తమ అన్ని ప్రాథమిక అవసరాల కొరకు ఖైదీలు పూర్తిగా జైలు సిబ్బందిపై అధారపడడమే కాక, పూర్తిగా వారి అదుపులో ఉండడంవలన మానవ హక్కుల ఉల్లంఘనకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటికి తోడు నగరానికి దూరంగా జైళ్ళను నిర్మించే పద్ధతి వల్ల ప్రజల భాగస్వామ్యానికి, పరిశీలనకు అవకాశం లేకుండా పోతుంది. ఇది రహస్య వాతావరణాన్ని పెంచుతుంది. లోపలి పరిస్థితులు బహిరంగం కాకపోవడంతో అవినీతి, హింస పుట్టుకొస్తాయి. జైలు పరిస్థితులు మెరుగుపడాలంటే, ఖైదీల హక్కులు రక్షింపబడాలంటే, జైళ్ళ పరిస్థితు లను, సిబ్బంది ప్రవర్తనను నిరంతరం సమీక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయడం ముఖ్యం. జైలు సందర్శనా వ్యవస్థ అలాంటి వ్యవస్థలలో ఒకటి. దీని క్రింద ప్రభుత్వమే సమాజంలోని కొందర్ని జైలు సందర్శనకు, అక్కడి మానవ హక్కుల పరిస్థితి సమీక్షకు నియమిస్తుంది. ఆ విధంగా సంప్రదాయక జైళ్ళ సందర్శనా వ్యవస్థ జైళ్ళ పరిస్థితిని సమీక్షించడానికి, జైళ్ళ పరిపాలనను అదుపు చేయడానికి పనికి వస్తుంది.జైళ్ళవ్యవస్థలోని సమస్యలను పరిశీలించ కుండాజైలు అధికారులపై నిందవేయడం వల్ల జైళ్ళ పరిస్థితులను మెరుగు పరచడమూ జరగదు, ఖైదీల హక్కుల ఉల్లంఘనా తగ్గదు. మనం పట్టించుకోవాల్సిన కొన్ని పెద్ద సమస్య లు ఖైదీల పట్ట సమాజానికి8 ఉండే వ్యతిరేకాభి ప్రాయం. జైళ్ల స్థాయికి మించిన ఖైదీల సంఖ్య ఆలస్య మౌతున్న విచారణల సమస్య విషయంలో పోలీసులు, కోర్టుల వంటి నేర న్యాయ వ్యవస్థ విభాగాల బాధ్యత. జైళ్ళ సిబ్బందికి ఉన్న నిరుత్సాహ పూరిత పని పరిస్థితులు. సదుద్దేశం ఉన్నప్పటికీ జరిగే తప్పులు సంస్కరణలు తేవాలనే రాజకేయ సంకల్పం పూర్తిగా లోపించడం. జైళ్ళ సమాజం నుండి వేరుపడిలేవు. నేర న్యాయ వ్యవస్థ లోని ఒక ముఖ్యమైన అంగంగాజైళ్ళు సమాజం అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తాయి. జైళ్ళు నిర్వహించే విధులను అన్ని ప్రభుత్వ శాఖలూ, వాటితో పాటు ఎవరి ప్రయోజనార్థమైతే వాటిని సృష్టించారో ఆ జైలు బయటి సమాజమూ సమన్వయంతో కలిసిపని చేసినప్పుడు మాత్రమే జైళ్ళ వ్యవస్థ సక్రమంగా పని చేయగలదు. ఆధారము: కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్