గతఅధ్యాయంలో పేర్కొన్న హక్కుల రూపంలో ఉన్న ప్రత్యేక రక్షణలే కాకుండా ఖైదీలకు కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. జైలులో క్రమశిక్షణ ఉండాలంటే ఖైదీలు కొన్ని విధులను, నిషేధాలను పాటించాలి. జైలు అధికారులు ఇచ్చిన్ చట్టబద్ధమైన ఆదేశాలను, సూచనలను పాటించడం, జైలు నిబంధనలన్నీ పాటించడం, ఆ నిబంధనలు విధించిన బాధ్యతలను నిర్వర్తించడం, నిర్ధేశించిన పరిశుభ్రతా, ఆరోగ్య ప్రమాణాలను పాటించడం, ప్రతి ఖైదీ, జైలు ఉద్యోగి, మరియు ఇతర సిబ్బంది జీవించే హక్కును, గౌరవాన్ని ఆమోదించడం, ఇతర వ్యక్తుల మతపరమైన భావాలను, నమ్మకాలను, విశ్వాసాలను గాయపరచకుండా ఉండడం, తప్పుడు ఫిర్యాదులు, అతిశయోక్తులతో కూడిన ఫిర్యాదులు చేయకుండా ఉండడం. ప్రభుత్వ ఆస్తిని జాగ్రత్తగా వాడుకోవడం, అజాగ్రత్తగా గాని ఉద్దేశపూర్వకంగా గాని వాటిని నాశనం చేయకుండా ఉండడం. జైలు అధికారులు తమ విధిని నిర్వర్తించడానికి ఎల్లప్పుడూ సహకరించడం, క్రమశిక్షణను పాటించడం’. సంస్కరణ వాతావరణాన్ని పెంపొందించడం, సహకరించడం. అనవసరంగా అటు ఇటు తిరగకుండా, ఇతర వర్గాల ఖైదీలతో కలవకుండా ఉండడం ఎటువంటి కుట్రలలో పాల్గొనకుండా ఉండటం. జైలు అధికారులు తమ మీద లేక జైలు అధికారుల మీద దాడి చేయకుండా ఉండడం. జైలు గార్డులతో అనవసర సంబంధాలు లేకుండటం. నిషేధిత వస్తువుల సరఫరా, వినియోగంలో పాల్గొనక పోవడంమంచి ప్రవర్తన కలిగి ఉండడం, కష్టపడి, క్రమశిక్షణతో పని చేయడం ద్వారా రెమిషన్ పొందడానికి కృషి చేయడం ఆధారము: కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్