హోమ్ / వ్యవసాయం / వ్యవసాయ, వ్యవసాయేతర పరిశ్రమలు / మొక్కజొన్న సాగులో విత్తు యంత్రాలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

మొక్కజొన్న సాగులో విత్తు యంత్రాలు

మొక్కజొన్న సాగులో విత్తు యంత్రాలు

మన దేశంలో ఆహార పంటల్లో వరి, గోధుమ తరువాత పండించే ప్రధాన ఆహార పంట మొక్కజొన్న. ఈ మొక్కజొన్నను ఆహార పంటగానే కాక కోళ్ళ, పశువుల దానగాను, పశుగ్రాసంగాను మరియు వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగాను ఉపయేగిస్తారు. మన రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణ పరిస్ధితులు ఉండటం వలన సంవత్సరం పొడవుగా మొక్కజొన్న పండించడం జరుగుతుంది. ఖరీఫ్ లో వర్షాధారంగాను మరియు రబీలో నీటి పరుగుల క్రంద సాగు చేస్తారు. ఖరీఫ్, రబీలోనే కాకుండా వరి, మాగాణుల్లో దున్నకుండా తక్కువ ఖర్చులో సాగు చేసి అధిక దిగుబడులు సాయాధిమ్చడం వలన గత ఐదు, ఆరు సంవత్సరాలుగా ఈ పంట యెక్క విస్తీర్ణం పెరుగుతున్నది.

అన్ని పంటలలో వ్యవసాయ కూలీలా కొరత, ఖర్చు, కష్ట, అధిగమించుటకు మరియు తక్కువ సమయంలో వ్యవసాయ పనులు చేసుకునేందుకు ఈ మధ్యకాలంలో వ్యవసాయ సాంకేతిక పరిజనంతో అనేక పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. మొక్కజొన్న పంట చాలా సున్నితమైన పంట. సరైన సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించినిచో దిగుబడి 30-35% తగ్గే అవకాశం ఉంది. మొక్కజొన్న విత్తే సమయంలో కూలీలా కొరత ఉండటం సర్వ సాధారణమే ఎందుకంటే అదే సమయంలో ఇతర ప్రధాన పంటల్లో కూడా కూలీలా అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ పరిశోధన స్ధానం, కరీంనగర్ లో మొక్కజొన్న సాగులో యాంత్రీకరణ క్రంది మొక్కజొన్నను విత్తుకోవడానికి, ఉపయెగించే పరికరాలు వాటి లాభనష్టాల గురించి తెలుసుకోవడం జరిగింది.

మొక్కజొన్న విత్తుకోవడానికి రెండు పరికరాలను ఉపయెగించడం జరిగింది.

విత్తనం మరియు ఎరువులు వేసే యంత్రం (సీడ్ కామ్ పార్టి డ్రిల్)

 • ఇది ట్రాక్టర్ తో నడిచేది.
 • దీనితో విత్తనం మరియు ఎరువులు ఒకేసారి వేసుకోవడం జరిగుతోంది.
 • ఈ యంత్రం ద్వారా విత్తనం మరియు ఎరువులు సరియైన లోతులో పడేటట్లుగా ఏర్పాటు చేసుకోవచ్చు.
 • రైతు పద్దతిలో చాలా వరకు అడుగు ముందు 15-20 రోజులప్పుడు వేస్తున్నారు కానీ ఈ యంత్రం ద్వారా విత్తనంతో పాటుగా ఎరువులు వేసే సోకార్యం ఉంది. తద్వారా అడుగున వేయవలసిన ఎరువులు కూడా సకాలంలో వేసే వీలు కలుగుతుంది.
 • ఈ యంత్రం ద్వారా విత్తనం కూడా సరియైన లోతులో వడి విత్తన మెలకశాతం సమానంగా ఉంటుంది.
 • విత్తన మేతదులో 20% వరకు  అదా అవుతున్నట్లుగా గమనించడం జరిగింది.
 • ఈ యంత్రం రోజుకి 4 నుంచి  5 ఎకరాలు విత్తవచ్చు.
 • ఒక గంటకు మూడు లీటర్ల డీజిల్ అవసరమవుతుంది.
 • ఈ పరికరంలో ఒక ఎకరం విత్తటానికి ముందు వరసల మధ్య రెండు పీటలు సరిచేసుకొని వీలుంది.
 • ఈ యంత్రం యెక్క ఖరీదు కంపెనీని బట్టి రూ. 40,000/- నుంచి  రూ. 60,000/- వరకు ఉంటుంది.
 • ఈ పరికరం వాడినప్పుడు భూమి బాగా చదును చేసి కలుపు లేకుండా ఉండాలి.
 • ఈ పరికరంతో విత్తుకునే ముందు వరుసలలో విత్తునా దూరం సమాంతరంగా పడేటట్లు కప్పుల అరమరికలు సరి చూసుకోవాలి. లేనిచో ఒకే దగ్గర ఎక్కువ విత్తనం పడటం లేదా ఖాళీలు ఏర్పడటం జరుగుతుంది.

సీడ్ వాక్యూమ్ ఫ్లంటర్

 • ఇది 50 హెచ్.పి. ట్రాక్టర్ తో నడిచే విత్తనం విత్తే పరికరం. ఈ పరికరంలో విత్తనం వాక్యూమ్ ద్వారా నడిచే కొలతలతో పడుతుంది. కాబట్టి వరుసలలో విత్తన దూరం సమాంతరంగా 8/20 సెం.మీ. మరియు వరుసల మధ్య రెండు పిట్లకు విత్తనం పడటం జరుగుతుంది.
 • ఒకేసారి 5 వరుసలలో విత్తనం పడటంవల్ల ఒక ఎకరం విత్తటానికి ఒక గంట సమయం పడుతుంది. విత్తన మేతదులో 35 శాతం అరకు అడా అవుతున్నట్లుగా గమనించడం జరిగింది. ఎకరానికి 5.2 కిలోల విత్తనం సరిపోతుంది.
 • కుదురుకు ఒకే విత్తనం పడటం చేత మెలికలు పెరిగిన తరువాత ఒత్తు మొక్కలు పీకే అవసరం లేక కూలీలా ఖర్చు తగ్గుతుంది.
 • విత్తనం ఒకే లోతులో (3-6 సెం.మీ.) పడటంతో ఒకే సారి మెలిక వచ్చి సమానంగా ఉంటుంది.
 • ఈ యంత్రం నడుచుటకు ఒక గంటకు మూడు లీటర్ల డీజిల్ అవసరమవుతుంది.
 • జూన్ డీర్ వారు రూపొందించిన ఈ పరికరం ఖరీదు 6.5 లక్షల రూపాయలు.
 • ఈ యంత్రం ఎరువులు వేసే సదుపాయం మాత్రం లేదు.
 • ఈ యంత్రం నడపటానికి భూమిని మెత్తగా దున్ని పెద్దలు, కలుపు లేకుండా చదును చేసి, పదును లేకుండా చూసుకోవాలి.

రైతులు ప్రస్తుతం మరియు భవిష్యత్తులో వచ్చే మార్చులకు అనుగుణంగా యాంత్రికరణంతో మొక్కజొన్న విత్తుకోవడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణం మరియు సరియైన సమయంలో విత్థికోవడంతో పాటు కూలీలా కొరతను అధిగమించవచ్చు.

 

ఆధారం: ప్రొపెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

3.0625
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు