ఎలక్ట్రానిక్‌ నిధుల బదిలీ (ఇఎఫ్‌టి) అంటే ఏమిటి?

మరొక వ్యక్తికి లేదా కంపెనీకి చెల్లింపు చేయాలనుకొన్న వ్యక్తి తన బ్యాంకుకు వెళ్ళి నగదు చెల్లింపు చేసే లేదా తన ఖాతానుంచి నేరుగా స్వీకర్త / ప్రయోజనం ఎందే వ్యక్తి బ్యాంకు ఖాతాకు నిధులను బదిలీ చేయడానికి సూచనలు / అధికారం ఇచ్చే వ్యవస్థే ఎలక్ట్రానిక్‌ నిధుల బదిలీ (ఇఎఫ్‌టి). ప్రయోజనం ఎందే వారి ఖాతాకు సరిగ్గా, వేగంగా నిధులు చేరడానికి వీలుగా అలాంటి బదిలీల కోసం కోరుతున్నప్పుడు స్వీకర్త పేరు, బ్యాంకు ఖాతాసంఖ్య, ఖాతా రకం (సేవింగ్స్‌ లేదా కరెంటు ఖాతా), బ్యాంకు పేరు, నగరం, శాఖపేరు వంటి పూర్తి వివరాలను అందజేయాలి. ఇ.ఎఫ్‌.టి.కి ఆర్‌.బి.ఐ సర్వీస్‌ ఎవైడర్‌గా ఉంది.

భారతదేశంలో ఎక్కడైనా నిధుల బదిలీకి ఇ.ఎఫ్‌.టి.ని ఉపయోగించుకోవచ్చా?

ప్రస్తుతానికి దేశం మొత్తం మీద దాదాపు 15 ప్రధాన నగరాల్లోనూ పట్టణాల్లోనూ బ్యాంకు శాఖల మధ్య నిధుల బదిలీకి ఇ.ఎఫ్‌.టి. సదుపాయం అందుబాటులో ఉంది. ప్రత్యేక ఇ.ఎఫ్‌.టి. అనే మరో ప్రత్యేక పథకం కింద 200పైగా నగరాల్లో మరిన్ని ఎంపికచేసిన శాఖలను (బాంకుల కంప్యూటర్‌ నెట్‌వర్క్‌లో ఉన్న వాటిని) ఎలక్ట్రానిక్‌ పరంగా నిధుల బదిలీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఆయా బ్యాంకుల నుంచి ఆర్‌.బి.ఐ వెబ్‌సైట్‌ నుంచి కూడా నగరాల, శాఖల వివరాలు తెలుసుకోవచ్చు.

ఇ.ఎఫ్‌.టి. ద్వారా నిధుల బదిలీకి ఎంత సమయం పడుతుంది?

సాధారణంగా నిధుల బదిలీ అదే రోజు జరిగిపోతుంది లేదా అలాంటి నిధుల బదిలీకి అభ్యర్థించిన సమయాన్ని బట్టి మహా అయితే తరవాతవచ్చే పనిరోజు జరిగిపోతుంది. నిధుల బదిలీకి అభ్యర్థించే సమయంలోనే ఖాతాదారు, తన బ్యాంకునుంచి ఈ అంశాన్ని స్థిరపరచుకోవాలి.

ఇ.ఎఫ్‌.టి. ద్వారా నిధులు బదిలీ చేయడానికి ఏవయినా ఛార్జీలు ఉంటాయా?

డిమాండ్‌ డ్రాప్ట్‌లు, పే ఆర్డర్‌లు వంటి ఇతర సేవలలో మాదిరిగానే బ్యాంకులు, సాధారణంగా ఇ.ఎఫ్‌.టి.కి కొన్ని ప్రాసెసింగ్‌ ఛార్జీలు విధిస్తాయి. వాస్తవమైన ఛార్జీలను బదిలీ చేసే మొత్తం మీద, బ్యాంకుకు ఖాతాదారు సంబంధం మీద ఆధారపడి ఉంటాయి. అయితే ఆర్‌.బి.ఐ. నిర్వహిస్తున్న క్లియరింగ్‌ హౌస్‌లలో సదరు నిధుల బదిలీ లావాదేవీలు ప్రాసెసింగ్‌ కోసం బ్యాంకుల నుంచి వసూలు చేస్తున్న ఇ.ఎఫ్‌.టి. ఛార్జీలన్నింటినీ ప్రస్తుతం ఆర్‌.బి.ఐ. రద్దు చేసింది. దీనివల్ల బ్యాంకులకు కూడా ప్రాసెసింగ్‌ వ్యయం తప్పకుండా తగ్గిపోతుంది.

ఆధారము: భారతీయ రిజర్వు బ్యాంకు