జూలై 28ని ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవంగా జరుపుకుంటాము. ఇది పర్యావరణాన్ని సంరక్షించాల్సిన తక్షణ ఆవశ్యకత గూర్చి అవగాహన కల్పించే సందర్భం. సహజవనరులు, మొక్కలు, జంతువులు, నేల, నీరు, గాలి ప్రకృతిలో నిలకడలేని బంధం మానవాళిని ఎన్నో పర్యావరణ సమస్యలను ఎదుర్కొనేలా చేస్తున్నది. కాలుష్యం, అటవీ నిర్మూలన, నేల క్షీణత, వృక్ష జంతు జాతులు అంతరించిపోవడం - ఇలా చాలా సవాళ్లు మన ముందున్నాయి. అభివృద్ధి పేర ప్రతీరోజు 80 వేల ఎకరాల అడవి మాయమై పోతున్నది. వాస్తవానికి పెరుగుతున్న భూతాపాన్ని నియంత్రించగల శక్తి అడవులకే ఉంటుంది. వాతావరణ విపత్తుల నుంచి మనిషిని కాపాడగల ముఖ్యమైన రక్షక వ్యవస్థ అడవే. అభివృద్ధి పథంలో గొప్ప ముందడుగు పేర చైనాలో 60 ఏండ్ల క్రితం ప్టేగుకు కారణమైన ఎలుకల్ని, మలేరియా వ్యాధి కారకమైన దోమల్ని మరెన్ఫో రోగాలను వ్యాప్తి చేసే ఈగల్ని ధాన్యాన్ని తినేస్తున్నాయన్న నెపంతో పిచ్చుకల్ని, “ఫోర్పెన్ట్స్ స్మాష్ స్వారో” అనే నినాదంతో కనిపించినవి కన్పించినట్టు చంపేశారు. దీనివల్ల ఆదేశ పర్యావరణ సమతుల్యం దెబ్బతిన్నది. పిచ్చుకలు లేకపోవడం వల్ల మిడుతలు, క్రిమికీటకాల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. ఇవి పంటల్ని నాశనం చేయడం వల్ల మహా కరువు గ్రేట్ ఫెమైన్) వచ్చి నాలుగున్నర కోట్ల ఆకలిచావులు సంభవించాయి. ఈ పరిస్థితులు చక్కదిద్దుకునేందుకు చైనావాసులు రష్యా నుంచి రెండున్నర లక్షల పిచ్చుకలను దిగుమతి చేసుకొని జాగ్రత్తగా పెంచారు. కరువు పరిస్థితులను చక్కదిద్దేందుకు కొన్ని దశాబ్దాలు (శ్రమించాల్సి వచ్చింది. జీవ వైవిధ్యానికి, పర్యావరణానికి, మానవ మనుగడకు ఉన్న సంబంధానికి చక్కటి ఉదాహరణ ఈ ఉ దంతం. ఒకప్పటి అటవీ భూభాగంలో మూడో వంతు అడవి మాయం అయ్యిందని, పర్యావరణ పనితీరు సూచీలో ప్రపంచంలోని 180 దేశాల్లో భారత్ 169 వ స్థానంలో ఉందని పర్యావరణ వేత్తలంటున్నారు. అందుకే “ఆజాద్‌కి అమృత్ మహోత్సవ్” పేర 75 ఏండ్ల స్వతంత్ర భారత ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ అడవుల విస్తీర్ణం పెంచుకోవడం మన తక్షణ కర్తవ్యం. 2019 లో 24.56 శాతంగా ఉన్న అటవీ విస్తీర్ణం ఇపుడు 24.62 అయిందని ఫారెస్ట్ సర్వే 2021 చెబుతోంది. అంటే 0.06 శాతం పెరిగిందన్నమాట. 8,287.268 స్క్వేర్ కి.మీ.ల భౌగోళిక విస్తీర్ణంతో ప్రపంచంలోనే ఏడవ పెద్ద దేశంగా ఉన్న భారత్‌కు ఈ మొక్కుబడిలాంటి పెరుగుదల ఏ మాత్రం సమంజసం కాదు. జాతీయ అటవీ విధానం 1952 నిర్దేశించిన లక్ష్యం, దేశంలో 38 శాతం అడవులుండాలని కానీ 70 ఏండ్లు పూర్తయినా ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాము. గత కొన్నేండ్లుగా వివిధ రాష్ర్టాలలో 50 వేల ఎకరాల అటవీభూమిని పరిశ్రమలు, సెజ్‌లు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, ఆనకట్టలు, రోడ్లు, రైల్వేలైన్లు లాంటి ఇతర అభివృద్ధి పనులకు మళ్ళించారు. అంటే 50 వేల ఎకరాలలోని చెట్లన్నింటిని నరికేసి, అక్కడ జంతువులను తరిమేశారన్న మాట. ఇలా అయితే అటవీ విస్తీర్ణం ఎలా పెరుగుతుంది? నివేదికలో పెరిగిందని చెబుతున్న 0.06 శాతం నిజంగా అడవేనా? వాస్తవానికి రాష్ర్టాలు చేపట్టే హరితహారంలాంటి మొక్కలు నాటే కార్యక్రమం వల్ల ఈ పచ్చదనం పెరిగింది. ఈ పచ్చదనంతో అడవుల వల్లే కలిగే ప్రయోజనాలు ఒనగూరవనేది పర్యావరణవేత్తల వాదన. వాస్తవానికి నేల కనబడకుండా 70 శాతం పైగా దట్టంగా అల్లుకున్న వృక్షఛత్రం ఉంటేనే దాన్ని దట్టమైన అడవి అని, 40-70 శాతం ఉంటే మధ్యస్థ దట్టమైన అడవిగా, 10 నుంచి 40 శాతం మధ్య ఉంటే బహిరంగ అడవి అని అంటారు. ఉపగ్రహ ఛాయా చిత్రాల ఆధారంగా స్వే చేసి అడవుల విస్తీర్ణాన్ని అంచనావేస్తున్నారు. కానీ ఇలాంటి సర్వేల్లో కొబ్బరి, కాఫీ, రబ్బరు లాంటివి పచ్చగా ఉ౦డడం వల్ల అడవులుగా నమోదవుతున్నాయి. ఇది శాస్త్రీయం కాదు. రెండున్నర ఎకరాల భూమిలో పదిశాతానికి మించి పచ్చని చెట్లు ఛత్రఛాయ ఉంటే అది అడవి అంటున్నారు. ఇలా నగరాల్లో, పట్టణాల్లో ఉండే పెద్ద పార్కులు అడవులుగా గుర్తించబడుతున్నాయి. ఇది సరి కాదు. అసలు అడవుల లక్ష్యం ఏమిటి? చెట్లు వరదలను అడ్డుకొని నేలకోతకు గురికాకుండా చూస్తాయి. అలా భూసారం తగ్గకుండా రైతులకు పంట దిగుబడి పెంచుకునేందుకు సహకరిస్తాయి. అడవుల్లో ఉండే దట్టమైన చెట్లు, రాలిన ఆకులూ, ఎండిన కలప, తడినేల లాంటి వన్నీ కలిసి వాతావరణంలోని కరన వాయువుల్ని పీల్చుకుని నిల్వచేసుకుంటాయి. దీనినే "కార్బన్ స్టాక్ అంటారు. కార్బన్ స్టాక్ ఎంత ఎక్కువ ఉంటే అంత మేర కిరణజన్య సంయోగక్రియ ద్వారా వాతావరణంలోని ప్రధాన గ్రీనెహెజ్ వాయువు అయిన కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది. అలా కార్బన్ స్ట్రోక్ ఎంత ఉందన్న దాన్ని బట్టి వాతావరణ మార్చులను అంచనా వేస్తాం. ఇలా పరోక్షంగా అడవులు ఉష్ణాన్ని గ్రహించి వాతావరణాన్ని చల్లబరుస్తాయి. మనం వాడే జెషధాలకు