జన్ ధన్ యోజన ప్రజా కేంద్రక ఆర్థిక కార్యక్రమం - సార్వజనీన వృద్ధికి పటిష్ట పునాది ఓ పుష్కర కాలం నుంచీ దేశం దశ, దిశలను సమూలంగా మార్చి, ప్రగతికి ఉత్తేజమిన్వడం ద్వారా ఆర్థిక విప్లవానికి నాంది పలికిన అత్యంత గతిశీల పథకాలలో ఒకటి 'ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, దేశ ఆర్థిక వనరులతో పేదల అవసరాలు తీరుస్తూ సామాన్యులకు సాధికారత లక్ష్యంగా 2014 ఆగస్టు 28న ఈ పథకం ప్రారంభమైంది. ఆనాడు నాటిన ఈ విత్తనం బహుముఖ మార్పుల దిశగా ప్రగాఢ ప్రభావం చూపుతూ సామాజిక, ఆర్థిక, సాంకేతిక సాధికారతల మహా వృక్షంగా విస్తరించింది. పీఎంజెడీవై ఖాతా విశిష్టాంశాలు -ఉచిత సదుపాయాలు పీఎంజెడీపై ఖాతాలు 'ప్రాథమిక పొదుపు బ్యాంకు డిపాజిట్ ఖాతాలు' (బీఎస్బీడీఏ). పూర్తి కెవైసీ నిబంధనలు వర్తించే ఈ ఖాతాలలో నగదు నిల్వ లేదా లావాదేవీ విలువకు ఎలాంటి. పరిమితులు ఉండవు. బ్యాంకు శాఖల వద్దనే కాకుండా ఏటీఎం,సీడీమ్ ల వద్ద కూడా నగదు జమ చేసే సదుపాయం ఉంటుంది. ఏదైనా ఎలక్ట్రానిక్ విధానం లేదా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల చెక్కుల జమ/సేకరణ ద్వారా నిధుల స్వీకరణ/రుణ సౌలభ్యం. నెలలో డిపాజిట్ మొత్తం లేదా విలువపై ఎలాంటి పరిమితి ఉండదు. నెలకు కనీసం నాలుగు దఫాలు (మెట్రో సహా ఏదైనా ఏటీఎం నుంచి) నగదు ఉపసంహరణ ఉచితం. ₹2 లక్షల ప్రమాద బీమా రక్షణ సహిత ఉచిత రూపే డెబిట్ కార్డు. ప్రభావం 1: ప్రజా కేంద్రక ప్రభావం వృద్ధికి మూలస్తంభం దేశంలో ప్రతి కుటుంబానికీ కనీసం ఒక ప్రాథమిక బ్యాంకు ఖాతా ద్వారా ఆర్థిక సార్వజనీన భారత్ కు పునాది పడింది. ప్రపంచ బ్యాంకు ప్రకటించిన 'గ్లోబల్ పిండెక్స్- 2025' నివేదిక ప్రకారం ప్రపంచంలోని మొత్తం బ్యాంకు ఖాతాల్లో భారత వయోజన ఖాతాల వాటా 89% పైగా నమోదైంది. 2011 నాటికి వయోజన బ్యాంకు ఖాతాలు 35%. శూన్య నిల్వతో ఖాతా తెరిచే సదుపాయం వల్ల నిరుపేదలు కూడా అధికారిక బ్యాంకింగ్ తో సంధానితులయ్యే వీలు కలిగింది. శూన్య నిల్వ ఖాతాల సంఖ్య ఇప్పుడు 10% కన్నా తక్కువ. డెబిట్ కార్డులు ఇప్పుడు హోదాకు ప్రతీక కాదు. ఆన్లైన్ చెల్లింపులు అసాధారణ స్థాయిలో ఉన్నాయి. 40.89 కోట్ల రూపే కార్డులు లబ్దిదారులకు ఉచితంగా జారీ అయ్యాయి. తద్వారా డిజిటల్ చెల్లింపులు నేడు ప్రజలకు ఒక అలవాటుగా మారిపోయింది. ప్రమాద బీమా రక్షణ, ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యంతో ఖాతాదారులకు అదనపు ఆర్థిక భద్రత సమకూరింది. 34.77 లక్షల పీఎంజేడీవై ఖాతాదారులు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుంటుండగా, కొన్ని షరతులతో ₹10,000 దాకా ఈ సదుపాయం లభిస్తోంది. 