లక్ష్యాలు వికలాంగుల నైపుణ్యాన్ని పెంపొందిచటానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడం ఈ పథకం లక్ష్యం వైకల్యం కంటే ఎక్కువ ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది వైకల్యాన్ని దృవీరించడానికి వైద్య అధికారి ద్వారా సర్టిఫికేట్ తీసుకోవాలి 30% మహిళా రిజర్వేషన్లు: మహిళలను ప్రోత్సహించే ప్రయత్నంగా , ప్రతి శిక్షణ కార్యక్రమంలో మొత్తం 30%ను మహిళా అభ్యర్థులకు కేటాయిస్తున్నారు. ఈ పథక నియమాల ప్రకారం ఈ శాఖ ద్వారా గుర్తింపు పొందిన శిక్షణా సంస్థల ద్వారా శిక్షణ అమలు జరుదుతుంది. అర్హత భారత పౌరులు అయిఉండాలి. 40% వైకల్యం కంటే ఎక్కున వైకల్యం ఉండి వైద్య అధికారి ద్వారా సర్టిఫికేట్ కలిగి ఉండాలి. కింది వాటిని వైకల్యాలుగా గుర్తించారు (ఏ) అంధత్వం (బి) తక్కువ దృష్టి (సి) నయమవుతున్న కుష్టు (డి) వినికిడి సమస్యలు (ఇ) లోకో - మోటారు వైకల్యం (ఎఫ్) మెంటల్ రిటార్డేషన్ (హెచ్) ఆటిజం (ఐ) సెరిబ్రల్ పాల్సి లేదా (జె) రెండు లేదా మూడు వైకల్యాలు కలిపి ఉండటం. వయసు: కోర్సు కోసం అప్లికేషను చివరి తేదీ నాటికి దరఖాస్తుదారు వయస్సు 15 సంవత్సరాల కంటే ఎక్కువ మరియు 59 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి . దరఖాస్తు చివరి తేదీకి ముందు రెండు సంవత్సరాల కాలంలో దరఖాస్తుదారు ప్రభుత్వం స్పాన్సర్ చెసిన ఏ ఇతర శిక్షణ కోర్సులను చేసి ఉండకూడదు. నిధుల నిబంధనలు శిక్షణ ఖర్చు: పూర్తి శిక్షణా కాలానికి గాను అన్ని శిక్షణా కార్యక్రమాల ఖర్చులను కలుపుకొని నెలకు Rs.5,000/- ప్రితీ ట్రేనీకి ఖర్చుచేయాలి. ఉదాహరణకు, మూడు నెలలు శిక్షణ కార్యక్రమం చేపట్టి ఉంటే, ప్రితి ట్రేనీకి చెల్లించ వలసిన శిక్షణా కార్యక్రమాల ఖర్చు రూ .15000 / అవుతుంది. నెలలో కొన్నిరోజులు శిక్షణ కార్యక్రమం ఉంటే దానికి తగ్గట్టుగా ఖర్చును లెక్కిస్తారు. ట్రైనీలకు స్టైఫండు: హాస్టల్లో ఉండేవారికి నెలకు రూ. 2000 మరియు బయటివారికి 1000/ నెలకు స్టైఫండుగా ఇస్తారు. రవాణా ఖర్చు: - హాస్టల్లో ఉండేవారికి నెలకు రూ.500/ మరియు బయటివారికి నెలకు రూ. 1500/ రవాణా ఖర్చులను ఇస్తారు. మరింత సమాచారం కోసం, ఇక్కడ క్లిక్ చేయండి.