కులాంతర వివాహం చేసుకున్న నవదంపతులకు ఆర్థిక సహాయం అందించే డాక్టర్ అంబేద్కర్ స్కీమ్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్ త్రూ ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ను ప్రకటించారు. అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా కేంద్ర సామాజిక, న్యాయ, సాధికార శాఖ ఏటా 500 జంటలు (తెలంగాణ, ఏపీల్లో 34 )లకు 2.5 లక్షలు అందజేస్తుంది. ఇందులో 50 శాతం ఐదేండ్ల కాలానికి ఎఫ్డీ చేస్తారు. నవ దంపతుల్లో ఒకరు ఎస్సీ, ఎస్టీ అయి ఉండి ఇరువురి వార్షిక ఆదాయం రూ.5 లక్షలు దాటనివారు ఈ పథకానికి అర్హులు. అర్హత ఈ పథకం క్రింద జీవిత భాగస్వాములు ఒకరు షెడ్యూల్డ్ కులం చెందిన మరియు ఇతరులు నాన్-షెడ్యూల్డ్ కులానికి చెందినవారు ఐ ఉండాలి హిందూ మతం వివాహ చట్టం 1955 క్రింద నమోదు అయ్యే ఉండాలి వివాహం ఐన ఒక సంవత్సరం లోపల సమర్పించిన ప్రతిపాదన నే చెల్లుబాటులో పరిగణిస్తుంది కొత్తగా పెళ్లయిన జంట మొత్తం వార్షిక ఆదాయం రూ . 5 లక్షలకంటే ఎక్కువ ఉండకూడదు ద్వితీయ లేదా తదుపరి వివాహానికి ఎలాంటి ప్రోత్సాహకం అందుబాటులో లేదు మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయంది ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు