జాతిపిత మహాత్మాగాంధీ దృష్టిలో ఆదర్శ గ్రామం నమూనా మన “స్వరాజ్యాన్ని” “సురాజ్య” సాధనకై మహాత్మాగాంధీ ప్రతిపాదించిన గ్రామీణాభివృద్ధి కేవలం ప్రతి గ్రామం ఒక ఆదర్శ నమూనా (గ్రామంలా రూపొందించి తద్వారా గ్రామీణాభివృద్ధి సాధన. మహాత్మాగాంధీ మాటల్లోనే... ఒక నమూనా ఆదర్శ గ్రామం రూపొందాలంటే ముఖ్యంగా సాధించాల్సింది అవలంబించాల్సింది “పరిశుభ్రత”. ప్రతి గ్రామంలో చక్కని గాలి, వెలుతురు కలిగిన ఇళ్ళు సుమారు 5 మైళ్ళ పరిధిలో ఉండాలి. గ్రామంలో ఉన్న సందుల రోడ్లు దుమ్ము, ధూళి రహితంగా ఉండి అందరికీ అందుబాటులో ఉండాలి. ప్రజలందరూ ఒకే చోట సమావేశమయ్యే స్థలం, గ్రామంలో ఉన్న పశుసంపద, అవి మేయడానికి ఒక స్థలం, సహకార పాడి పరిశ్రమ, ప్రాథమిక, ఉన్నత విద్య అందించే విద్యావ్యవస్థ ఉండాలి. బోధించే విద్యలో పరిశ్రమాభివృద్ధి పాఠ్యాంశంగా వుండాలి. గ్రామ పంచాయితీ వ్యవస్థ, వివాదాలు పరిష్కరించగలగాలి. ప్రతి గ్రామం ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవాలి, కూరలూ, పళ్ళూ సొంతంగా పండించుకొని స్వయం సమృద్ధి సాధించేదిగా ఉండాలి. స్వయంగా ఖద్దరు తయారుచేసుకోవాలి. అలాంటిదే “నమూనా ఆదర్శగ్రామం - (హరిజన్, 9-1,1987, వాల్యూమ్ నెం. 64, పేజీ 217-18) ఈ విధంగా ఉండే ప్రతి గ్రామం హెచ్చుగా ఉండే గ్రామీణాభివృద్ధి పరిశ్రమలతో అభివృద్ధి సాధిస్తూ, ప్రతి పౌరుడు విద్యావంతుడై రహదారులన్నీ పరిశుభ్రంగా, బావులన్నీ మంచినీటితో, అన్ని వర్గాలూ సమతుల్యం పాటిస్తూ, అంటరానితనాన్ని నిర్మూలించి, ప్రతి పౌరుడూ ఆవుపాలు, నెయ్యి సేవిస్తూ ప్రతి పౌరుడూ శ్రమ చేసి జీవించి తగవులకూ, ఆందోళనలకు దూరంగా ఉంటూ, స్నేహంగా కలసిమెలసి జీవించాలి. (మున్నాల్షా కు గాంధీజీ రాసిన ఉత్తరం 4-4-1941, వాల్యూమ్ 73, పేజీ 421.) “గ్రామ స్వరాజ్య సముపార్ణన సాధించాలంటే ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధిస్తూ, పొరుగు వారి సహకారాన్ని తీసుకొంటూ, పొరుగువారికి సహకరిస్తూ దృఢంగా ఉండాలి. ప్రతి గ్రామం ముఖ్య లక్ష్యసాధన ఏమిటంటే, గ్రామ ప్రజలు ఆహార ధాన్యాలు సమృద్ధిగా పండిస్తూ వారి దుస్తులకు కావల్సిన ప్రత్తిని వారే పండించుకోవాలి. పశు సంపద సమృద్ధిగా ఉంచుకొంటూ, పిల్లలకు, పెద్దలకూ ఆటస్థలాలు అభివృద్ధి చేసుకోవాలి. కనీస ఆహారాభివృద్ధి సాధించాక, మిగులు భూమిలో ద్రవ్యాభివృద్ధి సాధనాలైన పొగాకు… ఇతరాలైనవి పండించి ఆర్థికాభివృద్ధి సాధించాలి. ప్రతి గ్రామంలో చక్కని విద్యావ్యవస్థ, రంగస్థలం ఉండాలి. ప్రతి గగ్రామమూ నీటి నిర్మాణ వ్యవస్థ చక్కగా అభివృద్ధి చేసి సాగునీరు, త్రాగునీరు పెంపొందించుకోవాలి. ప్రతి పౌరునికి నిర్బంధ కనీస విద్య అనివార్యం. చక్కని సహకారాన్ని పెంపొందించుకొంటూ గ్రామంలో ప్రతి పౌరుడు కష్టపడి గ్రామాభివృద్ధికి తోడ్పడి, అంటరాని వ్యవస్థను నిర్మూలించాలి. (హరిజన్ 26-7-1945, వాల్యూమ్ 76, పేజీ నెం. 808 - 809) “భారతదేశంలోని గ్రామాలను ఎలా పునర్మించాలి అనేది దేశంను ప్రేమించే ప్రతి ఒక్కరి ముందు ఉన్న అంశము. అప్పుడే ఎవరు అయినా ఆ గ్రామాలలో సౌకర్యవంతంగా, నగరాలలో మాదిరిగా నివసించవచ్చు”. (హరిజన్ 7-8-1986) లక్ష్యం ప్రతి ఒక్కరూ “యస్. ఎ.జి. వై” గాంధీజీ ప్రతిపాదించిన గ్రామీణ పునర్నిర్మాణ వ్యవస్థను అనుసరించి, వాస్తవ లక్ష్యంగా పెంపొందించుకోవాలి. “'యస్.ఎ.జి. వై” విలువలు గ్రామంలో ఉన్న పౌరులందరూ, సదరు పేర్కొన్న గ్రామీణ పునర్నిర్మాణ బద్ధులై ఉండాలంటే కొన్ని విలువలకు లోబడి ఉండాలి. అవి : గ్రామంలో నివసించే అన్ని వర్ణాల ప్రజలను ఇందులో భాగస్వాములుగా చేసి, గ్రామ జీవితానికి, నిర్ణయాధికారానికి సభ్యులుగా చేసి రూపొందించాలి. “పేద, అల్పాదాయవర్గాలు” అంత్యోదయాలో పేర్కొన్నవిధంగా, వారి అభివృద్ధికి తోడ్పడాలి. ప్రతి గ్రామంలో మహిళలను గౌరవింస్తూ, లింగ వివక్షకు పాల్పడే వ్యవస్థను నిర్మూలించాలి. ప్రతిగ్రామం సామాజిక న్యాయం అందరికీ అందుబాటులో ఉండే హామీ కల్పించాలి. సమైక్య జీవనాన్ని పెంపొందిస్తూ, స్వచ్చందంగా సంఘసేవ చెయ్యాలి. చక్కని పరిశుభ్రత, చక్కటి సంస్కృతి రూపొందించుకోవాలి. చక్కటి పర్యావరణ సమతుల్యాన్ని సాధించాలి. ప్రకృతిని కాపాడాలి. స్థానిక సంస్కృతిని కాపాడుతూ, అభివృద్ధి చేయాలి. ఒకరికి ఒకరు సహకరించుకొంటూ, స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి గ్రామాభివృద్ధికి తోడ్పడాలి. గ్రామంలో శాంతి, సౌబ్రాతృత్వాలను కాపాడుకోవాలి. చక్కని పారదర్శకతను అవలంబిస్తూ, ప్రజాజీవితంలో ప్రతి గ్రామ పౌరుడూ జవాబుదారీతనాన్ని పెంపొందించుకొని విలువలకి కట్టుబడాలి. గ్రామంలో “స్వయం పరిపాలనా వ్యవస్థను” ఏర్పరచుకోవాలి. మన రాజ్యాంగంలో నిర్దేశించిన ప్రాథమిక హక్కులు, ప్రాథమిక బాధ్యతలకూ గ్రామంలో ప్రతి పౌరుడూ కట్టుబడి నివశించాలి. లక్ష్యాలు “యస్.ఎ. జి.