অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పప్పుధాన్యాలు

పప్పుధాన్యాలు

పప్పుధాన్యపు పంటకు ప్రాముఖ్యత

  1. రోజు రోజుకు నిస్సారమవుతున్నసాగు భూములను పూర్వ పు స్థితికి తీసుకురావడానికి అపరాక ఎంతో మేలు చేస్తాయి.
  2. వేర్లు వాతావరణంలోని నత్రజనిని సంగ్రహించివేరు బొడిపెలు ద్వారా నేలకు అందిస్తాయి. కాయ జాతి అపరాలైన పెసర మరియు  మినుము 40కి/హె.కంది 50కి/హె. నత్రజనిని నేల కందిఫలితాలు తెలుపుతున్నాయి.
  3. ఆకుల కాడలు కుళ్ళి సేంద్రియ పదార్థంగా మారి రసాయనిక వాటి జీవ కార్యకలాపాలు జరుపుకుంటూ నేలను నేలను గుల్లపర్చి తేమను నిల్వ ఉంచుతుంది.
  4. పప్పు ధాన్య పంటలు పశువుల మేతగా ఉపయోగ పడుతాయి.
  5. ఈ పంటలు సాగుచేయడం ద్వారా కలుపు ఉధృతి తగ్గుతుంది.
  6. పప్పుధాన్యాల పంటలను సాగు చేయడం వల్ల నేల పైపొర మట్టి నీటి వరదకు కొట్టుకొని పోకుండాఅరి కట్ట బడుతుంది.
  7. ఈ పంటల్లో మాంసకృతులు, విటమిన్ లు, ఖనిజాలు కూడా  ఎక్కువగా ఉన్నాయి. విటమిన్ ఎ  దాదాపు 3-4 శాతం ఉంటుంది.

పప్పుధాన్యాల పంట సాగులో సమస్యలు

  1. అపరాల సాగును 92 శాతం వరకు వర్షాధారంగా పండిస్తున్నారు.
  2. కీలక దశలో అధిక నీటి ఎద్దడికి మరియు ఎక్కువ ఉష్ణోగ్రతకు గురి కావడం జరుగుతుంది. అసాధారణ మరియు అసమాన వర్షాల వలన నీటి ఎద్దడికి మరియు నీటి ముంపుకు గురికావడం జరుగుతుంది.
  3. సారవంతం కాని నేలల్లో అపరాలను పండీంచడం వలన తక్కువ దిగుబడులు వస్తున్నాయి.
  4. అపరాలు సున్నితమైన పంటలు అవి ఆమ్లత్వాన్ని, క్షారత్వాన్ని నీటి ముంపును తట్టుకోలేవు.
  5. అధిక ఉత్పాదకత గల రకాలు లేకపోవడం.
  6. రైతులకు అపరాలు సాగుచేయడం పై అవగాహన లోపించడం.
  7. కలుపు మొక్కలను సరియైన సమయంలో నివారించక పోవడం.
  8. పురుగులు, తెగుళ్ళు ఎక్కువగా ఆశించడం.
  9. కోత తర్వాత గింజ నిల్వ సమయంలో పురుగులు ఆశించి నష్టం కలిగించడం.
  10. కోతఅనంతర సాంకేతికపరిజ్ఞానంలోప్రతికూలఅంశాలు ఉంచడం.

పప్పుధాన్యాల పంటలు పండించడంలో ప్ర్రధాన అంశాలు

  1. అనువైన తక్కువ కాలపరిమితి మరియు అధిక దిగుబడినిచ్చు వంగడాలను సాగు చేయడం ద్వారా ఎక్కువ విస్తీర్ణాన్ని అపరాల సాగులోనికి తీసుకురావడం.
  2. అపరాలను వర్షాధార మరియు నీటి పారుదల క్రింద మరియు ఎక్కువ ఎడములో పండించే పత్తి, ఆముదము, జొన్న, సజ్జ, వంటి పంటలలో సహ పంటగా, అంతర పంటగా, మిశ్రమ పంటగా సాగు చేయడం ద్వారా కొత్త పంటల వ్యవస్థను అభివృద్ధి పరచడం.
  3. అధిక ఐగుబడిని ఇచ్చే రకాలను రూపొందించి విత్తనాభివృద్ధి చేయడం.
  4. అనువైన సస్యరక్షణ చర్యలు చేపట్టడం.
  5. దుక్కిలో భాస్వరం ఎరువులు వేయడం విత్తన శుద్ధి చేయడం మరియు రైజోబియం కల్చర్ విత్తనానికి కలిపి సాగు చేయడం ద్వారా అచిక దిగుబడులు పొందడం.
  6. పప్పు ధాన్యాల పంటలను సారవంతమైన నేలలో సాగు చేయడం వల్ల అధిక దిగుబడులు పొందడం.
  7. రైతులకు పప్పు ధాన్యాల సాగు పద్ధతులను పూర్తిగా తెలుసుకొని సరైన సమయానికి పంటను విత్తుకోవడం, సరైన ఎరువులను వేయడం, సరైన కలుపు మరియు నీటి యాజమాన్యం చేపట్టడం ద్వారా అధిక దిగుబడిని పొందడం.

పెసర మరియు మినుము సాగు

మన రాష్ట్రంలో ఖరీఫ్ లో సాగుచేసే అపరాలలో పెసర ముఖ్యమైన పంట సుమారు 1.5 లక్షల హెక్టార్లలో సాగులో ఉంది.ఎక్కువగా నల్గొండ, మెదక్, వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మంజిల్లాల్లో సాగులో ఉంది.మినుము సుమారు 55000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది. మెదక్ , నిజామాబాద్ మరియు అదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువగా సాగుచేస్తారు.

పెసర సాగుకు అనువైన రకాలు

ఎల్ జిజి 460: ఈరకం 70-75 రోజుల పంట కాలము కలిగిఉంటుంది కాయలు గుత్తులు గుత్తులుగా పైభాగములో ఉండికోయడానికి అనుకూలంగా ఉంటాయి. ఒకేసారి కోతకు వస్తుంది. గింజలు మరుపును కలిగి ఉంటాయి.మొవ్వు కుళ్ళను కొంతవరకు తట్టుకొనును వరి మాగాణుల్లో వేయుటకు అనుకూలంగా ఉంటుంది. ఎకరానికి 5-6 క్వింటాళ్ళ దిగుబడి నిస్తుంది. యమ్ జి జి – 348 (భద్రాద్రి): మొక్కలు పొట్టిగా ఉండిఅంతర పంటకు అనుకూలంగా ఉంటుంది. 65 రోజులు పంట కాలము కలిగి రోజులు ఎకరానికి 4-5 క్వింటాళ్ళ దిగుబడి ఇస్తుంది.బెట్టను కొంతవరకు తట్టుకుంటుంది. పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకొనును మరియు గింజలు సాదాగాఉంటాయి.
టి యమ్ -96-2: బూడిద తెగులును తట్టుకొనే రకము 70-75 రోజుల పంట కాలము కలిగి ఎకరానికి 4-6 క్వింటాళ్ళ దిగుబడి ఇస్తుంది. వరి మాగాణులకు కూడా అనువైనది. డబ్ల్యు జి జి-37 (ఏకశిల): 60-65 రోజులు పంట కాలముకలిగి ఎకరానికి 5-6 క్వింటాళ్ళ వరకు దిగుబడినిస్తుంది. పల్లాకుతెగులును కొంతవరకు తట్టుకొనును.
డబ్ల్యుజిజి-2: నల్లమచ్చ తగులును తట్టుకునే రకం గింజలు మెరుస్తుంటాయి. 65 నుండి 70 రోజుల పంటకాలము కలిగి ఎకరానికి 5-6 క్వింటాళ్ళ దిగుబడి ఇస్తుంది ఎంజిజి-347: 65 నుండి 70 రోజులలో పక్వతకు వస్తుంది. 5-6 క్విఎకరానికి దిగుబడినిస్తుంది. బెట్టను మరియు ఆకుమచ్చ తెగులు ను.పల్లాకు తెగులును కొంతవరకు తట్టుకొనును
డబ్ల్యుజిజి-42 : 55 నుండి 60 రోజుల పంట కాలం కలిగి ఎకరాకు3 నుండి 5 క్వింటాళ్ళ దిగు బడినిచ్చి పల్లాకు తెగులును తట్టుకునేరకం, ప్రత్తిలో అంతర పంటకు మరియు వేసవి కాలానికిఅనువైనది.చిరు సంచుల దశలో ఉంది. యంజిజి-351: రబి మరియు వేసవి కాలానికి అనువైనది65 రోజుల పంట కాలం కలిగి ఎకరాకు 4 నుండి 6 క్వింటాలదిగుబడినిచ్చును
యమ్ జిజి-295: మొక్కలు నిటారుగా పెరుగుతాయి. గింజలు సాదాగా ఉంటాయి. కాపు పై భాగానే ఉంటుంది. నల్లమచ్చ తెగులును తట్టుకుంటుంది

మినుము సాగుకు అనువైన రకాలు

యమ్ జిజి-752: పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకముమెట్ట ప్రాంతాలలో మరియు వరి మాగాణుల్లో  విత్తాడానికి అనువైన రకము. 75-80  రోజుల పంట కాలము కలిగి ఎకరానికి 6-7క్వింటాళ్ళ దిగుబడి ఇస్తుంది. డబ్ల్యుబిజి-26: పల్లాకు తెగులును కొంతవరకు తట్టుకునే సాదారకము. కాయల మీద నూగు ఉండదు.70-75 పంటకాలము కలిగి ఎకరానికి ఎకరానికి 4-5 క్వింటాళ్ళ దిగుబడి ఇస్తుంది.
యల్ బిజి-20 (తేజ): పల్లాకు తెగులును కొంతవరకు తట్టుకునే పాలిష్ రకము.70-75 రోజుల పంట కాలము కలిగి ఎకరానికి 5-6క్వింటాళ్ళ వరకు దిగుబడి ఇస్తుంది. యల్ బిజి -207 ( మధిర మినుము) : 75-80రోజులపంటకాలము కలిగి బెట్టను తట్టుకునే పాలిష్ రకము. ఎకరానికి 5-6 క్వింటాళ్ళ వరకు దిగుబడి ఇస్తుంది.
పియు -31 ; పల్లాకు తెగులును పూర్తిగా తట్టుకుంటుంది. 70-75రోజుల పంట కాలము గల సాదారకము. ఎకరానికి 5-6 క్వింటాళ్ళ దిగుబడి ఇస్తుంది. యల్.బి.జి -645: ఎండు తెగులును తట్టుకునే లావుపాటి పాలిష్ రకము 80-90 రోజుల పంటకాలము కలిగి ఎకరాకు 8-9 క్వింటాళ్ళ దిగుబడి ఇస్తుంది.
యల్.బిజి – 685: పాలిష్ రకము ఎండు తెగులును తట్టుకుంటుంది.85-90 రోజుల పంట కలము కలిగి ఉంటుంది, తీగ వేస్తూ విస్తరించి    పెరుగుతుంది. ఎకరానికి 7-8 క్వింటాళ్ళ దిగుబడి ఇస్తుంది.కాయలుకాండం పై కూడ వస్తాయి. గింజలు మెరుపును కలిగి ఉంటాయి యల్ బిజి-678: పైరు తీగ వేస్తూ పెరుగుతుంది. కాయలపైన నూగు ఉంటుంది.  బూడిద, ఆకుమచ్చ, తుప్పు తెగుళ్ళను తట్టు కుంటుంది. 90-95 రోజుల పంట కాలము కలిగి ఎకరానికి 8క్వింటాళ్ళ వరకు దిగుబడి ఇస్తుంది.. గింజలు మెరుపును కలిగి ఉంటాయి

పై రకాలు అన్నికూడా రబికి మాత్రమే అనువైనవి.

యాజమాన్య పద్ధతులు

నేలలు: నీరు బాగా ఇంకి తేమను పట్టి ఉంచే, మధ్యస్థ బరువైన నేలలు అనుకూలమైనవి. చౌడు భూములు పనికి రావు.

నేల తయారీ: ఒకసారి నాగలితోను, రెండు పర్యాయములుగొర్రుతోను, మెత్తగా దున్ని గుంటక తోలవలెను

విత్తన మోతాదు

పెసర: మెట్ట ప్తాంతాలకు 6-7 కిలోలు మరియు వరిమాగాణుల్లో 10-12 కిలోలు ఎకరానికి అవసరమవుతాయి

మినుము : మెట్ట ప్తాంతాలకు 6-7 కిలోలు వరి మాగాణుల్లో 16కిలోలు ఎకరానికి అవసరమవుతాయి.

విత్తన శుద్ధి

కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్పాన్ లేదాఇమిడాక్లోప్రిడ్ 5 మి. లీ. లేదా ధయోమిధాక్సామ్ 5 గ్రా లేదా మోనోక్రోటోఫాస్ 5.మి.లీ కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే  సుమారు15-20 రోజుల వరకు రసము పీల్చు పురుగుల బారి నుండి రక్షించు కోవచ్చు కొత్తగా పండించేటప్పుడు ఎకరాకు 200గ్రా రైజోబియం కల్చర్ ను విత్తనానికి పట్టించాలి.

విత్తే సమయము

ఖరీఫ్: జూన్ 15 నుండి జులై 15, రబి: సెప్టెంబర్ లేదా అక్టోబర్ లోవిత్తుకోవచ్చు. వరి మాగాణుల్లో నవంబర్, డిసెంబర్ మొదటివారంలో విత్తుకోవచ్చు. వేసవిలో జనవరి 15 నుండి ఫిబ్రవరి 15 వరకు వేసుకోవచ్చు.

విత్తుదూరము: సాలుకు సాలుకు మధ్య 30 సెం.మీ ఉండేలాగొర్రుతో/నాగలితో వరుసలలో విత్తవలెను.

ఎరువులు : తొలకరి పంటకు 8 కిలోల నత్రజని 20కిలోల భాస్వరం రబిలో ఎకరానికి 16కిలోల నత్రజని, 20కిలోల భాస్వరం ఇచ్చే రసాయనికి ఎరువులు చివరి దుక్కిలో వేయాలి. వరి మాగాణుల్లోవేయ వలసిన అవసరం లేదు. 2% యూరియా ద్రావణాన్నిపిందె మరి యు గింజనిండే దశలో పిచికారి చేసినచో దిగుబడులు పెరుగును.

కలుపు నివారణ

విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు ఎకరానికి 1.2 లీటర్లు పెండిమిథాలిన్ మందును 200 లీటర్ల నీటిలోకలిపి పిచికారీ చేయాలి. విత్తిన 20-25 రోజుల మధ్యలో కలుపు లేత దశలోఉన్నప్పుడు ఎకరాకు 300 మి.లీ. ఇమజితాఫిర్ (పర్సూట్)లేదా కేవలం గడ్డిజాతి కలుపు నివారణకు ఎకరాకు 400 మి.లీ క్విజలాఫాప్ ఇథైల్(టర్గాసూపర్) పిచికారి చేయాలి. తర్వాత 30-35రోజుల వ్యవధిలో అంతరకృషి ద్వారా కలుపు నివారించవలెను.

నీటి యాజమాన్యం

నేల స్వభాన్ని బట్టి 2-3 తడులు ఇవ్వవలెను పూత మరియు కాయ తయారయ్యే సమయంలో పిందెలను కూడా తింటాయి.వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలనుపాటించాలి పంట బెట్టకు గురి కాకుండాచూడాలి. బెట్ట పరిస్థితులలో2శాతం యూరియాద్రావణాన్ని అవసరాన్ని బట్టి 2 లేదా3సార్లు పిచికారి చేయాలి.

పెసరను మరియు మినుమును ఆశించే ముఖ్యమైన పురుగులు


తెల్లదోమ: పెసరలో తెల్లదోమ వలన అపారమైన నష్టం వాటిల్లుతుంది. ఇది ఆకుల నుండి రసం పీల్చడమే కాకుండా ఎల్లోమొజాయిక్ వైరస్ ను వ్యాపింపచేయుట వలన పెసర పంటలో గణనీయంగా దిగుబడి తగ్గుతుంది దీని నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీలేదా ట్రైజోఫాస్`2.0 మి.లీ లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా ఒక లీటరు కలిపిపిచికారి చేయాలి.
తామర పురుగులు : ఈ పురుగులు తొలి దశలోలేత ఆకులపై వృద్ధి చెంది ఆకుల అడుగు నుండి రసాన్ని పీలుస్తాయి. వీటివల్ల ఆకుముడత అనే వైరస్ వ్యాధి కూడా వ్యాపింస్తుంది. వీటి నివారణకు గాను మోనోక్రోటోఫాస్ 1.5 మి.లీ ఎసిఫేట్ 1గ్రా లేదా ఫిప్రోనిల్ 1.0 మి.లీ ఒక లీటరు నీటిని కలిపి పిచికారి చేయాలి.

లద్దె పురుగు: ఈపురుగులు ఆకులను తీసివేసి ఈనెలనువదిలివేస్తాయి.ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పువ్వులను పిందెలను కూడా తింటాయి. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించాయి.

• గ్రుడ్ల సముదాయాలను ఏరిచేయాలి.
• జల్లెడగా మారి పిల్ల పురుగులతో ఉన్న ఆకులను ఏరి నాశనం చేయాలి.
• ఎకరాకు 30,000 ట్రైకోగ్రామ బదనికలను వారం తేడాతో2 పర్యా యాలు వదలాలి.
• పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు విషపు ఎరను పొలంలో సాయంత్రం వేళల్లో చల్లాలి.
• 5 కిలోల తవుడులో 500 గ్రా. బెల్లం 500 మి.లీ మోనోక్రోటోఫాస్. లేదా క్లోరిఫైరిఫాస్ లేదా 500 గ్రా. కార్బరిల్ సరిపడే నీటితో కలిపి  ఉండలుగా చేసి వేయాలి

మినుమును ఆశించే ముఖ్యమైన పురుగులు

కాండపు ఈగ: కాండంలోకి ఈ పురుగు చేరి తినడం వలన మొక్క ఎండిపొతుంది. దీని నివారణకు గాను, మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ.లేదా ఎసిఫేట్ 1.0 గ్రా. లేదా డైమిథోమేట్ 1.5 మి.లీ లీటరు నీటిని కలిపి పిచికారి చేయాలి.
మరుకా మచ్చల పురుగు: ఈ పురుగు మొగ్గ, పూత పిందెల దశలో ఆశించి ఎక్కువ నష్టం కలుగ జేస్తుంది. పూత దశలో పూలను గూడుగా చేసి లోపలి పదార్థాలను తింటుంది. కాయలు తయారయ్యేటప్పుడు కాయలను దగ్గరకు చేసి గూడుగా కట్టి, కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తినడం వలన పంటకు ఎక్కువ నష్టం కలుగు తుంది. దీని నివారణకు గాను మొగ దశలో ఎసిఫేస్ 1.0 గ్రా లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలిపంటలో గూళ్లు గమనిస్తే పై మందులతోపాటు ఉదర స్వభావం గలడైకోల్ వాస్ 1 మి.లీ./ లీటరుకు చొప్పున కలిపి పిచికారి చేయాలి. ఉదృతి ఎక్కువగా ఉన్నప్పుడు స్పైనోశాడ్ 0.3మి.లీ ఒక లీటరు నీటిని కలిపి పిచికారి చేయాలి.

తెగుళ్ళు

పెసర మరియు మినుము పంటను ఆశించే తెగుళ్ళలో ముఖ్యమైనవి

ఆకుమచ్చతెగులు • ఆకుల మీద చిన్న మచ్చలు ఏర్పడును.
• ఈ మచ్చలు చల్లని వాతావరణంలో అభివృద్ధి చెంది ఆకు అంతటా వ్యాపించి పండుబారి రాలిపోవును.
• 2.5 గ్రాముల మాంకోజెబ్ మందును 1 లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
బూడిదతెగులు • చిన్న తెల్లని మచ్చలు ఆకుల పైన ఎర్పడును.
• ఈ తెగులు చలికాలంలో ఎక్కువ వచ్చును.
• 1 లీటరు నీటిలో 3 గ్రాముల నీటిలో కరిగే గంధకంను కలిపి పిచికారి చేయాలి.

పల్లాకు తెగులు

• ఆకుల మీద చిన్న మచ్చలు పసుపు రంగులో ఏర్పడును.
• ఈ తెగులు ఉదృతి ఎక్కువ ఉన్నప్పుడు ఆకులన్నియు పసుపు రంగులోకి మారి పండుబారి రాలిపోవును .
• ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందును.
• తెగులు తట్టుకునే రకాలను ఎన్నుకోవాలి.
• పెసరలో ఏకశిల (WGG-37) మరియు (LGG-460) .
• మినుములో LBG-752,PU-31 మరియు T-9.
• కలుపు మొక్కలు లేకుండా తీసి వేయవలెను.
• తెగులు సోకిన మొక్కలను పీకివేయవలెను.

పంట కోత : మొక్కలను మొదలు వరకు కోసి ఎండిన తరువాత నూర్చుకోవాలి. ఆ తర్వాత ఎండబెట్టి శుభ్రపరిచి, నిలువ చేసుకోవాలి.

మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, మొక్కజొన్న పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్ , హైదరాబాద్ , ఫోన్ నెం. 040-24018447

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/10/2021



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate