ఈ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మే 10, 2018 న కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి - ఇందిరానగర్ వద్ద ప్రారంభించారు. మొట్టమొదటి సారిగా ధర్మరాజుపల్లి వాసులు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా చెక్కులు, పట్టాదార్ పాసు పుస్తకాలు అందుకున్నారు. లాభాలు రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఎకరానికి రూ.4 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేయనుంది. ఖరీఫ్, రబీ సీజన్ లకు ఎకరానికి రూ. 5000 చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ. 10000 పెట్టుబడిగా ఇవ్వనుంది. అర్హత రైతు తెలంగాణ రాష్ట్రంలో నివాసి అయి ఉండాలి. రైతుకు భూమి ఉండాలి. రైతు చిన్న, ఉపాంత రైతు అయి ఉండాలి. ఈ పథకం వాణిజ్య రైతులకు వర్తించదు. ఆధారం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్సైట్