హోమ్ / వ్యవసాయం / వ్యవసాయ, వ్యవసాయేతర పరిశ్రమలు / సేంద్రీయ ఎరువులు / వర్మి కంపోస్టు తయారీ లో తీసుకోవలసిన జాగ్రత్తలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వర్మి కంపోస్టు తయారీ లో తీసుకోవలసిన జాగ్రత్తలు

వర్మి కంపోస్టు తయారీలో జాగ్రత్తలు

  • వానపాములను సూర్యరశ్మి నుండి, వర్షము నుండి రక్షణ కల్పించాలి.
  • వర్మి కంపోస్టు బెడ్స్ లో 30-40 శాతం తేమ ఉండేటట్లు చూసుకోవాలి
  • పాక్షికం గా కుళ్ళిన వ్యర్ద పదార్ధాల మిశ్రమాన్ని వాడడం శ్రేయస్కరం
  • ఎలుకలు , చీమలు, కోళ్ళు, మొదలైన శత్రువుల బారి నుండి రక్షణ కల్పించాలి.
  • వ్యర్ధ పదార్ధాలను వేయడం, వర్మి ఎరువును సేకరించడం సకాలం లో జరగాలి.
  • వ్యర్ద పదార్ధాలలో ప్లాస్టిక్ మరియు గాజు పదార్ధాలు లేకుండా చూచుకోవాలి.

వర్మి కంపోస్టు వాడే విధానం

వివిధ పంటలకు ఎకరాకు ఒక టన్ను వేయవచ్చు.

పండ్ల మొక్కలకు చెట్టుకు 5-10 కిలోల వరకూ వేయ వచ్చు.

పూల కుండీలలో 200 గ్రాముల వరకూ వేసుకోవచ్చు

వర్మి కంపోస్టు లో 1-1.5 శాతం నత్రజని, 0.8 శాతం భాస్వరం, 0.8 శాతం పొటాష్ తో పాటు, కాల్షియం, మెగ్నీషియం, రాగి, ఇనుము, జింకు వంటి సూక్ష్మ పోషకాలు, విటమిన్లు, ఎంజైములు, హార్మోనులు ఉండుట వల్ల మొక్కలు పెరుగుదల బాగా ఉండి, దిగుబడులు పెరుగుతాయి. ఈడి నేల నీటి నిల్వ సామర్ధ్యం పెంచుతుంది,మొక్కలకు చీడ పీడలను తట్టుకొనే శక్తి వస్తుంది,కూరగాయలలో రుచి, పూలలో సువాసన, ఆహార పదార్ధాల నిల్వ సామర్ధ్యం పెరుగుతుంది మరియు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.01030927835
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు