ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి పథకం ఈ పథకంలో 18-50 ఏండ్ల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు. సంవత్సరానికి రూ.330 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఏ కారణంతో మృతిచెందినా నామినీకి రూ.2లక్షలు చెల్లిస్తారు. ఏ బ్యాంకు ఖాతానుంచైనా ఈ పథకంలో సభ్యత్వం పొందవచ్చు. ఏడాదికి ఒకసారి ఏకమొత్తంలో ప్రీమియం వసూలు చేస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన 2015-16 బడ్జెట్లో ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకాన్ని గురించి వివరించారు. అసలు ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం అంటే ఏమిటీ? దీని ప్రత్యేకలు ఏంటో చూద్దాం. వార్షిక ప్రీమియం కేవలం ౩౩౦ రూపాయలకే 2 లక్షల రూపాయల జీవిత భీమా లభిస్తుంది . మొత్తం పొదుపు 18 నుంచి 50 సంవత్సరాల వయసుగల బ్యాంకు ఖాతాదారులకు మీ తర్వాత, మీ కుటుంభ సభ్యులకు లభిస్తుంది భీమా సొమ్ము. భీమా వ్యవధి, వార్షికం :1 జూన్ -31 ప్రీమియం సొమ్ము ఖాతాదారుల పొదుపు ఖాతా నుంచి బ్యాంకు ద్వారా ‘ఆటో డెబిట్’ సదుపాయం ద్వారా , ఏ వ్యక్తి అయినా కేవలం ఒక పొదుపు ఖాతా ద్వారా మాత్రమే ఈ పథకాన్ని పొందగలరు. వెంటనే మీ బ్యాంకు ఖాతా లేదా బ్యాంకు మిత్రుని సంప్రదించండి మరియు నెలకొల్పబడిన శిభిరాలకు వెళ్లి ఫారం నింపి ఈ పథకం వల్ల కలిగే లాభం పొందండి. మీ అసోసియేట్ బ్యాంక్‌లు మరియు భీమా కంపినీల తరపున అధిక సమాచారం కోసం, దయచేసి టోల్ ఫ్రీ నం.1800 110 001/180 1111కి కాల్ చేయండి ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం ముఖ్య ఉద్దేశ్యం జీవిత బీమా కవరేజి. ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పేరిట కొత్తగా చేపడుతున్న పథకం నిరుపేదలకు కాస్త ఊరటనిస్తుంది. ఎవరెవరు ఈ పథకం కిందకు అర్హులు చూద్దాం. ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన వార్షిక ప్రీమియం కేవలం 12 రూపాయలకే 2 లక్షల రూపాయల ప్రమాద భీమా లభిస్తుంది మొత్తం పొదుపు 18 నుంచి 70 సంవత్సరాల వయసు గల బ్యాంకు ఖాతాదారులకు దుర్గటన స్థాయి, వైకల్యం కూడా భీమాలో ఉంటాయి. భీమా వ్యవధి, వార్షికం: 1 జూన్ -31 మే ప్రీమియం సొమ్ము ఖాతాదారుల పొదుపు ఖాతా నుంచి బ్యాంకు ద్వారా ‘ఆటో డెబిట్ ‘సదుపాయం ద్వారా, ఏ వ్యక్తి అయిన కేవలం ఒక పొదుపు ఖాతా ద్వారా మాత్రమే ఈ పథకాన్ని పొందగలరు . వెంటనే మీ బ్యాంకు ఖాతా లేదా బ్యాంకు మిత్రుని సంప్రదించండి మరియు నెలకొల్పబడిన శిభిరాలకు వెళ్లి ఫారం నింపి ఈ పథకం వల్ల కలిగే లాభం పొందండి. అసోసియేట్ బ్యాంక్‌లు మరియు భీమా కంపినీల తరపున అధిక సమాచారం కోసం, దయచేసి టోల్ ఫ్రీ నం. 1800 110 001/180 1111కి కాల్ చేయండి బ్యాంకు ఖాతా కలిగి ఉండి, 18-50 ఏళ్ల మధ్య వయసున్నవారు ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకానికి అర్హులు. ఈ పథకంలో చేరాలనుకునే వారు 50 ఏళ్లు నిండక ముందే చేరాల్సి ఉంది. ప్రీమియం పూర్తైన తర్వాత కూడా 55 ఏళ్ల పాటు ఇందులో కొనసాగవచ్చు. 18-50 ఏళ్లలోపు ఉన్న వారు 12 వాయిదాల్లో రూ. 330 ప్రీమియం చెల్లించాలి. చందాదారులు ఖాతా నుండి ప్రీమియం చెల్లింపు నేరుగా బ్యాంకు ద్వారా తీసుకోబడుతుంది. ఏదైనా ప్రమాదం వల్ల చనిపోతే, ఈ పథకం కింద రూ. 2 లక్షల బీమా సదుపాయం కల్పిస్తున్నారు. ఈ పథకం కింద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ప్రతి ఏడాది దానికదే పునరుద్ధరణ, రెండోది ఎంపిక వ్యక్తిగతం. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన కింద ఖాతాలు తెరిచిన వారికే ఈ పథకం వర్తిస్తుంది. పెన్షన్ ఫండ్‌లో పొదుపు చేసే వారికి రూ. 50 వేల వరకు రాయితీ. ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం యొక్క అప్లికేషను ఫార్మ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. ప్రధానమంత్రి సురక్ష బీమా పథకం ఏదైనా ప్రమాదంలో చనిపోయినా, శాశ్వత అంగవైకల్యం పొందినా సురక్ష బీమా పథకం కింద నామినీకి రూ. 2లక్షలు చెల్లిస్తారు. ఏడాదికి రూ.12 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 18 ఏండ్లనుంచి 70ఏండ్ల మధ్య వయస్కులకు ఈ పథకం వర్తిస్తుంది. ఏదైనా బ్యాంకు ఖాతానుంచి ఈ బీమా సౌకర్యం పొందవచ్చు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకం యొక్క అప్లికేషను ఫార్మ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. జన-సురక్ష-టోల్ ఫ్రీ నంబర్స్ క్రమ సంక్య.నం. రాష్ట్రం పేరు SLBC బ్యాంకు కన్వీనర్ పేరు టోల్ ఫ్రీ నం. 1 ఆంధ్రప్రదేశ్ ఆంధ్రాబ్యాంక్ 1800-425-8525 2 అండమాన్ & నికోబార్ ఐలాండ్ స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా 1800-345-4545 3 అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా 1800-345-3616 4 అస్సాం స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా 1800-345-3756 5 బీహార్ స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా 1800-345-6195 6 చండీఘర్ పంజాబ్ నేషనల్ బ్యాంకు 1800-180-1111 7 ఛత్తీస్గర్ స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా 1800-233-4358 8 దాద్రా & నగర్ హవెల్లి దేనా బ్యాంకు 1800-225-885 9 డామన్ & డయు దేనా బ్యాంకు 1800-225-885 10 ఢిల్లీ ఓరియంటల్ బ్యాంకు అఫ్ కామర్స్ 1800-1800-124 11 గోవా స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా 1800-2333-202 12 గుజరాత్ దేనా బ్యాంకు 1800-225-885 13 హర్యానా పంజాబ్ నేషనల్ బ్యాంకు 1800-180-1111 14 హిమాచల్ ప్రదేశ్ UCO బ్యాంకు 1800-180-8053 15 ఝార్ఖండ్ బ్యాంకు అఫ్ ఇండియా 1800-345-6576 16 కర్ణాటక సిండికేట్ -SLBC 1800-4259-7777 17 కేరళ కెనర బ్యాంకు 1800-425-11222 18 లక్షద్వీప్ సిండికేట్ బ్యాంకు 1800-4259-7777 19 మధ్య ప్రదేశ్ సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా 1800-233-4035 20 మహారాష్ట్ర బ్యాంకు అఫ్ మహారాష్ట్ర 1800-102-2636 21 మణిపూర్ స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా 1800-345-3858 22 మేఘాలయ స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా 1800-345-3658 23 మిజోరాం స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా 1800-345-3660 24 నాగాలాండ్ స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా 1800-345-3708 25 ఒడిష UCO బ్యాంకు 1800-345-6551 26 పుడుచేర్రి ఇండియన్ బ్యాంకు 1800-4250-0000 27 పంజాబ్ పంజాబ్ నేషనల్ బ్యాంకు 1800-180-1111 28 రాజస్తాన్ బ్యాంకు అఫ్ బరోడా 1800-180-6546 29 సిక్కిం స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా 1800-345-3256 30 తెలంగాణా స్టేట్ బ్యాంకు అఫ్ హైదరాబాద్ 1800-425-8933 31 తమిళ్ నాడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 1800-425-4415 32 ఉత్తర ప్రదేశ్ బ్యాంకు అఫ్ బరోడా 1800-102-4455 1800-223-344 33 ఉత్తరాఖండ్ స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా 1800180-4167 34 వెస్ట్ బెంగాల్ అండ్ త్రిపుర యునైటెడ్ బ్యాంకు అఫ్ ఇండియా 1800-345-3343 ఆధారము : గుడ్ రిటర్న్స్ మరియు నమస్తే తెలంగాణా