অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

Translation Volunteers

Translation Volunteers

ఏదైనా ఒక పువ్వుని ఒకేసారి రెండు రంగుల్లోకి మార్చే ప్రయోగాన్ని మీరెప్పుడైన చేసి చూశారా? అంటే పువ్వులో సగం ఒక రంగులోనూ, మిగతా సగం ఇంకో రంగులో ఉండేలా చేసే ప్రయోగం! చేయకపోతే... ఇదిగో ఇలా చేసి చుడండి.

కొంచెం ఎరువు రంగు సిరా(ఇంక్) ని కొంచెం నీలం రంగు సిరాని సేకరించండి. వాటిలో నీళ్ళను కలిపి కొంచెం పలుచగా మార్చండి. రెండు సన్నని గాజు గొట్టాలను (లేదా పరీక్షా నాళికలను) తీసుకోని ఒక్కో దాంట్లో ఒక్కో సిరాని నింపండి.

ఒక తెల్లని లిల్లీపువ్వుని గాని, గులాబీని గాని లేదా ఏదైనా తెల్లని లిల్లీ పువ్వుని గాని దాని కాడతో సహా తెంపండి. అలా తెంపండంలో కాడ భాగం కాస్త పొడుగ్గా వుండేలా ముందే జాగ్రత్త పడండి. పువ్వుకి సంబంధించిన కాడ కింద భాగమంతటిని, ఒక బ్లేడు సాయంతో నిధానంగా (నిలుపు) రెండుభాగాలుగా చీల్చండి. ఈ రెండు భాగలనూ ఇంతకు ముందు మనం సిరాతో నింపిన రెండు గాజు గోట్టాల్లోకి దించి, వాటిని అలాగే కొన్ని గంటల పాటు వదిలి వేయండి. ఆ తరువాత మీ కంటిని మీరే నమ్మలేనంత చక్కటి దృశ్యం కనిపిస్తుంది, మిగతా సగం ఎర్రగానూ మారిపోయింది.

చెట్టులోని వివిధ భాగలకు నీటిని, ఖనిజ లవణాల వంటి వాటిని తీసుకుపోయే సన్నని మార్గాలు (నాళాలు) వుంటాయి చూడండి. కాడలో వుండే అటువంటి నాళాల ద్వారా గాజుగోట్టల్లో వుండే రంగు నీరు క్రమంగా పువ్వు తాలూకు రెక్కల్లోకి చేరుకుంటుంది.అయితే అలా వచ్చిన రంగునీటిలో నీరు పూవు రెక్కల ద్వారా గాలిలోకి ఇగిరిపోతే రంగుమాత్రం వాటిలోనే నిలిచిపోతుంది. అది అసలు సంగతి.

మనం కాండను రెండు భాగాలుగా చీల్చి , ఒక భాగాన్ని ఒక రంfeb26.jpgగు నీటి గొట్టాల్లో వుంచినదువల్ల, అందులో ఏ కాడనుంచి పోయే రెక్కలకు నిరందుతుందో ఆయా రెక్కలన్నీ ఆ రంగులోకి మారి మనకు కాన్పిస్తాయి. ఇదంతా సరదాగా వుంటుంది. ఒక మారి ఆలస్యం దేనికి వెంటనే ఈ ప్రయోగానికి సన్నద్ధం కండి!

© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate