గృహాల్లో నీటి వినియోగం తగ్గించడానికి చిట్కాలు ఆహార వ్యర్థాలను పారవేసేందుకు కంపోస్ట్ పైల్ విధానాన్ని, మామూలు చెత్త పారవేసే దానికి ప్రత్యామ్నాయ పద్ధతిగా, ఉపయోగిస్తే నీటి వృథాను తగ్గించవచ్చు. చేతితో వంట పాత్రలను కడిగేటప్పుడు నీటి వాడకాన్ని తగ్గించాలి. అనవసరంగా టాయిలెటును ఫ్లష్ చేయటాన్ని నివారించండి. లాన్స్ మరియు ఇతర మైన వాటిని మురికి నీటిని ఉపయోగించి తడపాలి. నీటి అవసరాలను తగ్గించటమే కాకుండా, ఇది భూగర్భ జలాలను పెంచుతుంది. ఉదయం పూట ఉష్ణోగ్రత మరియు గాలి వేగం తక్కువగా ఉన్న సమయంలో లానుకు నీళ్లు చల్లటం వలన బాష్పీభవనం వల్ల జరిగే నష్టం తగ్గుస్తుంది. పాడైన గోట్టాలకు వెంటనే మరమ్మతులు చేయాలి. స్థానిక పొదలు మరియు చెట్లను తోటలో నాటడం వలన లానులకు అవసరమైన నీటిని తగ్గించవచ్చు. వర్షపు నీటి సేకరణను రోజు వాడే పనులకు అలాగే భూగర్భ జలాలు పెంచడానికి ఉపయోగిస్తే మునిసిపల్ నీటి సరఫరా మీద ఆధారపడటం తగ్గించుకోవచ్చు. మూలం : పోర్టల్ కంటెంట్ టీమ్ సంబంధిత వనరులు ఎడ్యూగ్రీన్ వెబ్సైట్ నీటి గురించి మొత్తం - ఎ ట్రిప్ విత్ డ్రిప్ ద వాటర్ డ్రాప్