సొమ్మును చెల్లింపు మాధ్యమంగా పరిగణించినప్పుడు ఇందులో నాణలు, కాగితం డబ్బు తీసుకొనే బ్యాంకు డిపాజిట్లు ఉండవచ్చు. ఈనాడు చెల్లింపు వ్యవస్థలో క్రెడిట్ కార్డులు, ఎల క్టాృనిక్ నగదు ప్రధాన అంశాలుగా ఉంటున్నాయి. సాధారణ పౌరుడికి మటుకు సమ్ము అంటే కరెన్సీ, నాణలు. మనదేశంలో చిల్లర లావాదేవీలన్నీ కరెన్సీ, నాణల చుట్టూనే తిరుగుతూ చెల్లింపు వ్యవస్థగా మారుతున్నాయి. రోజువారీన తాను నిర్వహించే కరెన్సీ, నాణల గురించి సామాన్య పౌరుడికి తెలిసింది తక్కువే. కొన్ని మౌలికాంశాలు భారత కరెన్సీని ఏమని పిలుస్తారు? భారత కరెన్సీని భారతీయ రూపాయి (ఐ.ఎన్.ఆర్.), నాణలను పైసలుగా పిలుస్తారు. ఒకరూపాయకు వందపైసలు ఉంటాయి. మనదేశంలో బ్యాంకు నోట్ల వర్తమాన సంజ్ఞ (డినామినేషన్) లేమిటి? ప్రస్తుతం మన దేశంలో 5, 10, 20, 50, 100, 500, 1000 రూపాయల నోట్లు (అనే సంజ్ఞలతో) జారీ అవుతున్నాయి. వీటిని భారతీయ రిజర్వు బ్యాంకు (రిజర్వ్ బ్యాంకు) జారీ చేస్తుంది అందువలన వీటిని బ్యాంకు నోట్లుగా పిలుస్తారు. రూ. 1 మరియు 2 లను నాణలుగా మార్చివేయడం జరిగింది. కాబట్టి వాటిని నోట్లుగా విడుదల చేయడం లేదు. అయినా అంతకుముందు జారీ అయిన నోట్లు చెలామణిలో ఉన్నాయి. రూ. 5 నోట్లను కూడా ఇప్పుడు అచ్చు వేయడం లేదు. డిమాండ్, సరఫరా దృష్ట్యా నోటు రూపాన్ని కూడా మళ్ళీ విడుదల చేసేందుకు రిజర్వ్ బ్యాంకు నిర్ణయించింది. మనదేశంలో ప్రస్తుతం లభిస్తున్న నాణల సంజ్ఞలేమిటి? పైసల్లో 10, 20, 25, 50 రూపాయి, రెండు, అయిదు రూపాయలు మనదేశంలో నాణలుగా లభిస్తున్నాయి. 50 పైసలలోపు నాణలను చిన్న నాణలు, ఒక రూపాయి అంతకు మించిన వాటిని రూపాయి నాణలు అని అంటారు. బ్యాంకు నోట్లు, నాణలు జారీ అయినవి కేవలం ఈ సంజ్ఞలలోనే ఉండాలా? అవసరం లేదు. రిజార్వు బ్యాంకు వెయ్యి రూపాయల నోట్లను అలాగే 5000, 10,000 రూపాయల నోట్లను లేదా ఇతర సంజ్ఞలలో కేంద్ర ప్రభుత్వ నిర్దారణ మేరకు నాణలుగా జారీ చేయవచ్చు. రిజర్వు బ్యాంకు చట్టం 1934 లోని ప్రస్తుత సదుపాయాల మేరకు పదివేల రూపాయలను మించి నోట్లను జారీ చేసే అవకాశం లేదు అలాగే నాణలను జారీచేయడం వెయ్యి రూపాయల సంజ్ఞకు మాత్రం పరిమితం. కరెన్సీ యాజమాన్యం కరెన్సీ యాజమాన్యంలో రిజర్వు బ్యాంకు పాత్ర ఏమిటి? భారతదేశంలో కరెన్సీ నిర్వహణను రిజర్వు బ్యాంకు చేస్తుంది. రిజర్వ్ బ్యాంకు సలహాతో ప్రభుత్వం వివిధ సంజ్ఞలను నిర్ణయిస్తుంది. భద్రతాంశాలతో సహా బ్యాంకు నోట్ల నమూనా రూపకల్పనలో రిజర్వు బ్యాంకు ప్రభుత్వంతో సమన్వయం చేస్తుంది. సంజ్ఞల వారీగా నోట్ల పరిమాణం ఎంత అవసరం ఉంటుందో రిజర్వు బ్యాంకు అంచనా వేస్తుంది. వాటికి అనుగుణంగా భారత ప్రభుత్వం ద్వారా వివిధ ముద్రణాలయాలకు ఇండెంట్లను సమకూరుస్తుంది. ఈ ముద్రణాలయాలు సరఫరా చేసిన నోట్లను జారీ చేస్తూ, నిల్వలను ఉంచుకొంటుంది. బ్యాంకుల నుంచి మరియు కరెన్సీ చెస్టుల నుంచి వచ్చిన నోట్లను పరీక్షింపచేస్తుంది. చెలామణికి తగి ఉన్న నోట్లను తిరిగి జారీ చేస్తుంది. మిగిలిన వాటిని (నలిగిన, చినిగిన, ఇతరంగా పనికిరాని వాటిని) నశింప చేసి, చెలామణిలో నాణ్యతను స్థిరంగా ఉంచుతుంది. రిజర్వు బ్యాంకు చట్టం 1934 ప్రాతిపదికగా కరెన్సీ యాజమాన్య పాత్రను రిజర్వ బ్యాంకు నిర్వహిస్తుంది. భారత ప్రభుత్వం పాత్ర ఏమిటి? ఎప్పటికప్పుడు సవరించుకొంటూ వచ్చిన నాణల నిర్మాణ చట్టం 1906 ప్రాతిపదికన భారత ప్రభుత్వం తన నాణల నిర్మాణ బాధ్యతను నెరవేరుస్తూంటుంది. వివిధ సంజ్ఞలలో నాణల రూపకల్పన, తయారి భారత ప్రభుత్వం నిర్వహిస్తుంటుంది. బ్యాంకు నోట్ల విలువ, వాటి ముద్రణను ఎవరు, ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు? బ్యాంకు నోట్ల విలువ, ముద్రణ పరిమాణాన్ని రిజర్వు బ్యాంకు నిర్ణయిస్తుంది. నిల్వల అవసరాలు, నలిగి/చిరిగిపోయిన నోట్ల భర్తీ, సాలుసరి బ్యాంకు నోట్ల చెలామణీ అవసరాలు మొ|| వాటి మీద విస్తుృతంగా ఆధారపడి బ్యాంకు నోట్ల ముద్రణ పరిమాణం నిర్దారితమవుతుంది. నాణల పరిమాణాన్ని తయారికై ఎవరు నిర్ణయిస్తారు? భారత ప్రభుత్వం నాణల పరిమాణం ఎంత అవసరమో నిర్ణయిస్తుంది. బ్యాంకు నోట్ల డిమాండును రిజర్వు బ్యాంకు ఎలా అంచనా వేస్తుంది? ఆర్థిక విధాన పెరుగుదల, డిమాండ్, నిల్వల అవసరాలు, మొ|| గణాంక నమూనాల ద్వారా సేకరించి, వాటి ప్రాతిపదికన బ్యాంకు నోట్ల డిమాండును రిజర్వ్ బ్యాంకు అంచనా వేస్తుంది. ప్రజల దగ్గరకు కరెన్సీని రిజర్వ్ బ్యాంకు ఏ విధంగా చేరుస్తుంది? రిజర్వ్ బ్యాంకు కరెన్సీ కార్యకలాపాలను తన కార్యాలయాల ద్వారా నిర్వహిస్తుంది. ఈ కార్యాలయాలు అహ్మదాబాదు, బెంగుళూరు, భూపాల్, భువనేశ్వర్, బేలాపూర్ (నవీ ముంబయి), కలకత్తా, చండీగడ్, చెన్నై, గువాహతి, హైదరాబాదు, కొత్త ఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం లలో ఉన్నాయి. ఈ కార్యాలయాలకు ముద్రణాలయాల నుంచి కొత్త నోట్లు అందుతాయి. అట్లాగే కలకత్తా, హైదరాబాదు, ముంబయి, కొత్త ఢిల్లీ రిజర్వ్ బ్యాంకు కార్యాలయాలకు టంకశాలల నుంచి నాణలు అందుతాయి. ఈ కార్యాలయాలు వీటిని ఇతర రిజర్వ్ బ్యాంకు కార్యాలయాలకు పంపిణీ చేస్తాయి. కరెన్సీ చెస్టులలో నోట్లను, రూపాయి నాణలను నిల్వ చేస్తారు. చిన్న నాణలను చిన్న నాణల డిపోలలో ఉంచుతారు. బ్యాంకు శాఖలకు కరెన్సీ చెస్టుల ద్వారా బ్యాంకు నోట్లు, నాణలు అందుతాయి. చిన్న నాణలను చిన్న నాణల డిపోలు అందిస్తాయి. అక్కడి నుంచి ప్రజల్లో పంపిణీ అవుతుంటాయి. కరన్సీ చెస్ట్ అంటే ఏమిటి? నోట్ల, రూపాయి నాణల పంపిణీ వసతి కోసం రిజర్వ్ బ్యాంకు ఎంపిక చేసిన బ్యాంకు శాఖలను అధికృతం చేసింది. ఇవి నిల్వ గోదామలుగా పని చేస్తాయి. రిజర్వ్ బ్యాంకు తరఫున బ్యాంకు నోట్లను, నాణలను ఉంచుకొంటాయి. వీటినే కరెన్సీ చెస్ట్‌లు అని అంటారు. ప్రస్తుతం 4368 కరెన్సీ చెస్ట్లున్నాయి. కరెన్సీ చెస్టు శాఖలు వారి కార్యకలాప ప్రాంతంలో ఉన్న ఇతర బ్యాంకు శాఖలకు నోట్లను, నాణలను పంపిణీ చేయాల్సి ఉంటుంది. చిన్న నాణల డిపో అంట ఏమిటి? కొన్ని బ్యాంకు శాఖలు చిన్న నాణల నిల్వలుంచుకోవడానికి అధికృతమై ఉంటాయి. వీటిని చిన్న నాణల డిపోలుగా పిలుస్తారు. దేశంలో 3708 చిన్న నాణల డిపోలు విస్తరించి ఉన్నాయి. ఈ శాఖలు తమ కార్యకలాపాలున్న చోట ఇతర బ్యాంకు శాఖలకు చిన్న నాణలను పంపిణి చేస్తుంటాయి. చెలామణీ నుంచి వాపస్ వచ్చిన నోట్లు, నాణలు ఏమవుతాయి? చెలామణీ నుంచి వాపస్ వచ్చిన నోట్లు, నాణలు రిజర్వ్ బ్యాంకు కార్యాలయాల్లో జమచేస్తారు. రిజర్వ్ బ్యాంకు వాటిని పరిక్షింపచేసి మళ్ళీ జారీ చేసేందుకు వీలున్న వాటిని తిరిగి జారీ చేస్తుంది. వీలుకాని వాటిని ష్రెడింగ్ ప్రక్రియ ద్వారా నాశనం చేస్తుంది. నాణల విషయంలోనూ ఇదే విధంగా చేస్తుంది. జారీ చేయలేని నాణలను టంకశాలకు కరిగించేందుకు పంపిస్తుంది. బ్యాంకు నోట్లను, నాణలను సాధారణ పౌరులు ఎక్కడ నుంచి ఎందవచ్చు? రిజర్వ్ బ్యాంకు, వాటి శాఖాకార్యాలయాలు, కరెన్సీ చెస్టులు, చిన్న నాణల డిపో నిర్వహణ చేసే బ్యాంకు కార్యాలయాల నుంచి బ్యాంకు నోట్లను, నాణలను ఎందవచ్చు. వర్తమానాంశాలు నాణలు, బ్యాంకునోట్ల సరఫరాలోలోటు ఎందుకు ఉంది? ఇది సరికాదు. ఇటీవల సరఫరా కన్నా కరెన్సీకి డిమాండ్ ఎక్కువగా ఉండటం నిజమే. భారతీయ సమాజం ఇంకా నగదు చోదకంగా ఉండటమే దీనికి ప్రాథమిక కారణం. ప్రస్తుతం బ్యాంకు నోటుకు సంబంధించి ఎటువంటి సరఫరా నిరోధాలు లేవు. నాణలకు సంబంధించి భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొంటోంది. రూపాయి నాణలను దిగుమతి చేసుకొంటోంది. ప్రజలు నోట్లకు ప్రాధాన్యం ఇవ్వడంవల్ల కూడా నాణల సరఫరాలో లోటు కనిపిస్తోందనిపిస్తుంది. నగదు మీద ఆధారపడటం తగ్గించవచ్చా? తగ్గించవచ్చు. చెక్కులు, క్రెడిట్, డెబిట్ కార్డులు, ఎలక్ట్రానిక్ నిధుల బదిలీకి ప్రాచుర్యం పెరిగితే, కరెన్సీకి ఉండే డిమాండ్ పడిపోతుంది. ఈ లోపు బ్యాంకు నోట్లు, నాణల సరఫరా పెంచేందుకు తీసుకొన్న కొన్ని చర్యలు ఏమిటి? బ్యాంకు నోట్లు, నాణల సరఫరా సముచితంగా ఉండేందుకు కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అవి ప్రభుత్వ అధీనంలో ఉన్న ప్రస్తుత నోటు ముద్రణాలయాలు, టంకశాలలను నవీకరించడం. రిజర్వ్ బ్యాంకు తన అనుబంధ సంస్థ భారతీయ రిజర్వ్‌బ్యాంకు నోటు ముద్రణ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆధునిక సాంకేతిక ప్రమాణాలతో రెండు కొత్త ముద్రణాలయాలను నెలకొల్పడం జరిగింది. డిమాండ్, సరఫరా మధ్య లోపాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం ఏక సమయప్రయత్నంగా బ్యాంకునోట్లను దిగుమతి కూడా చేసుకొంది. భారత ప్రభుత్వ టంకశాలలు నాలుగింట్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం జరిగింది. నాలుగు టంకశాలల నుంచి సరఫరా అవుతున్న నాణలకు తోడుగా రూపాయ నాణలను భారత ప్రభుత్వం దిగుమతి చేసుకొంటోంది. ఈవిధంగా ఇంతవరకు రెండు బిలియన్ నాణలను దిగుమతి చేసుకొంది. రూ. 1, 2, 5 నోట్లను ఎందుకు ముద్రించడంలేదు? చిన్న సంజ్ఞ నోట్లు పరిమాణ పరంగా మొత్తం నోట్ల చెలామణిలో 57 శాతంగా మరియు విలువపరంగా 7 శాతం ఉండటం వల్ల వీటిని ముద్రించడం లేదు. ఈ నోట్ల సరాసరి చెల్లుబడి కాలం ఏడాది మాత్రమే. ఈ నోట్ల ముద్రణ, సర్వీసింగ్ విషయాలు చెల్లుబడికాలంలో సరిపోలవు. అందువల్ల వీటి ముద్రణ నిలిపివేశారు. అందుకని వీటిని నాణలుగా విడుదల చేస్తున్నారు. ఏమయినప్పటికీ డిమాండ్, సరఫరా లోపాన్ని పూరించడానికి అయిదు రూపాయలను నాణలతోపాటు మళ్ళీ నోట్లను కూడా ముద్రించాలని నిర్ణయించడం జరిగింది. మకిలి/చినిగిన, నలిగిన నోట్లు మకిలి/చినిగిన, నలిగిన నోట్లంటే ఏమిటి? అధికంగా ఉపయోగించడంవల్ల మురికి, మకిలి పట్టి ఉన్న నోట్లను మకిలి/నలిగిన నోట్లని అంటారు. చిరిగిన, ఆకారం కోల్పోయిన, కాలిన, ఉతికిన, చెదలు కొట్టిన నోట్లను చినిగిన నోట్లుగా పరిగణిస్తారు. రెండు పక్కల నంబర్ కలిగిన (డబుల్ నెంబర్డ్) నోటు రెండుగా చిరిగినను వాటిలో రెండంకెలు సరిగ్గా ఉంటే దాన్ని మకిలి నోటుగా భావిస్తారు. ఇటువంటి నోట్లను విలువకు వినిమయం చేయవచ్చా? చేసుకోవచ్చు. అన్ని బ్యాంకు శాఖల్లో వినిమయం చేసుకొని విలువ పొందవచ్చు. పైవాటిని వినిమయంచేసినప్పుడు ఎంత విలువ పొందుతారు? మకిలి పట్టిన నోట్లకు పూర్తి విలువ లభిస్తుంది. చినిగిన నోట్ల విషయంలో వినిమయ విలువను ఆర్బిఐ (నోట్ రిఫండ్) నియమావళి 1975కి లోబడి చెల్లిస్తారు. ఈ నియమావళిని ఆర్బిఐ చట్టం 1934లోని సెక్షన్ 28కి లోబడి రూఎందించారు. ఈ నియమావళిని అనుసురించి చేసిన నిర్ణయాల మేరకు ప్రజలకు వారి నోట్ల విలువ దక్కుతుంది. 10 రూపాయల మరియు అంతకు పైబడిన నోట్ల విషయంలో పూర్తిగా, సగం, అసలు చెల్లింపులేకపోవడం అనే అవకాశాలున్నాయి. 1,2,5 రూపాయల నోట్ల విషయంలో నోటు స్థితిని బట్టి చెల్లింపు పూర్తిగా పొందవచ్చు లేదా అసలు చెల్లింపును వినియోగదారు పొందకపోవచ్చు. నోట్ రిఫండ్ నియమావళి ప్రకారం ఎటువంటి నోట్లకు చెల్లింపు అర్హత ఉండదు? నోట్ రిఫండ్ నియమావళి ప్రకారం దిగువ సూచించిన నోట్లకు చెల్లింపు లభించదు. నోటు ఒక వేళ పూర్తినోటులో సగం కన్నా తక్కువగా ఉంటే నోటుమీదుండాల్సిన సంఖ్యలో ప్రధానభాగం కన్నా తక్కువగా ఉంటే అంటే మొత్తం సంఖ్యలో పూర్వసర్గ (ప్రిఫిక్స్) మూడంకెలు లేదా నాలుగంకెలు లేకపోతే రూ. 5/- అంతకు లోబడిన నోట్లకు ఈ నియమం పాటిస్తారు. రూ.10/- అంతకు పైబడిన నోట్లకు రెండువైపులా ఉండే సంఖ్యా ఫలకం ఈ అసంపూర్ణతను కలిగి ఉన్నట్లయినచో నోట్ల చెల్లింపు లభించదు. జర్వ్బ్యాంకు కార్యాలయం రద్దు చేసిన లేదా విలువ చెల్లించిన నోటుకు. దొంగ/ సృష్టించిన నోటని భావిస్తే స్వచ్ఛందంగా చింపిన, మకిలి/ మురికి/ నలిపిన మార్పు చేసిన నోట్లకు రాజకీయలక్షణం ఉన్న సందేశాన్ని వ్యాపింపచేసే సామర్ధ్యం ఉన్న లేదా వ్యాపింప చేసే దృశ్య ప్రాతినిధ్యం ఉన్నా లేదా బాహ్యంగా పదాలు రాసిన నోట్‌కు చెల్లింపు లభించదు. చెల్లింపు లభించని నోటు ఏమవుతుంది? చెల్లింపు లభించని నోటును గ్రహించిన బ్యాంకులు తమవద్దే ఉంచుకొంటాయి. తరవాత వాటిని రిజర్వ్‌బ్యాంకుకు పంపుతారు. అక్కడ వాటిని నాశనం చేస్తారు. చెల్లింపు లభించే మురికి/ మకిలి, చినిగిన, నలిగిన నోట్లను ఎక్కడ అంగీకరిస్తారు? అన్ని బ్యాంకు శాఖల్లో వీటిని తీసుకొంటారు. మారక విలువను చెల్లిస్తారు. వినియోగదార్లు కాక పోయినా ఈ సేవను వారికి బ్యాంకులు అందించాలి. అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రయివేటు రంగ బ్యాంకులు, కరెన్సీ చెస్టు నిర్వహించే బ్యాంకు శాఖలు తగిన నిర్ణయం తీసుకోవడానికి అధికృతమయ్యాయి. వారు తగిన నిర్ణయం తీసుకొని చినిగిన నోట్లకు విలువను చెల్లించవచ్చు. ఈ నిర్ణయం ఆర్బిఐ (రిఫండ్) నియమావళి 1975కు లోబడి ఉండాలి. కొన్ని నోట్లను రెండు ముక్కలుగా ఉంటే వాటిని మకిలి / మురికి నోట్లుగా భావించి మారక విలువ చెల్లించాలని ఆర్బిఐ అన్ని వాణిజ్య బ్యాంకులను అధికృతం చేసింది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న బ్యాంకునోట్ల సాధారణ లక్షణాలు ఏమిటి? ఇప్పటికీ చెలామణిలో ఉన్న లోగడ జారీచేసిన రూ.10/-, 50/-, 20/-, 100/- నోట్ల మీద అశోకస్తంభం (వాటర్‌మార్క్) అశోకస్తంభం బొమ్మ ఉంటాయి. 