ఇరవై ఐదు శాతం వనరులను అడవుల నుండే తీసుకుంటాం. ఎన్నో రకాల జంతువులు, పక్షులు, పాములు అడవుల్లో నివాసముండడం వల్ల ఆహారపు గొలుసు నిరాటంకంగా కొనసాగుతోంది. కోట్లాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అడవులు ఉపాధిని కల్పిస్తున్నాయి. భారత్‌లో 2021 సంవత్సరంలో మూడు లక్షల పన్నెండు వేల మైళ్ల మేరకు సహజ అడవి మాయమయ్యింది. దీని వల్ల 64.6 మెట్రిక్‌టన్నుల కార్బన్ స్టాక్ నష్టం జరిగిందని పర్యావరణ నిపుణులంటున్నారు. వాస్తవానికి కార్చిచ్చుల వల్ల సహజంగానే అడవులకు కొంత నష్టం జరుగుతుంది. దాన్ని కాలక్రమేణా అడవులు భర్తీ చేసుకుంటాయి. కానీ విచక్షణా రహితంగా గనుల కోసం, ప్రాజెక్టుల కోసం అటవీ భూములను వినియోగిస్తే ఆ నష్టాన్ని పూడ్బ్చలేము. తెలంగాణాలో 2,250,000 మైళ్లు, ఆంధ్రప్రదేశ్‌లో 8,250,000 మైళ్ల మేరకు అటవీ వైశాల్యం తగ్గింది. ప్రపంచ భూభాగంలో మూడో వంతు వాటా అడవులదే. 80 శాతం జీవ వైవిధ్యం మన అడవుల్లోనే ఉ౦ది. అందుకే ఏ దేశానికి ఆ దేశం తన భూభాగంలో మూడో వంతు అడవిని పెంచాలి. అప్పుడే పర్యావరణ సమతుల్యం సాధ్యమవుతుంది. అటవీ విస్తీర్ణం తగ్గితే విమవుతుంది? అటవీ విస్తీర్ణం తగ్గితే వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువై భూతాపం పెరుగుతుంది. పెరిగిన భూతాపం వల్ల వాతావరణంలో అనూవ్యా మార్పులొస్తాయి. ముఖ్యంగా రుతుపవనాలు గతి తప్పుతాయి. తరచు వరదలు, తుఫాన్ల బారినపడుతాము. వన్యమృగాలు జనావాసాల్లోకొచ్చి పంటల నష్టం, ఆస్థి నష్టం చేస్తాయి. అడవుల నరికివేత వల్ల గత 50 సంవత్సరాల్లో ప్రపంచ వ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 58 శాతం తగ్గిందని నిపుణుల అంచనా వేస్తున్నారు. అడవులు ఎంత దట్టంగా ఉంటే మనిషి మనుగడ అంత స్థిరంగా ఉంటుంది. కానీ మనదేశంలో దట్టమైన అడవులు కేవలం మూడు శాతమే. అటవీ భూముల నమోదు కూడా శాస్త్రీయంగా లేదంటున్నారు పర్యావరణవేత్తలు, అడవుల విస్తీర్ణం పెంపుదలకు ఏమి చేయాలి? భూమ్మీద ఎంత జనాభా ఉందో అంతమేర చెట్లు పెంచాలని ఐక్యరాజ్యసమితి సూచిస్తోంది. అభయారాణ్యాల సంఖ్యను పెంచడం వల్ల పర్యాటకంగా అభి వృద్ధి చెందుతుంది. అలా దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. సామాజిక వనాల అభివృద్ధికి కృషి చేయాలి. ఇందుకోసం ప్రభుత్వాలు, పాలకులు, పౌర సమాజం అడవులను పెంచడమనేది అందరి సమిష్టి భాద్యతగా కలిసికట్టుగా ప్రయత్నించాలి. ఆధారం : Vigyan Prasar