తెలంగాణ రాష్ట్రంలో కేవలం మంచి నీటి వనరులకు అవకాశం ఉండుటవలన మత్స్య రైతులు మంచి నీటి వనరుల్లో పెంచడానికి అనువైన చేపలు - దేశవాలీ కార్ప్ జాతులైన బంగారు తీగ, వెండి చేప, గడ్డి చేపలను పెంచుతున్నారు. పెరుగుతున్న అవసరాలకు తగినంత సహజ సిద్ధ చేపల ఉత్పత్తి ఇందాకపోవటం చేత, కొరతను పూడ్చుటకు మత్స్య రైతులు చేపల సాగుపై దృష్టి పెడుతున్నారు. పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఆహార భద్రతకు అనుగుణంగా నాణ్యమైన మరియు వ్యాధులు కోకాకుండా చేపల సాగు చేయుట వలన అధిక లాభం పొందుటకు సాధ్యమవుతుంది. మంచి నీటికి పెరిగే చేపలకు చాలా రకాల వ్యాధులు సోకె ఆస్కారముంటుంది. ఆ వ్యాధి లక్షణాలను మరియు నివారణ పద్దతుల గురించి అవగాహనా ఉన్నట్లయితే చేపల సాగులో అత్యత్తమ ఫలితాలను పొందవచ్చు.
చేప పేను వ్యాధి (ఆర్గులోసిస్)
తెలుపు రంగులో బల్లపరుపుగా ఉండే ఆర్గులస్ అనే పరాన్నజీవి చేప శరీరం పై చేరి రక్తిని పీల్చుకుంటూ బతుకుతుంది. ముందుగా సున్నితమైన ప్రదేశాలైన రెక్కల కుదుళ్ల ఉదరం పై చేరి మిగతా శరీర భాగాలకు మెల్లిగా విస్తరిస్తుంది. నివారణకు డెల్లా మేత్రిన్ (1.75%) ఎకరాకు 100 మీ.లి. వాడుకోవాలి లేదా 0.5 కిలో పసుపు, 21 కిలోల సున్నం 18.5 కిలోల దొడ్డు ఇప్పతో 40 కిలోల మిశ్రమాన్ని తయారుచేసి చల్లాలి. చేప పేను తీవ్రత తగ్గని ఎదల మళ్ళీ మిశ్రమాన్ని 14 వ రోజున చెరువులో చల్లుకోవాలి.
రెడ్ డిసీజ్ (హేమరేజిక్ సెప్టిసీమియా)
రామనాస్ హైడ్రోపిల అనే యాక్టిరియా వలన పెంపకపు చెపాలలో ఈ వ్యాధి వస్తుంది. వ్యాధికారక బ్యాస్టీరియా చేప రాష్టంలోనూ ఇంకా ఇతర శరీర అంతరంగ అవయవాల్లోకి వ్యాపించడం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. వ్యాధి సోకినా చేపల్లో గుండె, కాలేయం, మూత్రపిండాలు ఉబ్బి ఉంటాయి. రక్తినాళిలు చిట్లడం వలన రక్తపు చారలు, రక్తపు గడ్డలు చేప శరీరంలోని, శరీర వెలుపల కూడా కనిపిస్తాయి. కాలేయం పసుపు రంగులో మారుతుంది. చేప నేతలు ముందుకు పొడుచుకొని వచ్చి, చేప మేత తీసుకోక బలహీనపడి చివరకు మరణిస్తాయి. ఈ వ్యాధి నివారణ కొరకు ఎంఓరోప్లేక్సిన్ లేదా ఆక్సిటెట్రాసైక్లోన్ లాంటి యాంటిబయటిక్స్ ను 100 గ్రాములు 1000 కిలోల చేపలకు వాడుకోవాలి.
తాటాకు తెగులు : ప్లెక్సీబాక్టర్ అనే బ్యాక్టీరియా వలన
ఆధారం : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం
Sir pdf uploade