1987 నుంచీ జారీ అయి ఇప్పటికీ చెలామణిలో ఉన్న రూ. 500/- నోట్మీద అశోకస్తంభం వాటర్‌మార్క్‌తో పాటు మహాత్మగాంధీ చిత్రం ఉంది. ఆర్బిఐ ఇప్పడు మహాత్మగాంధీ క్రమాన్నే విడుదల చేస్తుంది. అంటే ఇప్పటి నోట్మీద మహాత్మగాంధీ బొమ్మ, మహాత్మగాంధీ వాటర్‌మార్క్ ఉంటుందన్నమాట. ఆగస్టు 2001న జారీ చేసిన రూ.5/- నోటుమీద కూడా అశోకస్తంభం వాటర్‌మార్క్, అశోకస్తంభం బొమ్మ ఉంది. బ్యాంకు జారీ చేసిన ఈ నోట్లన్నీ చట్టపరమైన మారక విలువ కలిగినవే. మార్పు తేవడం ఎందుకు? ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకులన్నీ వారి బ్యాంకు నోట్లలో నమూనా మార్పులు చేస్తుంటాయి. ప్రాథమికంగా దొంగ/నకిలి నోట్లను నివారించడానికి చేస్తుంటారు. మనదేశం కూడా ఇదే విధానం పాటిస్తోంది. మహాత్మగాంధీ క్రమంలోని నోట్లలో ప్రత్యేక లక్షణాలు ఏమయినా ఉన్నాయా? అది వరకు జారీ అయిన నోట్లతో పోల్చినప్పుడు మహాత్మగాంధీ క్రమం నోట్లలో ఎన్నో ప్రత్యేక లక్షణాలున్నాయి. అవి భద్రతా తంతువు (సెక్యురిటీ త్రెడ్): రూ. 10/-, 20/-, 50/- నోట్లలో చూడదగిన భద్రతా గవాక్షిత (విండోడ్) నిక్షిప్త తంతువు ఉంటుంది. రూ. 100/-, 500/-, 1000/- నోట్లలో చూడదగిన గవాక్షిత భద్రతా తంతువు ఉంటుంది. ఇది పాక్షికంగా బాహ్యంగా, పాక్షికంగా నిక్షిప్తంగా ఉంటుంది. వెలుతురులో చూస్తే తంతువు ఒకే రేఖగా కనిపిస్తుంది. రూ. వెయ్యి నోట్లు తప్ప మిగిలిన వాటిల్లో భారత్ అని దేవనాగరి లిపిలో, ఆర్బిఐ ప్రత్యామ్నాయంగా గోచరిస్తుంది. వెయ్యి రూ. నోటు భద్రతా తంతువు మీద భారత్ దేవనాగరి లిపితోపాటు 1000, ఆర్బిఐ అని ఉంటాయి. పూర్వం జారీ చేసిన నోట్లు సాదాగా ఉండి భద్రతాతంతువు పూర్తిగా నిక్షిప్తంగా ఉండి చదవడానికి వీలు కాకుండా ఉంటుంది. గుప్తదృశ్యం: సంజ్ఞా విలువను రూ. 20/-, 50/-, 100/-, 500/- లేదా రూ.1000/- ని తెలియజేసే గుప్త దృశ్యం, మహాత్మగాంధీ చిత్రానికి కుడివైపున ఊర్ద్వపట్టీ వెనక ఉంటుంది. నోటును చేతిమీద ఉంచుకొని 45డిగ్రీల కోణంలో వెలుతురు ప్రసరింపచేసినప్పుడు ఆ విలువ కనిపిస్తుంది. అట్లా కానప్పుడు ఈ లక్షణం కేవలం ఊర్థ్వ పట్టీగా కనిపిస్తుంది. సూక్ష్మ అక్షర ముద్రణలు: సూక్ష్మ అక్షర ముద్రణమహాత్మగాంధీ చిత్రం, ఊర్ధ్వపట్టీకి మధ్య కనిపిస్తుంది. పదిరూపాయల నోటులో ఆర్బిఐ అని ఉంటుంది. రూ. 20/- పైబడిన వాటిల్లో ఆ నోటు సంజ్ఞ విలువ ముద్రితమై ఉంటుంది. భూతద్దం సహాయంతో ఈ లక్షణం మెరుగ్గా చూడవచ్చు. గుర్తింపు చిహ్నం: వాటర్ మార్క్ గవాక్షానికి ఎడమవైపున ప్రత్యేక నిశితంగా చిత్రితమయిన (ఇంటాగ్లియో) లక్షణాన్ని పదిరూపాయల నోటు మినహా మిగిలిన అన్నినోట్లలో ప్రవేశపెట్టారు. ఈ లక్షణం ఒక్కో నోటులో ఒక్కోరకంగా ఉంటుంది. (రూ. 20/- ఊర్ధ్వ దీర్ఘచతురస్రం, 50/- చతురస్రం, 100/- త్రికోణం, 500/- వర్తులం, 1000/- డైమండ్ ఆకారాలలో ఉంటాయి) దీనివల్ల అంధులయిన వారు కూడా ఈ లక్షణం ద్వారా నోటు ఏ విలువకు చెందిందో గుర్తిస్తారు. నిశిత చిత్రిత ముద్రణం: మహాత్మగాంధీ చిత్రం, ఆర్బిఐ ముద్ర, గ్యారంటీ, వాగ్దానం క్లాజు, ఎడమవైపు అశోకస్తంభం చిహ్నం, ఆర్బిఐ గవర్నర్ సంతకం మొదలగువాటిని నిశిత చిత్రిత ముద్రణ చేస్తారు. అంటే రూ. 20/-, 50/-, 100/-, 500/-, 1000/- నోట్లలో ఇవన్నీ ఉబ్బెత్తుగా తాకుతు న్నట్లుంటాయి. మెరుపు (ప్లోరసెన్స్): సంఖ్యా ఫలకాన్ని నోట్లమీద మెరుపుసిరాతో ముద్రిస్తారు. ఈనోట్లతో దృశాతంతువులు కూడా ఉంటాయి. నోటును అతినీలలోహిత దీపం వెలుగులో చూసినప్పుడు వీటిని గమనించవచ్చు. దృశావైవిధ్య సిరా: 500, 100 అంకెలను (మార్చిన లేత పసుపు, మాలే, గోధుమరంగు కలర్ పథకాన్ని అనుసరించి ముద్రించిన రూ. 500/- నోటు) రూ.1000/-ల నోట్ల మీద దృశావైవిధ్య సిరాతో ముద్రిస్తారు. అంటే ఇది రంగుమార్పిడి సిరా అన్నమాట. ఈ సంఖ్యరంగు మామూలుగా పట్టుకొన్నప్పుడు, ఆకుపచ్చగా కోణంలో పెట్టి చూపినప్పుడు నీలంగాను కనిపిస్తాయి. దొంగ / నకిలీలు (ఫోర్జరీలు) అసలు నోటకు, నకిలీ నోటుకు మధ్య తేడాను ఎలా గుర్తించడం? పైన సూచించిన లక్షణాలు నోట్లమీద లేనట్లయితే ఆ నోట్లను నకిలీ/ దొంగనోట్లుగా అనుమానించ వచ్చు. సూక్ష్మంగా పరీక్షించాలి. దొంగ/ నకిలీ నోట్ల చలామణి, ముద్రణ విషయంలో చట్టపరమైన అవకాశాలేమిటి? దొంగ/ నకిలీ ముద్రణ , చెలామణీ భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి)లోని 489 ఎ నుంచి 489 ఇ వరకూ ఉన్న సెక్షన్ల ప్రకారం నేరం. చట్ట ప్రకారం న్యాయస్థానం జైలుశిక్ష, జరిమానా లేదా రెండూ నేర స్థాయిని బట్టి విధించవచ్చు. గుర్తుంచుకోండిః ప్రజావగాహనే నకిలీ / దొంగ నోట్ల నుంచి అత్యుత్తమరక్షణ ఇదొక ఎలక్ట్రానిక్ పత్రం. నిర్దిష్ట పాఠానికి ముద్రితమయిన సమాచారపత్రం (బ్రోచర్) చదవాల్సి ఉంటుంది. ఆధారము: భారతీయ రిజర్వు బ్యాంకు