'బ్యాంకింగ్ మిత్ర', బ్యాంకుల నెట్ వర్క్ విస్తరణ, బ్యాంకు సేవలు చివరి అంచెదాకా చేరడం వంటి ప్రయోజనాలతో గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవల సౌలభ్యం కలిగింది. 13.55 లక్షల 'బ్యాంకు మిత్ర' కార్యకర్తలు నేడు ప్రజలకు బ్యాంకుశాఖ రహిత సేవలను అందిస్తున్నారు. 45.68 కోట్ల ఖాతాలను గ్రామీణ, సాక్షిక-పట్టణ ప్రాంతాలలో తెరిచిన నేపథ్యంలో నీటి వాటా సుమారు 78% పొదుపు సంస్కృతి, ఆర్థిక క్రమశిక్షణ పెంపొందింది. ₹3.10 లక్షల కోట్లు తప్పనిసరి నిల్వ నిబంధన లేకపోయినా జన్ ధన్ ఖాతాల్లో జమ చేసిన మొత్తం. ప్రభావం 2 : ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) - పాలనలో పారదర్శకత జన్ ధన్-ఆధార్-మొబైల్ (జామ్ త్రయం) సంయుక్త శక్తితో ప్రభుత్వ పథకాల రాయితీలు, ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ అయ్యే వీలు కలిగింది. 52.50 లక్షల కోట్లకు పైగా నిధులు 'జామ్ త్రయం' ద్వారా పౌరుల ఖాతాలకు బదిలీ అయ్యాయి. 900 కు పైగా పథకాల నిధులు కూడా లబ్దిదారుల ఖాతాలకు 'డీబీటీ' ద్వారా బదిలీ అయ్యాయి. దళారుల బెడద తొలగిపోవడంతో అవినీతి, నిధుల దుర్వినియోగం గణనీయంగా తగ్గిపోయాయి. డీబీటీతో ప్రజలకు సామాజిక భద్రత ప్రయోజనాల పరిధి కూడా విస్తరించింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఉజ్వల యోజన, కోవిడ్ ఉపశమన పథకాల ప్రయోజనాలు అర్హులైన పౌరులకు సకాలంలో, నేరుగా చేరాయి.₹4.46 లక్షల కోట్లకు పైగా మొత్తాన్ని 23 విడతలుగా రైతులకు పంపిణీ చేశారు.సహాయం పంపిణీ 9.44 కోట్ల మందికి పైగా రైతు లబ్ధిదారులు. వీరిలో మహిళలు 23 శాతం. పీఎం కిసాన్ తొలివిడత మొత్తం ₹2,000 ఏప్రిల్ 2020లో విడుదల చేయగా, దీనివల్ల 8.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం లభించింది. ఉజ్వల యోజనలో భాగంగా సుమారు 11 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయగా, రాయితీలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమయ్యాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో 3 కోట్ల మంది వితంతువులు, దివ్యాంగులు సహా ప్రతి లబ్ధిదారుకూ ₹1,000 వంతున ఆర్థిక సహాయం మంజూరైంది. అధిక వడ్డీ వసూలు చేసే స్థానిక వ్యాపారులపై ఆధారపడాల్సిన దుస్థితిని తప్పించడంతో పాటు రుణ వలయం నుంచి విముక్తి కల్పించడంలో ఈ పథకం తోడ్పడింది. పీఎంజేడీవై ద్వారా పేదలు, అణగారిన వర్గాల వారికి బ్యాంకింగ్ సేవలు చేరువయ్యాయి. ఖాతాలు తెరవడం ద్వారా ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం, రుణ సౌలభ్యం కలిగాయి. ఈ ఏడాది (2026) మార్చి నాటికి ప్రధానమంత్రి స్వనిధి పథకంలో భాగంగా సుమారు 84 లక్షల మంది వీధి వ్యాపారులకు ₹17,000 కోట్లకు పైగా హామీ రహిత రుణం లభించింది. ఆర్థిక వ్యవస్థ క్రమబద్ధీకరణ నగదు ఆధారిత అనధికారిక లావాదేవీలన్నీ అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయి. శూన్య నిల్వ జన్ ధన్ ఖాతాలు తెరవడం వల్ల లోగడ డబ్బు ఇంట్లోనే ఉంచుకున్న వారికి నేడు బ్యాంకులలో దాచుకునే వీలు కలిగింది. వడ్డీ వ్యాపారులు లోగడ నగదు లావాదేవీలు ఆసరాగా దోపిడీకి పాల్పడితే, ఇప్పుడు ఆన్ లైన్ చెల్లింపులతో రికార్డుల నిర్వహణ సులభమైంది. ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల ఆదా సహా నిజమైన లబ్ధిదారులకు నేడు అన్ని ప్రయోజనాలూ అందుతున్నాయి. ₹5లక్షల కోట్లకు పైగా ప్రజా ధనం డీజీటీ వల్ల ఆదా అయింది. నకిలీ, బూటకపు గ్యాస్ కనెక్షన్లు, రేషన్ కార్డుల తొలగింపుతో పునరావృతి బాధ తప్పింది. డీబీటీలో మొత్తం ప్రభుత్వ వ్యయంలో సబ్సిడీలకు కేటాయింపు 16 నుంచి 9 శాతానికి తగ్గింది. ప్రభుత్వ వ్యయ సామర్థ్యంలో గణనీయ మెరుగుదలకు ఇదొక నిదర్శనం. పేదల క్రెడిట్ స్కోరింగ్, భవిష్యత్తు రుణ అర్హతల విషయంలో వారి ఆర్థిక సమాచార జాడ కీలక పాత్ర పోషిస్తోంది. అనధికారిక రంగంలోని వారికి లేదా పేదరిక నేపథ్యం గలవారికి లోగడ క్రెడిట్ స్కోరు లేనందువల్ల బ్యాంకు రుణం లభించేది కాదు. ఇప్పుడు జన్ ధన్ తో మార్గం సుగమమైంది. రుణ సౌలభ్యం పెరగడంతో పేద, అట్టడుగు వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ఈ గుణాలతో వారికి తమ పిల్లల విద్యా వ్యయభారం తగ్గింది. ప్రభావం 3 : సామాజిక భద్రత సార్వజనీన వృద్ధి జన్ ధన్ ఖాతాలను ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి సామాజిక భద్రత పథకాలతో అనుసంధానించారు. 27.8 కోట్ల మందికి పైగా చందాదారులు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో భాగంగా సిమోదయ్యారు. ఏ కారణం వల్లనైనా మరణం సంభవిస్తే చందాదారు కుటుంబానికి ₹2 లక్షల జీవిత బీమా రక్షణ. వార్షిక రుసుము ₹436. అంటే- రోజుకు 21.20 కన్నా తక్కువ వ్యయంతో ఈ బీమా లభిస్తుంది. 58.78కోట్ల మంది చందాదారులు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన నమోదయ్యారు. మరణం లేదా శాశ్వత సంపూర్ణ వైకల్యం సంభవిస్తే ₹2 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా రక్షణ, శాశ్వత పాక్షిక వైకల్యం సంభవిస్తే 21 లక్ష మేర రక్షణ లభిస్తుంది. వార్షిక రుసుము ₹20 (సుమారు ఒక కప్ టీ ధర). 18-70 2వయోవర్గంలో ఉన్నవారు ఈ పథకం కింద చందాదారులుగా చేరవచ్చు. 9.29కోట్ల మంది చెందాదారులు అటల్ పెన్షన్ యోజనలో చేరాను. ఇది ప్రభుత్వ హామీతో లభించే తొలి పెన్షన్ పథకం. దీని కింద నెలకు ₹1,000 నుంచి ₹5,000 దాక పెన్షన్ లభిస్తుంది. వయస్సు ఎంపిక చేసుకున్న పెన్షన్ మొత్తానికి అనుగుణంగా ప్రస్తుత నెలవారీ చందా ₹242 నుంచి ₹1,454 వరకూ చెల్లించాల్సి ఉంటుంది. ముద్ర యోజనలో భాగంగా రుణాలు పొందే సదుపాయంతో చిన్న తరహా పారిశ్రామికవేత్తలకు.. ముఖ్యంగా మహిళలకు, గ్రామీణ ప్రజలకు స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. 59 కోట్లకు పైగా రుణాలు ప్రధానమంత్రి ముద్ర యోజన కింద మంజూరయ్యాయి. ₹40.76 లక్షల కోట్ల మేర వ్యవస్థాపకులకు రుణం పంపిణీ చేశారు. పొదుపు అలవాటును ప్రోత్సహించడం వల్ల ఆర్థిక క్రమశిక్షణకు బాటలు పడటంతో పాటు భవిష్యత్తు ప్రణాళిక సామర్థ్యం ఇనుమడించింది. రమారమి ₹3.10 లక్షల కోట్ల దాకా నిధులు 58.70 కోట్ల జన్ ధన్ ఖాతాల కింద తప్పనిసరి నిల్వ నిబంధన లేకపోయినప్పటికీ జమయ్యాయి. అసంఘటిత రంగంలోని కోట్లాది కార్మికులకు, వారి కుటుంబాలకు తొలిసారి జీవిత-ప్రమాద బీమా రక్షణ లభించింది. 31.65 కోట్ల మందికి పైగా అసంఘటిత రంగ కార్మికులు 'ఇ-శ్రమ్' పోర్టల్ లో నమోదు చేసుకున్నారు. దీనివల్ల అనేక సామాజిక-ఆర్ధిక పథకాల ప్రయోజనాలను ఒకే వేదికపై పొందే అవకాశం వారికి లభించింది. పీఎంజేడీవై ఖాతాదారులందరూ సామాజిక భద్రత బీమా పథకాల (ఉదా: ప్రధానమంత్రి జీవన్. జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన, అటల్ పెన్సన్ యోజన)లో చందాదారులుగా చేరేందుకు, చందా మొత్తం సులువుగా చెల్లించేందుకు ప్రభుత్వం వివిధ మార్గాల్లో ప్రోత్సహిస్తోంది. ప్రభావం 4 : మహిళా సాధికారత - సామాజిక గౌరవం జన్ ధన్ ఖాతాలలో మహిళల వాటా సుమారు 56 శాతం కాగా, వారి ఆర్థిక సాధికారత దిశగా ఇదొక కీలక మలుపుగా నిలిచింది. బ్యాంకు ఖాతా తమ పేరిట ఉండటం వల్ల మహిళల స్వయంసమృద్ధి సాధన సహా కుటుంబ ఆర్థిక నిర్ణయాలలో పాలుపంచుకునే అవకాశం వారికి లభించింది. 32.72 కోట్ల జన్ ధన్ ఖాతాలు తెరవడం ద్వారా మహిళలు తమ పొదుపును బ్యాంకులో దాచుకునే వీలు కలిగింది. 75% ఇళ్లను 'పీఎం ఆవాస్ యోజన- గ్రామీణ్ 'లో భాగంగా మహిళల పేరిట మంజూరు చేయడంతో వారు లేదా ఉమ్మడి యాజమాన్యంలో ఆ ఇళ్ళు నమోదయ్యాయి. అలాగే, ఇతర పథకాల్లోనూ మహిళలకు ప్రాధాన్యంతో ఆర్థిక సహాయం లేదా రాయితీలు నేరుగా వారి ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. వివిధ పథకాల ప్రయోజనాలు, ఆర్థిక సహాయం డీబీటీ ద్వారా మహిళల ఖాతాల్లో నేరుగా జన అవుతుండటంతో వారి సామాజిక గౌరవం కూడా ఇనుమడించింది. మహిళా లబ్దిదారులు: 68% పీఎం ముద్ర రుణ యోజన 44% పీఎం స్వనిధి యోజన. 10 కోట్ల మందికి పైగా గ్రామీణ మహిళలు స్వయం సహాయ సంఘాలతో ముడిపడి ఉండటంతో వారికి ప్రభుత్వ చేయూత అభిస్తోంది. సుకన్య సమృద్ధి యోజనలో భాగంగా ఆ ఖాతాల్లోనూ విధులు జమ అవుతున్నాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో మహిళా ఖాతాదారులకు తక్షణ ఉపశమన సహాయం నేరుగా బదిలీ అయింది. ₹30,600 కోట్ల మేర సహాయాన్ని కోవిడ్- 19 సమయంలో 'పీఎంజెడీవై' ఖాతాలు గల 20.40 కోట్ల మంది మహిళలకు నెలకు ₹500 వంతున వరుసగా మూడు వాయిదాల్లో జమ చేశారు. 14.17 కోట్లకు పైగా వంటగ్యాస్ సిలిండర్లను ప్రధానమంత్రి ఉజ్వల యోజనలో భాగంగా కోవిడ్-19 సమయంలో సుమారు 8 కోట్ల మంచి లబ్దిదారులకు సరఫరా చేయగా, వీటిపై రాయితీ కింద ₹9,670 కోట్ల మేర డీబీటీ ద్వారా జమ చేశారు. వరదలు, కరవు వంటి ఇతర విపత్తుల వేళ అత్యవసర నగదు బదిలీకి ఇదొక సంసిద్ధ వ్యవస్థగానూ ఉపయోగపడింది. ప్రభావం 5 : డిజిటల్ ఇండియా - సాంకేతిక సాధికారత డిజిటల్ చెల్లింపుల విప్లవానికి యూపీఐ సహా జన్ ధన్ ఖాతాలు బలమైన పునాది వేశాయి. తద్వారా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో డిజిటల్ లావాదేవీలు నమోదయ్యే దేశంగా భారత్ నేడు అవతరించింది. 55.49 కోట్ల మంది యూపీఐ వినియోగదారులు. ₹314 లక్షల కోట్లకు పైగా విలువగల యూపీఐ లావాదేవీలు 2025-26లో నమోదయ్యాయి. 10 దేశాలు- భూటాన్, సింగపూర్, యూఏఈ, ఫ్రాన్స్, మారిషస్, శ్రీలంక, నేపాల్, ఖతర్, గ్రీస్, కంబోడియాలలో యూపీఐ విస్తృత వినియోగంలో ఉంది. గ్రామీణ- మారుమూల ప్రాంతాల్లోనూ డిజిటల్ అవగాహన విస్తరణకు రూపే కార్డులు, మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాలు దోహదపడ్డాయి. 40.89 కోట్ల రూపే డెబిట్ కార్డులను జన్ ధన్ ఖాతాదారులకు జారీ. 6.39 కోట్ల మందికి ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ (పీఎంజీదీక్ష) లో భాగంగా శిక్షణ. 'జన్ థన్ దర్శక్' యాప్ ప్రకారం, బ్యాంకింగ్ అవుట్ లెట్లు 5 కిలోమీటర్ల మేర ప్రాంతాలను కవర్ చేస్తాయి. 21.6 లక్షలకు పైగా బ్యాంకింగ్ సేవా కేంద్రాలు దేశవ్యాప్తంగా ఏర్పాటు. 6 లక్షలకు పైగా (99.92%) గ్రామాలకు 5 కిలో మీటర్ల పరిధిలో (బ్యాంకు శాఖ, తపాలా చెల్లింపుల బ్యాంకు లేదా బ్యాంకు మిత్ర వంటి) బ్యాంకింగ్ సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. జాతీయ - అంతర్జాతీయ గుర్తింపు ప్రపంచంలోనే అత్యంత భారీ ఆర్థిక సార్వజనీనత కార్యక్రమంగా ఇది ప్రపంచ బ్యాంకు సహా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా గుర్తింపు పొందింది. 1,80,96,130 ఖాతాలను జన్ ధన్ యోజన కింద ఒక వారం (2014 ఆగస్టు 23-29) లో ప్రజలు ప్రారంభించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ ఈ ఘనత నమోదైంది. ప్రపంచంలోని వర్ధమాన దేశాల్లో సార్వజనీన ఆర్థిక విధానానికి ఈ పథకం ఒక నమూనాగా నిలిచింది. ఆధారం: న్యూ ఇండియా సమాచార్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన