గిరిజన సంక్షేమము 2011వ సంవత్సరం యొక్క జనాభా లెక్కల ప్రకారం దేశంలోని 15 శాతం ప్రాంతంలో 10.428 కోట్ల గిరిజనులు (ఎస్.టి) ఉన్నారని, వారి జనాభా దేశం యొక్క మొత్తం జనాభాలో 8.61 శాతంగా ఉందని తేలింది. సామాజికంగా, ఆర్ధికంగా మరియు దేశాభివృద్ధిలో వారి పాత్ర చాలా తక్కువగా వుంది కాబట్టి వారి పై ప్రత్యేక శ్రద్ధ కనపర్చవలసి వుందని గమనించబడింది. విద్యుత్ శక్తి, త్రాగు నీరు, వ్యవసాయ భూములను స్వంతంగా కలిగివుండుట మరియు బాలింతల, శిశువుల మరణాలు మొదలైన విషయాలకు వస్తే, వీరు సాధారణ ప్రజానీకం కంటే చాలా వెనుకబడి వున్నారు. 2009-2010 లెక్కలు ప్రకారం 47.4% గ్రామీణ మరియు 30.4 పట్టణ ప్రాంతాలలో గిరిజన (ఎస్.టి) జనాభా దారిద్ర్యరేఖకు దిగువన జీవనం సాగిస్తున్నారు. భారత దేశంలోని గిరిజనులు 2001 వ సంవత్సరం యొక్క జనాభా లెక్కల ప్రకారం దేశంలోని 15 శాతం ప్రాంతంలో 8.451 కోట్ల గిరిజనులు (ఎస్.టి) ఉన్నారని, వారి జనాభా దేశం యొక్క మొత్తం జనాభాలో 8.14 శాతంగా ఉందని తేలింది. సామాజికంగా, ఆర్ధికంగా మరియు దేశాభివృద్ధిలో వారి పాత్ర చాలా తక్కువగా వుందని కాబట్టి వారి పై ప్రత్యేక శ్రద్ధ కనపర్చవలసి వుందని గమనించబడింది. విద్యుత్ శక్తి, త్రాగు నీరు, వ్యవసాయ భూములను స్వంతంగా కలిగివుండుట మరియు బాలింతల, శిశువుల మరణాలు మొదలైన విషయాలకు వస్తే, వీరు సాధారణ ప్రజానీకం కంటే చాలా వెనుకబడి వున్నారు. 52% గిరిజన (ఎస్.టి) జనాభా దారిద్ర్యరేఖకు దిగువన జీవనం సాగిస్తూండగా, 54 శాతం మంది గిరిజనులకు ప్రభుత్వ పరమైన ఆర్థిక సేవలు అనగా రవాణా, సమాచార సేవలు కూడా అందుబాటులో లేవు. భారత రాజ్యాంగం గిరిజనులలోని అన్ని తెగలను షెడ్యూల్డు తెగలుగా నిర్వచించలేదు. భారత రాజ్యాంగంలోని అధికరణ 342 ను, 366 (25)ను అనుసరించి షెడ్యూల్డు తెగలు అనగా షెడ్యూలులో వివరించిన తెగలు/ వర్గాలు మాత్రమే షెడ్యూల్డు తెగలుగా నిర్వచించారు. భారత రాజ్యాంగం అధికరణ 342 ప్రకారం షెడ్యూల్డు తెగలు లేదా గిరిజనులు అనగా లేదా గిరిజనులలోని కొన్ని తెగలు మరియు కొన్ని వర్గాలు లేదా అన్ని వర్గాలు లేదా అన్ని తెగలు అని భారత రాష్ట్రపతి ద్వారా ప్రకటింపబడిన ప్రకటనలో పేర్కొన్నారు. 1991వ సంవత్సరం జనాభా లెక్కలను అనుసరించి గిరిజనులలో 6.776 కోట్ల మంది, దేశ జనాభాలో 8.08 శాతం మాత్రమే పెడ్యూల్డు తెగలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గిరిజనులు ముఖ్యంగా దేశంలోని అడవులు, కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ గిరిజన కులాల యొక్క ప్రధాన గుణ గణాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదీవాసులు లేదా అనాగరికులుగా వుండడం. భౌగోళికంగా దూరంగా ఒంటరిగా జీవనం సాగించడం. ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయం, భాష కలిగి వుండడం. సామాజికులతో కలవడానికి బిడియపడడం, లేదా సంకోచించడం. ఆర్ధికంగా బాగా వెనుకబడి ఉండడం. 1991 వ సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం 42.02 శాతం మంది గిరిజనుల జనాభాలో ప్రధానంగా ఎక్కువ మంది పనివారు లేదా కార్మికులు కాగా అందులో 54.50 శాతం మంది వ్యవసాయ దారులు (రైతులు) మరియు 32.69 శాతం మంది వ్యవసాయ కూలీలు (రైతు కూలీలు). అందుచేత ముఖ్యమైన పనివారిలో 87 శాతం మంది ఈ కులాలు తెగలకు చెందిన వారే మన ప్రాథమిక రంగాల్లో పనిచేస్తున్నారు. అయితే సగటు జాతీయ అక్షరాస్యత 52 శాతం వుండగా గిరిజనులలోని అక్షరాస్యత 29.6 శాతం మాత్రమే వుంది. గిరిజనుల్లోని మహిళల్లో 3/4 వ వంతు కంటే ఎక్కువ మంది మహిళలు నిరక్షరాస్యులు. అసలే నియత విద్యలో పాఠశాలకు వెళ్లడం మానుకున్న వారి శాతంతో కలిపి ఎక్కువ మంది విద్యకు దూరమవుతుండగా, ఈ వ్యత్యాసాలు ఇలావుండగా, వారిలో అతి తక్కువ శాతం మంది ఉన్నత విద్యార్జనలో వున్నారు, ఆశ్చర్య పడకూడని విషయమేమిటంటే, దేశంలోని సగటు పేదరికాన్ని అంచనావేస్తే అందులో అతి ఎక్కువ శాతం మంది గిరిజనులు సాధారణ పేదవారి కంటే ఎంతో హెచ్చు స్థాయిలో దారిద్ర్య రేఖకు దిగువన జీవనం సాగిస్తున్నారు. 1993 -94 వ సంవత్సరంలో ప్రణాళికా సంఘం పేదరికంపై చేసిన అధ్యయనంలో 51.92 శాతం మంది గ్రామీణ గిరిజనులు, 41.4 శాతం మంది పట్టణ గిరిజనులు (ఎస్.టి) ఇప్పటికీ దారిద్ర్య రేఖకు దిగువన జీవనం సాగిస్తున్నారని తెలిసింది. భారత రాజ్యాంగంలో ఈ గిరిజనుల కోసం (ఎస్.టి)ల కొన్ని ప్రత్యేక ప్రయోజన కారకమైన నిబంధనలను పొందుపర్చారు. వారి విద్యాభ్యున్నతికి, ఆర్థిక ప్రగతికి, మరియు వారికి సామాజిక న్యాయం జరిగేలా, ఇంకా వారు ఏ విధమైన శ్రమ దోపిడికి గురవకుండా రక్షణను ఈ నిబంధనలలో పేర్కొనబడింది. పంచ వర్ష ప్రణాళికా విధానం ప్రారంభ సమయంలోనే ఈ లక్ష్యాల సాధన కోసం గిరజన ఉప వ్యూహం ఒకదానిని రూపొందించారు. ఈ ఉప వ్యూహం, ఈ లక్ష్యాలను సాధించే దిశలో రూపొందింపబడి, వాటిని అమలు చేస్తుంది. ఈ వ్యూహం లేదా ఊప ప్రణాళికను అమలు చేసి గిరిజనుల అభివృద్ధి సాధించేందుకు తగినంత నిధులను రాష్ట్ర ప్రణాళికల్లో కేటాయించి, అలాగే కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/ విభాగాల యొక్క పథకాలు/ కార్యక్రమాలలో కేటాయింపులు జరిపి, ఆర్ధిక మరియు అభివృద్ధి సంస్థలు అందించే ధన సహాయంతో నిర్వహిస్తారు. ఈ ఉప ప్రణాళికలో భాగంగా అన్ని రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలలో వాటిలో వున్న గిరిజనుల జనాభా యొక్క నిష్పత్తిని అనుసరించి గిరిజన ఉప ప్రణాళిక నిధులను కేటాయిస్తారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు మరియు పరిపాలనా యంత్రాంగాలు మరియు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/ విభాగాలు ఈ గిరిజనుల ఉప ప్రణాళికను అమలుచేసి వారిని సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధిలోకి తేవడానికి కృషి చేస్తాయి. కాగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా వారికి వివిధ రకాల పథకాలు, కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా వారికి ప్రయోజనం కలిగిస్తాయి. సంవత్సరాల వారీగా అక్షరాస్యత అభివృద్ధిలో సాధించిన ఫలితాలు ఈ కింద పేర్కొన బడడం చూడవచ్చు. 1961 1971 1981 1991 2001 అక్షరాస్యులైన మొత్తం జనాభా 24% 29.4% 36.2% 52.2% 64.84% గిరిజనుల (ఎస్.టి) జనాభా 8.5% 11.3% 16.3% 29.6% 47.10% మొత్తం స్త్రీల జనాభా 12.9% 18.6% 29.8% 39.3% 53.67% మొత్తం గిరిజన స్త్రీల (ఎస్.టి) జనాభా 3.2% 4.8% 8.0% 18.2% 34.76% ప్రస్తుతం దేశంలో మొత్తం 194 సమగ్ర గిరిజనాభివృద్ధి పథకాలు (ITDPS) వున్నాయి. వీటిలోని బ్లాక్ ల బృందాలలో గాని లేదా ఒక బ్లాకులో గాని ఉన్న మొత్తం జనాభాలో 50 శాతం కంటే ఎక్కువ గిరిజనుల (ఎస్.టి) జనాభా వుంటుంది. 6వ ప్రణాళిక అమలులో సవరింపబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం (ఎం ఎ డి ఎ) కింద గిరిజనుల కోసం రూపొందింపబడిన ఉప ప్రణాళిక కింద (ITDP) సమగ్ర గిరిజనాభివృద్ధి పథకాల పరిధిలో లేని ప్రాంతాల్లో మొత్తం 10,000 జనాభాలో కనీసం 5,000 గిరిజన జనాభా వున్న వాటిని ఎంపిక చేసారు. దేశంలో ఇప్పటికి 252 ఎం ఎ డి ఎ ప్రాంతాలు గుర్తించబడ్డాయి. అలాగే అదనంగా, మొత్తం 5,000 మంది జనాభా గల 79 గుంపులలో లేదా సమూహాలలో 50 శాతం మంది గిరిజనులు (ఎస్టీలుగా) వున్న వాటిని కూడా గుర్తించారు. గిరిజన తెగల అభివృద్ధిని అతి ముఖ్యమైన, ప్రధాన లక్ష్యంగా దృష్టిలో పెట్టుకుని, ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను 1999 వ సంవత్సరం అక్టోబర్ నెలలో ఏర్పాటు చేశారు. ఆ మంత్రిత్వ శాఖను గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అని పిలుస్తారు. ఈ మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయం మరియు సాధికారికత మంత్రిత్వ శాఖకు అనుబంధంగా దాని నాయకత్వంలో పని చేస్తుంది. ఈ మంత్రిత్వ శాఖ గిరిజనుల అభివృద్ధికి అవసరమైన అన్ని విధానాల రూపకల్పన, ప్రణాళికా రచన, అన్ని పథకాలు, కార్యక్రమాలు సమన్వయ పరుచుకుంటూ పనిచేస్తుంది. ఈ మంత్రిత్వ శాఖ తప్పనిసరిగా గిరిజన తెగల సామాజిక భద్రత, సాంఘిక భీమా లతో సహా వారి సంక్షేమం, ప్రణాళికా రచన, పరిశోధన మరియు శిక్షణల కోసం సంస్థలను ఏర్పాటు చేయడం, గిరిజన సంక్షేమం మరియు గిరిజన ప్రాంతాలలో పరిపాలనకు సంబంధించిన అంశాలు మరియు గిరిజన ప్రోత్సాహకం, అభివృద్ధి, ఉన్నతికి స్వచ్చంద సేవలు కల్పించాలన్నది ఈ మంత్రిత్వ శాఖ ఆదేశం. గిరిజన తెగలకు సంబంధించిన కార్యక్రమాలు, వాటి కులాల అభివృద్ధి, వాటిని అమలు చేసే విధానాలు, రూపొందించే ప్రణాళికలు, వాటిని అమలు పర్యవేక్షణ, సమీక్ష, మరియు వాటిని సమన్వయ పరిచి అమలు చేసే బాధ్యతను గిరిజన తెగలకు సంబంధించిన కేంద్ర మంత్రిత్వ శాఖ / విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల అధికార పాలనా యంత్రాగాలు సంయుక్తంగా నెరవేర్చాలి. ప్రతి యొక్క కేంద్ర మంత్రిత్వ శాఖ / విభాగం తన రంగానికి సంబంధించిన ప్రతి విభాగానికి నాయకత్వం వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలన అధికార యంత్రాంగాలకు మరియు కేంద్రంలోని ఇతర మంత్రిత్వ శాఖలు/ విభాగాలు నిర్వహించే కార్యక్రమాలకు, ఈ తెగల అభివృద్ధికి సత్ సంకల్పంతో చేసే అభివృద్ధి పనులకు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ సహకారాలను మరియు మద్దతును ప్రకటిస్తుంది. నిర్వచనం Definition భారత రాజ్యాంగంలో "షెడ్యుల్డు తెగలు" అనే పదం మొదట ప్రవేశపెట్టబడింది. రాజ్యాంగంలో ని 342 అధికరణ కింద పెడ్యుల్డు తెగల నిబంధన గురించి 366 (25) అధికరణలో నిర్వచించిన "షెడ్యుల్డు తెగలు" పదానికి అర్ధం ఏ తెగలు లేదా ఏఏ వర్గాలు లేదా వాటిలోని కొన్ని తెగలు లేదా అన్ని గుంపులు లేదా కొన్ని గుంపులు షెడ్యుల్డు తెగలు లేదా షెడ్యుల్డు వర్గాలుగా పేర్కొన్నారో అవేనని నిర్ణయించారు. 342 అధికరణ తిరిగి ఈ విధంగా పేర్కొంది. పెడ్యుల్డు తెగలను ప్రత్యేకించి పేర్కొనే ముందు ఈ కింది విధానాలను అవలంబించాలి. అధికరణ 342 కింది షెడ్యుల్డు తెగలు (గిరిజనులు) Article 342 Scheduled Tribes ఏదైనా రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతాలను సందర్భాన్ని బట్టి, రాష్ట్రపతి, ఒక వేళ అది రాష్ట్రమైతే, ఆ రాష్ట్ర గవర్నర్ తో సంప్రతించి ఆ తర్వాత ఒక అధికార ప్రకటన ద్వారా కొన్ని ప్రత్యేక తెగలను లేదా ఆ తెగలలోని కొన్ని వర్గాలను లేదా అన్ని వర్గాలను, కొన్ని గుంపులను లేదా అన్ని గుంపులను ఆ రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతంలోని షెడ్యుల్డు తెగలు / లేదా తెగలకు సంబంధించిన వర్గాలుగా సందర్భాన్ని బట్టి రాజ్యాంగాన్ని అనుసరించి తెలియ పరచవచ్చు లేదా ప్రకటించవచ్చు. ఒక ప్రకటన జారీద్వారా క్లాజ్ (1) (వాక్యం లేదా షరతు) కింది ఏదైనా తెగ లేదా తెగకు చెందిన వర్గం లేదా తెగలలోని కొన్ని వర్గాలను లేదా అన్ని వర్గాలను లేదా తెగలోని కొన్ని గుంపులను/ అన్ని గుంపులను ప్రత్యేకంగా షెడ్యుల్డు తెగల జాబితాలో పొందుపర్చడం లేదా తొలగించడమును కేంద్ర, శాసన సభలు (పార్లమెంట్) ఒక చట్టం ద్వారా అమలులోకి తేవచ్చు. అయితే పైన చెప్పిన అంశాన్ని పైన చెప్పిన క్లాజు కింది తర్వాత ప్రకటనలో మార్పు చేయకుండా వుండి వుంటే ఆ చట్టం అమలులో వుంటుంది. అందుచేత షెడ్యుల్డు తెగల గురించి ప్రత్యేకించి విడుదల అయ్యే మొదటి ప్రకటన ప్రతి రాష్ట్రానికి లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి రాష్ట్రపతి ఆదేశాల ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో వాటిలో నివసించే ఎ.స్టాల గురించి సంప్రతించిన తర్వాత విడుదల చేయబడుతుంది. అయితే ఈ ఆదేశాలకు సవరణలు మరలా కేంద్ర శాసన సభలచే రూపొందించబడిన చట్టాల ద్వారా మాత్రమే తిరిగి చెయ్యవలసి వుంటుంది. ఈ అధికరణ ఏమి చెబుతోందంటే షెడ్యుల్డు తెగల జాబితాలో చేర్చబడే తెగలు ఆయా రాష్ట్రాలు /కేంద్ర పాలిత ప్రాంతాలలో వాటి నివాసం ఆధారంగా మాత్రమే చేర్చబడతాయి తప్ప దేశం మొత్తం మీద అనుసరించి చేర్చబడవు. ఒక గిరిజన తెగను గాని వర్గాన్ని గాని షెడ్యుల్డు తెగగా లేదా వర్గంగా ప్రత్యేకించి పేర్కొనే ముందుగా ఈ కింది అంశాలను పరిగణించ వలసి వుంటుంది. వారు అనాగరిక ఆదీవాసులై వుండి, ప్రత్యేక సంస్కృతి, (భాష, సంప్రదాయం), భౌగోళికంగా ఒంటరిగా జీవిస్తున్న వారై అనగా సభ్య సమాజానికి దూరంగా నివసించడం, సమాజంలో కలిసి మెలిసి పోవడానికి బిడియపడడం లేదా జంకడం మరియు అన్ని రకాలుగా వెనుక బడి వుండే వారై వుండాలి. ఈ విధానం రాజ్యాంగంలో పేర్కొన బడలేదు. కాని ఎక్కువ ప్రాచుర్యం పొందింది. 1931 వ సంవత్సరం జనాభా లెక్కలలో ప్రచురించిన నిర్వచనాల ప్రకారం ఇది గుర్తించ బడింది. 1955 వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన మొదటి వెనుక బడిన తరగతుల కమీషన్ ఇచ్చిన నివేదిక లో పేర్కొన బడింది. అలాగే కలేకర్ సలహా కమిటీ నివేదికలో, 1965 వ సంవత్సరం లో ఎస్. సి/ఎస్.టీల జాబితా సవరణ కోసం నియమింపబడిన లోకూర్ కమిటీ తయారు చేసిన నివేదికలో, ఈ విషయం నిర్వచించబడింది. ఇంకా 1967 వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన పార్లమెంట్ (ఉభయ శాసన సభల) సంయుక్త కమిటి ఈ ఎస్.సి / ఎస్.టిల ఆదేశాల (సవరణ)కై చేసిన బిల్లు పై ఆ కమిటీ ఇచ్చిన నివేదికలో, మరియు 1969 లో చందా కమిటీ ఇచ్చిన నివేదికలో కూడా ఇదే నిర్వచనం ఇవ్వబడింది. భారత రాజ్యాంగంలోని 342 అధికరణలోని క్లాజ్ (షరతు) లో ఇచ్చిన అధికారం అనుసరించి, భారత రాష్ట్రపతి, గిరిజనులు (ఎస్.టి) లు నివసిస్తున్న ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రతించిన తర్వాత ఇప్పటి వరకు ఆయా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల యొక్క ఎస్.టిల గురించి 9 ఆదేశాలను జారీ చేశారు. వాటిల్లో ఆయా రాష్ట్రప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబందించి షెడ్యుల్డు తెగలకు సంబంధించిన వారు ఎవరో స్పష్టంగా వివరించారు. ఈ ఆదేశాల్లో ప్రస్తుతం 8 ఆదేశాలు జారీ అయిన నాటి నుంచి యధాతధంగా లేదా సవరింపబడి అమలులో వుండగా ఒక ఆదేశం అమలులో లేదు. రాజ్యాంగాన్ని అనుసరించి 1968 వ సంవత్సరంలో రూపొందించిన (గోవా, డామన్, డయ్యు) షేడ్యుల్డ్ తెగల ఆదేశం అమలులో లేదు. కారణం ఏమిటంటే, 1987 వ సంవత్సరంలో ఆ ప్రాంతాలను పునః వ్యవస్థీకరించడమే. 1987 వ సంవత్సరంలో గోవాను విడదీసి ప్రత్యేక రాష్ట్రంగా చేయడం వలన గోవా ప్రాంతంలోని షెడ్యుల్డ్ తెగలను 1950 వ సంవత్సరంలో రాజ్యాంగంలో తెచ్చిన షెడ్యుల్డ్ ఆదేశాలలోని XIX షెడ్యులులో ఒక భాగంగా బదిలీ చేసి అందులో పొందు పర్చారు. అలాగే డామన్, డయ్యులను కేంద్ర పాలిత ప్రాంతంగా సవరించి ఆ ప్రాంతంలోని షెడ్యూల్డ్ తెగలను 1951 వ సంవత్సరంలో రాజ్యాంగంలో తెచ్చిన కేంద్ర పాలిత ప్రాంతాల షెడ్యుల్డ్ తెగల ఆదేశంలోని డామన్, డయ్యు II షేడ్యులులో చేర్చి అందులో పొందు పర్చారు. వరుస సంఖ్య ఆదేశం పేరు ప్రకటన వెలువడిన తేదీ ఆదేశం వర్తించే రాష్ట్రాలు/ కేంద్రపాలిట ప్రాంతాలు 1. రాజ్యాంగ (షెడ్యూల్డ్ తెగల) ఆదేశాలు 1950 (సి.ఒ.220 ) 6/9/1950 ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, గుజరాత్, గోవా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, ఒరిస్సా, రాజస్ఠాన్, తమిళనాడు, త్రిపుర మరియు పశ్చిమ బెంగాల్ 2. రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ తెగల (కేంద్ర పాలిత్ ప్రాంతాల) ఆదేశాలు 1951 (సి.ఒ.33) 20/9/1951 డామన్, డయ్యు, లక్ష ద్వీప్ 3. రాజ్యాంగంలోని (అండమాన్ నికోబార్ దీవుల) షెడ్యూల్డ్ తెగల ఆదేశాలు 1959 (సి.ఒ.58) 31/3/1959 అండమాన్ మరియు నికోబార్ దీవులు 4. రాజ్యాంగంలోని (దద్రా & నాగర్ హవేలి) షెడ్యూల్డ్ తెగల ఆదేశాలు 1962 (సి.ఓ.65) 30/6/1962 దద్రా మరియు నగర్ హవేలి 5. రాజ్యాంగంలోని (ఉత్తర ప్రదేశ్) షెడ్యూల్డ్ తెగల ఆదేశాలు 1967 (సి.ఒ.78) 24/6/1967 ఉత్తర ప్రదేశ్ 6. రాజ్యాంగంలోని (నాగాలాండ్) షెడ్యూల్డ్ తెగల ఆదేశాలు 1970 (సి.ఒ. 88) 23/7/1970 నాగాలాండ్ 7. రాజ్యాంగంలోని (సిక్కిం) షెడ్యూల్డ్ తెగల ఆదేశాలు, 1978 (సి.ఒ.111) 22/6/1978 సిక్కిం 8. రాజ్యాంగంలోని (జమ్ము మరియు కాశ్మీర్) షెడ్యూల్డ్ తెగల ఆదేశాలు, 1989 (సి.ఒ.142) 7/10/1989 జమ్ము మరియు కాశ్మిర్ హర్యానా మరియు పంజాబ్ రాష్ట్రాలు, ఛండీఘడ్, ఢిల్లీ మరియు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన షెడ్యుల్డ్ తెగల గురించి ఏ తెగలను ప్రత్యేకంగా పేర్కొనలేదు. షెడ్యుల్డ్ తెగల జాబితాలను రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలవారీగా అనుబంధం I లో మరియు అక్షరక్రమంలో అనుబంధం II లో ను పేర్కొన బడింది. షెడ్యుల్డ్ తెగల గురించి ధృవ పత్రాల జారీ విషయమై ఈ విధానం అనుసరించాలి సాధారణ అంశాలు General: ఎవరైనా వ్యక్తి తాను పుట్టుక ప్రకారం షెడ్యుల్డ్ తెగకు చెందిన వాడనని ధృవ పత్రం జారీ చేయాలని కోరితే, ఈ కింది అంశాలను పరిశీలించాలి. అతడు లేక ఆమె ఏ తెగకు చెందిన వాడనని/దాననని తెలిపారో చూసి అతని/ ఆమె తల్లిదండ్రులు ఆ తెగకు చెందిన వారా? కాదా అని పరిశీలించాలి. అతడు / ఆమె ఏ రాష్ట్రానికి చెందిన వారో చూసి ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎస్.టీల జాబితాలో అతడు/ ఆమె ఏ తెగకు చెందినట్లు పేర్కొన్నాడో ఆ తెగ రాష్ట్రపతి ఆదేశాలలో పేర్కొన బడిందా / లేదా అని పరిశీలించాలి. షెడ్యుల్డ్ లో పేర్కొన్న అతని/ ఆమె తెగ ఆ రాష్ట్రంలోని ప్రాంతానిదేనా, మరియు ఆ రాష్ట్రానికి చెందినదేనా అని చూడాలి. ఆ వ్యక్తి ఏ మతాన్నైనా ప్రవచించుకోవచ్చు. అతడు ఆ రాష్ట్రంలో శాశ్వతంగా నివాసముంటున్నాడా లేదా పరిశీలించి రాష్ట్రపతి ఆదేశాలు జారీ అయిన తేదీ నాటికి అతడు అక్కడ నివసిస్తున్నట్టయితే ఈ అంశం అతనికి వర్తిస్తుంది. రాష్ట్రపతి ఆదేశాలు జారీ అయిన నాటికి ఆ వ్యక్తి తన శాశ్వత నివాసాన్ని తాత్కాలికంగా వదిలి వేసినచో ఆటువంటి సందర్బంలో అతడు జీవనోపాధి కోసం వలస వెళ్ళినచో లేదా విద్యాభ్యాసం కోసం వెళ్లినచో మొదలైన కారణాలను బట్టి అతడిని అతడు ఏ రాష్ట్రం లోని షెడ్యుల్డ్ తెగకు చెందిన వాడో, ఆ ఆదేశాలలో పేర్కొని వుంటే అతడిని ఆ రాష్ట్రంలోని షెడ్యుల్డ్ తెగకు చెందిన వాడిగా గుర్తించాలి. కాబట్టి అతడు తాత్కాలికంగా నివసిస్తున్న ప్రాంతానికి లేదా ఆ రాష్ట్రంలోని ఎస్.టి తెగకు చెందిన వాడుగా గుర్తించరాదు. ఎందుకంటే ఆ తెగ రాష్ట్రపతి ఆదేశాలలో అక్కడ కూడా పేర్కొన్నప్పటికీ, అతడు ఆ ప్రాంతానికి, ఆ రాష్ట్రానికి చెందినవాడు కాడు కాబట్టి ప్రకటింపబడి, అమలులో వున్న రాష్ట్రపతి ఆదేశాలను అనుసరించి, ఏ వ్యక్తి లేదా వ్యక్తులు ఆ ఆదేశాల తర్వాత జన్మించినచో , అటువంటివారు ఆ ప్రాంతంలో నివసిస్తున్న షెడ్యుల్డ్ తెగ / తెగలుగా గుర్తింపబడేందుకు వారియొక్క తల్లిదండ్రుల శాశ్వత నివాసం ఆ ప్రాంతమేనని రూఢీ అయిన తర్వాత వారు ఆ రాష్ట్రంలోని ఏ తెగకు చెందినవారో ఆ తెగకు సంబంధించిన ఆదేశాల ననుసరించి ఆ తెగకు చెందిన వారుగా, శాశ్వత నివాసులుగా గుర్తింపబడతారు. వలస వచ్చినట్టు షెడ్యుల్డ్ తెగల ధృవ పత్రం కోరినచో Scheduled Tribe claims on migration: ఎవరైనా వ్యక్తి ఒక రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలి వెళ్లితే, తాను గతంలో వున్న ప్రాంతం షెడ్యుల్డు తెగలో గుర్తింపబడి వుండి, ఇప్పుడు అతడు తరలి వచ్చిన ప్రాంతం వున్న రాష్ట్రంలో ఆ తెగ షెడ్యుల్డ్ తెగగా గుర్తింపబడి వుండకపోతే, అతడు తన రాష్ట్రంకు చెందిన షెడ్యుల్డ్ తెగ కు చెందిన వ్యక్తిగానే కొనసాగుతాడు. అలాగే ఒక వ్యక్తి ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి తరలి వెళితే, అతడు ఏ రాష్ట్రంలోని షెడ్యుల్డ్ తెగకు చెందిన వాడిగా గుర్తింపబడి ఉన్నాడో, ఆ షెడ్యుల్డ్ తెగకు చెందిన వాడుగానే కొనసాగుతాడు తప్ప తాను వలస వచ్చిన రాష్ట్రానికి చెందిన ఎస్.టి తెగకు చెందిన వాడుగా గుర్తింపబడడు. వివాహా నం తరం షెడ్యుల్డ్ తెగగా గుర్తించడం గురించి Scheduled Tribe claims through marriages: మార్గదర్శక సూత్రాల ప్రకారం పుట్టుకతో షెడ్యుల్డ్ తెగకు చెందిన ఒక వ్యక్తి అతడు/ఆమె షెడ్యుల్డ్ తెగకు చెందిన వారిని వివాహమాడినచో ఆ వివాహాం అయినంత మాత్రం చేత ఆ వ్యక్తి షెడ్యుల్డ్ తెగకు చెందిన వాడు/ దాని గా గుర్తింపబడతారు. అలాగే ఒక వ్యక్తి షెడ్యుల్డ్ తెగకు చెందివుండి అతడు /ఆమె షెడ్యుల్డ్ తెగకు చెందని వారిని వివాహం చేసుకుని వుంటే ఆ వ్యక్తి షెడ్యుల్డ్ తెగకు చెందిన వానిగా/ చెందిన దానిగానే గుర్తింపబడతాడు/ తుంది. షెడ్యుల్డ్ తెగకు చెందినట్టు ధృవ పత్రం జారీ విషయం గురించి Issue of Scheduled Tribe Certificates: ఒక వ్యక్తి తాను షెడ్యుల్డు తెగకు చెందిన వానిగా ధృవపత్రం కోరినచో, అనుబంధం Illలో పొందుపర్చిన నిర్ణీత దరఖాస్తు ఫారంలో అందులో పేర్కొన్న ఏ అధికారి చేతనైనా తాను ఆ తెగకు చెందినట్టు ఆధారాలు కలిగిన పత్రాలు చూపి ధృవ పత్రం పొందవచ్చు. సరియైన పరిశీలన జరపకుండా పెడ్యుల్డ్ తెగకు చెందినట్టు ధృవ పత్రాలు జారీ చేసినచో ఆ అధికారులు శిక్షార్హులుగా పరిగణింపబడతారు. ఇతర రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వలస వచ్చినారికి షెడ్యుల్డ్ తెగకు చెందిన ధృవ పత్రాలు జారీ చేయడంలో విధి విధానాలు సులభతరం చేయబడ్డాయి. షెడ్యుల్డ్ తెగలకు చెందినవారు, తాము తమ స్వంత రాష్ట్రం నుంచి ఉపాధి, ఉద్యోగం, విద్యాభ్యాసం మొదలైన వాటికోసం మరొక రాష్ట్రానికి వలస వస్తే, వారు ఏ రాష్ట్రానికి చెందిన షెడ్యుల్డ్ తెగకు చెందిన వారో ధ్రువ పత్రం పొందడంలో ఆ రాష్ట్రం పాలనా యంత్రాంగం నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్టు వారియొక్క అనుభవాలు తెలుపుతున్నాయి. ఈ ఇబ్బందులు తొలగించడానికి ఏదైనా రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం అధికార యంత్రాంగం నియమించిన అధికారి దరఖాస్తు చేసిన వ్యక్తి తన యొక్క తల్లిదండ్రులు ఏ రాష్ట్రానికి చెందిన షెడ్యుల్డ్ తెగకు చెందినవారో తెలియచేసే ఖచ్చితమైన, విశ్వసనీయమైన రుజువు పత్రాలను సమర్పిస్తే వారికి ఆ షెడ్యుల్డ్ తెగల ద్రువ పత్రాలను జారీ చేయవచ్చు. అయితే కొన్ని సందర్బాలలో ఆ అధికారులు దరఖాస్తు దారుని యొక్క పూర్తి వివరాలు పై దర్యాప్తు చేయదలిస్తే అతను ఏ రాష్ట్రానికి చెందిన వాడో ఆ రాష్ట్రం ద్వారా దర్యాప్తు జరిపి ఆ నివేదికల ఆధారంగా షెడ్యుల్డ్ తెగకు చెందినట్టు ధృవపత్రాలు జారీ చేయవచ్చు. ప్రస్తుతం ఆ వ్యక్తి నివసిస్తున్న రాష్ట్రంలో అతడు షెడ్యుల్ తెగకు చెందిన వాడా? కాదా అన్న ప్రశ్నను పక్కన పెట్టి అతడు ఏ రాష్ట్రంలోని షెడ్యుల్ తెగకు చెందివున్నాడో ఆ వివరాల ఆధారంగా షెడ్యుల్ తెగల దృవపత్రం జారీ చేయవచ్చును. ఐతే ఆ వ్యక్తులకు తాము ప్రస్తుతం వలస వచ్చి నివసిస్తున్న రాష్ట్రంలోని షెడ్యుల్ తెగలు పొందే ప్రయోజనాలు అందించబడవు. అవి వారికి వర్తించవు. ఇంకా..... విధానాలు - చట్టాలు రాష్ట్రాల వారీగా గిరిజనులు/ఆదివాసీలు పథకాలు ఆదివాసి శిక్షా ఋణ యోజన (ఆ.శి.ఋ.యో) గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖచే అమలుచేయబడుతున్న ముఖ్యమైన పథకాలు / కార్యక్రమాలు జాతీయ సంస్థలు జాతీయ గిరిజనుల ఆర్థిక మరియు అభివృద్ధి కార్పోరేషన్ (ఎన్.ఎస్.టి.ఎఫ్.డి.సి) జాతీయ ఆదివాసి/గిరిజన కమీషన్ (ఎన్.సి.ఎస్.టి) భారతీయ ఆదివాసి/ గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్య లిమిటెడ్ (ట్రైఫెడ్) ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు