অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సాంకేతిక ప్రమాణాల ఆచరణకు విధివిధానాలు

వేరియేషన్ క్లాజులోని అంశములకు లోబడి నిర్దేశితసాంకేతిక ప్రమాణాలకు లోబడి వున్న శీతల గిడ్డంగి ప్రాజెక్టులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ అర్ హత లభించును. దీనిని నిర్ధారించుకొను టకు ఈ క్రింది ప్రాతిపకికను అనుసరించవలెను

అంగీకార పత్ర విధానము

శీతల గిడ్డంగి నిర్మాణమును చేపట్టుటకు ముందే వ్యవస్థాపకునిచే అంగీకారపత్రం పొంద వలెను. నిర్ధేశింపబడిన యితర పత్రములతో బాటు ఈ క్రింది పత్రములను అంగీకార పత్ర దరఖాస్తుకు జతపరచవలెను.

  1. విశదంగా రూపొందింపబడిన ప్రాజెక్టు నివేదిక యొక్క ప్రతి
  2. అవసరమైనపత్రములతో బాటు ప్రాథమిక సమాచార పత్రంలో నిర్దేశిత సమాచారం నిర్దేశిత సాంకేతిక ప్రమాణాలకు లోబడి ప్రాజెక్టు ఉన్నదని నిర్దారించుకొనుటకు పత్రాల సాంకేతిక పరిశీలన నిర్వహింపబడును. మరియు నిల్వచేయు వస్తువు, నిల్వ పరిస్థితులు, శక్తి సామర్థ్యాలు, పరిసరాలు మరియు జాగ్రత్త చర్యలు మొదలగు విషయములను బట్టి కొద్దిపాటి తేడాలను అనుమతించవచ్చును.

సివిల్ నిర్మాణము

సివిల్ నిర్మాణము విషయంలో వ్యవస్థపకునిచే ఈ క్రింది పత్రములు సమర్పింప బడవలెను.

  1. స్థానిక ప్లానింగు అధికారిచే అనుమతింపబడిన భవన ప్లానుకు సంబంధించిన సర్టిఫికేట్
  2. భవన నిర్మాణ ప్రమాణాలు మరియు జాగ్రత్త చర్యల విషయంలో నిర్దేశితజ్ ప్రమాణాలకు లోబడి ఉన్నదని సంబంధిత సివిల్ డిజైన్ ఇంజినీరు నుండి సర్టిఫికేట్
  3. అనుమతింపబడిన ప్లాను మరియు ప్రమాణలకు లోబడి సివిల్ నిర్మాణము జరిగినదని స్థల ఇంజ నీరు./ఆర్కిటెక్టు నుండి సర్టిఫికేట్

థర్మల్ ఇన్సెలేషన్ మరియు రెఫ్రిజిరేషన్ విధానము, నియంత్రణ మరియు జాగ్రత్త చర్యలు

  1. ఇన్సులేషన్ మరియు రెఫ్రిజిరేషన్ విధానంలోనివిభాగాలు నిర్ధేశిత ప్రమాణాలకు లోబడి మరియు రేటింగ్ కు లోబడి ఉన్నవని సాంకేతిక డేటా పత్రనమూనాలో ఉత్పత్తిదారుచే దృవీకరింపబడి ఉండాలి.
  2. అంతేకాక ఈ ఉద్దేశ్యము కొరకు సంబంధిత అధికారి వర్గముచే ఏర్పాటు చేయబడిన తనిఖీ బృందము ప్రాజెక్టు నిర్మాణము/స్థాపించు స్థలమును వివిధ దశలలో తనిఖీ చేయవలెను.
  3. అంత్యముగా, నిర్దేశిత ప్రమాణాలకు లోబడి ప్రామాణిక సూచికలకనుగుణంగా శీతలీకరణ విధానం సంతృప్తికరముగా ఏర్పాటు చేయబడినదని ఉత్పత్తిదారు/శీతలీకరణ కాంట్రాక్టు పొందిన సంస్థ సర్టిఫికేట్ ను ఇవ్వవలెను.
  4. ఎలక్ట్రికల్ డ్రాయింగ్స్, నిర్వహణా మాన్యువల్, స్పేర్ పార్టుల జాబితా, శీతలీకరణ గిడ్డంగి యొక్క ప్లాను (లే ఔట్) మొదలగు వాటిని ఉత్పత్తిదారు/రిఫ్రిజిరేషన్ కాంట్రాక్టు ఏజన్సీ వారు అందచేయవలెను
  5. రెఫ్రిజిరేషన్ కంపెనీ/కాంట్రాక్టింగ్ ఏజన్సీచే ఇవ్వబడిన రెఫ్రిజిరేషన్ సిస్టమ్ నిర్వహణా సర్టిఫికేట్ మరియు కంపెనీ/ఏజన్సీ యొక్క అధీకృత పట్టభద్ర ఇంజనీరుచే సంతకం చేయబడిన పైన చెప్పబడిన పత్రములు సంబంధిత అధికారికి సమర్పించబడాలి. పై రికార్డు తాలూకు ప్రతిని ప్రాజెక్టు వ్యవస్థాపకుడు /యజమానికి ఇవ్వాలి

పూర్తయిఅన ప్రాజెక్టుల తనిఖీ /ఉమ్మడి తణిఖీకి మార్గదర్శకాలు

ఉద్దేశ్యం: అనుమతింపబడిన స్థలమునందు మరియు అన్ని విభాగాలతో సంతృపికరంగా, నాణ్యంగా, అనుమతింపబడిన శ్రామిక ప్రమాణాల ప్రకారం పని నిర్వహింప బడినదని, మొదటి ప్రాజెక్టు రిపోర్టు ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేయబడినదని నిర్ధారించుకొనుట తణిఖీ/ఉమ్మడి తణిఖీ యొక్క ప్రధాన ఉద్దేశ్యము. విభాగం వారీగా లబ్దిదారుచే చేయబడిన అసలు ఖర్చుకు ఆధారంగా ఉన్న్ ఓచర్లు, కార్డులను పరిశీలించి ప్రాజెక్టు యొక్క వ్యయాన్ని మదింపు చేయుటకు ఈ తనిఖీ ఉద్దేశింపబడినది. సృష్టింపబడిన ఆస్తుల మనుగడకు సాక్ష్యంగా జాతీయ ఉద్యానవనబోర్డు వారి ఆదేశాల ప్రకారం ప్రాజెక్టు యొక్క్ ఫోటోలు/ వీడియోలు కూడా అందచేయబడాలి

ప్రాజెక్టు పూర్తయినట్లుగా తెలియజెప్పుట మరియు తనిఖీ /ఉమ్మడి తనిఖీ నిర్వహించుట

పరపతితో ముడిపెట్టబడిన ఏ ప్రాజెక్టుకయితే జాతీయ ఉద్యానవనబోర్డు వారిచే అనుమతి పత్రం జారీ చేయబడినదో ఆ ప్రాజెక్టు పూర్తయిన తరువాత వ్యవస్థాపకుడి సంబంధిత ఆర్ధిక సహాయ సంస్థ/ బ్యాంకు వారు జాతీయ ఉద్యానవన బోర్డు వారి రాష్ట్ర ఇన్ ఛార్జిని సంప్రదించిన మీదట ఉమ్మడి తణిఖీకి ఒక తేదీని నిన్ణయించును.ఆ ప్రాజెక్టులు లబ్దిదారు సమక్షంలో జాతీయ ఉద్యానవన బోర్డు ప్రతినిధి మరియు ఆర్దిక సహాయ సంస్థ/ బ్యాంక్లు యొక్క ప్రతినిధిచే ఉమ్మడిగా తణిఖీ చేయబడును. జాతీయ ఉద్యానవన బోర్డు వారి ఆదేశాలమేరకు రాష్ట్ర ఉద్యానవన డైరెక్టరేట్ యొక్క ప్రతినిధి కూడా ఈ తణిఖీలో పాల్దొనును. తణిఖీ రిపోర్టు యొక్క ముఖ్య లక్షణాలు

నిర్దేశింపబడిన నమూమ్ఆలో సంబంధిత ఆర్ధిక సహాయ సంస్థ/ బ్యాంకు వారిచే జాతీయ ఉద్యానవన బోర్డుకు బ్యాంకు తణిఖీ రిపోర్టు / ఉమ్మడి తణిఖీ రిపోర్టు సమర్పింపబడాలి.ప్రజెక్టు విభాగాఅల వివరణతోను, ప్రాజెక్టు స్థలం, నిధుల లభ్యత, ప్రాజెక్టు విభాగాలు అన్నియు క్రొత్తగా మొదలగు విషయాలతో తణిఖీ రిపోర్టు వ్రాతపూర్వకంగా సమర్పింపబడాలి. జాతీయ ఉద్యానవన బోర్డు వారి ఆదేశాల ప్రకారం ఆ రిపోర్టుకు సంబంధిత ఫోటోలు/ వీడియో గ్రాపులను జతపరచవలెను.

ప్రాజెక్టు పూర్తయిన పిదప ప్రాజెక్టు మరియు ప్రాజెక్టు విభాగాల యొక్క వ్యయాన్ని అంచనావేయుట ప్రాజెక్టు మొత్తంగాను మరియు ప్రాజెక్టు విభాగాలవారీగా వ్యయాన్ని మదింపు చేయువల సిన బాధ్యత తణిఖీ అధికారి/ ఉమ్మడి తణిఖీ బృందంపై ఉన్నది. పొందిన సేవలు/ సేకరణకు సంబంధించిన ఓచర్లు /నగదు రశీదులు మొదలగు పత్ర సంబంధమైన సాక్ష్యాధారాలను పరిశీలించుట జరుగును. ఒక్కొక్కపుడీ ఓచర్లు /నగదు రశీదుల క్రమబద్ధత సరిగా లేనపుడే స్థానిక రేట్లను పరిగణనలోనికి తీసుకొనుట ద్వారా వ్యయాన్ని మదింపు చేయవచ్చును. చార్టర్డు అకౌంటెంట్ చే విలువకట్టబడిన మొత్తాన్ని కూడా పరిగణనలోనికి తీసుకొనవచ్చును. చార్టర్డు అకౌంటెంట్ యొక్క సర్టిఫికెట్ ఆధారంగా పూర్తయిన పని విలువలను బట్టి ఆర్ధిక సహాయ సంస్థ/ బ్యంకులు అప్పు తాలూకు తదుపరి మరియు అంత్య వాయిదాలను విడుదల చేయును .ప్రాజెక్టు మొత్తంగాను మరియు విభాగాల వారీగా వ్యయ నిర్ధారణ చేయుటకు ఆ పత్రాలు ఆధారం కావచ్చును.

సూచన: తన ప్రజెక్టుకు సంబంధించిన సబ్సిడీ క్లెయిమును పంపించుటకు నిర్ణీత నమూనాలో క్రొత్త ధృవ పత్ర సమర్పణ ఆవస్యకత మొదలగు విషయాలను లబ్దిదారుకు తెలియపరచాలి.

ఆదారము:జాతీయ ఉద్యానవన బోర్డు వారి వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate