సాంఘిక సంక్షేమ శాఖ-ఆంధ్రప్రదేశ్ ఆశయం షెడ్యూల్డ్ కులాల (యస్.సి.) ప్రజలు సమగ్రాభివృద్ధి సాధించడంలో, అంకితభావంతో తోడ్పాటు అందించడం ప్రధాన లక్ష్యంగా, సాంఘిక సంక్షేమ శాఖ ఏర్పాటైంది. 2001 జనాభా లెక్కల ప్రకారం, రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల జనాభా 123.39 లక్షలు. రాష్ట్రం మొత్తం జనాభాలో వీరు 16.19 శాతం. 2. సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ ఈ శాఖకు అధిపతి. ప్రధాన కార్యాలయంలో , ఒక అడిషనల్ డైరెక్టర్, ఆరుగురు జాయింట్ డైరెక్టర్లు, ఏడుగురు డిప్యూటీ డైరెక్టర్లు, ఇద్దరు అకౌంట్స్ ఆఫీసర్లు, ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఒక అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసరు ,ఇతర సిబ్బంది , కమిషనర్ కు సహకరిస్తుంటారు. 3. జిల్లాల స్థాయిలో, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్లు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ల సహకారంతో, ముఖ్యంగా జిల్లాల కలెక్టర్లు, సాంఘిక సంక్షేమ పథకాలను అమలుచేస్తుంటారు. వీరికి అదనంగా, డివిజన్ స్థాయిలో, 165 మంది సహాయ సాంఘిక సంక్షేమ అధికారులు పనిచేస్తుంటారు. ఇంతేకాక, సాంఘిక సంక్షేమ హాస్టళ్ళలోనివారి సంక్షేమాన్ని చూడడానికి 2313 మంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు వున్నారు. సంస్థ లక్ష్యం షెడ్యూల్డ్ కులాల ప్రజల సంక్షేమం, సంరక్షణ, విద్యాభివృద్ధి, సాంఘిక ఆర్ధిక అభివృద్ధికి కృషిచేయడం ; అనాథ బాలల సంరక్షణ కేంద్రాలను (ఆర్ఫన్ చిల్డ్రన్ హొమ్స్) ఏర్పాటుచేయడం, జోగినులకు, నిర్బంధ కార్మికులకు (బాండెడ్ లేబర్ కు), పాకీ పని చేసే వారికి పునరావాసం కల్పించడం, పేద వితంతువులకు పెన్షన్లు, బలహీనవర్గాలకు ఇళ్ళస్థలాలు మంజూరుచేయడంవంటి సామాజిక భద్రతా కార్యక్రమాలను చేపట్టడం సాంఘిక సంక్షేమ శాఖ ప్రధాన లక్ష్యాలు. పౌరులకు అందించే సేవలు మెట్రిక్ లోపు తరగతులకుచెందిన (ప్రి-మెట్రిక్)2.72 లక్షలమంది విద్యార్ధులకు, 2356 హాస్టళ్ళ ద్వారా ( వీటిలో 1691 బాలల హాస్టల్స్ కాగా, 665 బాలికల హాస్టల్స్) భోజన, వసతి సౌకర్యం కల్పించడం ; మెట్రిక్ అనంతర కోర్సులు చదివే (పోస్ట్-మెట్రిక్), 3.75 లక్షల మంది ఎస్.సి. విద్యార్ధులకు మెట్రిక్ అనంతర (పోస్ట్ మెట్రిక్) ఉపకార వేతనాలు (స్కాలర్ షిప్స్) అందించడం. ఎస్. సి. న్యాయవాదులకు ఆర్ధిక సహాయం అందించడం పౌరహక్కుల రక్షణ చట్టం-1955, ఎస్.సి, ఎస్.టి. ల చట్టం ( దౌర్జన్యం, అత్యాచార నిరోధన)-1989 తోడ్పాటుతో, ఎస్.సి ల సంక్షేమాన్ని, సంరక్షణను అందించడం దౌర్జన్యం, అత్యాచార బాధిత ఎస్.సి.లకు జిల్లా కలెక్టర్లద్వారా ఆర్ధిక సహాయం, ఉచిత న్యాయ సహాయం సమకూర్చడం వర్ణాంతర వివాహం చేసుకునే దంపతులకు 50,000 రూపాయల ప్రోత్సాహక నగదు బహుమతి ఇవ్వడం (దంపతులలో ఒకరు ఎస్.సి కి చెందినవారై వుండాలి) బలహీన వర్గాలకు ఇళ్ళ స్థలాలు మంజూరుచేయడం పేద వితంతువులకు, జిల్లా కలెక్టర్ల ద్వారా నెలకు 200 రూపాయల పెన్షన్ అందించడం సేవలకు నిర్ణీత కాల పరిమితి ఎస్ . సి కుటుంబాలకు అందించే సేవల విషయంలో , ఈ క్రింది లక్ష్యాలు, ప్రమాణాలు, స్పందనకు కాల పరిమితిని విధించుకోవడం జరిగిందిి హాస్టళ్ళు హాస్టళ్ళలో అడ్మిషన్‌కోసం నోటిఫికేషన్ జారీ --- మే 31వ తేది హాస్టళ్ళకు ఆహార పదార్ధాలను సమకూర్చుకోవడానికి, కొనుగోలు సంఘం సమావేశం --- మే 31వ తేది తాజా అడ్మిషన్లపై సలహా సంఘం సమావేశం, అడ్మిషన్ల ఖరారు --- జులై 15వ తేది హాస్టళ్ళలో కొనసాగే పాత విద్యార్ధులను ప్రత్యక్షంగా పరిశీలించడం --- జూన్ 25వ తేది నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాల సరఫరా ---హాస్టళ్ళు పున: ప్రారంభమైన వారం లోగా దుస్తుల సరఫరా --- ఆగస్టు 15వ తేది కాస్మెటిక్ చార్జీల చెల్లింపు --- ప్రతి నెల 20వ తేది లోగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు పోస్ట్ -మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు తాజా నోటిఫికేషన్ జారీ --- జూన్ 15వ తేది లోగా దరఖాస్తు (అప్లికేషన్) ఫారాల పంపిణీ ---కళాశాలలు పున: ప్రారంభించిన తేది నుంచి అప్లికేషన్ ఫారాలను స్వీకరించే తుది గడువు --- సెప్టెంబర్ 30వ తేది అప్లికేషన్ ఫారాలను స్వీకరించే తుది గడువు --- ప్రొఫెషనల్ (వృత్తి) కళాశాలలు పున: ప్రారంభమైన నెలరోజుల తర్వాత ఏఎస్ డబ్ల్యు ఓ చే అప్లికేషన్ ఫారాల పరిశీలన --- ప్రిన్సిపాల్ నుంచి అందిన 15 రోజులకు డి ఎస్ డబ్ల్యు ఓ చే అప్లికేషన్ ఫారాల పరిశీలన- ట్రెజరీనుంచి స్కాలర్షిప్ మొత్తాలను విత్‌డ్రా చేయడం, ప్రిన్సిపాల్స్ కు పంపించడం ( నిధుల అందుబాటుకు లోబడి) --- ప్రిన్సిపాల్స్ కు చెక్కుల పంపిణీ --- ట్రెజరీ / డి టి ఓ నుంచి అందిన వారంలోగా వర్ణాంతర వివాహం చేసుకున్న దంపతులకు ఆర్ధిక సహాయం దర్యాప్తు జరపడం, ప్రోత్సాహక నగదు బహుమతి మంజూరు (ఏ ఎస్ డబ్ల్యు ఓ ద్వారా) --- ఒక నెల పరిశీలన, మంజూరు (డి డి ఎస్ డబ్ల్యు ద్వారా) --- ఒక నెల ( బడ్జెట్ లో నిధుల అందుబాటుకు లోబడి) ఫారాలను / సమాచారాన్ని పొందే విధానం ఈ శాఖకు సంబంధించిన వివిధ ఫారాలను ఈ క్రిందివారి ద్వారా ఉచితంగా పొందవచ్చును హాస్టల్ అడ్మిషన్ (ప్రవేశ) ఫారాలు --- హెచ్ డబ్ల్యు ఓ / ఏ ఎస్ డబ్ల్యు ఓ / డి డి ఎస్ డబ్ల్యు పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్ ఫారాలు --- సంస్థలు / ఏ ఎస్ డబ్ల్యు ఓ / డి డి ఎస్ డబ్ల్యు సమాచారంకోసం సంప్రదిం చవలసిన అధికారులు --- మన్ననతో సహాయక సేవలు అభ్యర్థులకు అవసరమైన సహాయాన్ని ఎంతో మన్ననతో అందించాలన్నది సాంఘిక సంక్షేమ శాఖ ఆశయం. ఈ సేవలు పొందడంలో ఏదైనా ఇబ్బంది ఎదురైతే, ఈ కింది అధికారులను సంప్రదిం చవచ్చును. అధికారి పేరు ఫోన్ నంబర్ / ఇ- మెయిల్ అందుబాటులో వుండే సమయం కమిషనర్ (ఎస్ డబ్ల్యు) 23391361/2,comm_sw@ap.gov.in ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 అడిషనల్ డైరెక్టర 23391361/2,addldir_sw@ap.gov.in ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 జాయింట్ డైరెక్టర్లు 23391361/2,comm._sw@ap.gov.in ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 ఫిర్యాదులు మీరు ఏదైనా ఫిర్యాదుచేయదలచుకుంటే, మా కార్యాలయాలలో వుంచిన ఫిర్యాదు పెట్టెలలో వేయవచ్చు, లేదా మాకు వ్రాయవచ్చు లేదా పైన పేర్కొన్న అధికారులను సంప్రదిం చవచ్చు మేము అందించే సేవలను మరింత మెరుగుపరిచే విషయమై మీ సలహాలను పైన పేర్కొన్న అధికారులకు పంపండిి మీరు మాకెలా సహకరించగలుగుతారు సేవలను మెరుగుపరిచే విషయంలో మీరు ఈ క్రింది విధంగా మాకు సహకరించవచ్చును అప్లికేషన్ ఫారాలలో కోరిన సమాచారాన్నంతటిని తెలియజేస్తూ, అప్లికేషన్ ఫారాన్ని పూర్తిచేయడం అప్లికేషన్ ఫారాన్ని సకాలంలో అందజేయడం సంబంధిత అధికారి ( ఏ.ఎస్.డబ్ల్యు.ఓ / హెచ్.డబ్ల్యు.ఓ ) కార్యాలయంలో నేరుగా అప్లికేషన్ ఫారాన్ని అందించడం వివిధ పథకాల అమలులో చేయవలసిన మార్పు చేర్పులను గురించి మీ విలువైన సూచనలను అందించడం లబ్ధిదారులతో సమావేశాలు హాస్టల్ పిల్లల తల్లి దండ్రులతో, సంబంధిత హాస్టల్లో రెండునెలలకొకసారి మేము సమావేశాలు జరుపుతాం పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్ చెక్కులను పంపిణీచేయడంకోసం , ప్రతి జిల్లా డివిజనల్ కార్యాలయాలలో, కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో, విద్యార్ధి సంఘాలతో మేము ఆరు నెలలకొకసారి సమావేశాలు జరుపుతున్నాం. నివాసప్రాంత అభివృద్ధి కార్యక్రమం ఇళ్ళ స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం భూమిలేని పేదలకు ఇళ్ళ స్థలాలను మంజూరుచేయడం, ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమం. సమాజంలోని బలహీన వర్గాలకు, ముఖ్యంగా, ఎస్ సి లు, ఎస్ టి లు, బి. సి లు, మైనారిటీలు, ఇతర ఆర్ధిక పేద వర్గాలకు ఇల్లు కట్టుకోవడమనేది ఒక తీవ్రమైన సమస్య. అందువల్ల, వీరికి ఆ సమస్యను తొలగించడంకోసం, ఏడాదికి 11,000/- రూపాయలలోపు ఆదాయం కలిగి, ఇంటి స్థలం అవసరమైన ఎస్ సి లు, ఎస్ టి లు, బి. సి లు, మైనారిటీలు, ఇతర ఆర్ధిక పేద వర్గాలకు , ప్రభుత్వం ఉచితంగా ఇళ్ళ స్థలాలను మంజూరు చేస్తుంది. ఇళ్ళ స్థలాల మంజూరుకు అవసరమైన జాగాను ప్రయివేటు వ్యక్తులనుంచి కొనుగోలుచేయడానికి అవసరమయ్యే నిధులను సాంఘిక సంక్షేమ శాఖ అందజేస్తుంది ఇళ్ళ స్థలాల మంజూరు విషయంలో అనుసరించవలసిన దామాషాను, 24-9-2001 తేదీ నాటి జి. ఓ . ఎం. ఎస్ నం. 90 ఎస్ డబ్ల్యు (ఎల్ ఏ 1 ) శాఖ ఉత్తర్వులో, ప్రభుత్వం ఈక్రిందివిధంగా పేర్కొనడం జరిగింది. ఎస్ సి లు : 40 % ఏస్ టి లు : 10% బి సి లు : 30% మైనారిటీలు : 10 % ఓ బి సి లు 10 % న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా చూడడానికి, ఇళ్ళస్థలాల మంజూరులో అనవసరమైన జాప్యం జరగకుండా నివారించడానికి ప్రభుత్వం 15-12-2003 న జారీచేసిన జి ఓ ఎం ఎస్ నం. 122 ఎస్ డబ్ల్యు (ఎల్ ఏ-1) శాఖ ఉత్తర్వు, ఇళ్ళ స్థలాల మంజూరుకు అవసరమైన జాగాను 31-3-2004 వరకు నేరుగా కొనుగోలుచేయడానికి అధికారం కల్పించింది. ఇళ్ల స్థలాల మంజూరుకు కావలసిన భూములను కొనుగోలుచేయడమే ఎంతో సులువుగా వున్నదని, ఆ ఉత్తర్వును పునరుద్ధరించాలని ఎక్కువమంది కలెక్టర్లు కోరడంతో, ప్రభుత్వం అందుకు అనుగుణంగా, 29.12.2004 న జి ఓ ఎం ఎస్ నం. 92 ఎస్ డబ్ల్యు ( ఎల్ ఏ) శాఖ ఉత్తర్వును జారీ చేసింది. ఈ ఉత్తర్వు, బలహీనవర్గాలకు ఇళ్ళస్థలాలను మంజూరుచేయడంకోసం, ఎలాంటి కాల పరిమితి లేకుండా, జిల్లా కలెక్టర్లు నేరుగా భూసేకరణ జరపడానికి అధికారం కల్పించింది. 2005-2006 సంవత్సరం, రెండవ త్రైమాసికంనాటికి, అంటే, 2005 సెప్టెంబర్వరకు , జిల్లాలకు, 480.23 లక్షల రూపాయల నిధులు విడుదల చేయడం, జరిగింది, 2005 ఆగస్టు వరకు రాష్ట్రంలో, 63,832 ఇళ్ళ స్థలాల పట్టాలను పంపిణీ చేయడం జరిగింది.ి. డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ విగ్రహాల ప్రతిష్ఠాపన అణచివేతకు గురైన వర్గాల ప్రయోజనం కోసం, తన జీవితాంతం పోరాడిన, మహా నాయకుడు, డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ స్మారకార్ధం, ఆయన విగ్రహాలను జిల్లాలలో ఏర్పాటుచేయాలని, ప్రజలనుంచి, సంఘాలు, సంస్థలనుంచి ఎన్నో విజ్ఞప్తులు వచ్చాయి. అందువల్ల, స్థానిక ప్రజలు , తాము సమాన మొత్తం విరాళంగా ఇవ్వడాన్నిబట్టి, అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు 50,000/- రూపాయలనుంచి, 1,00,000/- రూపాయల వరకు మంజూరుచేయడం జరిగింది. బాబూ జగ్జీవన్‌రాం విగ్రహాలను ఏర్పాటుచేయాలనికూడా, ప్రజలనుంచి, ఎస్ సి సంఘాలనుంచి విజ్ఞప్తులు అందాయి. అందువల్ల, బాబూ జగ్జీవన్‌రాం విగ్రహాల ఏర్పాటుకు అనుమతిస్తూ, డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు విషయంలో అనుసరించిన నిబంధనలను, మార్గదర్శకాలనే జగ్జీవన్‌రాం విగ్రహాల ప్రతిష్ఠాపనకు కూడా వర్తింపజేస్తూ, ప్రభుత్వం జి. ఓ. ఎం. ఎస్, నం. 21 ఎస్ డబ్ల్యు (పి ఓ ఏ-2) శాఖ పేరిట, 24-03-1998 తేదీన ఉత్తర్వు జారీచేసింది. మహిళలకు, పిల్లలకు సహాయ కేంద్రాలు మహిళా సహాయ కేంద్రము వుమెన్ ప్రొటెక్షన్ సెల్: 040 -23240663 మహిళా పోలిస్ స్టేషన్: 040-27853508 అస్మితా రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్:040-27733251 షాహీన్స్ మహిళా ఆర్గనైజేషన్:040-24386994 ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ నెట్ వర్క్:040-27014394 పి.వో.డబ్యు సంధ్యా గారు :9849018471 భూమిక ఉమెన్ కలెక్టివ్: 040-27660173 మానసిక ఒత్తిడిలో ఉన్న మహిళలకు భూమిక సహాయ కేంద్రము –టోల్ ప్రీ నెంబరు 1800 425 2908/ 040-2765316 నేషనల్ కమీషన్ ఫర్ ఉమెన్ -011-13237166 అన్వేషి -27423690 సన్నిహిత – ఉషాగారు 9246573978 పిల్లల సహాయ కేంద్రము చైల్డ్ లైన్ : 1098, 040-23133550 రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ :040-24601571, 24601572, 24601574 చైల్డ్ రైట్స్ :1800 425 2933 దివ్య దిశ:9848186982 మానవ హక్కుల సహాయ కేంద్రము హ్యూమన్ రైట్స్ లా నెట్ వర్కు:040-27661883 నేరాలను ఆపడానికి సహాయ కేంద్రము క్రైం స్టాపర్ :1090 ఆత్మహత్యలు ఆపడానికి సహాయ కేంద్రము రోషిని హెల్ప్ లైన్:040-66202000 అవినీతి నిరోధక సహాయ కేంద్రము అవినీతి నిరోధక వింగ్:040-24720196, 24720197 ఆరోగ్య సహాయ కేంద్రము ఆరోగ్యం కోసం సహాయ కేంద్రము: 1056, 104 అత్యవసర అంబులెన్స్ : 108 మధ్యపానము మానడానికి సహాయ కేంద్రము మధ్యపాన సేవించే వారికి పునరావాస కేంద్రము:040-65969896, 9849940500 మానవ/మహిళా పిల్లల అక్రమ రవాణా ఆపడానికి సహాయ కేంద్రము ప్రజ్వల: 040-65704048 అంకురము:040-27017446 వైకల్యం గలవారికీ సహాయ కేంద్రము వైకల్యంగలవారికి స్వీకార్ –ఉపకార్ వారి సేవలు:040-27814089 వృద్ధులకు సహాయ కేంద్రము వృద్దులకు సహాయ కేంద్రము : 1253 మహిళలకు స్వయం ఉపాధి సహాయ కేంద్రము ఏలీప్:040-23893644 విద్య కోసం సహాయ కేంద్రము బ్రెడ్ ఆర్గనైజేషన్:040-65887177 ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు