కొత్త చట్టాలలో సెక్షన్ల సవరణ: కొన్ని తొలగింపు మరికొన్ని కఠినతరం కొత్త నేర విచారణ సంస్కరణ చట్టాల్లో ప్రాథమ్యాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. బ్రిటిష్ పార్లమెంటు రూపొందించిన ఐపీసీ (163 ఏళ్ల నాటిది), సీఆర్పీసీ (125 ఏళ్ల నాటిది), సాక్ష్యాల చట్టం (150 ఏళ్ల నాటిది) ఆధారంగా నడిచే వ్యవస్థలో ఈ మార్పులు అనివార్యమయ్యాయి. మహిళలు, పిల్లలు, దేశ వ్యతిరేక నేరాల సంబంధిత సెక్షన్లకు 'భారతీయ న్యాయ సంహిత' ప్రాధాన్యమిచ్చింది. ఇది వలస పాలన నాటి చట్టాలకు భిన్నమైన విధానం. పాత చట్టాల్లో మహిళలు, పిల్లలు, దేశ వ్యతిరేక నేరాల కన్నా... దేశద్రోహం, ప్రభుత్వ ఖజానాను దోచుకోవడం, ప్రభుత్వ అధికారులపై దాడి వంటి అంశాలకే అధిక ప్రాధాన్యం ఉండేది. చట్టంలో అభ్యంతరకరమైన పదజాలం దేశంలో కొనసాగిన వలస పాలన కాలపు చట్టాలలో 2024 జూన్ 30 వరకూ స్వతంత్ర భారత స్ఫూర్తికి విఘాతం కలిగించే పదజాలం కనిపించేది. స్వాతంత్య్రం తర్వాత 75 ఏళ్లు దాటినా ఆ చట్టాల అమలు ఆగలేదు. వాటిలో 'యునైటెడ్ కింగ్ డమ్ పార్లమెంట్', 'ప్రాంతీయ శాసనసభలు', 'క్రౌన్' (బ్రిటిష్ రాజు లేదా రాణి) ప్రతినిధులు, 'లండన్ గెజిట్', 'జ్యూరీ', 'యునైటెడ్ కింగ్ డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ ఐర్లాండ్', 'హర్ మెజెస్టీన్ గవర్నమెంట్' (రాణి గారి ప్రభుత్వం), 'లండన్ గెజిట్' నిర్దేశిత విధానాలు, 'బ్రిటిష్ క్రౌన్', ''ఇంగ్లాండ్' న్యాయస్థానాల సంప్రదాయాలు సహా 'బారిస్టర్' వంటి పదాలు లేదా ప్రస్తావనలు కనిపించేవి. స్వాతంత్ర్యం వచ్చాక 7 దశాబ్దాలుగా న్యాయ వ్యవస్థ ఎదుర్కొన్న సవాళ్లపై సమగ చర్చ సాగింది. ఆచరణాత్మక వినియోగం, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా చట్టంలోని ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు. 'సముద్ర మథనం' తరహాలో ఈ కఠిన, సుదీర్ఘ ప్రక్రియ ద్వారా 'అమృత కాలం' కోసం 'అమృత' ధారలా 'భారతీయ న్యాయ సంహిత' ఆవిర్భవించింది. విస్తృత సహకారంతో రూపుదిద్దుకున్న ఈ దేశీయ కొత్త న్యాయ సంహిత, భారత ప్రగతి ప్రయాణంలో ఒక కీలక మలుపుగా మారింది. ఈ చట్టాలను 2024 జూలై 1న అమలులోకి తేవడంతో బ్రిటిష్ పాలన, వలసవాద బానిసత్వపు ఆనవాళ్లు మొత్తం సమసిపోయి, పూర్తి స్వదేశీ చట్టబద్ధ వ్యవస్థ రూపుదాల్చింది. ఇది భారత నేర విచారణ న్యాయ వ్యవస్థలో నవ శకానికి నాంది పలికింది. ఈ చట్టం పూర్తిగా అమల్లోకి రావడంతో, 'తారీకు మీద తారీకు' (వాయిదా మీద వాయిదా )గా ప్రాచుర్యంలో గల అనంత వాయిదాల పర్వానికి తెరపడింది. బాధితులకు మూడేళ్లలోపు న్యాయ ప్రదానం చేసే న్యాయ వ్యవస్థ ఇప్పుడు దేశంలో ఏర్పాటైంది. తత్ఫలితంగా రెండేళ్లలో భారత కొత్త చట్టాలు న్యాయ వ్యవస్థ స్వరూపాన్నే మార్చేశాయి. ఈ మార్పును ప్రతి పౌరుడూ నేడు ప్రత్యక్షంగా అనుభూతి చెందుతున్నాడు. ప్రస్తుతం అమలులోకి వచ్చిన 'బీఎస్ఎస్' వేగంగా పురోగమించే భారత దృక్పథాన్ని ప్రతిబింబిస్తూ న్యాయ ప్రదానంలో నవ్యారంభానికి సంకేతంగా నిలిచింది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 358 సెక్షన్లను భారతీయ న్యాయ సంహిత (బీఎర్ఎస్) లో చేరగా. పాతకాలపు ఆసీస్ (1860)లో 511 సెక్షన్లు ఉండేవి. 21 కొత్త సెక్షన్ల ద్వారా నేర నిర్వచనాలను చేర్చారు. 41 సెక్షన్ల కింద విధించే కారాగార శిక్ష కాలం పెంచారు. 82 రకాల నేరాలకు ఇరిమానా మొత్తం పెంచగా, 25 నేరాలకు తప్పనిసరి కనీస శిక్ష పద్ధతిని ప్రవేశపెట్టారు. 19 తొలగించడంతోపాటు 6 రకాల నేరాలకు 'సామాజిక సేవ'ను శిక్షగా నిర్దేశించారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) 531 సెక్షన్లను 'బీఎమ్ఎస్ఎస్'లో' చేర్చగా, మునుపటి సీఆర్పేస్ (1973) 484 మొత్తం 14 సెక్షన్లను తొలగించారు. 177 నిబంధనలను సవరించగా, 9 సెక్షన్లను, 38 ఉప సెక్షన్లను కొత్తగా చేర్చారు. 44 కొత్త వివరణలు, అర్థాలను జోడించారు. 35 సెక్షన్లలో నిర్దిష్టకాల పరిమితులను చేర్చారు. 35 ఆడియో వీడియో నిబంధనలను ప్రవేశపెట్టారు. భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్ఏ) 170 సెక్షన్లను ఇందులో పొందుపరచగా, సాక్ష్యాల చట్టం-౧౮౭౨లో వాస్తవంగా 167 సెక్షన్లు ఉండేవి 24 రకాల మార్పులతో నిబంధనలను రూపొందించారు. రెండు సెక్షన్లు, ఆరు ఉప సెక్షన్లను జోడించి, మొత్తం 6 సెక్షన్లను తొలగించారు. ఆధారం: న్యూ ఇండియా సమాచార్