్కు రోడ్డు వేస్తే తుర్క్మెనిస్తాన్లోని సహజవాయువులు ఆఫ్ఘనిస్తాన్ మీదుగా పాకిస్తాన్ మీదుగా భారతదేశానికి తీసుకురావచ్చు అని. ఇన్ని లాభాలు వున్నాయి కాబట్టే ఈ సంపదలో మాకు న్యాయమైన వాటా కావాలని మనం అడుగుతున్నాం. కనీసం 10% వాటా ఇవ్వండి అని అడిగాం. చాలామంది ఇక్కడ ఒక వాదం చెబుతారు. భారతదేశానికి సంబంధించిన సంపద ఇది. బాంబే హై మాదే అని మరాఠా వాళ్ళు అనుకుంటే మనదాకా వచ్చేదా? అస్సాం వాళ్ళు మాదే అనుకుంటే మనదాకా వచ్చేదా? కాబట్టి కృష్ణా,గోదావరి బేసిన్ కూడా మాదే అని అనుకోవద్దు అని వాదిస్తున్నారు. దేశం అంటే ఎవరిది? ఈ వేళ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే సహజ వనరులున్నాయో, ఆ సహజ వనరులు తమకు దక్కకుండా ఇతర ప్రాంతాలకు తీసుకువెళుతుంటే, అక్కడ తీవ్రమైన ఆశాంతి వ్యక్తమౌతుంది. న్యాయమైన వాటానే అడుగుతున్నాం: కృష్ణా, గోదావరి బేసిన్లో దొరికే గ్యాస్ అంతా మాదే అని మనం అనడం లేదు. అనడం న్యాయం కాదు. అన్నా ఇచ్చేవాడు లేదు. మనం అంటున్నది ఏమిటంటే మా ప్రాంతంలో వున్నది. మాకు కొద్దిగా అయినా వాటా ఇవ్వండి అని. ఇప్పుడు సదీపరివాహక ప్రాంతం హక్కులు ఉన్నాయి. ఏ నది ఎక్కడైతే ప్రవహిస్తుంటే అక్కడ ప్రజలకు మొదటి హక్కు వుంటుంది. అనేది ప్రపంచవ్యాప్తంగా వుంది. మిగులు జలాలు వుంటే తీసుకువెళ్ళు. అలాగే ఈ సహజవాయువు కూడా అలాంటి సంపదే కనుక అది ఈ ప్రాంతంలో దొరికింది కనుక మనకు ఇవ్వడం వల్ల ఇతర ప్రాంతాలు దెబ్బతింటాయా? మనకి ఇవ్వగా కూడా, ఇంకా పుష్కలంగా ఈ సహజ వాయువులు వున్నాయి. అందువల్ల మన డిమాండ్ ఏమిటంటే మేము విద్యుత్ ప్లాంట్లు తయారు చేసుకుంటాం. మేము ఎరువుల కర్మాగారాలు పెట్టుకుంటాం. మేము బస్సులకు సిఎన్జి అమర్చుకుంటాం. మేము పైప్‌లైన్ ద్వారా సిటీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా వంట గ్యాస్‌ను సప్లై చేసుకుంటాం. రు. 100/-కే గ్యాస్ ఇంటింటికి ఇచ్చుకుంటాం. మాకు సరిపోయినంత గ్యాస్ ఇస్తానన్న హామీ ఇవ్వండి అని అడుగుతున్నాం. కేంద్రం ఇంత వరకు దీనికి అంగీకరించలేదు. ఒక గ్యాస్ యుటిలైజేషన్ పాలసీనే తయారు చేయలేదు. ముఖేష్ అంబానీ ఇది నా గ్యాస్ నేను ఎక్కడైనా అమ్ముకుంటాను అని అంటాడు. మనం ఏమంటున్నాం. నీవు కాంట్రాక్టర్వే తప్ప ఓనర్వు కాదు. ఈ మొత్తం కృష్ణా, గోదావరి బేసిన్లో 3098 చ.కి.మీ.ల భూమిని ముఖేష్ అంబానీకే ధారాదత్తం చేసింది ఎవరు? రాజ్యాంగం అంగీకరిస్తుందా? కార్గిల్ యుద్ధ సమయంలో మన భూభాగంలోకి శత్రు సైన్యాలు ప్రవేశిస్తే మనం వీరోచిత త్యాగాలు చేసి మన భూమిని కాపాడుకున్నాం. అందువల్ల ప్రపంచంలో ఎక్కడ కూడా సముద్ర జల సంపదను ముఖేష్ అంబానీ కానీ, ఏ ప్రైవేటు కంపెనీకి కాని ఇవ్వరు. అది కూడా భారత రాజ్యాంగంలోని 297 ఆర్టికల్ ప్రకారం సహజ వనరుల యజమాని కేంద్ర ప్రభుత్వం మాత్రమే. రిలయన్స్ కాంట్రాక్టరే తప్ప ఓనరు కాదు. కాంట్రాక్టరుకు అధికారం ఉండదు. మొదటిగా మన వాదన ఏంటి? మా రాష్ట్రానికి అవసరం అయ్యే గ్యాస్ ఇవ్వండి ఆ ప్రాంతానికి కావల్సిన గ్యాస్ మొదట ఇవ్వండి. మనకే కాదు కృష్ణా, గోదావరి బేసిన్లో నివసించే ప్రజలకు ముందు ప్రాధాన్యత ఇచ్చి తరువాత ఈ రాష్ట్రానికి కావల్సిన వాటా ఇవ్వండి అని అడుగుతున్నాం. ఈ డిమాండ్‌ను రిలయన్స్ ఒప్పుకోలేదు. కేంద్ర ప్రభుత్వమూ ఒప్పుకోలేదు. ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు మనకు సరిపోయినంత గ్యాస్ ఇస్తానంటున్నారని అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. ఇప్పటికే కాకినాడ, హైదరాబాద్ మీదుగా అహ్మదాబాద్ తీసుకు వెళ్ళాటానికి ఒక పైపు లైన్ వేశారు. మరో పైప్‌లైన్ గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ కాకినాడ, మల్లవరం, వరంగల్, వార్థ, నాగపూర్, ఇండోర్ మీదుగా గుజరాత్ తీసుకువెళ్ళడానికి వేస్తున్నది. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దీన్ని తీసుకెళ్ళి అజీరా, బీజాపూర్, జగదీష్పూర్, ఉత్తరప్రదేశ్‌లోని పైపులైనుతో దీన్ని లింకు చేస్తుంది. అన్ని పైపులైన్లు గుజరాత్‌కు వెళుతున్నాయి అని ఎకనామిక్ టైమ్స్‌లో వచ్చింది. ఇవ్వాళ ప్రతి నెల 2 లక్షల కొత్త గ్యాస్ కనెక్షన్లు పైపులైన్ ద్వారా ఇస్తాను అని నరేంద్ర మోడి గుజరాత్లో ప్రకటించుకున్నాడు. అంటే ఈ సంపద అంతా గుజరాత్‌కు తరలివెళుతుంటే మనం చూస్తూ వూరుకొని, తరువాత ఎప్పుడో బాబ్లిలో, ఆల్మట్టిపైన అల్లరి పెట్టినట్లు మనం మాట్లాడతాం. అక్కడ విద్యుత్ ప్లాంట్లు ఉంటాయి, గ్యాస్ ఎలోకేషన్ వుంటుంది. అందువల్ల మనం అడుగుతున్నది మాకు ఒక ఫాం ఎలొకేషన్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్‌కు ఇంత వాటా ఇస్తాం అని హామీ ఇవ్వండి. ఇచ్చిన తరువాత ఆటోమేటిక్‌గా కంపెనీలు వస్తాయి. ఫాం ఎలొకేషన్ లేకుండా ఎవ్వరూ కూడా పెట్టుబడులు పెట్టరు. ఎందుకంటే హైదరాబాద్‌లో పైప్‌లైన్ ద్వారా గ్యాస్ ఇవ్వాలనుకుంటేనే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. రాను రాను లాభం వస్తుంది. ఇప్పటికే గ్యాస్ అథారిత ఫ్యాక్టరీలకి గ్యాస్ అందకపోవడం వల్ల మనం రివర్స్‌లో డబ్బులు కడుతున్నాం. నదీ జలాలను ట్రిబ్యునల్ పెట్టి ఇంత వాటా అని డిసైడ్ చేస్తారు. ఈ స్టేట్‌కి ఇంత నీళ్ళు, మహారాష్ట్రాకి ఇంత అని ఆ స్థాయి గ్యాస్ ఇవ్వడం సాధ్యం కాదు. కాని ఏదో మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ఇంత ఇస్తామని చెప్పమని అడుగుతున్నాం. గ్యాస్ ధర ఎవరు నిర్ణయించాలి? రిలయన్స్ వాడు నేను ఉత్పత్తి చేస్తున్నా నా ఇష్టం అంటాడు. కొంతమంది ప్రైవేటు శక్తులను సమర్థించేవారు మార్కెట్ శక్తులకు వదిలేయండి అంటారు. కాని పరిమితమైన వనరులను మార్కెట్టు శక్తులకు వదిలేస్తే ఎమవుతుందో మనం చూస్తున్నాం కదా, కందిపప్పు ఏమయింది? బియ్యం ఏమయింది.? కొరత లేకపోయినా కొరతను సృష్టించి భారీ ఎత్తున గోడౌన్లలో దాచి దాని ధరని భయంకరంగా పెంచి అమ్ముకుంటున్నారు. అందువల్ల మార్కెట్ శక్తులకు వదిలేస్తే న్యాయం జరగదు. అందుకే ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వ్యవస్థ పేరుకు మాత్రం మనకు మంత్రులు కాని వారికి దేశంకటే ముఖేష్ రిలయన్స్ ప్రయోజనాలే ముఖ్యం. రు.100/- పెట్టుబడి మొదట చూపెట్టి తరువాత రు. 400/-లు చేశాడు. ఇది మన ఆరోపణ కాదు. అనిల్ అంబానీ కోర్టుకు చెప్పాడు మా అన్న దోచుకుంటున్నాడు అని. 2009-10 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ముఖేష్ అంబానీకి ప్రాఫిట్ అండ్ నాచురల్ గ్యాస్‌పైన ట్యాక్స్ ఫ్రీ చేసింది. ఈ ఒక్క చర్య వల్ల ముఖేష్ అంబానీకి లభించిన ఆదాయం, లేదా ప్రభుత్వం కోల్పోయింది 20 వేల కోట్ల రూపాయలు. భారత దేశంలో ఈ డబ్బుతో సగం ప్రాంతానికి ఉపాధి హామీ పథకం అమలు పర్చవచ్చు. ఇంత భయంకరంగా ముఖేష్ అంబానీకి బాసటగా నిలిచిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మాట ఎందుకు వింటుంది? ఆధారము: ఏ.పి యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్.ఆర్గ్