వైై ముఖ్య లక్ష్యాలు పవిత్రమైన (గ్రామ పంచాయితీ వ్యవస్థకు కృషి చెయ్యాలి. చక్కటి జీవన ప్రమాణాల అభివృద్ధికీ, మెరుగైన జీవన విధానాన్ని గ్రామంలో సాధించడానికి, అన్ని వర్ణాల సంక్షేమానికి... మెరుగైన కనీస అవసరాల అభివృద్ధి, అత్యధిక ఉత్పాదన, మెరుగైన మానవ అభివృద్ధి, మెరుగైన జీవనాధార అవకాశాలు, అసమానతలు లేని సమాజం ప్రతి పౌరుడూ తన హక్కులు బాధ్యతలు పాటిస్తూ విశాలమైన సామాజిక సమీకరణాలు అభివృద్ధి చేసిన సామాజిక మూలధనాలు ప్రతి గ్రామ పంచాయితీ వ్యవస్థను పునర్చిర్మాణపరచి, అభివృద్ధి చేసి, పొరుగు గ్రామాలకు “ఆదర్శంగా” నిలబడే గ్రామ పంచాయితీ వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలి. మిగతా గ్రామాలకి “ఆదర్శంగా” ఉండాలి. అభివృద్ధి చెందిన (ప్రతి గ్రామ పంచాయితీ వ్యవస్థ, మిగతా గ్రామాలకు “బోధనా పంచాయతీ వ్యవస్థగా మారి, మిగతా గ్రామాలను అభివృద్ధి చెయ్యాలి. “యస్.ఎ.జి.వై యొక్క ప్రధాన లక్ష్యం “విలువలకి కట్టుబడిన గ్రామీణ జీవితం, ప్రజలు మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలబడాలి.” గ్రామంలో ఉన్న పౌరులందరూ, సదరు పేర్కొన్న గ్రామీణ పునర్నిర్మాణ బద్ధులై ఉండాలంటే కొన్ని విలువలకు లోబడి ఉండాలి. గతం నుంచి నేర్చుకోవలసిన పాఠాలు కొన్ని గ్రామాలు చెప్పుకోదగిన అభివృద్ధిని, సమగ్ర స్వయం అభివృద్ధిని సమర్థులైన నాయకత్వంలో సమిష్టి కృషితో సాధించి పేరు తెచ్చుకొని, వెలుగులోకి వచ్చాయి. ఈ విధంగా గ్రామీణ స్వయం సమృద్ధి సాధించాలంటే ఎన్నో సమస్యలు ఎదురు అయ్యాయని మన గత అనుభవాల ద్వారా మనకి తెలిసింది. ముఖ్యంగా క్రింద పేర్కొన్న అంశాలు ప్రతిబంధకాలుగా పేర్కొనవచ్చును. నిర్మాణాత్మక అభివృద్ధి కోసం, దీర్ధకాలిక దృష్టి, లక్ష్యం, సహకారం లేకపోవడం నిజమైన సామాజిక అవసరాల కోసం పాటు పడకపోవడం, వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకోకపోవడం సమాజంలో ఉన్న అన్ని వర్గాల పాత్రలోపించడం, ముఖ్యంగా పెద్దలు, అనుభవజ్ఞుల నిర్మాణాత్మక పాత్ర గ్రామీణాభివృద్ధితో లేకపోవడం. సమగ్రమైన వ్యవస్థ లేకపోవడం, సామాజిక అంశాల పట్ల విస్మరించడం ఆదాయ, వ్యయ నిర్వహణలో లోటుపాట్లు. కేవలం ప్రభుత్వ సహాయం కోసం ఆధారపడి, స్వయం సహాయక బృందాల లేమి, సామాజిక పాత్ర గ్రామీణాభివృద్ధిలో విస్మరించడం. చక్కటి అభివృద్ధి పథకాలను విస్మరించడం /లేకపోవడం. సంక్షేమ పథకాలు కేటాయించడంలో లోటుపాట్లు జరగడం వలన తీవ్రమైన అసమానతలు గ్రామంలో పెరగడం. క్కటి రాజకీయ వ్యవస్థ లేకుండడము గ్రామంలో వివిధ వర్గాల సామాజిక - సాంస్కృతిక విలువలను విస్మరించడం ప్రస్తుత విభిన్న రాజకీయ వర్గాల పాత్ర, చక్కదిద్దే వ్యవస్థ లోపించడం తాత్కాలిక లాభాల కోసం పర్యావరణ సమతుల్యాన్ని విస్మరించడం. సామాజిక (ప్రతిబంధకాలైన మద్యపానం, వరకట్న సమస్య, కులవ్యవస్థ అల్లర్లు, మహిళలపట్ల వివక్ష చూపడం. వెళ్ళవలసిన దారి/అవలంబించే పద్ధతి/ దృక్పథం లక్ష్య సాధన కోసం క్రింది అంశాలు లెక్కలోకి తీసుకోవాలి. చక్కని నైపుణ్యంతో, న్యాయకత్వంతో, లక్ష్యబద్దులైన పార్లమెంటు సభ్యులు “గ్రామ పంచాయితీలను అభివృద్ధి పరచుకోవడంలో వారి పాత్ర ముఖ్యం కావాలి. ప్రజలను ఉత్తేజపరచి కార్యోనుముఖుల్ని చేసి, స్థానిక పరిపాలనలో భాగస్వాములను చేసి అభివృద్ధి వైపు పయనం. ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా (ప్రభుత్వం,(ప్రయివేటు వారు అందించే) పథకాలను రూపొందించి సహాయాన్ని పొందుపరచి, స్థానిక అభివృద్ధిని, సమతుల్యాన్ని సాధించాలి. స్వచ్చంద సంస్థల సేవలను, సహకార వ్యవస్థను ప్రోత్సహించి పరిశోధనా వ్యవస్థలను / సంస్థలను అభివృద్ధి చేసుకోవాలి. స్వయం సమృద్ధి సాధించడానికి నిలద్రాక్కుకోవడానికి వీలయిన ఫలితాలను సాధించాలి/ అన్వేషించాలి. చక్కని నైపుణ్యంతో, న్యాయకత్వంతో, లక్ష్యబద్దులైన పార్లమెంటు సభ్యులు “గ్రామ పంచాయితీలను అభివృద్ధి పరచుకోవడంలో వారి పాత్ర ముఖ్యంగా ఉండాలి. ఆదర్శ గ్రామంలో ఉండవలసిన/చేయవలసిన పనులు ప్రజల పాత్రను, వారి సామర్థ్యాన్ని అందుబాటులో ఉన్న వనరులని చక్కటి వినియోగం, ఆయా పార్లమెంట్ సభ్యుడి ద్వారా సాధించడం. ఈ లక్ష్య సాధన గ్రామ పంచాయితీ, ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యం. వ్యక్తిత్వ అభివృద్ధి : చక్కటి వరిశుబ్రోమైన ప్రవర్పన, సాద్తోన పెంపొందించడం. మంచి ఆరోగ్య అలవాట్లు అయిన శారీరక ధారుధ్యశ్రమ, ఆటలు ఆడే అలవాట్లు ఆరోగ్యానికి హానికరమైన త్రాగుడు, ధూమపానం అలవాట్లకి దూరంగా ఉండడం వ్యక్తిత్వ వికాసం / అభివృద్ధి ఆరోగ్య బీమా కోసం పాలసీ తీసుకోవడం, వైద్య పరీక్షలు సకాలంలో చేయించుకోవడం. సంపూర్ణ రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడం. సమతౌల్యమైన లింగాభివృద్ధి 100 శాతం ఆసుపత్రి ప్రసూతి వృద్ధులకు, పిల్లలకు, ఆడవారికి, అనారోగ్య బాధితులకు, పాలిచ్చే తల్లులకు సంపూర్ణ సమతౌల్య ఆహారాన్ని అందించడం. అంగవైకల్యం ఉన్న వారి ప్రత్యేక అవసరాలు, అందునా పిల్లలు, ఆడవారి అవసరాలను తీర్చడం. 10వ తరగతి వరకూ అందరికీ ఏకీకృత విద్య అందుబాటులో ఉంచడం. అన్ని స్కూళ్లను “నైపుణ్యం గల పాఠశాల”గా మార్చి, కంపూటర్ విద్యను అభివృద్ధిచేసి, కంప్యూటర్ శిక్షణా తరగతులు, గ్రంథాలయాలు పెంపొందించి నైపుణ్యం అందించడం, పెద్దలకు అక్షరాస్యత కంప్యూటర్ అక్షరాస్యత గ్రామీణ (గ్రంథాలయాలు, లైబ్రరీలు సామాజిక అభివృద్ధి స్వచ్చంద సేవకుల అభివృద్ధి - భారత నిర్మాణంలో వారిప్రాముఖ్యత వీరిని ప్రోత్సహించడం. ప్రజలను వారి పూర్తి శక్తి సామర్థ్యాలతో స్థానిక అభివృద్ధిలో భాగస్వాములను చేసి ప్రోత్సహించడం. ముఖ్యంగా గ్రామంలో ఉన్న స్వాతంత్ర్య సమరయోధులను, గ్రామ నిర్మాణంలో వారి పాత్రను అనుసరించి వారిని సన్మానించడం (మృతులు) అమరవీరుల సంస్కరణ. హింస, నేర ప్రవృత్తి నిరోధక రహిత గ్రామంగా తీర్చి దిద్దడం కోసం గ్రామ పౌరుల సంఘాలు, యువజన సంఘాల పాత్రపెంపొందించడం. గ్రామీణ క్రీడలు, సంస్కృతి, కళల అభివృద్ధి గ్రామ ప్రజల ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పేలా గ్రామానికి ఒక పాట ఉండలి. "గ్రామ వికాస దినం” పాటించడం షెడ్యూల్డ్ కులాల, తెగల అభివృద్ధికి ప్రోత్సాహక చర్యలు పెంపొందించడం. సౌఖ్యంగా సమాజంలో వివక్షతకు గురైన జాతులందరికీ సంఘంలో స్థానం కల్పించడం. ఆర్థికాభివృద్ధి వ్యవసాయ ఆధారిత జీవనాధారాలు, పచ్చదనం హరిత గ్రామీణాభివృద్ధిసంబంధిత అవకాశాలు ప్రోత్సాహించడం. సేంద్రియ వ్యవసాయపద్ధతులు భూసార పరిరక్షణ కార్చులివ్వడం. శ్రీ వరి విధానాన్ని ప్రోత్సహించడం. విత్తనాభివృద్ధి నిల్వ సంస్థలు అభివృద్ధి అటవీ ఉత్పత్తులు సేకరణ మరియు వేల్యూ ఎడిషన్ జంతువుల అభివృద్ధి, కోళ్ళు,పశువుల అభివృద్ధి, గోబర్ గ్యాస్ విధానం. పశుసంపద వసతి పెంపొందించడం. బిందుసేద్యం ప్రోత్సహించడం వ్యవసాయ సేవాకేంద్రాల స్థాపన గ్రామీణ పారిశ్రామిక అభివృద్ధి చేపపిల్లల, తాబేలు పిల్లల పెంపకం కోసం దరఖాస్తుల సేకరణ సూక్ష్మ అభివృద్ధి సంస్థలు నిర్మించడం. పాడి పరిశ్రమాభివృద్ధి, నిర్మాణాత్మకం ఆహార సేకరణ అభివృద్ధి సంప్రదాయ పరిశ్రమలు. గ్రామీణ పర్యాటక వ్యవస్థ-విస్తృత పర్యాటక వ్యవస్థ మహిళలను, స్వయం సహయక బృందాలను ఉత్తేజపరచి, గ్రామీణ ఆర్థిక పేదరిక నిర్మూలన కోసం ఉపాధికల్పన, అందరికీ ఉపాధి, ఆర్థికంగా ఆదాయం వచ్చే మార్గాల అన్వేషణ తద్వారా గ్రామీణ పర్యాటక వ్యవస్థ అభివృద్ధి పర్యావరణ అభివృద్ధి గ్రామాలలో పచ్చదనం - పరిశుభ్రత కోసమై కార్యకల్పన గ్రామలలో ప్రతీ ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించే కార్యక్రమం. అన్ని చోట్ల పారిశుధ్య కార్యక్రమాలపై దృష్టి, అభివృద్ధి, సక్రమ వినియోగం. చెత్త నిర్మూలనా కార్యక్రమం తడి- పొడి చెత్త నిర్వహణ రోడ్ల ప్రక్కన చెట్లునాటే కార్యక్రమం. మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్యంగా విద్యాలయాలు, ఇళ్ళు కాలనీలు స్థానిక సంస్థల వద్ద మొక్కలు నాటి, హరిత బాటలు వేసే కార్యక్రమం. వాన నీటి సక్రమ వినియోగం- ఇంకుడుగుంతల అభివృద్ధి. నీటినిర్వహణా అభివృద్ధిలో వాన నీటి సక్రమ నిల్వ, వినియోగం సంప్రదాయ చెరువులు త్రవ్వకం, అభివృద్ధి. సామాజిక అడవుల పెంపకం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గాలి, నీటి, భూమి కాలుష్యనివారణ. ప్రాథమిక సౌకర్యాలు-సేవలు గ్రామీణ నిరుపేదలు నివసిస్తున్న గుడిసెల స్థానే పక్కా ఇళ్ళు కట్టించుట త్రాగునీటి నిర్వహణ, ముఖ్యంగా పైపులద్వారా నీటి పంపిణీ వ్యవస్థ ప్రతి ఇంటికీ ప్రతి రోడ్డుకు - మురికికాల్వ అనుసంధానం గ్రామంలో ఉన్న రోడ్లన్నీ ప్రధాన రహదారికి అనుసంధానం. విద్యుచ్చక్తి ప్రతి ఇంటినీ, సక్రమ వీధి దీపాల వెలుగు నిర్వహణ. ప్రత్యామ్నాయ మార్గాలైన సౌరవిద్యుత్ కోసం ప్రత్యేక దృష్టి. అంగన్ వాడీ స్కూళ్ళు, ఆరోగ్యసంస్థలు, గ్రామ పంచాయితీ వ్యవస్థ, గ్రంథాలయల కోసం పటిష్టమైన వ్యవస్థ ఏిర్పర్చుకోవడం. పౌర వ్యవస్థ నిర్వహణలో భాగంగా “స్వయం సహయక సంస్థల” కు భవనాల ఏర్పాటు, కమ్యూనిటీ హళ్ళు, ఆటస్థలాల ఏర్పాటు, శ్శశాన వాటికల ఏర్పాటు చేసి సామాజిక పౌరవ్యవస్థ అభివృద్ధి గ్రామ సంతలు లేదా రైతు బజార్ల ఏర్పాటు. “ప్రజాపంపిణీ వ్యవస్థ” నిర్వహణా ఏర్పాటు సూక్ష్మ, చిన్న తరహ బ్యాంకింగ్ వ్యవస్థ తపాలా ఆఫీసులు ఎపుడైనాడబ్బుతీసుకోనే ఏర్పాటు సంస్థలు ఎ.టి.ఎమ్. ల ఏర్పాటు. అన్ని సేవా కేంద్రాలలో “బ్రాడ్‌బ్యాండ్ ఏర్పాటు” సక్రమ టెలిఫోన్ల నిర్వహణ నిఘా నేత్ర వ్యవస్థ అన్ని ముఖ్య స్థానిక కేంద్రాల వద్ద ఏర్పాటు సి.సి.టీ సామాజిక భద్రత వితంతువులకూ, అంగవైకల్యం ఉన్నవారికీ, వృద్ధులైనవారికీ, అర్హులైన అందరికీ పెన్షన్లు సామాజిక బీమా ఏర్పాటు ఆరోగ్య బీమా (ఆర్ ఎస్ బి వై) అర్హులైన అందరికీ అందుబాటులో ఉంటే “ప్రజాపంపిణీ వ్యవస్థ” పి డి ఎస్ “సుపరిపాలన” స్థానిక గ్రామ సభలు, గ్రామపంచాయితీల ద్వారా, జవాబుదారీగా ఉండే విధంగా ఏర్పరచి, స్థానిక ప్రజాస్వామ్యపాలన. చక్కటి సేవ- అందరికీ అందుబాటులో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డుల పంపిణీ గ్రామలో ఉండే ప్రభుత్వసంస్థల ఉద్యోగులకీ, పంచాయితీ సంస్థల ఉద్యోగుకీ హజరు నిబద్ధత వ్యవస్థ సకాలంలో పౌర వ్యవస్థకు జవాబు దారీ నిర్వహణ. ప్రతి గ్రామ సభకు ముందు, మహిళా గ్రామసభల ఏర్పాటు చేయడం తప్పనిసరి. ప్రతి ౩ నెలలకి ఒక సారి 'బాలసభల ఏర్పాటు”. నిర్వహించదలచిన కార్యక్రమాలు, వాటినిర్వహణ, వాటిస్వభావం నడుస్తున్న పనితీరు ఇవన్నీ స్థానిక భాషలో గోడలమీద నోటీసు బోర్డు ల మీద ప్రజలకు వివరించడం. సదరు అవతరించే పథకాలకి అర్హులైన ప్రజా జాబితాలు, లబ్ధిదారుల వివరాలు వెల్లడించడం. ఇందుకు లభించిన ఆర్థిక వనరులు- అంచనా ఖర్చు ప్రతి ఒక్క విషయం ప్రజలకి అందుబాటులో ఉంచడం. పౌరహక్కుల వ్యవస్థలో భాగంగా, అనుగుణంగా సకాలంలో సేవలు అందించడం. గ్రామ పంచాయితీ వ్యవస్థను- సమాచార నిర్వహణ వ్యవస్థా రూపొందించడం. సకాలంలో ప్రజా వివాదాల పరిష్కారం అనగా అన్ని రకాలైన వివాదాల పరిష్కారానికై స్థానిక గ్రామపంచాయితీ అధికారి లేదా గ్రామ పంచాయితీని బాధ్యులుగా చేసి, ఆయా వివాదాల ఉత్తరాలకి తగిన రశీదు ఇవ్వడం సదరు కోరిన వివాదాల పరిష్కారం చేసినట్లయితే ౩ వారాల లోగా లిఖితపూర్వక జవాబివ్వడం. వివాదాలపరిష్కారానికి ప్రజల సమక్షంలో, ప్రజల మధ్య వివాదాల పరిస్థితి వివరించి, వాటి పరిష్కారంలో ప్రజలను భాగస్వామ్యులుగా చేసే వ్యవస్థ తేవడం. ఎమ్.జి. ఎన్. అర్. ఈ. జి. ఎ. లో భాగంగా అర్ధసంస్థల లెక్కల తనిఖీ నిర్వహించి, (గ్రామసభకి సమర్పించి జవాబుదారీ చేయుట. వ్యూహం ఎన్నిక అయిన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి క్రింది విధంగా వ్యూహరచన చేయడం. ప్రతి ఒక్క మంచి పనికి జనబాహుళ్యాన్ని ఉత్తేజపరచి, లక్ష్య దిశ గా ముందరికి నడిపించడం. స్థానిక ప్రజల అవసరాలు వాటి ప్రాధాన్యత క్రమంలో ప్రజలను వ్యూహపూర్వక భాగస్వామ్యం చేసి ప్రాధాన్యతా క్రమం ఆమోదింప చేసుకొని తదనుగుణంగా నిర్వహించడం. క్రేంద్రం ద్వారా లభించేవనరులు, కేంద్ర పభుత్వ పథకాలను, రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నింటికి ప్రోగుచేసుకొని వాటి నిర్వహణ కోసం ఆలోచించడం ప్రస్తుత బలహీన వ్యవస్థను, నిర్మాణాత్మకంగా సరిదిద్దడం. గ్రామ పంచాయితీ వ్యవస్థను ప్రజా సంస్థలతో కలిసి బలపరచడం. పారదర్శకతను, జవాబుదారీ తనాన్ని పెంపొందించుకోవడం. కేంద్రం ద్వారా లభించేవనరులు, కేంద్ర పభుత్వ పథకాలను, రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నింటికి ప్రోగుచేసుకొని వాటి నిర్వహణ కోసం ఆలోచించడం ప్రతి ఒక్క మంచి పనికి జనబాహ్య్యాన్ని. ఉత్తేజపరచి, లక్ష్య దిశ గా ముందరికి నడిపించడం. పైన పేర్కొన్న వాటి సమర్థ నిర్వహణకు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇచ్చే సంక్షేమ పథకాలు, వివిధోకార్యక్రమాల నిర్వహణ, వినియోగం ఇవన్నీ “అనుబంధం -1లో పొందుపరచారు. వీటిని సమర్ధంగా ప్రయోజనాత్మకంగా నిర్వహించాలి. ఆదర్శగ్రామం నిర్ధారణ గుర్తింపు దీని గుర్తింపునకై గ్రామ పంచాయితీ ఆధారం. సాధారణంగా గ్రామంలో జనాభా 3000-5000 కొండ ప్రాంతాల్లో 1000-3000 గిరిజన ప్రాంతాల్లో ఉంటాయి. దీని ఆధారంగా గ్రామ పంచాయితీలను గుర్తించడం. పార్లమెంటు సభ్యుడు తన సొంత గ్రామం కాకుండా, తనకి ఇష్టమైన గ్రామ పంచాయితీని గుర్తించి, సదరు ఆ గ్రామాన్ని “ఆదర్శగ్రామం” గా పరిగణించాలి. ఈ గ్రామ నిర్వహణ, సదరు పార్లమెంటు సభ్యుని యొక్క సొంత గ్రామం కాని, తన భార్యయొక్క గ్రామం అయికాని ఉండరాదు. పార్లమెంటు సభ్యుడు వెంటనే ఒక గ్రామాన్ని గుర్తించి “ఆదర్శగ్రామానికి” ఎన్నిక చేసుకోవాలి. మిగతా రెండు మూడు గ్రామాలు వీలువెంబడి తీసుకోవచ్చు.తన నియోజక వర్గ పరిధిలో గ్రామం గుర్తించి తాను ఎన్బికైన నియోజక వర్గంలో ఉన్న గ్రామాన్ని తీసుకోవాలి. “ఎన్నికైన పార్లమెంట్ సభ్యుడు” ఏ గ్రామాన్సైనా ఆదర్శగ్రామంగా గుర్తించవచ్చును. పట్టణ నియోజక వర్గానికి సంబంధించి ఒక వేళ గ్రామ పంచాయితీలు లభ్యం కాని స్థితిలో పట్టణ నియోజక వర్గానికి దగ్గరగా ఉన్న గ్రామం గుర్తించి “ఆదర్శగ్రామం”గా పరిగణించాలి. ప్రాథమికంగా నిర్దేశించుకొన్నది ౩ ఆదర్శగ్రామాలుగా 2019 మార్చిలోగా తీసుకొని, 2016 లోగా ఒక గ్రామం “అదర్శగ్రామం” గా తీర్చిదిద్దడం. 5 ఆదర్శగ్రామాలు 2024 లోగా తీర్చిదిద్దాలనే లక్ష్యం ఉన్న (ఒక్కొక్కరి ప్రతి సంవత్సరం చొప్పున) నిర్దేశించిన లక్ష్యం 5 ఆదర్శగ్రామాలు 2024కు పూర్తి అవుతాయి. ప్రణాళిక గ్రామంలో ఉన్న (ప్రతి పేదను, పేదరికం నుంచి విముక్తి చేయడమే “గ్రామాభివృద్ధి ప్రణాళిక తద్వారా గ్రామ పంచాయితీ పై ప్రత్యేక దృష్టిసారించి అభివృద్ధి లక్ష్యం. ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకొనే ముందు, పార్లమెంట్ సభ్యుడు ఒక చక్కని క్రమానుగతమైన వాతావరణం ఏర్పరచి, సామాజిక సమీకరణ చెయ్యాలి. గ్రామ పంచాయితీని పూర్తిగా సంబద్ధీకరించాలి. ఇందులో భాగంగా కొన్నినులు. గ్రామ సభలు, మహిళా సభలు, బాలసభల లో అన్యోన్యపరచి చర్చించడం. వృత్తి కి సంబంధించిన సమూహాలు, స్థానిక సంస్థలు, యువజన సభలతో అన్యోన్యపరచి చర్చించడం. క్రీడోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ పాదయాత్రలు, లఘు నాటకాలు, గోడల మీద సమాచారం రాయించడం మొదలైనవి నిర్వహించడం. చిత్రలేఖనం, సాంస్కృతిక పోటీల నిర్వహణ కు సంబంధించి ఆ గ్రామం “ఆదర్శగ్రామం”గా ఎలా ఉండాలో చేయడం. గ్రామ అభివృద్ధికై సంబంధించిన చిత్రాలను, సినిమాలను ప్రదర్శించడం. పైన పేర్కొన్న అన్ని అంశాలు ఆ గ్రామ ప్రజలలో “ఆదర్శగామం” ఎలా అవుతుందో అన్నదానిపై ఒక చక్కని అవగాహన కలుగుతుంది. ఆ తరువాత నిర్వహించే రెండు దశల కార్యక్రమంలో అనగా “ప్రజల భాగస్వామ్య(ప్రణాళిక” లో పార్లమెంటు సభ్యుని పాత్ర అవగాహన కలిగి, స్థానిక గ్రామ పంచాయితీ, జిల్లా కలెక్టరు కలిసి వృత్తి పరమైన, అనుసంధాన సహాయం నిర్దేశిస్తారు. ఇందుకు సంబంధించి మొదటి దశలో ప్రజలను ఒకరికి ఒకరు సహయం చేసుకోవడంలోనూ, శ్రమ దానంలోనూ, స్థానికుల సహకారము కలిగి, సదరు ఆ గ్రామంలో ఉన్న వనరులను గుర్తించడం ద్వారా కార్యోన్ముఖులను చేయాలి. ఇందుకోసం క్రింది విధమైన సూచనలు : అన్ని కులమతాల ప్రజలు (ఆ గ్రామంలో అందరూ) ఎన్నుకున్న ప్రతి నిధులు ప్రభుత్వ కార్యనిర్వహకులు కలిసి ఒక నియమితకాలంలో ఆర్థిక అభ్యున్నత కోసం పాటుపడతామని, గ్రామంలో ఒక్క పేదరికం అంచులో నిలబడకుండా వృద్ధిలోకి తీసుకొస్తామని “ప్రతిజ్ఞ” చేయాలి. రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాథమిక హక్కులు, బాధ్యతలు తెలిసికొని వివరణ పొందాలి. “ఆరోగ్య శిబిరాల” నిర్వహణ “పరిశుభ్రతా వారోత్సవాలనిర్వహణ “పశుశిబిరాల” నిర్వహణ- వాటి ఆరోగ్య సూచనలు. అంగన్ వాడీల ద్వారా “నాణ్యాతా సేవల సంరక్షణ ప్రదానం పాఠశాలలో హాజరు పెంపుదల, నాణ్యమైన విద్యావిధానం అందించి, నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకం పి.టి.ఎ. భాగస్వామ్యంతో చేయడం చెట్లు నాటే కార్యక్రమాలు స్వయం సహాయక బృందాలను పునర్నిర్మించి, బలపరచడం పనికి ఆహార పథకం నిర్వహణ జిల్లా కలెక్షర్లు జిల్లా అధికారులు, ముఖ్యంగా ప్రజాపంపిణీవ్యవస్థ, సాంఘిక సంక్షేమ, రెవెన్యూ అధికారుల సమీక్షంలో “వివాదాల పరిష్కార నిర్వహణా శిబిరాలను ఏర్పాటు చేయడం. ఇత్యాదివన్నీ మొదటిదశలో వస్తాయి. ఈ ప్రథమ దశలో వ్యక్తిగత, మానవ, సామాజిక, పరిసరాల అభివృద్ధి పైన పేర్కొన్న కార్యక్రమాల వల్ల “సుపరిపాలన” వైపు దారి తీస్తుంది. ఈ కార్యక్రమాల వలన గ్రామ ప్రజలు ధ్యేయాలపట్ల నిబద్ధులైన వారై గ్రామం అభివృద్ధి చేయడానికి సన్నద్దులవుతారు. పరిసితి విశేషణ తరువాత రెండోదశలో క్రింది సూచనలు మెదటిదశలో (ప్రారంభించిన పనులు, ఇపుడు రెండో దశలో “రెండంచెల” కార్యక్రమాలు ఒకే సమయంలో జరుగుతాయి, ప్రాథమిక అవలోకనం : రెండు లాభాలుంటాయి. మొదటిగా గ్రామ పరిస్థితిని అంచనావేసి ఏ ఏ చోట్ల అభివృద్ధి చెయ్యాలో తెలియడం. రెండవది ఈ అంచనా ద్వారా ఎక్కడ వ్యవస్థా పూర్వకమైన లోటు పాట్లు ఉన్నాయో తెలియడం. ఈ రకమైన అవలోకనానికి, విశిష్టమైన ప్రత్యేక సంస్థలను నియమించి వారి “అవలోకన సమాచార సేకరించడం” ఈ సమాచారాన్ని నిపుణులైన విద్యాధికుల ద్వారానే సాధ్యం. దీనికి సంబంధించిన సూచనలు అనుబంధం-2లో ఇవ్వడమైనది. భాగస్వామ్యస్థితి విశ్లేషణ : ఇది శిక్షణాసులుభులు, గ్రామ ప్రజలను సుభాగస్వామ్యం చేయించడంలో తోడ్పడతారు. ఈ శిక్షణ ఎన్ ఐ ఆర్ డి అండ్ పి ఆర్ వారి ద్వారా సాధ్యపడుతుంది. ఇందులోని కీలకాంశాలు, సోషల్ మేప్ సామాజిక చిత్రం సామాజిక ,చిత్రంలో స్థానికులు,మహిళలు, గ్రామంలో వివిధ వర్ణాల ప్రజలు కలిసి భౌతిక సామాజిక వ్యవస్థను నిర్మించి వసతులు కూడా పౌందుపరుస్తారు. వనరుల చిత్రీకరణ : భూవినియోగం, నీటి విభాగాలు, వ్యవసాయ విధానాలు, భూమి ఎత్తుపల్లాలు, మురుగునీటిపారుదల వ్యవస్థను చిత్రీకరిస్తారు. ఈ విధంగా తయారైన చిత్రం ద్వారా సూక్ష్మ నీటి నిల్వలు ఏ విధంగా చేసుకోవాలి, తద్వారా వ్యవసాయ అభివృద్ది సహజ నీటి వనరుల ద్వారా ఎట్లా సాధ్యమో తెలుస్తుంది. అవసరాల పట్టిక : గ్రామంలో ఉన్నా గృహస్థుల భాగస్వామ్యంతో ఆ గ్రామాలలో కలిగే “సమిష్టి అవసరాలు”, ప్రాధాన్యాలు తెలుస్తాయి. మొదటిదశ పరిణామ క్రమ విశ్లేషణ : స్థానిక పార్లమెంటు సభ్యుడు, జిల్లా కలెక్టరు, గ్రామపంచాయితీ, అన్ని వర్ణాల ప్రజలు కలిసి మొదటిదశ పనితీరును విమర్శ నాత్మకంగా విశ్లేషించి, ఆ గ్రామం తన స్వంతంగా ఎంతకాలంలో, ధ్యేయాన్ని లక్ష్యాభివృద్ధిని సాధించగలరో విశ్లేషిస్తారు. ఈ విశ్లేషణ ఆధారంగా ఆ గ్రామం, తర్వాత లక్ష్యాభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేసుకొంటుంది. ప్రణాళికా నిర్దేశిత్వం : మొదటి దశ పరిణామ క్రమం ఆధారంగా అనగా ప్రాథమిక అవలోకనము “భాగస్వామ్యుల ఊహాత్మకత” ఆధారంగా, అధికారులు సమర్థులు, ఆ గ్రామాభివృద్ధికి వ్ఏ ప్రణాళికలు, ప్రాజెక్టులు కావాలో నిర్దేశిస్తారు. వనరుల అవగాహనా చిత్రం : అంశాలు ఇందిరా ఆవాస్ యోజనా, ఐ.ఎ.వై, ప్రధానమంత్రి సడక్ యోజన పి.ఎమ్. జి,యస్ వై పథకాల అమలు. ఇవి పూర్తిగా లభ్యం అవుతాయి. కొంతవరకు లభించే వనరులైన మహాత్మాగాంధీజాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం “ఎమ్. జి. ఎన్. ఆర్. ఇ జి.యస్, రాష్ట్రీయ వ్యవసాయ వికాస పథకం ఆర్.కె.వి. వై, జాతీయ గ్రామీణ జీవనాధార వ్యవస్థ ఎన్. ఆర్. ఎల్. ఎమ్, సర్వ శిక్షా అభియాన్ “అందరికీ విద్య పథకం యస్ యస్ ఎ ఉపయోగించుకోవడం. వనరుల లభ్యతలో ఉన్న కొన్ని పథకాలు “వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం బి.ఆర్.జి. ఎఫ్, పార్లమెంటు సభ్యుల స్థానిక అభివృద్ధి పథకం ఎమ్.పి. ఎల్.ఎ.డి.