హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / తీగ జాతి కూరగాయల సాగులో మెళకువలు (బీర, దొండ)
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

తీగ జాతి కూరగాయల సాగులో మెళకువలు (బీర, దొండ)

బీర, దొండ కూరగాయల పంట సాగులో మెళకువల గురించి తెలుసుకుందాం.

వాతావరణం

వేడి వాతావరణం అనుకూలమైనది.

నేలలు

నీటిని నిలుపుకొనే తేలికపాటి బంకమట్టి నేలలు అనుకూలమైనవి.

విత్త సమయం

జూన్, జూలై చివరి వరకు మరియు జనవరి రెండవ వారం నుండి ఫిబ్రవరి చివరి వరకు,

దొంద

సంవత్సరమంతా నాటవచ్చును.

విత్తనము మరియు వితే పద్ధతి

వర్షాకాలములో నీటి కాలువలకు తోడుగా మురుగు నీరు పోవడానికి 2 మీ.ల దూరంలో కాలువలు చేయాలి. అన్ని రకాల పాదులకు మూడు విత్తనాలను 1.2 సెం.మీ. లోతులో విత్తుకోవాలి. దొండకు చూపుడు వేలు లావుగల కొమ్మలు 4 కణుపులు గలవి రెండు చొప్పన నాటుకోవాలి.

విత్తనశుద్ధి

కిలో విత్తనానికి 3 గ్రా, చొప్పున ధైరమ్ మరియు 5 గ్రా, చొప్పన ఇమిడాక్లోప్రిడ్ ఒకదాని తరువాత మరొకటి కలిపి విత్తనశుద్ధి చేయాలి.

ఎరువులు

విత్తే ముందు ఎకరాకు 6 - 8 టన్నుల పశువుల ఎరువు, 32 - 40 కిలోల భాస్వరం, 16 - 20 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను గుంటలలో వేయాలి. నత్రజనిని 32 - 40 కిలోలు రెండు సమపాళ్ళగా చేసి విత్తిన 25 - 30 రోజులకు మరియు పూత, పిండె దశలో వేసుకోవాలి.

కలువు నివారణ, అంతర కృషి

కలువు మొక్కలను ఎప్పటికప్పుడు తీసి వేయాలి. రెండు మూడు తడుల తరువాత మట్టిని గుల్ల చేయాలి.

 • beeraఎండాకాలంలో లోతుగా దుక్కి దున్నుకోవాలి.
 • పంట మార్పిడి చేయాలి (వరి పంటలో).
 • మిథైల్ యూజినాల్ + వెనిగార్ + పంచదార ద్రావణం 10 మి.లీ. చొప్పన కలిపి 10 ఎరలు ఎకరానికి పెట్టి పండు ఈగల ఉనికిని గమనించాలి. లేదా 100 మి.లీ. మలాథియాన్ + 100 గ్రా. బెల్లం 10.లీ. నీటిలో కలిపి మట్టి ప్రమిదల్లో అక్కడక్కడ పొలంలో వుంచాలి.
 • కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
 • 100 గ్రా. విత్తనానికి ట్రైకోడెర్మా విరిడి 2 గ్రా చొపున విత్తనశుద్ధి చేయాలి.
 • అల్లిక రెక్కల పురుగులను మొక్కకు 2 చొప్పన విడుదల చేయాలి.
 • పెరుగుదల దశలో నుండి పూత వచ్చే వరకు 5 % వేప గింజల కషాయాన్ని 15 రోజుల వ్యవధితో పిచికారి చేయాలి.
 • పెంకు పురుగుల నివారణకు కార్పరిల్ 3 గ్రా. లేదా క్లోరిపైరిఫాన్ లీటరు నీటికి 2 మి.లీ. కలిపి పిచికారి చేయాలి.
 • dondaబూడిద తెగులు నివారణకు డైనోక్యాప్ 1 మి.లీ. ఒక లీటరు నీటికి చొప్పన కలిపి 10 రోజుల వ్యవధితో పిచికారి చేయాలి.
 • నులి పురుగుల బెడద వున్నచోట కార్ఫోసల్ఫాన్ 30 గ్రా. ఒక కిలో విత్తనానికి చొపున కలిపి విత్తనశుద్ధి చేయాలి.
 • తీగజాతి పంటలపై గంధకం సంబంధిత పురుగు/తెగులు మందులు వాడరాదు. దీని వలన ఆకులు మూడిపోతాయి.

ఇతర వివరములకు సంప్రదించవలసిన ఫోన్ నెం. 8374449066

2.953125
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు