పన్ను వాపసు అంటే ఏమిటి..? నమూనా జీఎస్టీ చట్టం సెక్షన్ 38లో పన్ను వాపసు (రిఫండ్) గురించి చర్చిండమైంది. సెక్షన్ 38(2) నిబంధనల ప్రకారం 'రిఫండ్"లో భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి చేసిన సరుకులు మరియు లేదా సేవలు లేదా భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి చేసిన సరుకులు మరియు లేదా సేవలకోసం వినియోగించుకున్న ఇన్పుట్స్ లేదా ఇన్పుట్ సేవలపై కట్టిన పన్ను వాపసు లేదా ఎగుమతులుగా భావింపబడే సరుకుల సరఫరాపై చెల్లించిన పన్ను వాపసు లేదా ఉపయోగించని ఇన్పుట్స్ ట్యాక్స్ క్రెడిట్ రిఫండ్ ఉంటాయి. ఉపయోగించని ఇస్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రిఫండ్ గా అనుమతించబడుతుందా..? అవును. అయితే సెక్షన్ 38 సబ్-సెక్షన్ (2) ప్రకారం దిగువ సందర్భాలలో మాత్రమే రిఫండ్ అనుమతించబడుతుంది. ఎగుమతి సుంకం చెల్లించాల్సిన అవసరం లేని సరుకుల ఎగుమతి, సేవల ఎగుమతి, ఇన్పుట్స్ పై పన్ను రేటు అధికంగా ఉండి ఔట్‌పుట్స్ పై పన్ను రేటు తక్కువగా ఉండడం వల్ల క్రెడిట్ పోగుపడి ఉండడం. భారత్ వెలుపల ప్రాంతానికి ఎగుమతి చేసి సరుకులు ఎగుమతి సుంకానికి అర్హమైనవి అయితే ఐటీసీ రిఫండ్ ఉంటుందా..? లేదు. (నమూనా జీఎస్టీ చట్టం సెక్షన్ 38(2) రెండవ నిబంధన ప్రకారం అందుకు వీలు లేదు). ఆర్థిక సంవత్సరం చివరన (జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత) స్టాక్ లో ఉండిపోయిన సరుకులపై ఐటీసీ రిఫండ్ పొందవచ్చా? లేదు. దీనిని క్యారీ ఫార్వార్డ్ చేయాలని ప్రతిపాదించడమైంది. ఒక పన్ను చెల్లింపుదారు ఐజీఎస్టీ/ సీజీఎస్టీ/ఎస్జీఎస్టీని పొరపాటున రాష్ట్ర అంతర్గత/బయటి సరఫరాల కింద చెల్లించాడు. తదుపరి దాని లకణాన్ని వివరించడం జరిగింది. పొరపాటున చెల్లించిన ఐజీఎస్టీని సీజీఎస్టీ/ఎస్జీఎస్టీ కింద సర్దుబాటు చేసేయడం జరుగుతుందా..? లేదు. అతడు తగినరీతిలో పన్ను చెల్లించాలి మరియు పొరపాటున చెల్లించిన పన్ను రిఫండ్ క్లెయిమ్ చేసుకోవాలి. (ఐజీఎస్టీ సెక్షన్ 30 మరియు జీఎస్టీ సెక్షన్ 53). రాయబార కార్యకార్యాలయాలు మరియు ఐక్య రాజ్య సమితి జరిపే కొనుగోళ్లపై పన్ను ఉంటుందా లేక మినహాయింపు ఇస్తారా..? పన్ను విధించడం జరుగుతుంది. తదుపరి వారు రిఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. {ఐక్యరాజ్య సమతి మరియు కాన్పలేట్స్ లేదా రాయబార కార్యాలయాలు యూనిక్ ఐటడెంటిటీ నంబరు తీసుకొని దానిమీదే కొనుగోళ్లు జరిపాలి. అప్పుడా కొనుగోళ్లు సరఫరాదారు యొక్క ఔట్ వార్డ్ సరఫరాల రిటర్న్ లో వారి నంబరు కింద కనిపిస్తాయి. వాటిపై పన్ను వాపసు మంజూరు చేస్తారు. దీనికొరకు ప్రత్యేక క్రమాన్ని నోటిపై చేయడం జరుగుతుంది. జీఎస్టీ సెక్షన్ 19 (6)}. రిఫండ్ తీసుకునేందుకు కాలపరిమతి ఏమిటి.? సంబంధిత తేదీ తర్వాత రెండేళ్ల లోపల సదరు వ్యక్తి నమూనా జీఎస్టీ చట్టం సెక్షన్ 38 నిబంధనల ప్రకారం రిఫండ్ కు దరఖాస్తు చేసుకోవాలి. అక్రమార్జన సూత్రాన్ని రిఫండ్ విషయంలోనూ వర్తింపజేస్తారా..? అవును. ఎగమతులు మరియు ఉపయోగించని ఐటీసీకి మాత్రం మినహాయింపు ఉంటుంది, సెకన్ 38 స్-సెకన్ (2) నిబంధనల మేరకు (పైన ఇచ్చిన 2వ ప్రశ్నను కూడా చదవండి). ఒకవేళ పన్నును వినియోగదారునికి బదలాయించడం జరిగితే రిఫండ్ అనుమతిస్తారా..? అవును. అయితే అలా లెక్కగట్టిన సొమ్మును వినియోగదారుల సంకేమ నిధికి జమ చేస్తారు. రిఫండ్ అనుమతికి ఏదైనా కాలపరిమితి అంటూ ఉందా..? అవును. అన్ని సందర్భాల్లో 90 రోజులు. సెక్షన్ 38 సబ్-సెక్షన్ (4ఏ) కింద యావత్తు మొత్తంలో రిఫండ్ 80 శాతం వరకు ఉండే కొన్ని తరగతుల ఎగుమతులకు మాత్రం మినహాయింపు ఉంటుంది. ఒకవేళ రిఫండ్ మూడు మాసాల్లో మంజూరు చేయని పక్షంలో డిపార్టుమెంటు వడ్డీతో సహా చెల్లించాల్సిఉంటుంది. డిపార్టుమెంటు రిఫండ్ ను నిలిప వేయవచ్చా? అవును. దిగువ తెలిపిన పరిస్థితుల్లో రిఫండ్ ను నిలిపివేయవచ్చు. రిజిస్టర్డ్ డీలరు రిటర్న్(లు) సమర్పించకపోతే, వాటిన సమర్పించేంతవరకు రిజిస్టర్డ్ పన్ను చెల్లింపుదారు ఏదైనా పన్ను, వడీ లేదా జరిమానాకట్టాల్సి ఉండి, దానిపై అపెలేట్ అథారిటీ/ట్రిబ్యునల్/కోర్టు ఎలాంటి స్టే ఇవ్వని పక్షంలో, సదరు పన్ను, వడ్డి లేదా జరిమానా కట్టేంతవరకు, [రిఫండ్ చేయాల్సిన మొత్తంలోనుంచి తగినస్థాయి అధికారి డీలరు చెల్లించని పన్నులు ఏవైనా ఉంటే వాటిని రాబట్టుకోవచ్చు]. రిఫండ్ ఆర్డర్ అపీలు కింద ఉంటే, సదరు రిఫండ్ మంజూరు వల్ల రెవెన్యూకు భంగం వాటిల్లుతుందని బావించిన పక్షంలో కమిషనర్/ బోర్డు రిఫండ్ ను నిలిపివేయవచ్చు - (నమూనా జీఎస్టీ చట్ట సెక్షన్ 38 (9) ప్రకారం) పైన 11(సీ)లో చర్చించినట్టుగా, సెక్షన్ 38 (9) కింద రిఫండ్ నిలిపివేసి పకంలో పన్నుచెల్లింపుదారుకు వడ్డీ చెల్లిస్తారా..? అపీల్ ఫలితంగా లేదా తదుపరి కార్యాచరణ వల్ల పన్ను చెల్లింపుదారు రిఫండ్ కు అర్హుడైతే వడ్డీ కూడా కలిపి చెల్లించబడుతుంది. రిఫండ్ కు కనీస ప్రవేశ పరిమితి అంటూ ఏదైనా ఉందా..? రూ. 1OOO లోపు రిఫండ్ మంజూరు చేయబడదు. (నమూనా జీఎస్టీ చట్టం సెక్షన్ 38 (11)). ఇదివరకటి చట్టాల కింద ఏర్పడిన రిఫండ్ల పరిస్థితి ఏమిటి.? ఇదివరకటి చట్టాల కింద ఇవ్వాల్సిన రిఫండ్ ను ఆయా చట్టాల ప్రకారం నగదు రూపంలో (సీజీఎస్టీ కింద) లేదా ఇదివరకటి చట్ట నిబంధనల ప్రకారం (ఎస్‌జీస్టీ కింద) చెల్లించబడుతుంది. దీనిని ఐటీసీ రూపంలో మాత్రం వాడుకునేందుకు వీలులేదు. (నమూనా జీఎస్టీ చట్టం సెక్షన్ 156, 157, మరియు 158). పత్రాల తనిఖీ కంటే ముందే రిఫండ్ ఇవ్వడం జరుగుతుందా..? 80 శాతం వరకు రిఫండ్ ఇవ్వాల్సిన కొన్ని తరగతుల ఎగుమతుల రిఫండ్లు, సెకన్ 38(4ఏ)లో సూచించిన షరతులు నియంత్రణలకు లోబడి, తనిఖీకి ముందే మంజూరు చేయబడతాయి. ఎగుమతుల కింద రిఫండ్లు ఇవ్వాల్సి వస్తే, రిఫండ్ మంజూరుకు బీఆర్సీ తప్పనిసరి అవుతుందా..? ఎగుమతిదారుకు ఎగుమతి లావాదేవీల మొత్తాలు సంవత్సర కాలం లోపు అందుతాయి కనుక రిఫండ్ దరఖాస్తు నాటికి బీఆర్సీ అందుబాటులో ఉండకపోవచ్చు. ఒకవేళ ఎగుమతుల విలువ ముందే అడ్వాన్స్ రూపంలో అందితే బీఆర్సీ అందుబాటులో ఉండవచ్చు. అప్పుడు బీఆర్సీ వివరాల సమర్పణ ఆధారంగానే రిఫండ్ ఏడాది కాలపు కనీస గడువు లోపల లేదా ఆర్బీఐ పొడిగించిన గడువు ప్రకారం చెల్లించవచ్చు. డీజీఎఫ్టీ (DGFT) లోని ఈ-బార్సీ (e-BRC మాడ్యూల్ జీఎస్టీ మాడ్యూల్ కు కలుపబడుతుంది. అయితే సేవల ఎగుమతికి సంబంధించి మాత్రం రిఫండ్ కు ముందే బీఆర్సీ తప్పనిసరిగా అవసరమవుతుంది. ఎగుమతులు లేదా ఎగుమతులుగా పరిగణింపడే సరఫరాల విషయంలో అక్రమార్జన సూత్రాన్ని వర్తింపజేస్తారా..? వాస్తవికంగా సరుకులు లేదా సేవల ఎగుమతి జరిగితే గ్రహీత పన్ను ప్రాదేశిక పరిధికి వెలుపల ఉండాలి కనుక అక్రమార్జన సూత్రం వర్తింపజేయం కుదరదు. ఎగుమతులుగా పరిగణింపబడే సరఫరాల విషయంలో మాత్రం దీనిని వర్తింపజేస్తారు. తన విషయంలో అక్రమార్థన సూత్రం వర్తించదని ఎవరైనా వ్యక్తి ఎలా రుజువు చేస్తాడు.? సంబంధిత వ్యక్తి తాను చెల్లించిన పన్ను మరియు వడ్డీ మొత్తం, లేదా రిఫండ్‌కు సంబంధించి క్లెయిమ్ చేయబడిన మరే ఇతర చెల్లించిన మొత్తం తాను మరే ఇతర వ్యక్తికి బదలాయించలేదని రుజువు చేసే పత్రా(లు), ఆధారా(లు) సమర్పించాల్సి ఉంటుంది. - సెక్షన్ 38 (3)బీ. తదుపరి, పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించే నిమిత్తం పైన తెలిపిన సబ్ సెక్షన్ రిఫండ్ మొత్తం రూ.5 లక్షల లోపు అయితే స్వయం-ప్రకటన మాత్రమే సరిపోతుందని కూడా తెలియజేస్తున్నది. ప్రస్తుత వ్యాట్/సీఎస్టీ కింద ఎగుమతి వ్యాపారులు ఎలాంటి పన్ను చెల్లించకుండానే ప్రకటన పత్రం సమర్పించి సరుకులు కొనుగోలు చేయగలుగుతున్నారు. జీఎస్టీ కింద కూడా ఇలాంటి వ్యవస్థ ఉంటుందా? ఉండదు. జీఎస్టీలో అలాంటి ఏర్పాటు ఏదీ లేదు. వారు పన్ను చెల్లించి సరుకులు కొనుగోలు చేయాలి మరియు పోగుపడిన ఐటీసీని సెక్షన్ 38(2)లో చర్చించిన నిబంధనల మేరకు క్లెయిమ్ సమర్పించి రిఫండ్ పొందవచ్చు. ప్రస్తుతం కేంద్ర చట్టం కింద ఎగుమతి దారులు డ్యూటీ చెల్లించిన ఇన్ పుట్ లు పొందేందుకు అర్హత కలిగి ఉన్నారు. దానిపై ఐటీసీని పొంది డ్యూటీ చెల్లింపు తర్వాత (ఐటీసీని ఉపయోగించుకొని) సరుకులు ఎగుమతి చేయగలుగుతున్నారు. తదుపరి ఎగుమతులపై చెల్లించిన సుంకాన్ని రిఫండ్ కింద క్లెయిమ్ చేయగలుగుతున్నారు. జీఎస్టీ కింద ఈ వ్యవస్థ కొనసాగుతుందా? జీఎస్టీ కింద ఎగుమతులు జీరోరేటెడ్ గా ఉంటాయి. అంటే ఎగుమతి సరుకులకు ఎలాంటి వాస్తవిక పన్ను లయబిలిటీ ఉండదు, కానీ అలాంటి ఎగుమతుల కోసం ఉపయోగించే ఇన్పుట్ ల పై మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీ కింద పోగుపడిన ఇన్పుట్ లు మరియు తయారీ ఎగుమతి సరుకులపై రిఫండ్ అనుమతిస్తారు. ఆధారం : సెంట్రల్ బోర్డ్ అఫ్ ఎక్సైజ్ మరియు కస్టమ్స్ https://www.cbic.gov.in