యస్. ఇది స్థానిక శాసన సభ్యుల, పార్లమెంటు సభ్యుల సహకారంతో సాధించే వనరులు - గ్రామీణాభివృద్ధిలో నిధుల లేమిని కొంతవరకూ తీరుస్తాయి. గ్రామ పంచాయితీల స్వంతనిధులు, ఆదాయం రాష్ట్ర కేంద్ర ఆర్థిక సంస్థల అందించే ధనసహకారం / నిధులతో అభివృద్ధి సాధించవచ్చును. స్థానిక గ్రామ ప్రజలను ఉత్తేజపరచి ధనము, శ్రమ, వస్తుసహకార సమీకరణ. కార్పొరేట్ సామాజిక భాధ్యతా సి యస్ ఆర్ నిధుల సేకరణ - వినియోగము. పైన పేర్కొన్న నిధులు / వనరుల ద్వారా పూర్తి వినియోగించడం ద్వారా “ఆదర్శ (గ్రామీణాభివృద్ధి” జరుగుతుంది. కేంద్ర, రాష్ర్టాలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిధులు మంజూరు. మొత్తంగా అవసరాల నిర్ణయం : ఇది రెండు విధాలు. మొదటిభాగం వివిధ వర్గాలు అనగా “స్వయం సహకార బృందాల”తో చర్చించడం. రెండవది గ్రామ సభతో చర్చించడం. ఈ రెండూ చేయడం వలన మొత్తంగా ఆ గ్రామంలోని అవసరాలు వాటి ప్రాధాన్యతాక్రమం సమిష్టిగా నిర్ణయించుకోగలరు. గ్రామీణాభివృద్ధి రచన తయారీ : పైన పేర్కొన్న విధంగా ఆ గ్రామ నిర్దిష్ట అవసరాల అమలు కోసం ప్రభుత్వం జిల్లా కలెక్టరు, ఉద్యోగులు, బయట ఉన్న నిపుణులు, వృత్తి పరమైన నిపుణులు కలిసి “గ్రామీణాభివృద్ధి రచన” (విలెజ్ డెవలప్మెంట్ ప్లాన్ డ్రాఫ్ట్ ) చేస్తారు. “గ్రామీణాభివృద్ధి ప్రణాళిక లో కార్యక్రమాలలో తమ వంతుపాత్రను పోషించే వ్యక్తులు మొదటిదశలో సాధించిన లక్ష్యాలు పొందుపరుస్తారు. దీనివలన ఎంతవరకు సాధించినది, కాలక్రమేణా సాధించవలసిన లక్ష్యాలు తెలుస్తాయి. గ్రామీణాభివృద్ధి ప్రణాళికను గ్రామసభకు సమర్పించాలి. గ్రామీణాభివృద్ధి ప్రణాళిక గ్రామసభ ద్వారా ఆమెదించిన తర్వాత, జిల్లా స్థాయి కమిటీ జిల్లా కలెక్టరు వారి ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యునికి తెలుపుతారు. అప్పుడు పార్లమెంట్ సభ్యుని సూచనలు/ సలహాలు లెక్కలోకి తీసుకొని, గ్రామీణాభివృద్ధి ప్రణాళికకు 8-6-9 నెలలు,1 సంవత్సరం దశలవారీ అభివృద్ధి లక్ష్యాలు నిర్దేశిస్తారు. ప్రణాళిక - నిధుల మంజూరు : ఈ గ్రామీణాభివృద్ధి ప్రణాళిక" లో పొందు పరచిన అంశాలు వాటి లక్ష్యసాధన నిర్దేశాలు కలిపి సంబంధిత శాఖాధికారి ద్వారా నిర్వహణ, ఆర్థిక, శాఖాల ఆమోదంతో సంబంధిత సూచనలతో ఈ పథకం కేటాయింపు అంగీకరిస్తారు. జిల్లా కలెక్టరు స్వయంగా పర్యవేక్షించి సంబంధిత అధికారి సహాయంతో సజావుగా నడిపిస్తారు. వెల్లడించుట : సంబంధించిన గ్రామీణాభివృద్ధి అంగీకరించిన ప్రణాళిక అమలు లో ఉండే స్థితిగతులు, ఆర్థికాంశాలు, సదరు అమలు పరచడం వలన ఏర్పడే అభివృద్ధి, ఫలితాలు పూర్తిగా వెళ్లడిస్తారు. గ్రామీణాభివృద్ధి ప్రణాళిక అమలు, దానికి తగిన వాతావరణం, సామాజిక సమీకరణాలు ఇవన్నీ దోహదపడతాయి. మామూలుకు భిన్నంగా కాక, నూతన విధానంతో కూడిన గ్రామీణాభివృద్ధి ప్రణాళిక అమలవుతుంది. ఎందుకంటే ఇవి నిర్దేశిత 8 నెలలకు గాని, 68 నెలలకు గాని, ఒకసంవత్సరంగాని, సంవత్సరం పైబడి లక్ష్యాలతో కూడి ఉంటాయి కనుక. కాలపరిమితి పూర్తి కాబడిన ప్రణాళికతో పాటు వివిధ కార్యక్రమాలకు కాల పరిమితులు వ్యక్తిగత, సామజిక అంశాలు మరియు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా క్రింది సాదరణ కాలపరిమితులు ఇవ్వబడినవి. వివరణ కాలపరిమితి ఆదర్శ గ్రామం ఎన్నిక - ఒక నెల ప్రణాళిక ప్రజావగాహన - 2 నెలలు అనువైన వాతావరణం, సామాజిక సమీకరణలు - 3 నెలలు మొదటిదశ అమలు - 3 నెలలు మొదటిదశ అమలు విశ్లేషణ - 5 నెలలు పూర్తి గ్రామీణాభివృద్ధి - 7 నెలలు అనుమతులు-నిధులమంజూరు - 8 నెలలు కార్యక్రమాల పని అమలు - 9 నెలలు గ్రామసభ పంచాయితీ ద్వారా గ్రామీణాభివృద్ధి ప్రణాలికాభివృద్ధి పనితీరు విశ్లేషణ - ఒక సంవత్సరం గ్రామస్తుల తో కలసి వారిని ఉత్తేజ పరిచి అభివృద్ధి కార్యక్రమాలను వారికి చేతనైన పద్ధతిలో చేపట్టడం. విధులు, బాధ్యతలు “యస్. ఎ. జి.వై పథకాన్ని ఎన్బికైన గ్రామపంచాయితీ ప్రతినిధులు, విభిన్న శాఖాలకు చెందిన అధికారులు నిర్వర్తిస్తారు. వీరందరూ కలిసి ప్రజాజీవనానికి కావలసిన ముఖ్య అవసరాలను ఎన్నుకొని వివిధ వనరులు సేకరించి, ప్రజలను, ప్రభుత్వ భాగస్వామ్యం అందరి చక్కని ప్రణాలిక, పర్యవేక్షణతో అమలు చేస్తారు. అందరూ అనగా ప్రభుత్వం, గ్రామపంచాయితీలు, ప్రజాసంఘాలు, భాగస్వామ్యంతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారు, ఇతర గ్రామాలకు కూడా ఈ ఆదర్శ గ్రామం ఒక నమూనాగా వ్యాప్తి చెంది గ్రామాల సుభిక్షత తద్వారా దేశ అభివృద్ధి జరుగుతుంది. పార్లమెంట్ సభ్యుడు చెయ్యవలసిన పనులు ఆదర్శ గ్రామం ఎన్నిక ఆయా వ్యక్తుల సామర్థ్యం ఆధారంగా గ్రామంలో ఉన్న వివిధ వర్ణాల సమీకరించి వారి అభివృద్ధి కార్యక్రమాల పట్ల చైతన్యవంతం చేయడం. ప్రణాళిక అమలు వలన కలిగే లాభం వివరించడం. సుహృద్భావ వాతావరణం కోసం కార్యక్రమాల చొరవ. ప్రణాళికాభివృద్ధి - వివరణ అదనపు నిధులైన సి.యస్.ఆర్ నుంచి సేకరణ. ప్రణాళికాభివృద్ధిలో కలిగే ఇబ్బందులు అధిగమించడానికి పార్లమెంట్ సభ్యుడు స్థానిక నిధులు మంజూరు. సకాలంలో సదరు ప్రణాళిక అమలులో వచ్చే అంశాల పరిష్కారం కోసం పర్యవేక్షణ. ప్రణాళికా అమలులో పారదర్శకత, జవాబుదారీ ప్రజా ఫిర్యాదుల పరిష్కారం. అన్ని వర్ణాలను కలుపుకొంటూ, నిర్దేశించిన ప్రణాళిక లక్ష్యాలు సాధించడం. భారతప్రభుత్వం జాతీయస్థాయిలో ఈ పథకం అమలు పరిచే బాధ్యత గ్రామీణ మంత్రిత్వశాఖది. ఈ పథకం అమలు పర్యవేక్షణకు రెండు జాతీయస్థాయి కమిటీలు పనిచేస్తాయి. సంబంధిత శాఖా మంత్రులు, ప్రణాళికా నిర్వహణా, ఇతర మంత్రిత్వశాఖలు కూడా ఇందులో ప్రముఖ పాత్రవహిస్తాయి. రెండవ కమీటీలో గ్రామీణాభివృద్ధి కార్యదర్శి ఆధ్వర్యంలో క్రింది ప్రతినిధులు/శాఖలు/జాయింట్ సెక్రటరీ స్థాయి క్రింద కాకుండా పంచాయితీ రాజ్, ప్రణాళికా విభాగం, భూవనరులు, స్త్రీ శిశు సంక్షేమశాఖ కుటుంబ ఆరోగ్యశాఖ, పాఠశాల విద్య, సూక్ష్మచిన్న తరహా సంస్థలు త్రాగునీరు పారిశుధ్యశాఖ, విద్యుచ్ళక్తి, నూతన పునరుత్పత్తి శక్తిశాఖ టెలికాం, సమాచార, నీటివనరులు, సామాజిక న్యాయం, గిరిజనవ్యవహారాలు, పర్యావరణం, అడవులు వాతావరణ మార్పులు, వ్యవసాయం, యవజన క్రీడావిభాగాలు, ఇతర మంత్రిత్వ శాఖలు ఉంటాయి. దీనికి సంబంధించిన కమీటీ ముఖ్య విభాగాల పథకం అమలులో, తాత్కాలిక అద్దె నియమకాలు ముగ్గురు వ్యక్తులను నియమించుకోవచ్చు. ఈ కమిటీ లక్ష్యాలు : 1. పనుల పర్యవేక్షణ అమలు తీరు వాటి ప్రణాళికా రచన. £. పథకం అమలులో విశ్లేషణ. 8. పథకం అమలులో అంతర్జాల సహకారంతో పథకం పర్యవేక్షణ మాములు భిన్నంగా నూతన పద్ధతులు. 4. ఎక్కడైనా పథకం అమలు వచ్చే ఇబ్బందులుంటే వాటికి తగురీతిలో పరిష్కార సూచన, సలహాలివ్వడం. 5, సంబంధిత నిర్దేశిత వనరుల సహాయము వివిధ మంత్రిత్వశాఖల ద్వారా చేసి అన్ని రాష్ర్టాలలోనూ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం. 6. గ్రామ స్థాయిలో లఘుచిత్రాలు, ప్రచురించే మంచి పద్ధతుల వ్యాప్తి చేయడం. 7. సమయానుకూలంగా క్రియాశీలక సూచనలు ఇస్తు గ్రామీణాభివృద్ధి ప్రణాళిక అమలులో సంబంధిత కార్యనిర్వహక సూచనలు అందించడం. రాష్ట్రస్థాయి : ముఖ్యకార్యదర్శి ఆధ్వర్యంలో ఒకసాధికారక కమీటీ అన్ని శాఖల సమన్వయంతో పని చేయడమే కాకుండా, దీనిలో “నీపుణులు” కూడా కలిసి ఉంటారు. అంతేకాక ఈ కమీటీలో ఇద్దరు “పౌర ప్రతినిధులు” కూడా వుంటారు. ఈ పథకం వైవిధ్యభరిత అమలుకు పైన సాధికారక కమిటీ తోడ్పడుతుంది. గ్రామీణాభివృద్ధి ముఖ్యకార్యదర్శి - రాష్ట్రస్థాయి ఇందులో మెంబరు - కన్వీనర్‌గా ఉంటారు. ఇద్దరు పూర్తి స్థాయి “వనరుల సమీకరణ అధికారులు” కాంట్రాక్టు పద్ధతిలో నియమితులై సదరు రాష్ట్రస్థాయి కమీటీతో పనిచేస్తారు. ఈ సాధికారిక కమిటీ ప్రతి 3నెలలకు ఒకసారి కలిసి క్రింది చెప్పిన పనులు చేస్తారు. పార్లమెంట్ ఆదర్శ గ్రామ పథకం ఎస్ ఎ జి వై మార్గదర్శక నిర్దేశాలు ఆధారంగా, రాష్ట్రస్థాయి పథకాలను చేరుస్తారు. ఈ పధకాల అమలుకోసం గ్రామపంచాయితీలు, బ్లాక్, జిల్లా రాష్ట్రస్థాయిలో సమీక్షిస్తారు. నియోజక వర్గాల ఆధారంగా గ్రామీణాభివృద్ధి పథకాన్ని సమీక్షిస్తూ, మార్పులు ఏదైనా ఉంటే సూచిస్తూ, అవసరమైతే, సకాలంలో ఫలితాలు సాధించగలిగారో లేదో చూడడం. అంతర్జాలం ద్వారా పథకంలో పనిచేస్తున్న సంస్థల తీరు తెన్నుల పరిశీలన, అవరోధాలు అధిగమిస్తూ, సూచనలు చేసి, సాంకేతిక. కార్యనిర్వాహక సహాయం అందిస్తూ ప్రభుత్వ ఆదేశాలు అమలు పరచడం. అవసరమైనప్పడు ఈ సాధికారిక కమిటీని, జాతీయస్థాయిలో పర్యవేక్షణ. నిర్ధిష్టమైన “కార్యక్రమ(ప్రణాళిక ద్వారా” నమూనా గ్రామాలకు వెళ్ళి రాష్ట్రస్థాయి ప్రణాళికా వ్యాప్తి చేసి, చక్కగా అమలు అయ్యేవిధాన సూచన. పథకంలో ఎదురయ్యే “సమస్యా పరిష్కార నిర్మాణం” కోసం సంబంధిత అధికారితోనూ, జిల్లా అధికారులతో సమీక్ష చేసి సూచనలివ్వడం. సాధికారిక కమీటీ పార్లమెంట్ సభ్యుని తీసుకొని, చిన్న సమూహాలతో కాని కూర్చొని సమస్యలు పరిశీలించి పరిష్కరిస్తుంది. గ్రామస్థాయి అభివృద్ధిలో మంచి అనుభవాలను వీడియో మరియు ప్రింట్ ద్వారా వ్యాప్తి చేయడం. జిల్లాస్తాయి : యస్, ఎ.జి.వై' పార్లమెంట్ ఆదర్శ గ్రామ పథకానికి ముఖ్య అధికారి జిల్లాకలెక్టరు. పార్లమెంట్ సభ్యుల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులను, సంబంధిత అధికారులను, గ్రామపంచాయితీలోనూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. జిల్లా కలెక్టరు “సమర్థుడైనా సంబంధిత అనుభవజ్ఞుడైన అధికారిని నియమించి ప్రతి గ్రామపంచాయితీలో పథకాల సక్రమ అమలు పర్యవేక్షకునిగా నియమిస్తారు. జిల్లా కలెక్టరు ఈ పథకంలో చురుకుగా పాల్గొంటారు. అంతేకాక “జాతీయ ఉపాధి హామీపథకం” సభ్యులను జిల్లాస్థాయి యాజమాన్య నిర్వహక అధికారులను కూడా నియమించి బాధ్యులను చేస్తారు. జిల్లా కలెక్టరు క్రింది వాటికి బాధ్యులు : ఆధారగీత పరిశీలన, గ్రామస్థాయి ప్రణాళిక తయారీ సులభతరం చేస్తారు. అన్ని పథకాలను ఒకచోట చేర్చుకొంటారు. వివిధశాఖలు పథకం అమలు ఉన్న తీరును అనుసంధానిస్తారు నెలకొని ఒకసారి పథక సమీక్షా సారాంశాన్ని నివేదికను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వలకు సమర్పిస్తారు. నిబద్ధతలలో సమస్యల పరిష్కారాన్ని చేస్తూ, పథకాల మార్గదర్శకాలను నిర్దేశిస్తారు. పథకాల అమలు అయ్యే పనితీరును క్షేత్రస్థాయిని తరుచుగా వెళ్ళి సమీక్షిస్తారు. సాంకేతిక వినియోగం మరియు నవకల్పనలు ఇందులో ఇమిడి ఉన్న అంశాలు. సంకేత పద్ధతి (రిమోట్ సెన్సింగ్) : ఏజన్సీల ద్వారా ప్రణాళిక, పర్యవేక్షణా తీరును పరిశీలించడం. ఈ పద్ధతి ద్వారా ఆస్తుల చిత్రీకరణలో వీరి సహాయంతో తీసుకోవచ్చు. బహు ముఖ్యమైన సాంకేతికపద్ధతి : ఎన్.టి.సి ద్వారా పథకాల పర్యవేక్షణ సులభతరం కాబట్టి వీరి సహాయాన్ని తీసుకోవచ్చు. వ్యవసాయధార సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులు గ నూతనత్వం : స్థానిక కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఉత్పాదకత,అదనపు నిలువ తెచ్చుకోవచ్చు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఎ.టి.ఎమ్. ఎ) సహాయంకోరడం ద్వారా కూడా పురోగతి మెండుగా ఉంటుంది. జీవనోపాధి సాంకేతిక సంస్థల ద్వారా నూతనత్వం : సంబంధిత “మంత్రిత్వశాఖ ద్వారా రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి సంస్థల సహకారం తీసుకోవచ్చు. నియత భవన నిర్మాణ సాంకేతిక శాఖల ద్వారా, గ్రామీణాభివృద్ధి, మంత్రిత్వశాఖ గ్రామీణ గృహనిర్మాణ సంస్థ వీరందరూ కావలసిన సమాచారాన్ని అందచేస్తారు. రహదారి నిర్మాణ నైపుణ్యాలు: ఈ నైపుణ్యాలు గ్రామిణాభివృద్ది శాఖలోని జాతీయ రహదారి అభివృద్ది సంస్థ వద్ద లభించును. నీటిపారుదల, పారిశుధ్య సాంకేతికత్వం : నీటిపారుదల పారిశుధ్య మంత్రిత్వశాఖ వారి ద్వారా పొదుపుగా నూతనత్వంగా ఉండే విధంగా సలహాతీసుకోవచ్చు. పైవేట్, స్వచ్చంద, సహకార సంస్థల యొక్క పరపతిని పెంచడం “యస్. ఎ.జి.వై వీరి సహాకారాన్ని క్రింది విధంగా వాడుకొంటుంది. సాంకేతిక సహకారం, (ప్రణాళిక, పర్యవేక్షణలో తీసుకోవడం. స్థానిక యువతని ఉద్యోగఅవకాశాల పెంపుదలకోసం. స్థానిక ఉత్పత్తుల కోసం సంబంధిత మార్కెట్ చేయడానికి తగిన ప్రమాణీకరణ, నాణ్యత భరోసా ఇవ్వడం. వ్యక్తిత్వ, సామాజిక అభివృద్ధికి మార్గదర్శనం చేయడం. సామర్థ్య నిర్మాణం “యస్. ఎ.జి.వై పథకాల అమలుకు అత్యంత ఉత్తేజితులైన జ్ఞానసముపార్టన కలిగిన అధికారులు అవసరం. గ్రామపంచాయితీల సామర్థ్యం పెంచాలి. గ్రామీణాభివృద్ధిమంత్రిత్వశాఖ ద్వారా “సామర్థ్యనిర్మాణ అంశాల జాబితా” జాతీయ గ్రామీణాభివృద్ధిసంస్థల పంచాయితీరాజ్ సంస్థ హైద్రాబాద్ వారి ద్వారా, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థల (రాష్ట్రస్థాయిలో) లబ్ధిదారులకోసం సవివరమైన మారదర్శకతా పుస్తకాలు అందచేయడం ఆదర్శ గ్రామాల కోసం చక్కటి ఆదర్శ విధానాలను నూతనత్వంతో చేర్చిఇవ్వడం. చక్కని/ మంచి గ్రామపంచాయితీలను గుర్తించి - సూక్ష్మ సమూహాలను అవసరమైనచోట సహాయకేంద్రాలను ఎన్.ఐ. ఆర్.డి. అండ్ పి.ఆర్ లో ఏర్పాటు చేసి ఒక్కమాటలో అనుమానాలను స్పష్టం చేసే సలహాలు ఇచ్చే ఏర్పాటు చేయ్యాలి. ఉత్తమ గ్రామపంచాయితీలను గుర్తించి సూక్ష్మసమూహాలను ఒకచోటచేర్చే ఏర్పాటు. ఉత్తమ గ్రామపంచాయితీలను గుర్తించి 'సూక్ష్మసమూహాలను ఒకచోటచేర్చే ఏర్పాటు. కనిపించే ఫలితం (అవుట్ కమ్) మెరుగైన జీవన ప్రమాణాలు/ ఉద్యోగఅవకాశాలు నిరాశా వలసలు తగ్గడం వెట్టిచాకిరీ విముక్తి, బాలశ్రామికులు విముక్తి , చేతిపారిశుధ్యనిర్మూలన 100శాతం జననమరణాల వివరాలు. ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారానికి నాందిగా అన్నివర్గాల ఆమోద యోగ్య పద్ధతి. సుఖసంతోషాలు, శాంతి మరో పంచాయితీకి మార్గదర్శకంగా ఉండే విధంగా మార్పు. పర్యవేక్షణ అంతర్జాలం ద్వారా ఈ పథకం పర్యవేక్షణ జరుగుతుంది. ప్రత్యేక స్థాయిలో వెబ్సైట్ ఏర్పాటు చేసి ఇందులో ఉన్న అధికారులందరూ పర్యవేక్షించి, సలహాలు, సూచనలు ఇచ్చేవీలుగా పథకం అమలు తీరును తెలుసుకొనే విధంగానూ, ఫిర్యాదులు ఏమైనా ఉంటే అధికారులు పరిష్కరిస్తారు. ప్రతి పని తీరు ఫోటోలు తీసి అంతర్జాలంలో ఉంచి ప్రజలందరూ పర్యవేక్షించేటట్లు ఉంచుతారు. ఈ పథకంలో ప్రతి పనికి నిర్దిష్టకాలపరిమితి ఉంటుంది. ఆర్థిక, భౌతిక లక్ష్యాలు గ్రామీణ అభివృద్ధి ప్రణాళికలో నిర్దేశిస్తారు. 12వ పంచవర్షప్రణాళికలో ఇది అత్యంత ముఖ్యమైనది అవుతుంది. పరిణామక్రమం : స్వయంసాధికారిక సంస్థ ద్వారా మధ్యంతర పరిణామక్రమం పనితీరును పర్యవేక్షిస్తారు. అలాగే వ్యవస్థా పూర్వకమైన అంచనాలు, పనితీరు పర్యవేక్షణ, పరిణామక్రమం కూడా తెలుసుకుంటారు. అవార్డులు : 1. చక్కటి పద్ధతులు 2. ఉత్తమ ఉద్యోగులు 8. ఉత్తమజిల్లా కలెక్టర్లు 4. ఉత్తమ ఆదర్శ గ్రామాలు స్థిరంగా కొనసాగడం, నిలద్రాక్కుకోవడం - భారమును మోసే విధానం పార్లమెంట్ సభ్యుని నిరంతర సలహా, మార్గదర్శనం. గ్రామపంచాయితీ పటిష్టతలో, గ్రామాలలో అన్ని వర్గాలు కలిసి ఈ పధకానికి నిర్దేశించిన ఆస్తుల నిర్వహణ -స్థిరత్వం. మురుగునీటి నిర్మూలన, పెద్దస్థాయి నీటి అందచేయడానికిగాను ప్రయివేటు సంస్థల భాగస్వామ్య నిర్వహణ. సేంద్రియ ఎరువుల పోషణలో, చిన్న నీటిపారుదలలో పథకాలలో, పోషకాహార సంస్థలు పౌర సేవాకేంద్రాలు, గ్రంథాలయాలు అన్నింటిని “స్వయం సహాయక గ్రంథాలను ఇవ్వడం. పథకాల ఆమోదంలో, శాఖాస్థాయిలో నిర్దష్టమైన/ స్పష్టమైన నిర్వహణా నియమాలు నిర్వచించాలి. ఇవి జరపడంలోనూ అమలులోనూ ఖచ్చితంగా పాటించాలి. ఆదరం : SAGY