హోమ్ / ఇ-పాలన / ఇ-పాలన వనరులు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఇ-పాలన వనరులు

ఈ విభాగం ప్రపంచ ఇ-పాలన వనరుల యొక్క వివిధ నివేదికల వివరాలను అందిస్తుంది.

ఇ- పాలన పై శిక్షణ కార్యక్రమం

  1. ఇ- గవర్నెన్స్ పై ఆన్ లైన్ కోర్సు (యు ఎన్ పి ఏ ఎన్ )

సి ఎస్ సి కార్యక్రమాలకు రాష్ట్రాలలో అధికృత సంస్థలు

  1. ఎలెక్ట్రానికల్లీ డెలివరబుల్ సర్వీసెస్ ( ఆంధ్ర ప్రదేశ్ )
  2. సొసైటీ ఫర్ ప్రొమోషన్ ఆఫ్ వొకేషనల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ( అండమాన్ , నికోబార్ దీవులు )
  3. అస్సాం ఎలెక్ట్రానిక్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ( అస్సాం)
  4. బీహార్ స్టేట్ ఎలెక్ట్రానిక్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ( బీహార్ )
  5. సొసైటీ ఫర్ ప్రొమోషన్ ఆఫ్ ఐ టి ఇన్ చండీఘర్
  6. చత్తీస్ ఘర్ ఇన్‌ఫో టెక్ అండ్ బయో టెక్ ప్రొమోషన్ సొసైటి ( చత్తీస్ ఘర్ )
  7. ఆమ్నీబస్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ( డామన్ , డయూ )
  8. గోవా ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్ ( గోవా )
  9. హర్యానా స్టేట్ ఎలెక్ట్రానిక్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ( హర్యానా )
  10. సొసైటి ఫర్ ప్రొమోషన్ ఆఫ్ ఐ టి అండ్ ఇ గవర్నెన్స్ ( హిమాచల ప్రదేశ్ )
  11. ఝార్ఖండ్ ఏజెన్సీ ఫర్ ప్రొమోషన్ ఆఫ్ ఐ టి ( ఝార్ఖండ్ )
  12. సెంటర్ ఫర్ ఇ-గవర్నెన్స్ ( కర్ణాటక)
  13. కేరళ స్టేట్ ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజి మిషన్ (కేరళ )
  14. ఎంపి స్టేట్ ఎలెక్ట్రానిక్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (మధ్యప్రదేశ్ )
  15. ఎస్ ఇ టి యు మహారాష్ట్ర ( మహారాష్ట్ర )
  16. మిజోరం స్టేట్ ఇ-గవర్నెన్స్ సొసైటి ( మిజోరం )
  17. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఐ టి ( నాగాలాండ్ )
  18. ఒరిస్సా కంప్యూటర్ అప్లికేషన్ సెంటర్ ( ఒరిస్సా )
  19. రాజస్థాన్ స్టేట్ ఏజెన్సీ ఫర్ కంప్యూటర్ సర్వీసెస్
  20. తమిళనాడు ఇ- గవర్నెన్స్ ఏజెన్సీ ( తమిళనాడు )
  21. సెంటర్ ఫర్ ఇ- గవర్నెన్స్ ( ఉత్తరప్రదేశ్ )
  22. వెస్ట్ బెంగాల్ స్టేట్ రూరల్ డెవలప్‌మెంట్ ఏజన్సీ (పశ్చిమ బెంగాల్ )

నివేధిక – సిఫార్సు

ఇ గవర్నెన్స్ పై జాతీయ విజ్ఞాన కమీషన్ సిఫారసులు

జాతీయ విజ్ఞాన కమీషన్ (ఎన్ కే సి) నందన్ నిలేకని ఆద్వర్యంలో ఇ గవర్నెన్స్ ను అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేక జట్టును నియమించింది. ఈ జట్టు అందించిన నివేదికను ప్లానింగ్ కమీషన్ చర్చించాక సమాచార మంత్రిత్వ శాఖ మంత్రికి అందించడం జరిగింది. ఎన్ కే సి చేసిన సిఫారసుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రపంచ ఇ- పార్లమెంట్ నివేదిక -2010

ఇ-పరిపాలన పై పనిచేస్తున్న సంస్థలు

ప్రగతి సంగణన వికాస కేంద్రం (సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆప్ అడ్వాన్సడ్ కంప్యూటింగ్ ) – సి-డాక్

ఉత్తమ పరిపాలన కేంద్రం ( సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ) – సిజిజి

డేటాక్వెస్ట్

డిజిటల్ గవర్నెన్స్ డాట్ ఒఆర్జి ఇనిషియేట్

ది సోసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఆఫ్ ఇ-గవర్నెన్స్

ఇ-పరిపాలన ఆన్ లైన్

ఇ-పరిపాలన ఉత్తమ ప్రమాణాలు

ఇ-పరిపాలన – పర్యవేక్షణ

ఇనిస్టిట్యూట్ ఫర్ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్

ఐ గవర్నమెంట్

యం-గవ్ వరల్డ్

డిపార్టుమెంటు ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

యంపి పోస్ట్

నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ స్మార్ట్ గవర్నెన్స్

నేషనల్ ఇ-గవర్నెన్స్ స్టేట్ హోల్డర్స్ ఫోరమ్

నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్

యునెస్కో

యుయన్.పి.ఏ.యన్

వార్తా వాహిని

హిమాచల్‌ ప్రదేశ్‌లో అన్ని పంచాయితీలలో ఇ-గవర్నెన్స్‌ కేంద్రాలు

హిమాచల్‌ ప్రదేశ్‌లో అన్ని పంచాయితీలలో గ్రామ్‌ సుగమ్స్‌ అనే పేరుతో 3361 ఇ-గవర్నెన్స్‌ కేంద్రాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వీటిని పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యంతో జిల్లా స్థాయి ఇ-గవర్నెన్స్‌ ప్రాజెక్ట్‌లకు కొనసాగింపుగా ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రం మొత్తాన్ని సివ్లూ(933), మండి(1293), కంగ్రా(1113) అని 3 డివిజన్లుగా విభజించి ఈ ప్రాజెక్టును అమలుచేయనున్నారు.
ఈ కేంద్రాలు గ్రామాల్లో డ్రైవింగ్‌ లైసెన్స్‌, కుల ధృవీకరణ పత్రం, టెలిఫోన్‌, విద్యుత్‌ బిల్లుల చెల్లింపులు వగైరా వంటి పలుసేవలను అందిచనున్నాయి. ఈ గ్రామ్‌ సుగమ్స్‌ కేంద్రాలన్నీ హిమాచల్‌ ప్రదేశ్‌ స్టేట్‌ వైడ్‌ ఏరియా నెట్‌వర్క్‌ (హిమ్‌స్వాన్‌) ద్వారా బ్లాక్‌, డివిజన్‌, రాష్ట్ర రాజధాని వంటి వివిధ స్థాయుల్లో అనుసంధించడం జరుగుతుంది. దీని ఫలితంగా ప్రజలు అన్ని రకాల ప్రభుత్వం ప్రజలకందించే సేవలను పంచాయితీల స్థాయిలోనే పొందవచ్చు.
ఈ ప్రాజెక్టును విజయవంతంగా అమలుచేయడంవల్ల రాష్ట్ర వ్యాప్తంగా 3500కు పైగా ఉద్యోగాలను ఏర్పాటు చేయడం మాత్రమేకాక ఐటి, ఐటి ఆధారిత సేవలన్నిటికీ అందరికీ అందుబాటులోకి తేవడం జరుగుతుంది.

జార్ ఖండ్‌లో ఇక హైటెక్‌ మాతా శిశు సంక్షేమం

రాంచి:మమత అనే సాఫ్ట్‌వేర్‌ను జార్ ఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం ద్వారా ఆ రాష్ట్రంలోమాతా శిశు సంక్షేమ పథకాలను పర్యవేక్షించనుంది. ప్రతి పిల్లనూ, పిల్లవానినీ వారి పెరుగుదలనీ పర్యవేక్షించడం సుసాధ్యమయ్యే అవకాసం ఉంది. శిశు మరణాల రేటు, మాతృ మరణాల రేటు, మొత్తం సత్తువ రేటు వంటి వాటిని తగ్గించడమే లక్ష్యంగా ఈ సాఫ్ట్‌వేర్‌ రూపొందింది.
సౌకర్యాలు :

  • గర్భవతుల వివరాలను, అపుడే పుట్టిన పసికందు వివరాలను అంగన్‌వాడీ స్థాయిలో సేకరిస్తుంది
  • డేటాబేస్‌లో తల్లి పేరున, బిడ్డ పేరున వివరాలను వెదికే విశిష్ట సౌకర్యం ఉంది
  • ప్రతి తల్లినీ, బిడ్డనీ విడివిడిగా దృష్టిలో ఉంచుకొని వారి పోషక విలవల స్థితులను పర్యవేక్షిస్తుంది
  • నిపుణులు, సంస్థలు ఎంతమందికి పురుడు పోశారో , ఎలాటి ప్రసవాలు జరిగాయో(సిజేరియన్‌, సాధారణం, మరణించిన బిడ్డ) కూడా పర్యవేక్షిస్తుంది
  • వ్యాధి నిరోధక కార్యక్రమాల పరిస్థితిని పర్యవేక్షిస్తుంది
  • అంగన్‌వాడీ వారీగా లబ్దిదారుల వివరాలు, వ్యాధి నిరోధక టీకాలు వేయాల్సిన వారి వివరాలతో నివేదికలు పొందవచ్చు
  • తయారైన నివేదికల ఆధారంగా సూచనలనూ రూపొందించగలదు

ఆధారము: http://www.igovernment.in/site/jharkhand-takes-mother-child-care-programme-hi-tech/

ఇ-గవర్నెన్స్ కోసం అధికారులకు శిక్షణ నిమిత్తం రు. 313 కోట్లు వెచ్చించనున్న భారతదేశం

దేశ ఇ - గవర్నెన్స్ ప్రణాళికను దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలుచేసేందుకు వీలుగా, సామర్ధ్య నిర్మాణ పథకం(ఎన్ఇజిపి) అనేదాన్ని గురువారం(జనవరి 09, 2008) ప్రభుత్వం ఆమోదించింది. ముఖ్యంగా రాష్ట్ర స్థాయి ప్రణాళిక, నిర్ణయాలు చేసే వారికి తగిన సాంకేతిక, వృత్తి పరమైన సాయాన్ని అందించి తద్వారా వారు ఇ - గవర్నెన్స్ అమలుకు కావలసిన నైపుణ్యాన్ని అలవర్చుకోవడానికి వీలయ్యేలా ఈ పథకం వినియోగిస్తుంది. తద్వారా వివిధ రాష్ట్రాల్లో శిక్షణా సంస్థలను పటిష్టం చేయడంతోబాటు అంతర్జాతీయంగా వాడే అత్యుత్తమ పనితనం అలవడేలా చూస్తుంది. దీనికి 3 ఏళ్ల వ్యవధిలో రు. 313 కోట్ల నిధులు కేటాయించారు. దానిని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ అమలు చేస్తుంది. ఈ పథకం వివరాలు ఇవి :

  • సంస్థాగత ముసాయిదాను రూపొందించి తద్వారా రాష్ట్ర స్థాయి నిర్ణయాలు తీసుకోడానికి వీలునివ్వడమేకాక అందు నిమిత్తం రాష్ట్ర ఇ - గవర్నెన్స్ మిషన్ టీంలను(ఎస్ఇఎంటి) ఏర్పాటు చేయడం.
  • ప్రత్యేక శిక్షణనివ్వడం, ఎస్ఇఎంటిల కోసం, నిర్ణయాధికారుల (రాష్ట్ర లెజిస్లేచర్లు, సీనియర్ బ్యురోక్రాట్లు) కోసం నిర్దేశనా కార్యక్రమాన్ని చేపట్టడం, జ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడం, అంతర్జాతీయంగా వాడే అత్యుత్తమ పనితనం అందరికీ అందుబాటులోకి తేవడం.
  • వివిధ రాష్ట్రాల్లో శిక్షణా సంస్థలను పటిష్టం చేయడం .
  • ప్రభుత్వ ఆమోదం వల్ల సామర్ధ్య నిర్మాణ నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటుచేయడం సాధ్యమౌతుంది. తద్వారా పథకం అమలుకు తోడ్పాటు, పర్యవేక్షణలు సాధ్యమౌతుంది. ఇది ఐటి కార్యదర్శి సారధ్యంలో దీని కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శక్తియుత కమిటీ నేతృత్వంలో పనిచేస్తుంది.

ఇకపై 90 రోజులకు ముందుగానే రైలు టికెట్ల బుకింగ్

కస్టమర్ సేవలను మరింత మెరుగుపరచి, వారి ప్రయాణ పథకాలను ముందే ఏర్పాటు చేసుకోవడంలో వీలు కలిగించే దిశగా భారతీయ రైల్వే ప్రయాణీకులు 90 రోజుల ముందే టికెట్లను రిజర్వ్ చేసుకొనేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రైల్వే శాఖ ప్రకారం, ఇపుడున్న 60 రోజుల సౌకర్యాన్ని, ప్రయాణ తేదీ కాకుండా 90 రోజులకు పెంచుతూ రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకొంది. ఫిబ్రవరి 2008 నించి ఇది అమలులోకొస్తోంది.
ఐతే, పగటిపూట మొదలయ్యే తాజ్, గోమతి వంటి ఎక్స్ ప్రెస్ రైళ్లకిది వర్తించదు. అలాగే విదేశీ పర్యాటకుల కోసం ఉన్న 360 రోజుల పరిమితిలో కూడా ఎలాంటి మార్పు ఉండబోదని రైల్వే శాఖ ప్రకటించింది.

ఆధారము: http://www.igovernment.in/site/now-book-your-rail-ticket-90-days-in-advance/

జి 2 సి సేవలను అందించనున్న 3ఐ ఇన్ఫోటెక్

ఇంటర్నెట్ సేవలు, ప్రభుత్వ ప్రజల సేవలు(జి2సి) అందించే సామాన్య సేవా కేంద్రాలను(సిఎస్సి) రాష్ట్రంలోని ఐదు జోన్ల లోనూ ఏర్పాటు చేయడానికి 3ఐ ఇన్ఫోటెక్ సంస్థను తమిళనాడు ప్రభుత్వం ఎంపిక చేసింది.
హర్యానా ప్రభుత్వంనించి 322 సిఎస్సిలను గుర్గావ్ లో ఆరంభించడానికి ఆర్డర్లను పొందిన 3ఐ ఇన్ఫోటెక్ సంస్థ, తమిళనాడులో ప్రతిపాదించిన 5440 లో4400 పై చిలుకు సిఎస్సిలను త్వరలో ఆరంభించనున్నది. త్వరలో వేలూరు, కృష్ణగిరి, ధర్మపురి, తిరువణ్ణామలైలలో సర్వీస్ ప్రొవైడర్లను ఎంపిక చేయనుంది.
ఈ సిఎస్సిలు తాలూకా కార్యాలయాల్లో, కలెక్టరేట్లలో, రిజిస్ట్రేషన్ శాఖలో, రవాణా శాఖలో, పౌర సరఫరా శాఖలో, మునిసిపాలిటీలలో లభించే వివిధ ప్రభుత్వ సేవలను అందించే సింగిల్ విండోగా పనిచేస్తాయి. ఇ - గవర్నెన్స్ చొరవలను ముందుకు తీసుకెళ్లడంలో ఈ సిఎస్సిల ఏర్పాటుకు తమిళనాడు ఇ - గవర్నెన్స్ ఏజన్సీ(టిఎన్ ఇజిఏ) నోడల్ ఏజన్సీగా వ్యవహరిస్తుంది.ఈ ప్రతిపాదనల ప్రకారం, సర్వీస్ ప్రొవైడర్లు ప్రతి 3 గ్రామాలకో గ్రామంలో ఒక సిఎస్సిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఇదే కనీస మితి మిగిలిన రాష్ట్రాల్లోప్రతి 6 గ్రామాలకు ఒక గ్రామంలో సిఎస్సి ఉండాలని ఉంది.

ఇ - గవర్నెన్స్ వర్క్ షాప్ ను నిర్వహించనున్న ఎన్ఐసి

నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసి) 4 రోజుల ఇ - గవర్నెన్స్ వర్క్షాప్ను నిర్వహించనుంది ఇందులో వివిధ పబ్లిక్ సెక్టర్ సంస్థలకు చెందిన అధికారులు, సీనియర్, మధ్య స్థాయి ప్రభుత్వ అధికారులు పాల్గొంటారు.
ఈ వర్క్ షాప్ ను భారత ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ & ట్రైనింగ్ స్పాన్సర్ చేస్తోంది. ఎన్ఐసి ప్రధాన కార్యాలయంలో ఫిబ్రవరి 4 - 8, 2008 లో ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎన్ఐసి శిక్షణా విభాగం దేశంలోని ఇ - గవర్నెన్స్ ఫ్రేంవర్క్ గురించి ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి తెలియజేస్తారు.
ఇ - గవర్నెన్స్ తీరూ తెన్నులతో బాటు ఇందులో పాల్గొనే వారికి ఇ - గవర్నెన్స్ అంతర్జాతీయరంగంలో ఎలా అమలౌతోందో తెలియజేయడమే కాక, ఈ ఇ - గవర్నెన్స్ అమలులోని వివిధ దశలు, ఇ - తయారీ, టెక్నాలజీ ఆధారిత గవర్నెన్స్కి సంస్థాపరమైన మార్గదర్శకం ఎలా ఉండాలో తెలియజేస్తారు. .
ఎన్ఐసి అధికారులు చెప్పిన ప్రకారం, ఈ కోర్సులో ఇ - గవర్నెన్స్ ప్రాజెక్టుల అభివృద్ధి చేయడం, అమలు చేయడం, వాటిలో ఉండే సమస్యలు, విభిన్న మెళుకువలు వంటి విషయాలను చర్చించడం జరుగుతుంది.

ఇ - గవర్నెన్స్ కోసం 9000 కియోస్కులను ఏర్పాటుచేయనున్న మహారాష్ట్ర ప్రభుత్వం

మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9000 కియోస్కులను బిల్డ్, ఆపరేట్, ఓన్, ట్రాన్స్ఫర్(బూట్) పద్ధతిలో ఏర్పాటు చేసే యోచనలో ఉంది. తద్వారా 2088 సంవత్సరాన్ని 'ఐటి - ఇ గవర్నెన్స్ సంవత్సరం' గా ప్రకటించనుంది.
ఈ కియోస్క్ లు భూమి రికార్డులు, వివిధ లైసెన్సులు, కుల, స్థానిక ధృవీకరణ పత్రాలు, వ్యాట్ రిటర్న్ ఫైలింగ్, మోటారు వాహనాల పన్ను చెల్లింపు, వృద్ధులకు, అభాగ్యులకు వివిధ రాష్ట్ర ప్రభుత్వ పించను పథకాలకై నమోదు వంటి వివిధ ప్రభుత్వ సేవలను అందించనున్నాయి. ఈ కియోస్క్ లను నడిపే ఆపరేటర్లు వారి పెట్టుబడిని తిరిగి పొందడానికి వీలుగా యూజర్ ఛార్జీలను వసూలు చేయడానికి అనుమతి నివ్వడం జరుగుతుంది. ఈ కియోస్క్ లను పర్యవేక్షించడానికి ప్రతి చిన్న పట్టణంలోనూ ఒక బ్రాంచి ప్రభుత్వ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. అదే సమయంలో ఇ - గవర్నెన్స్ చొరవలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని 358 తాలూకా కేంద్రాలను, 35 జిల్లా కేంద్రాలను బ్రాడ్ బ్యాండ్ ద్వారా రాష్ట్ర మంత్రిత్వ శాఖకు అనుసంధానం చేశారు.

ఆధారము: http://www.egovonline.net/news/news-details.asp?NewsID=13117

ఇ - గవర్నెన్స్ పైలట్ ప్రాజెక్టును ఆరంభించిన పంజాబ్ ప్రభుత్వం

పంజాబ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మునిసిపల్ కార్పొరేషన్లను, కౌన్సిళ్లను కంప్యూటరీకరించాలని నిశ్చయించింది. దీని కోసం మైక్రోసాఫ్ట్ సంస్థతో ఒక పైలట్ ప్రాజెక్ట్ను చేయడానికి ఒక ఒప్పందాన్ని (ఎంఓయు) కుదుర్చుకొంది.
మునిసిపల్ కార్పొరేషన్లు ముఖ్య ప్రాతిపదికపై విభాగాలను కంప్యూటరీకరించనున్నాయి. తొలి దశలో ఇవన్నీ వెబ్ ఆధారితమైన అప్లికేషన్లుగా అమలయ్యి, తద్వారా ప్రజలు సమాచారాన్ని ఆన్లైన్గా చూసుకొనే సౌకర్యాన్నిస్తాయి. రెండో దశలోఆన్లైన్గా చెల్లింపు చేసే సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రజలు ఈ సేవలద్వారా ఇంటిపన్ను, నీటి, మురుగునీటి పన్ను, జనన, మరణ ధృవ పత్రాలు, ఆర్థిక లావాదేవీల లెక్కలు - అన్నీ చెల్లించవచ్చు, పొందవచ్చు.

ఇ - గవర్నెన్స్ అజెండాతో పెద్ద ఎత్తున సాగుతోన్న బీహార్

ఎట్టకేలకు టెక్నాలజీ పురుగు అనేది బీహార్ ప్రభుత్వాన్నీ కుట్టింది. 160 రు. కోట్ల విలువైన 6 ఇ - గవర్నెన్స్ ప్రాజెక్టులకై ప్రభుత్వం టాటా కన్సల్టెన్సీ సర్వీస్(టిసిఎస్)తో చేయి కలిపింది. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను కంప్యూటరీకరించడంతో ఆరంభమయ్యింది. ఇ - గవర్నెన్స్ దిశగా దీన్ని తొలి మెట్టుగా ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల ఎలాటి బాదరబందీ లేకుండా ఎంతో సమర్థవంతంగా ప్రజలు తమ పనులను చేసుకో గల్గుతున్నారు.
ఈ చొరవల గురించిన వివరాలందిస్తూ, బీహార్ ఉప ముఖ్యమంత్రి సుషీల్ కుమార్ మోడి, ఈ 6 చొరవలలో సమగ్ర ట్రెజరీ మేనేజిమెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం(సిటిఎంఐఎస్), వాల్యూ యాడెడ్ టాక్స్ మేనేజిమెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం(వాట్ఎంఐఎస్), సిటిజన్ సెంట్రిక్ పోర్టల్( బీహార్ ఆన్లైన్), ఇంటిగ్రేటెడ్ వర్క్ఫ్లో మరియూ డాక్యుమెంటేషన్ సిస్టం(ఐడబ్ల్యుడిఎంఐఎస్), బ్రైన్ డేటా సెంటర్, బీహార్ స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్(బీహార్ స్వాన్) ఉన్నాయని చెప్పారు.
ఈ ఆరు చొరవలకు సంబంధించిన పైలట్ ప్రాజెక్టులూ ఫిబ్రవరిలోనే ఆరంభం అయ్యేలా చూడాలని ప్రభుత్వం యోచిస్తున్నా, ఏప్రిల్లో లాంఛనప్రాయంగా ఆరంభించనుంది. ఐడబ్ల్యుడిఎంఐఎస్ అనేది తొలిదశలో 8 రాష్ట్ర కార్యాలయాల్లో, సెక్రటేరియట్లో ఆరంభం కానుంది. బీహార్ స్వాన్ 4 దశలలో అన్ని 38 జిల్లాలలోనూ అమలుకానుంది.
మౌలిక సదుపాయాలు డేటా సేవలు, వీడియో కాన్ఫరెన్సింగ్, వాయిస్ కాన్ఫరెన్సింగ్, ఇమెయిల్ సౌకర్యాలను అన్ని జిల్లా, బ్లాకులకూ అందించే దానికి రాష్ట్ర ప్రభుత్వానికి తోడ్పడనున్నాయని ఆయన అన్నారు.
ఈ స్వాన్ ప్రాజెక్ట్కై రాష్ట్ర ప్రభుత్వం రు. 125 కోట్లు వెచ్చించనుండగా, ఇప్పటికే రు. 19 కోట్లతో డేటా సెటర్ని ఆరంభించింది. బీహార్ ఆన్లైన్ అనేది ప్రజా పోర్టల్ - అంటే ప్రజలు జనన, మరణ, కుల ధృవీకరణ పత్రాలు చాలా త్వరగా అతి తక్కువ సమయంలో పొందవచ్చు. ఇతర పౌర సేవలూ ఇందులో లభ్యం కానున్నాయి.

ఆధారము: http://www.igovernment.in/site/bihar-goes-high-on-e-gov-agenda/

ఇ - గవర్నెన్స్ చొరవను ఆరంభించిన పాట్నా మునిసిపల్ కార్పొరేషన్

పాట్నా మునిసిపల్ కార్పొరేషన్, www.patnanagarnigam.org అనే తన పోర్టల్ను ఆరంభించడంతో ఇగవర్నెన్స్ చొరవలను ఆరంభించడంలో ఒక అడుగు ముందుకు వేసింది. ఇది ప్రజలకు జనన ధృవీకరణ పత్రాలు, రిజిస్ట్రేషన్ పత్రాలను డిజిటల్ సంతకాలతో ప్రజలకు జారీ చేయగలదు.
కేంద్ర సంచార మంత్రిత్వ శాఖకు చెందిన ఐటిఐ సంస్థ దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసింది. జనన, మరణ ధృవీకరణ పత్రాలు ఎలాటి ఆలస్యం లేకుండా, సులభంగా పొందవచ్చు. పైగా, తన డిమాండ్ స్థితి ఎప్పటికప్పుడు సైట్లోకెళ్లి ఒక క్లిక్తో తెల్సుకోవచ్చు. సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయడానికి దాదాపు 100 సంస్థలు పోటీ పడగా, అందులో ఐటిఐ సంస్థ ఎంపిక అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం పాట్నాను మెట్రోపాలిటన్ సిటీగా మార్చే యోచనలో ఉంది. పాట్నా గంగానది కావలనున్న పరిసర హాజీపూర్ కూడా ప్రతిపాదిత గ్రేటర్ పాట్నా లో కలవనుంది. ఈ ప్రాజెక్టుకై కేంద్ర ప్రభుత్వం 550 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. దీనిలో, పట్టణ మౌలిక సేవల పథకం కింద 313 కోట్లు బీదవారికి కొత్త ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి కేటాయించింది.

ఆధారము: http://www.egovonline.net/news/news-details.asp?NewsID=13141

ఆన్ లైన్ 'జీవన్' ప్రాజెక్ట్ అమలుకు ఢిల్లీ కేబినెట్ అంగీకారం

ఆన్లైన్ జీవన్ ప్రాజెక్ట్ అమలుకు 14 జనవరి, 2008 నాడు ఢిల్లీ కేబినెట్ అంగీకారం తెలిపింది. ఇది వివిధ మంత్రిత్వ శాఖలూ, విభాగీయ శాఖలూ అందించే వివిధ సేవలను ఒకే చోట లభించేలా చేసి ఢిల్లీని నిజంగా ఒక హైటెక్ సిటీగా రూపొందించనుంది. జీవన్ ప్రాజెక్ట్ కోసం 23 శాఖలనూ, 104 సేవలనూ గుర్తించడం జరిగింది. వీటిలో 45 అత్యంత కీలకమైన సేవలు ఆరంభంలోజీవన్ కంప్యూటరీకరించిన కేంద్రాలు లేదా పోర్టల్ ద్వారా, ఆన్లైన్ చెల్లింపు గేట్ వే సౌకర్యంతో అందించనున్నారు.
ఇది పౌర సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. తద్వారా అన్ని ప్రభుత్వ ఏజన్సీలూ, కొన్ని వ్యాపార సంస్థలూ ఈ మౌలిక సదుపాయాలను వాడుకొంటాయి. ప్రవేటు-పబ్లిక్ భాగస్వామ్యం పద్ధతిలో ఈ పథకం నడుస్తుంది. తద్వారా ఖర్చుకు తగ్గ ఫలితం, జవాబుదారీతనం మెరుగ్గా ఉంటుంది. అనువైన ప్రాంతాల్లో కియోస్కులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్, డెవలప్మెంట్ అథారిటీ, జలబోర్డ్, విద్యుత్ పంపిణీ సంస్థలు, కొత్త ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్, అగ్నిమాపక సంస్థ, మహానగర్ టెలిఫోన్ లిమిటెడ్, మరి ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఇతర శాఖలూ ఇందులో ఉన్నాయి. ఈ కంప్యూటరీకృత పౌర సేవలలో లేదా వెబ్ పోర్టల్ పలురకాల బిల్లుల చెల్లింపు, వివిధ ఫారములు, దరఖాస్తుల జారీ, సమాచార బ్రోచర్లు -వంటి పలు సేవలు ఉన్నాయి.

ఏకీకృత పోర్టల్ ను ఆరంభించనున్న ఢిల్లీ ప్రభుత్వం

ఢిల్లీ జాతీయ ముఖ్య పట్టణ పరిసర ప్రభుత్వం(జిఎన్సిఐడి) తన రాష్ట్ర పోర్టల్ http://delhigovt.nic.in/index.asp ను వివిధ పోర్టల్స్ తో ఏకీకృతం చేయ నిశ్చయించింది.. తద్వారా అన్ని రకాల సమాచారానికీ, ప్రజల, వ్యాపారస్థుల, సందర్శకుల అవసరాలకి ఏకీకృత గవాక్షంగా ఇది పనిచేయనుందని ఢిల్లీ రాష్ట్ర సమాచార పరిజ్ఞాన శాఖ తెలిపింది.
ప్రస్తుతం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తన వివిధ శాఖల సేవలను, సమాచారాన్ని దాదాపు 81 వెబ్సైట్ల ద్వారా అందిస్తోంది. ఈ కొత్త పోర్టల్ ప్రేంవర్క్ ద్వారా సేవలెంతో సరళీకృతం కానున్నట్టు జిఎన్సిఐడి భావిస్తోంది. అటు పోర్టల్ నిర్వాహకులకూ, ఇటు యూజర్లకూ వారి వారి ఐచ్ఛికాలకనుగుణంగా సెట్టింగ్స్ చేసుకోవచ్చని ఆ శాఖ ప్రకటించింది.
జిఎన్సిఐడి ఈ పోర్టల్ సమాచార నిర్వహణ వ్యవస్థకు తయారు చేసిన ప్రతిపాదనా విన్నపం(ఆర్ఎఫ్పి) ప్రకారం, ప్రతి పోర్టల్ యూజర్కూడా తనకవసరం అయినట్టు పోర్టల్ స్వరూపాన్ని ఎంచుకోవచ్చు. వ్యక్తిగతీకరించుకోవచ్చు. రంగులు, రూపు ఎంచి సెట్ చేసుకోవచ్చు. సాముదాయక సౌకర్యాలను ఇంట్రానెట్ పై ఇవ్వడం, డాక్యుమెంట్లను ఇవ్వడం, చర్చావేదికలనేర్పాటు చేయడం, చాట్ ఏర్పాటు, డైనమిక్ గ్రూప్, టీం తయారీ, మెసేజీ పంపుకోవడం, ప్రకటనలను జారీ చేయడం కూడా సాధ్యం.
ఇంటరాక్టివ్ సౌకర్యాలలో విడియో, ఆడియో, అప్లికేషన్లను పరస్పర మార్పిడి చేసుకోవడం వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ కొత్త పోర్టల్ ఫ్రేంవర్క్తో ఇపుడున్న వెబ్సైట్నూ, భవిష్యత్లో రానున్న వాటినీ ఏకీకృతం చేయడం జరుగుతుంది. తద్వారా వివిధ సేవలను సులభంగా ఒకే చోట అందుకోవచ్చు. అలాగే తరచూ వాడే ఇగవర్నెన్స్ సమాచార సేవలూ పొందవచ్చు. ఈ పోర్టల్ సమాచారాన్ని పోగుచేసి, వివిధ లింక్లనూ ఏర్పరచి, ఢిల్లీ ప్రభుత్వ డేటాను, ఇతర సమాచారాన్నీ ఒక పద్ధతిలో పొందేందుకు వివిధ టూల్స్ ఉపకరిస్తాయి.

ఆధారము: http://www.igovernment.in/site/delhi-plans-one-stop-portal/

పరిశ్రమల పోర్టల్ ను ప్రారంభించిన హర్యానా ప్రభుత్వం

హర్యానా ప్రభుత్వం తన పరిశ్రమల సంబంధమైన పోర్టల్ : www.haryanaindustries.com/ ను ఆరంభించింది. ఇది రాష్ట్రంలో పెట్టుబడిపెట్టేవారికి అవసరమయ్యే పలు చట్టాలు, పాలసీలు, నియమాలు, ఫారమ్లను అందిస్తుంది. ఇది మిశ్రమ దరఖాస్తు(కాంపోజిట్ అప్లికేషన్ ఫారం -సిఏఎఫ్) సౌకర్యాన్ని కూడా ఇస్తుంది. ఇది అన్ని రకాల అప్లికేషన్లకీ ఏక గవాక్షంగా పనిచేసి,అన్ని క్లియరెన్సులనూ, అనుమతులనూ ఆన్ లైన్ గా ఇస్తుంది. యూజర్లు తమ అప్లికేషన్ల స్థితిని ఆన్ లైన్ గా తెలుసుకోవచ్చు. సేవలను మరింత విస్తృతం చేయడంలో భాగంగా మైక్రోసాఫ్ట్ చెల్లింపులకు వీలునిచ్చే పేమెంట్ గేట్ వేనీ, డిజిటల్ సంతకాలనీ కూడా ఇందులో ప్రవేశ పెట్టనున్నది. దీనివల్ల లావాదేవీలు మరింత సురక్షితంగా ఉంటాయి. ఈ పోర్టల్ లో భాగంగా త్వరలో పర్యాటక శాఖను కూడా రాష్ట్ర ప్రభుత్వం జోడించనున్నట్టు తెలుస్తోంది.
ఇపుడిప్పుడే పరిశ్రమల స్థాపనచేయనున్న మదుపరులకు వ్యాపారాన్ని ఆరంభించేందుకు వీలుగా వ్యాపార దర్శినిని, ఒక కార్యాచరణ ప్రణాళికతో అందించనుంది. ఈ పోర్టల్లో భాగస్వాములందరికీ సౌకర్యాలున్నాయి. ముడిసరకులు సరఫరా చేసేవారినించి, మానవవనరులను సరఫరా చేసేవారికీ, నిధులు సమకూర్చేవారికీ కూడా ఈ పోర్టల్ చోటు కల్పించనుంది.
ఈ సందర్బంగా హర్యానా ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హూడా మాట్లాడుతూ, ఇది జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఏకీకృత గవాక్షంగా పనిచేస్తుందనీ, హర్యానా ప్రభుత్వం అందించే సౌకర్యాలనీ, చేకూర్చే ప్రయోజనాలనీ ఆన్ లైన్ గా తెలుసుకొనే వీలు ఏర్పడుతుందనీ అన్నారు.
ఈ పోర్టల్ లో చర్చావేదిక కూడా ఉంది. రిజిస్టరైన పరిశ్రమలు వారికి ఇష్టమైన విషయాలపై చర్చల్లో పాల్గొనవచ్చు, బ్లాగులను పెట్టవచ్చు, వికీ ఎంట్రీలను పెట్టవచ్చు. అభిప్రాయ సేకరణలో పాల్గొనవచ్చు.

ఆధారము: http://www.igovernment.in/site/haryana-launches-industries-portal/

హర్యానా నిర్వహించనున్న 11వ జాతీయ ఇ-గవర్నెన్స్ సదస్సు

పరిపాలనా సంస్కరణలు, ప్రజా సమస్యలు విభాగం (డిఏఆర్ & పిజి), మినిస్ట్రీ ఆఫ్ పర్స్ నల్, పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, హర్యానా ప్రభుత్వం సహకారంతో 11వ జాతీయ ఇ-గవర్నెన్స్ సదస్సు ను ఫిబ్రవరి 7, 8 తేదీలలో చండీఘడ్ లో నిర్వహించనున్నది. ఈ సదస్సు 'సమీకృత పౌర సేవలు - సమస్యలు, సవాళ్లు' అనే నేపథ్యంలో సాగుతుంది.
డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహకారంతో నిర్వహించే ఈ సదస్సులో జాతీయ ఇ-గవర్నెన్స్ అవార్డు 2007-08 ప్రదానం చేస్తారు. దీనిని ఇ-గవర్నెన్స్ చొరవలను సమర్థవంతంగా అమలుచేసినందుకు గుర్తింపుగా, ప్రశంసగా ప్రదానం చేస్తారు.

28 రాష్ట్రాల్లో డేటా సెంటర్లు ఏర్పాటుచేయనున్న కేంద్రం

దేశంలో వివిధ రాష్ట్రాల సౌలభ్యంకోసం పెద్ద సంఖ్యలో డేటా సెంటర్లను జాతీయ ఇ-గవర్నెన్స్ ప్లాన్(ఎన్ఇజిపి) పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. కేంద్ర కేబినెట్ ఆమోదించగానే ఈ 6 - 8 నెలల వ్యవధిలో ఏర్పాటవుతాయి. స్టేట్ డేటా సెంటర్(ఎస్డిసి) ప్రతిపాదన ఎన్ఇజిపి ప్లాన్లో భాగంగా పైరులకు డిజిటల్ సేవలను అందిస్తాయి. దీనికింద అన్ని 28 రాష్ట్రాల్లో కేంద్రాలను ఆరంభించి, వివిధ సర్వీస్ పోర్టల్ వంటి చొరవలను చేపట్టడం జరుగుతుంది. సురక్షిత డేటా స్టోరేజి సౌకర్యాలు, ఆన్లైన్ సేవలు, డిసాస్టర్ రికవరీ, రిమోట్ మేనేజిమెంట్, సమీకృత సర్వీసుల వంటి వాటిని ఈ కేంద్రాలు అందిస్తాయి.

రాష్ట్ర నెట్వర్క్ దిశలో ఉత్తర ప్రదేశ్

జనవరి 1, 2008నించి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం 241 తాసీలులలో, 574 బ్లాకులలో వెరసి మొత్తం70 జిల్లాలను రాష్ట్ర నెట్వర్క్కు అనుసంధానం చేసేందుకు ప్రయత్నాలారంభించింది. ప్రస్తుతం 55 జిల్లాల్లో స్థల నిర్ధారణ చేశారు. 38 చోట్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. 574 డెవలప్మెంట్ బ్లాక్స్లలో 380 బ్లాకుల్లో స్థలనిర్ధారణ అయింది. యుపిస్వాన్ 885 నెట్వర్క్ ఆపరేటింగ్ కేంద్రాలతో పనిచేస్తుంది.

వన్ స్టాప్ సమాచార కియోస్కులను ఆరంభించనున్న ఎంసిడి

ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్(ఎంసిడి)(ఇండియా) ప్రజల సౌకర్యార్థం వన్ స్టాప్ సమాచార కియోస్క్ లను ఏర్పాటు చేయనుంది. దీనిద్వారా ఫోన్ బిల్లులు, విద్యుత్ బిల్లలు, సెల్ఫోన్ రీఛార్జింగ్ వంటి సౌకర్యాలు పొందవచ్చు. వీటిని వివిధ మార్కెట్ ప్రదేశాల్లో ఉంచనుంది ఎంసిడి. ఇలాంటివి 2.5 లక్షల కియోస్కులను దేశం మొత్తంలో నెలకొల్పనున్నారు.

జనన మరణ రికార్డులను కంప్యూటరీకరించనున్న ఎన్డిఎంసి

న్యూఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్(ఎన్డిఎంసి) అతి త్వరలో 1928 నుంచి 1995 దాకా జనన మరణ రికార్డులని కంప్యూటరీకరించి వారి పోర్టల్లో ఉంచనుంది. ఆయా రికార్డులని ప్రజలు వీక్షించవచ్చు.
ప్రజలకు ఎన్డిఎంసి ఇక అదే రోజు ఆయా రికార్డుల కాపీలను ఇవ్వగలదు. ఇప్పటికే 1996 నించి 2003 దాకా రికార్డులని కంప్యూటరీకరించిన ఎన్డిఎంసి, 2004 నించి 2007 దాకా రికార్డులనూ అందుబాటులోకి తేనుంది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి 6 లక్షల రూపాయలు ఖర్చవుతోంది. కేవలం 6 నెలల వ్యవధిలో ఈ ప్రాజెక్ట్ పూర్తవడం విశేషం. ఈ ప్రాజెక్ట్ వల్ల జనన మరణ రికార్డులను ప్రజలు స్వయంగా చూసి, వాటినకళ్లను అందుకోవచ్చు. ఎన్డిఎంసి ఏర్పాటు చేసిన 4 కేంద్రాల్లో వీటిని పొందవచ్చు.

గ్రామాలను ఇ - కనెక్ట్ చెయనున్న బీహార్

బీహారు గ్రామస్థులు త్వరలో వారివారి గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందనున్నారు. వసుధ పేరుతో సమీకృత పౌర కేంద్రాలను(సిఎస్సి) త్వరలో ఏర్పాటుచేసి వాటిద్వారా గ్రామాల్లో బీహార్ ప్రభుత్వం పౌర సేవలందించనుంది.
ఈ సిఎస్సి కేంద్రాలు, వసుధ అనే ఇ-కియోస్క్ లు శ్రేయీ సహజ్ ఇ - విలేజి పేరుతో ఆరంభించడం జరుగుతుంది. ఈ ఇ-కియోస్క్ లు అన్ని రకాల ఇ సేవలకు ఒకే చోట డెలివరీ పాయింట్గా పనిచేస్తాయి. ఇవి ఇగవర్నెన్స్ సేవలని ఇవ్వడమే కాక ఇ - లెర్నింగ్ కేంద్రాలుగా కూడా పనిచేస్తాయి. యువకులు కేవలం ఇంటర్నెట్ ను వాడుకోవడానికి మాత్రమేకాక దూర విద్య నభ్యసించడానికి, వృత్తి నైపుణ్యాలను నేర్చుకోవడానికి కూడా ఇవి తోడ్పడతాయి.
ఈ ప్రాజెక్ట్ మొదటి దిశలో 5,540 వసుధ కేంద్రాలను రాష్ట్రంలో ఆరంభించడం జరుగుతుంది. టాటా కన్సెల్టెన్సి సర్వీస్ (టిసిఎస్) సంస్థ సాఫ్ట్ వేర్ రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ ఇప్పటికే సూచనాప్రాయంగా ఆమోదించింది. ఆరంభంలో ఎనిమిది ప్రభుత్వ కార్యాలయాలు వసుధ కేంద్రాలకు లింక్ చేస్తారు. దానివల్ల సమాచారాన్ని ఇవ్వడమేకాక సేవలను అందిస్తారు. వీటిలో వాతావరణ సమాచారం, ధరలు, వ్యవసాయ పర సలహాలు, ఆరోగ్య, పరిశుభ్రతా పరమైన చిట్కాలు వంటి సమాచారాన్నివ్వడమేకాక జననమరణ సర్టిఫికేట్లు, భూరికార్డులు కూడా జారీ చేస్తారు. దీనికి నామమాత్రపు రుసుం వసూలు చేస్తారు.
ఈ వసుధ కేంద్రాలను ఎంపిక చేసిన గ్రామీణులే ఏర్పాటుచేసి, నిర్వహిస్తారు. వీటిని ప్రాంతీయ నియంత్రణా కేంద్రాలు, కేంద్ర నియంత్రణా కేంద్రం పర్యవేక్షిస్తాయి. ఒక్కో కియోస్కును ఆరంభించడానికి దాదాపు 1.2 లక్షల రూపాయలు అవసరమౌతుంది. బీహార్లో వసుధ ఏర్పాటు చేయడంవల్ల దాదాపు 5,500 మంది గ్రామీణులకి లబ్ది చేకూరుతుంది. అంతే కాదు. గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం వస్తుంది. తద్వారా వివిధ ప్రభుత్వ సేవలను గ్రామీణులకు అందుబాటులోకి తేవడం జరుగుతుంది.

ఇ-గవర్నెన్స్ లో ప్రథమ స్థానంలోకి హర్యానా

స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్, కామన్ సర్వీస్ సెంటర్ల (ఇదిశ) ప్రాజెక్ట్ స్థాపనలో హర్యానా రాష్ట్రం మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడి పరుగులు తీస్తున్నది. హర్యానా ఇగవర్నెన్స్ చొరవ కూడా తొలి 5 ఉత్తమ ఎంట్రీలలో ఒకటిగా ఈ కేటగిరీలో ఇప్పటికే స్థానాన్ని సంపాదించుకొంది. మిగిలిన 4 రాష్ట్రాలలో ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్య ప్రదేశ్ ఉన్నాయి.

హర్యానా ఇ-గవర్నెన్స్ ప్రాజెక్టుకై 3ఐ ఇన్ఫోటెక్ ఎంపిక

హర్యానా ప్రభుత్వం తన ఇ-గవర్నెన్స్ ప్రాజెక్టైన ఇ-దిశ ఏకల్ సేవా కేంద్ర ప్రాజెక్టును అమలు చేయడానికి 3ఐ ఇన్ఫోటెక్ను ఎంపికచేసింది. ప్రభుత్వం రాష్ట్రంలో 322 ఇ-దిశ ఏకల్ సేవా కేంద్రాలను గుర్గావ్ డివిజన్లో ఏర్పాటు చేస్తుంది. గుర్గావ్ డివిజన్లో గుర్గావ్, ఫరీదాబాద్, రేవరి, మహేంద్ర ఘడ్, మేవాత్ జిల్లాలున్నాయి. ఈ కేంద్రాలు ప్రభుత్వ సేవలందించే సింగిల్ విండో డెలివరీ కేంద్రాలుగా పనిచేస్తాయి.

ఇ-గవర్నెన్స్ దిశలో బీహార్ పంచాయితీలు

బీహారు ప్రభుత్వం తన 8479 పంచాయితీలలో ఇగవర్నెన్స్ ప్రవేశపెట్టే ప్రతిపాదనకు అంగీకారాన్ని తెలిపింది. దీనికి 252 మిలియన్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా.
బీహార్ స్టేట్ ఎలక్ట్రానిక్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (బిఎస్ఇడిసి) టాటా కన్సెల్టెన్సి (టిసిఎస్) సాయంతో ఇందుకు అవసరమైన సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్(ఐఎల్ఎఫ్ఎస్) సంస్థ ఈ ప్రాజెక్ట్ అమలుతీరును పర్యవేక్షిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కింద పంచాయితీ ఇన్ఫర్మేషన్ సెంటర్లు లేదా పంచాయితీ పోర్టల్ 'వసుధ కేంద్ర' ఏర్పాటు చేస్తారు. దీనివల్ల గ్రామస్థులతో నేరుగా సంబంధాన్ని ఏర్పరుచుకొని మరింత పారదర్శకతతో పాలన సాగించే వీలు ఏర్పడుతుంది.

తమిళనాడు పంచాయితీలలో త్వరలో ఇ-గవర్నెన్స్

తమిళనాడు ప్రభుత్వం తన ఇ-పంచాయితీ కార్యక్రమంలో భాగంగా మరో 19 ప్రధాన పంచాయితీలను చేర్చింది. ఇ-పంచాయితీ ప్రాజెక్ట్ అనేది ఇ-గవర్నెన్స్ దిశలో ప్రజలను ఎలక్ట్రానిక్ విజ్ఞానాధార వ్యవస్థల ఆధారంగా శక్తిమంతం చేసే చర్యలో ఒక భాగం. దాదాపు రు. 8.31 కోట్ల పెట్టుబడితో ప్రభుత్వం475 గ్రామాలను ఈ పథకం కింద ఎంపిక చేసింది. ఈ ఇ-పంచాయితీ పథకంవల్ల గ్రామ పంచాయితీ పరిధిలోకి వచ్చే అన్ని పనులకు సంబంధించిన వివరాలూ ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. అలాగే, దరఖాస్తు ఫారంలను డౌన్లోడ్ చేసుకోవడం, సిటిజన్ ఛార్టర్ కింద సమాచారం, వివిధ చట్టాలు, జివోలు, పంచాయితీల గురించిన సమాచారం, ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అర్జీ పెట్టుకొన్న దరఖాస్తుల స్థితి, ఫిర్యాదుల నమోదు, స్థితి తెలియజేయడం వంటి సేవలున్నాయి. అలాగే, బడ్జెట్ వివరాలు, వివిధ ముఖ్యమైన వెబ్ సైట్లకు లింక్లు కూడా ఇందులో ఉన్నాయి. జనన మరణ వివరాలు, ఇంటి పన్ను, వ్యాపార లైసెన్సులు, పింఛను పథకాలు, పనులు, భూ రుకార్డులు, వివాహాలు, ఫిర్యాదుల పరిష్కారం, ప్రభుత్వ ఆర్డర్లు కూడా ఇందులో లభిస్తాయి.

తమిళనాడు గ్రామాలకు ఎరిక్సన్ ద్వారా ఇ-గవర్నెన్స్

టెలికాం లీడర్ గా పేరున్న ఎరిక్సన్ తమిళనాడులో గ్రాం జ్యోతి రూరల్ బ్రాడ్ బ్యాండ్ ప్రాజెక్టును వడుగంబాడీ గ్రామంలో ఆరంభించింది. ఈ గ్రామం చెన్నయికి 60 కి.మీ. దూరంలో ఉంది.
హై స్పీడు ఇంటర్నెట్ సర్వీసు ద్వారా గ్రామాలను కనెక్ట్ చేయడమే ఈ పైలట్ ప్రాజెక్ట్ లక్ష్యంగా పెట్టుకొంది. ఈ ప్రాజక్టు కింద గ్రామాలలో బ్రాడ్ బ్యాండ్ సేవలవల్ల టెలి మెడిసన్, ఇ - విద్య, ఇ - గవర్నెన్స్ అప్లికేషన్లను అందుకోవచ్చు. 3జి మాధ్యమం ద్వారా ఈ సేవలన్నీ అందుబాటులోకి వస్తాయి.

సిటిజన్ పోర్టల్ ను ఆరంభించిన ఎంసిజిఎం

మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై(ఎంసిజిఎం) ముంబై ప్రజల కోసం సిటిజన్ పోర్టల్ను ఆరంభించింది. దీనిద్వారా వివిధ సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. వివిధ దరఖాస్తు ఫారాలనుంచి, ఆన్లైన్ చెల్లింపులు, ఆన్లైన్ ఫిర్యాదుల స్వీకరణ, ఆస్తి, నీటి పన్ను ల చెల్లింపు, ఇ - టెండరింగ్ ప్రక్రియ వంటి సేవలు కూడా లభిస్తాయి.

కర్ణాటకలో కాగితంతో నిమిత్తం లేని కార్యాలయాలు

కర్ణాటక ప్రభుత్వం తన ఐటి & బిటి శాఖలో పూర్తిగా కాగితాలతో నిమిత్తం లేకుండా పనిచేసే దిసలో ఏర్పాట్లు చేస్తున్నది. దీనికి మైక్రోసాఫ్ట్ సంస్థ సహకారాన్ని అందిస్తోంది. ఐటి & బిటి శాఖలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి ఆ తర్వాత అన్ని శాఖలకూ దీన్ని విస్తరింప జేస్తారు.

ఇ - హళ్లి కేంద్రాలను ఆరంభించనున్న కర్ణాటక ప్రభుత్వం

కర్ణాటక ప్రభుత్వంత్వరలో ఇ హళ్ళిఅనే ఇ-గవర్నెన్స్ చొరవను ఆరంభించబోతోంది. ఇది గ్రామీణులనుద్దేశించి ఆరంభిస్తోంది. రాష్ట్రంలో 5628 పంచాయితీలలో వీటిని ఆరంభిస్తున్నారు. విస్తృతమైన సమాచారాలతో గ్రామీణులముందుకు వస్తోంది.
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, కర్ణాటక రాష్ట్ర స్త్రీ అభివృద్ధి కార్పొరేషన్లు సంయుక్తంగా వీటిని ఆరంభిస్తున్నాయి. తొలి దశలో 10 జిల్లాలలో వాటిని ఆరంభిస్తారు. యసస్విని నగర హాగు గ్రామీణ అభివృద్ధి పరిషత్ (వైఎన్జిఏపి) అనే దావణగెరెకు చెందిన ఒక ఎన్జిఓ ఈ కేంద్రాల ఆరంభించే బాధ్యత చేపట్టింది. ఈ సంస్థ ఇప్పటికే దావణగెరె జిల్లాలో 5 కేంద్రాలను పైలెట్ ప్రాజెక్టుగా ఆరంభించింది. అవి ఎంతో విజయవంతమయ్యాయి కూడా.
కర్ణాటక రాష్ట్ర స్త్రీ అభివృద్ధి కార్పొరేషన్ రు. 35000ల మార్జిన్ గా ఆసరా పథకం కింద స్వయం సహాయక సమూహాలకు (ఎస్.హెచ్.జి) కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థిక సాయాన్నిస్తుంది.

ఇ-గవర్నెన్స్ ఏజిటి అవార్డును గెల్చుకొన్న కర్ణాటక ప్రభుత్వం

కర్ణాటక ప్రభుత్వంఅమలు చేసినలక్ష్యాత్మక ఇగవర్నెన్స్ ప్రాజెక్టు 'నెమ్మది'. దీనికి ఆసియాలోకే ప్రతిష్టాత్మక ప్రభుత్వ టెక్నాలజీ అవార్డు లభించింది. గ్రామీణ కర్ణాటకానికి జి2సి, జి2బి సేవలను అందించడానికే నెమ్మది ప్రాజెక్ట్ ఆరంభించడం జరిగింది. కర్ణాటక ప్రభుత్వంఅమలు చేసిన మరో ఇగవర్నెన్స్ ప్రాజెక్టు బెంగళూరు వన్కు మైక్రోసాఫ్ట్ ఇ-గవర్నెన్స్ అవార్డు కింద మెరిట్ సర్టిఫికేటు లభించింది. దాన్ని ఇటీవల కొత్త ఢిల్లీలో జరిగిన మైక్రోసాఫ్ట్ గవర్నమెంట్ లీడర్ షిప్ సమ్మిట్ - 2007లో ప్రకటించారు.

ఉత్తమ ఇ-గవర్న్డ్ అవార్డును గెల్చుకొన్న గుజరాత్

42వ కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా (సిఎస్ఐ) సదస్సులో గుజరాత్ ప్రభుత్వం2006-07కు గాను ఉత్తమ ఇగవర్న్డ్ స్టేట్ అవార్డ్ను గెల్చుకొంది. మొత్తంగా గుజరాత్ కు 4 కేటగిరీలలో అవార్డులు వచ్చాయి. అవి ఉత్తమ ఇ-గవర్న్డ్ స్టేట్, ఉత్తమ ఇ-గవర్న్డ్ డిపార్ట్మెంట్ (ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ), ఉత్తమ ఇ-గవర్నెన్స్ జి2బి ప్రాజెక్ట్(ఇ ప్రొక్యూర్మెంట్), ఇంకా వ్యాట్ సమాచార వ్యవస్థ.
సదస్సులో జరిగిన ఒక సమావేశంలో గోవా, జార్కండ్, కేరళ రాష్ట్రాలను ప్రగతిశీల ఇగవర్న్డ్ రాష్ట్రంగా సంయుక్త విజేతలుగా ప్రకటించారు. లక్షద్వీప్ కు చెందిన విద్యుత్ శాఖ, గుజరాత్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలను ఉత్తమ ఇ-గవర్న్డ్ శాఖలుగా ప్రకటించారు. మిగిలిన కేటగిరీలలో మధ్యప్రదేశ్ తన జి2సి ప్రాజెక్టైన శిశు సమాచార వ్యవస్థకు, సమాధాన్ ఏక్దిన్ మే (ఒకే రోజులో డాక్యుమెంట్స్ నివ్వడం) అనే దానికి ఉత్తమ ఇ-గవర్నెన్స్ ప్రాజెక్టులుగా అవార్డునందుకొంది . అంతే కాక సాధారణ సేవలను, కనీస సౌకర్యాల నిర్వహణ కార్యక్రమానికి కూడా ఫస్ట్ రన్నర్ అప్ గా అవార్డునందుకొంది. కేరళ రెండు తరగతుల్లో అవార్డునందుకొంది. ఒకటి సెంట్రలైజ్డ్ అలాట్మెంట్ ప్రాసెస్ ఫర్ ప్రొఫెషనల్ కోర్స్ అడ్మిషన్స్, మరోటి ఉత్తమ ఇ-గవర్నెన్స్ ప్రాజెక్ట్ జి2జి / జి2జిఇ తరగతి. ఐఆర్సిటిసి కూడా తన వెబ్ ఆధారిత రైల్వే రిజర్వేషన్కు అవార్డునందుకొంది. అదేవిధంగా పిఇఎస్ఓ, నాగపూర్ ఉత్తమ ఇగవర్నెన్స్ ప్రాజెక్ట్ జి2బి తరగతిలో బెస్ట్ రన్నర్ అప్ గా నిలిచింది.

అస్సాంలో ఇ-గవర్నెన్స్ చొరవకు ఏడిబి నిధులు

ఏషియా అభివ్రుద్ధి బ్యాంక్(ఏడిబి) అస్సాంలో ఇగవర్నెన్స్ చొరవలను ఆరంభించేందుకు తగిన ఐసిటి నైపుణ్యంతో సాంకేతిక సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రతిపాదించింది.
రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఇ ఏషియా అండ్ నాలెడ్జి పార్ట్నర్ ఫండ్ కింద 5,00,000 అమెరికన్ డాలర్ల విలువ గల సాంకేతిక సాయాన్ని ఏడ్బ్ ద్వారా అందిస్తుంది. దానిని నవంబర్ 2007 నించి 10 నెలల కాలంలో, అంటే ఆగస్ట్ 2008 లోపల అమలుచేస్తుంది. గ్రామీణ ప్రాంతాలకు వ్యవసాయ సంబంధమైన, భూరికార్డులు, రిజిస్ట్రేషన్ రంగాలతోబాటు ఐసిటి వాడకాన్ని పెంపొందించడానికి ఇగవర్నెన్స్ అప్లికేషన్లను అభివృద్ధి చేయడానికి వీలుంటుంది.

జనవరి 2008నుంచి ఇ-టెండరింగ్ విధానాన్ని ఆరంభించనున్న పంజాబ్ పిడబ్ల్యుడి

పంజాబ్ పిడబ్ల్యుడి (బి & ఆర్) విభాగం విప్లవాత్మకంగా జనవరి 2008 నించి ఇ - టెండరింగ్, ఇ - ప్రొక్యూరింగ్ విధానాలను ఆరంభించి విభాగీయ పాలనలో మరింత పారదర్శకత, బాధ్యతలని పెంపొందించే విధంగా సాగనున్నది. ఇది కంప్యూటరీకరణలో తొలిదశగా ఐటి విభాగం చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ జూన్ 2008 నాటికి పూర్తి అవుతుంది.

వాణిజ్యపరమైన పోర్టల్ ను ఆరంభించనున్న భారతీయ రైల్వే

భారతీయ రైల్వే అతి త్వరలో తన వ్యాపారాన్ని పూర్తిగా ఆన్ లైన్ గా చేయనుంది. ప్రయాణీకుల సేవలతోబాటు రవాణా సేవలు, తుక్కును వేలం వేయడం కూడా ఆన్ లైన్ గా నిర్వహించనుంది. ది సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టం (క్రిస్) ఈ పోర్టల్ని అభివృద్ధి చేస్తోంది.

నైపుణ్యాన్ని, ఉపాధిని కల్గించే ఇ-పోర్టల్ ఆరంభం

డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, భారత ప్రభుత్వం ఒక పోర్టల్ ప్రాజెక్ట్ను ఆరంభించింది. దాని పేరే స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఫర్ ఇంప్రూవ్డ్ లైవ్లీహుడ్స్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్(స్కిల్స్). దీనిని యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (యుఎన్డిపి) కింద చేపట్టారు.

ఆధారము: www.nsdcindia.org

అనేది కొత్త శిక్షణా ప్రణాళికతో, ఆధునిక టెక్నాలజీ నైపుణ్యాలకు కావలసిన సౌకర్యాలతో విద్యాధికులైన నిరుద్యోగులకు వినియోగించేలాగా రూపుదిద్దుకొంది. ఈ ప్రాజెక్టును తిరుచినాపల్లి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంటర్ప్రెనర్స్ పార్క్(టిఆర్ఇసి - ఎస్టిఇపి), వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో టెక్నాలజీ, నింపిట్, జెఎస్ఎస్ అకాడమి ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ - సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంటర్ప్రెనర్స్ పార్క్ (జెఎస్ఎస్ఏటిఇ - ఎస్టిఇపి), నోయిడా, అగ్నెల్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కాంప్లెక్స్, గోవాలలో ప్రభుత్వం అమలు చేస్తోంది.

బీహార్ ఇ-పంచాయితీ ప్లాన్

బీహారులో 8,479 పంచాయితీల్లో ఇ-గవర్నెన్స్ను అమలుచేయలన్న ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వం అమోదించింది.దీనికి 252 మిలియన్ రూపాయలు ఖర్చవుతుందని అంచనా. లభించిన సమాచారాన్ని బట్టి తెలిసిందేమంటే, రాష్ట్ర ప్రభుత్వం 8 ప్రభుత్వ శాఖలను ముఖ్యమంత్రి సెక్రటేరియట్తో సహా స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ తో అనుసంధానం చేయనుంది. ప్రభుత్వం పనిచేయడంలో పారదర్శకత, ప్రజలతో ప్రత్యక్ష సంబంధం నెలకొల్పడం దీని ప్రధాన లక్ష్యం.
ఈ ప్రాజెక్టు టిసిఎసి, బీహార్ స్టేట్ ఎలక్ట్రానిక్స్ డెవలెప్ మెంట్ కార్పొరేషన్లు సంయుక్తంగా నిర్వహిస్తాయి, అమలు పరిచే తీరును ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పర్యవేక్షిస్తుంది.

ఆధారము: www.nisg.org

ఇండియాలో తొలి ఇ-జిల్లా మల్లాపురం(కేరళ)

'అత్యుత్తమ ఇ-గవర్నెన్స్ రాష్ట్రం' అవార్డ్ పొందిన చండీగఢ్
ఇ-సంసిద్ధతలో లీడర్లుగా కేంద్రం గుర్తించే దిశలో చండీగఢ్ నగరం చేరువలోనే ఉంది. ఏటా కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇచ్చే అత్తుత్తమ సంపూర్ణ ఇగవర్నెన్స్ రాష్ట్రం అవార్డును చండీగఢ్ నగరం దక్కించుకొంది. చండీగఢ్అడ్మినిస్ట్రేషన్కు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పంపిన ఇ-మెయిల్ సమాచారంలో ఈ అవార్డు విషయాన్ని నిర్వాహకులు తెలిపారు. అందమైన చండీగఢ్ నగరం అత్యుత్తమ ఇ-గవర్నెన్స్ రాష్ట్రంగా ఎంపికైనట్లు నిర్వాహకులు ఆ ఇ-మెయిల్లో తెలిపారు. చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న మొత్తం ఇ-గవర్నెన్స్ చొరవలో, ఇది వరకే భారత ప్రభుత్వం ఇచ్చిన ఇ-గవర్నెన్స్ గోల్డెన్ ఐకాన్ అవార్డు పొందిన ఇ-సంపర్క్ ప్రాజెక్ట్ తో సహా, రాబోయే జన సంపర్క్(సమాజం కోసం ఐటి) ప్రాజెక్ట్ నూ ఈ పోటీకి పంపడం జరిగింది.

ఆధారము: www.nisg.org

ఇ-మార్కెట్ కోసం చూస్తున్న జార్ఖండ్

జార్ఖండ్ ప్రభుత్వం అహ్మదాబాద్ కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్ఐడి) ద్వారా తమ రాష్ట్రపు హస్త, చిత్ర కళాఖండాలను ఇ-మార్కెట్ చేయనుంది. ఇ-మార్కెటింగ్ వెబ్సైట్ ని ఎన్ఐడి నెలకొల్పడమేకాక, అంతర్జాతీయంగా ఆ కళాఖండాలకున్న డిమాండ్ ను అర్థంచేసుకొని, దానికి అనుగుణంగా డిజైన్లలో మార్పులనూ సూచించనుంది. ఈ వెబ్సైట్ లో కళాఖండాలు, పెయింటింగ్స్, చేనేతలు తదితరాలు చోటు చేసుకొంటాయి.
ఎన్ఐడికి ఇప్పటికే జడుపటియా, సోహ్రాయ్, పయిత్కర్ రూపాల పెయింటింగ్స్, చేనేత, సెరికల్చర్, హస్తకళల శాఖల కోసం ఒక సాధ్యాసాధ్యాల నివేదికను తయారుచేయమని ప్రభుత్వం పురమాయించింది. కళాఖండాలు, పెయింటింగ్స్, చేనేతలు తదితరాలను అంతర్జాతీయంగా ఎలా ఆకట్టుకొనేలా చేయాలో ఇప్పటికే కళాకారులకు ఎన్ఐడి శిక్షణనివ్వడం ఆరంభించింది.

ఆధారము: www.nisg.org

న్యూస్ అప్ డేట్

గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో ఇ-గవర్నెన్స్
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫలాలను చక్కగా వాడి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలుచేయడానికి కొన్ని పనులు చేపట్టింది. మంత్రిత్వశాఖ వెబ్సైటు www.rural.nic.in అందరికీ అందుబాటులో ఉంది. ఇందులో గ్రామీణాభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలగురించి, మంత్రిత్వశాఖ గురించి వివరాలున్నాయి. మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించడానికి, వివిధ జిల్లాలనుంచి ఆర్థిక సంబంధమైన నెలవారీ రిపోర్టులు, కొన్ని ముఖ్యమైన పథకాల ప్రగతి సమాచారం వంటివి పూర్తి పారదర్శకతనివ్వడానికి, సులభంగా డేటా అందుకోవడానికి వీలుగా ఈ సైట్లో ఇవ్వబడ్డాయి.
భూమి రికార్డులను కంప్యూటరీకరించే దిశగా మంత్రిత్య శాఖ ఒక పథకాన్ని ప్రవేశపెడుతోంది. దాని ముఖ్యోద్దేశం ఏమిటంటే, భూమి రికార్టుల డిజిటల్ డేటాబేస్ ఏర్పాటు చేయడం, తద్వారా రికార్డ్ ఆఫ్ రైట్స్ నకలు కాపీలను అవసరమైనపుడు ఆ భూమి తాలూకు స్వంతదారులకు అందజేయడం. రు. 102 కోట్లు ఈ భూమి రికార్డులను కంప్యూటరీకరించే కార్యక్రమానికీ, ఇతర ఇ-గవర్నెన్స్ కార్యక్రమాలకీ వెచ్చించడానికి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

ఆధారము: www.rural.nic.in

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

పల్లెలకూ ఐటీ సేవలు

  • పంచాయతీ, వైద్యం, విద్య రంగాల్లోనూ అమలు
  • 15 ఏళ్లకు సరిపోయే ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తం
  • ఐటీఐఆర్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొస్తం
  • ఐటీ, పీఆర్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి.. ఒరాకిల్ ప్రతినిధులతో భేటీ

పట్టణాలకే పరిమితమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)సేవలను గ్రామాలకూ విస్తరిస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయత్‌రాజ్ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. ప్రతి పల్లెలోనూ ఐటీ సేవలు అందించడం ద్వారా ప్రజలకు మేలు కలుగుతుందని, దీంతో గ్రామస్థాయిలో అవినీతిని కూడా అరికట్టేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. బుధవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. విద్య, వైద్యం, పంచాయతీ శాఖల్లో ఐటీ సేవలను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. దీని కోసం కసరత్తు జరుగుతోందని, రానున్న 15 ఏళ్లకు సరిపోయే ఆధునిక శాస్త్ర సాంకేతిక నైపుణ్యాన్ని ఇందుకు వినియోగించనున్నామని తెలిపారు.

ప్రస్తుతం ప్రభుత్వ సంక్షేమ పథకాలైన రేషన్, పింఛన్లు వంటివి అనర్హులకూ అందుతున్నాయన్నారు. అలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఐటీ సేవలు ఉపయోగపడుతాయని అభిప్రాయపడ్డారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుకు ప్రపంచస్థాయి గుర్తింపును తీసుకొస్తామన్నారు. గ్లోబల్ మార్కెట్‌లో టాప్ 5లో ఈ ప్రాజెక్టును నిలబెట్టేందుకు కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఐటీ రంగంలో తెలంగాణను అత్యున్నతంగా నిలబెడతామన్నారు. ఈ రంగం పై సమగ్ర అధ్యయనం చేసేందుకు ఈ సమావేశం దోహదపడుతుందన్నారు. అలాగే సమస్యలు తెలుసుకునేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు. అంతకుముందు మంత్రి కేటీఆర్ ఒరాకిల్ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ప్రధానంగా ఐటీ సెక్టార్‌లో మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులను ఆహ్వానించేందుకు అవసరమైన చర్యలపై సమీక్ష నిర్వహించారు. విలేకరుల సమావేశంలో మంత్రి కేటీఆర్‌తోపాటు ఐటీ శాఖ కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ఒరాకిల్ సహకారంతో ఈ గవర్నెన్స్

రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలకు ఈ గవర్నెన్స్ విధానాన్ని విస్తరించాలని యోచిస్తోంది. తొలిదశలో పౌరసరఫరాలు, గృహ నిర్మాణ రంగానికి ఐటీ సేవలు వినియోగించాలని భావిస్తోంది. అదేబాటలో ఈ-పంచాయత్, ఈ-హెల్త్, ఈ-ఎడ్యుకేషన్ సేవలను కూడా ప్రతి పల్లెకు అందించేందుకు కసరత్తు చేస్తోంది. దీనికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని ఒరాకిల్ సంస్థ నుంచి స్వీకరించేందుకు చర్చలు జరిగాయి. ఉచితంగానే ఈ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రభుత్వానికి సాంకేతిక నైపుణ్యాన్ని అందించేందుకు హామీఇచ్చింది. ఇప్పటికే సంస్థ ప్రతినిధి సుబ్రమణ్యం తమతో చర్చలు జరిపినట్లు ఐటీ శాఖ కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. త్వరలోనూ సామాన్యులకు అర్థమయ్యే రీతిలో సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి ప్రభుత్వానికి అందించనుంది.

ఒరాకిల్ సంస్థ ఈ ప్రక్రియను పూర్తిచేసిన తర్వాత సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ పరిశీలనకు పంపుతారు. వారి ఆమోదం పొందితే అమల్లోకి తీసుకురానున్నట్లు హర్‌ప్రీత్‌సింగ్ టీ మీడియాకు వివరించారు. అన్ని శాఖలకు ఈ సేవలను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణులకు పౌర సేవలతో పాటు ఇతర వ్యక్తిగత, సామాజిక సమస్యలను కూడా పరిష్కరించుకునేందుకు ఉపయోగపడే సలహాలు, సూచనలను కూడా ఈ గవర్నెన్స్ ద్వారా అందించనున్నారు. ఏదైనా చిన్నపాటి అనారోగ్యానికి గురైనప్పుడు వైద్యుడి సలహా అవసరమైతే ఈ-హెల్త్ ద్వారా పొందే సదుపాయం ఉంటుంది. అలాగే విద్య రంగంలోనూ దీనిని అందుబాటులోకి తీసుకురానున్నట్టు కార్యదర్శి తెలిపారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అర్హులకు చేర్చేందుకు ఐటీ సేవలను వినియోగించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

ఐటీ సెక్టార్‌పై సర్కారు దృష్టి

  • సమస్యల పరిష్కారం దిశగా అడుగులు
  • ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం
  • రేపు ఐటీ కంపెనీలతో భేటీ

తెలంగాణ ఐటీ రంగాన్ని మరింతగా ప్రగతిబాట పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా ప్రతిష్ఠాత్మకమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్(ఐటీఐఆర్) ప్రాజెక్టు అమలుకు పకడ్బందీ కార్యాచరణను రూపొందిస్తోంది. అలాగే ఐటీ రంగంలోని సమస్యల పరిష్కారానికీ ప్రభుత్వం నడుంబిగించింది. హైదరాబాద్‌లో ఐటీ రంగ నిపుణులు, వ్యాపారవేత్తలతో ఏర్పాటు చేసిన సమావేశం ఈ కోవలోనిది. హైదరాబాద్ ఐటీ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్, తెలంగాణ ఐటీ అసోసియేషన్ల సహకారంతో ఈ భేటీని తలపెట్టింది. 150 కంపెనీలకు చెందిన పారిశ్రామికవేత్తలు దీనికి హాజరవుతారని అంచనా. ప్రభుత్వం ఆలోచనలతో ఐటీ రంగం ప్రతినిధులతో పంచుకోవడానికి, వారి సమస్యలు తెలుసుకోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటుచేసినట్టు ఐటీశాఖ కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. కొంతకాలంగా తెలంగాణ ఉద్యమాన్ని బూచీగా చూపించి ఐటీ కంపెనీలు రాకుండా దుష్ప్రచారం చేశారని అభిప్రాయపడ్డారు. తెలంగాణలోని సామరస్యపూర్వక వాతావరణాన్ని ప్రపంచానికి చాటిచెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అందుకే ఐటీ విభాగంలో ప్రభుత్వం అనుసరించనున్న విధి విధానాలను, ఇవ్వనున్న ఇన్సెంటివ్స్, ప్రోత్సాహకాలు, రాయితీలను వివరిస్తామన్నారు.

ఆ తర్వాత పాలసీని రూపొందించేందుకు అవసరమైన సూచనలను వారి నుంచి స్వీకరిస్తామన్నారు. దాంతోపాటు ఇప్పుడున్న ఐటీ కారిడార్‌లో నెలకొన్న సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలను తీసుకునేందుకు కార్యాచరణను రూపొందిస్తామని హర్‌ప్రీత్‌సింగ్ చెప్పారు. ఐటీ శాఖతోపాటు హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అండ్ సీవరేజ్ బోర్డు, రవాణా, పోలీసు తదితర శాఖల అధికారులు కూడా సమావేశానికి వస్తున్నారని తెలిపారు.. ఔత్సాహిక ఐటీ పారిశ్రామికవేత్తలు వ్యక్తీకరించే ప్రతి సమస్యను గుర్తించి వీలైనంత త్వరగా పరిష్కరించే ఎజెండాను అమలుచేయనున్నట్లు చెప్పారు. ఇలాంటి ముఖాముఖి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించే అవకాశాలు ఉన్నాయన్నారు. తెలంగాణ ఐటీ సెక్టార్‌ను అభివృద్ధి పర్చుకునేందుకు అవసరమైన రోడ్ మ్యాప్‌ను డిజైన్ చేసేందుకు దోహదపడుతుందని ఉద్దేశంతోనే ఐటీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ఐటీ అసోసియేషన్(కార్పొరేట్ వింగ్) ప్రెసెడెంట్ కే మోహన్‌రాయుడు తెలిపారు. వారు ఎదుర్కొంటోన్న సమస్యలు తెలిసినప్పుడే ప్రభుత్వం పరిష్కరించగలదని చెప్పారు.

ఆధారము: టి.ఆర్.ఎస్. పార్టీఆన్లైన్.ఆర్గ్

పునరావాస కేంద్రాలుగా సమాచార కమిషన్లు

సుమారు రెండు సంవత్సరాలపాటు తటపటాయింపు, పలు వివాదాల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నలుగురు సమాచార కమిషనర్లలో ముగ్గురు ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వ అధికారులే కావడం గమనార్హం. ప్రభుత్వంలో పారదర్శకత కోసం, సమాచారాన్ని ప్రజలకు తెలుపకుండా అడ్డుకుంటున్న పాలనా యంత్రాంగం కారణంగా సమాచార కమిషనర్లను నియమించవలసి వచ్చింది. ఇక్కడ కూడా ప్రభుత్వోద్యోగులే ఆధిపత్యం వహిస్తుంటే వాటి వైఖరిలో గణనీయ మార్పులు ఆశింపలేము. పార్లమెంటు సమాచార హక్కు చట్టం, ఆమోదించి ఏడు సంవత్సరాలు పూర్తయ్యింది. మొదటగా 2006-07లలో నియమించిన సమాచార కమిషనర్ల ఐదేళ్ళ పదవీకాలం పూర్తయి అన్ని రాష్ట్రాలలో కొత్తవారిని వారి స్థానంలో నియమిస్తున్నారు. ఈ సందర్భంగా కామన్‌వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్ జరిపిన ఒక అధ్యయనంలో వాటి పనితీరులో చెప్పుకోదగిన మార్పురాలేదని స్పష్టమవుతున్నది.

2006-07లో కేవలం 52శాతం మంది మాత్రమే సగంమంది ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వ అధికారులు సమాచార కమిషనర్లుగా ఉండగా, ప్రస్తుతం కేంద్రంలో 29 రాష్ట్రాలలోగల సమాచార కమిషనర్లలో మూడింట రెండువంతుల మంది 66 శాతం ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వ అధికారులే ఉండటం గమనార్హం. ప్రస్తుతం 117 మంది కమిషనర్లు ఉండగా వారిలో 83 మంది ప్రభుత్వ అధికారులే. వీరిలో తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన నియామకాలను పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్రాలలో 30 శాతం పోస్టుల భర్తీ కాలేదు. జార్ఖండ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో ఖాళీలను భర్తీచేయవలసి ఉంది. మహారాష్ట్ర, మణిపూర్, త్రిపురలో ప్రధాన సమాచార కమిషనర్లను నియమించవలసి ఉంది. దేశంలో ఎక్కడా మహిళలను ప్రధాన కమిషనర్ల్లుగా నియమించలేదు. అలాగే యాజమాన్యం, సైన్స్, టెక్నాలజీ, అర్థశాస్త్రం, మాస్ మీడియా, పత్రికా రచన, సామాజిక, రంగాలలో పేరొందినవారిని కూడా ఎక్కడా ప్రధాన కమిషనర్లుగా నియమించలేదు. ప్రధాన కమిషనర్లలో 75 శాతం మంది ఉద్యోగ విరమణ చేసిన ఐ.ఎ.ఎస్. అధికారులే. సమాచార కమిషన్‌లో మహిళా ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంటున్నది. సమాచార కమిషనర్లలో 15 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు. గుజరాత్, హిమాచలప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్ర సమాచార కమిషనర్లు అందరూ ఉద్యోగ విరమణచేసిన ఐ.ఎ.ఎస్. అధికారులే కావడం గమనార్హం. కేవలం జమ్మూకాశ్మీర్‌లో మాత్రమే ఐ.ఎ.ఎస్‌లు లేకుండా కమిషన్ సభ్యులను నియమించారు. పత్రికా రంగంనుండి పది శాతంకన్నా తక్కువగానే ఉన్నారు. హర్యానా కమిషన్‌లో సగం మంది భార్యాభర్తలే. కేరళ, నాగాలాండ్, పంజాబ్‌లలో రాజకీయ పార్టీల సభ్యులను సహితం సమాచార కమిషనర్ల్లగా నియమించారు. అధికార పక్షానికి అనుకూలంగా ఉద్యోగ బాధ్యత నిర్వహించినవారికి బహుమతిగా ఉద్యోగ విరమణ అనంతరం ఈ పదవులు కట్టబెట్టడం జరుగుతున్నది. ఉద్యోగ నిర్వహణలో పాలనలో పారదర్శకత పట్ల ఎటువంటి ఆసక్తిచూపని వారిని, సమాచార హక్కు చట్టం పట్ల అవగాహన లేని వారిని ఎక్కువగా సమాచార కమిషనర్ల్లుగా నియమిస్తున్నారు. ఖాళీలను ముందుగా ప్రకటించి, ఆసక్తిగల వారినుండి దరఖాస్తులు కోరే పద్ధతిని అనుసరించడం లేదు. గత ఎన్నికలలో పోటీచేసి ఓటమి చెందిన వారిని ఎంపిక చేయడంద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలనే వివాదాస్పదం అయింది. రాజకీయ నేపధ్యం కారణంగా నలుగురు సభ్యుల నియామకాన్ని గవర్నర్ నరసింహన్ తిరస్కరించడం అందరికీ తెలిసిందే. మిజోరామ్ రాష్ట్ర కమిషన్‌కు మాత్రమే ప్రత్యేకంగా వెబ్‌సైట్ లేదు. మిగిలిన అన్ని కమిషన్‌లకు ఉన్న వాటిల్లో తాజా సమాచారం, వారు పరిష్కరించిన అంశాలకు సంబంధించిన అంశాలు ఉండటంలేదు. కేవలం మధ్యప్రదేశ్, మహారాష్ట్ర కమిషన్లు మాత్రమే స్థానిక భాషలో వెబ్‌సైట్లు ఏర్పాటుచేశాయి. కేంద్ర కమిషన్‌తో సహా మిగిలిన అన్ని రాష్ట్రాల కమిషన్‌ల వెబ్‌సైట్‌లు ఆంగ్లంలోనే ఉన్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్‌తోపాటు ఆంధ్రప్రదేశ్, బీహార్ కమిషన్లు మాత్రమే వార్షిక నివేదికలను వెబ్‌సైట్‌లో ఉంచాయి. 2006 నుండి 2011వరకు, కేవలం 45 శాతం మంది సమాచార కమిషన్లు (13 మంది) గత ఏడు సంవత్సరాలలో తాము వెల్లడించిన అన్ని నిర్ణయాలను వెబ్‌సైట్‌లో ఉంచాయి. కర్ణాటక, ఉత్తరఖండ్ కమిషన్లు అయితే తామిచ్చిన తీర్పులు కేవలం సంబంధిత వ్యక్తులు/సంస్థలు మాత్రమే వెబ్‌సైట్‌లో చూసుకొనే ఏర్పాట్లుచేశాయి.

సమాచార కమిషన్ల నిర్ణయాలు ప్రజలు అందరికీ అందుబాటులో ఉండటం విధానపరంకావాలని, సమాచార కమిషన్ల వెసులుబాటుకు వదిలివేయరాదని సి.హెచ్.ఆర్.ఐ డైరెక్టర్ మజీదారువాలా స్పష్టం చేశారు. కేసుల సంఖ్య ఆధారంగా కమిషనర్ల సంఖ్యను నిర్ణయించాలని ఆమె చెప్పారు. సమాచార కమిషనర్ల నియామకంలో అర్హతలను నిర్ణయించడానికి ప్రభుత్వాలు, పౌర సమాజ ఉద్యమకారులు కలసి ఒక అంగీకారానికి రావలసి ఉన్నది. మొత్తం సమాచార కమిషనర్లలో 22శాతం మందికి మాత్రమే న్యాయవాదిగానో, అధ్యాపకులుగానో న్యాయశాస్త్రం పట్ల అవగాహన ఉండగా, కేవలం జార్ఖండ్, గోవాలలో మాత్రమే మాజీ న్యాయమూర్తులను ప్రధాన సమాచార కమిషనర్లుగా నియమించారు.

కేంద్ర ప్రభుత్వం బహిరంగంగా ప్రకటన ఇచ్చి, దరఖాస్తుచేసుకున్న వారి నుండి ఎంపిక చేస్తున్నది. 200మందికి పైగా దరఖాస్తుచేసుకోగా వారిలో ముగ్గురిని గత మార్చిలో కేంద్ర కమిషన్‌కు నియమించారు. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని రాష్ట్రాల కమిషన్‌లు తమ అధికార భాషలో ప్రధానమైన అంశాలను వెబ్‌సైట్‌లో ఉంచాయి. కమిషన్ల వార్షిక నివేదికలు మొక్కుబడిగా మారుతున్నాయి. వాటి గురించి పార్లమెంటులో, శాసనసభలలో అసలు చర్చలే జరగడంలేదు. ఈ నివేదికల గురించి సంబంధిత వేదికలపై విస్తృత స్థాయిలో చర్యలకు అవకాశం కల్పించాలి. సమాచార కమిషన్‌కు అందిన అన్ని విజ్ఞప్తులు, ఫిర్యాదులను వాటి పరిశీలన స్థాయితో సహా వెబ్‌సైట్‌లలో ఉంటే వాటి గురించిన సమాచారం అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా వాటిపై విచారణ తేదీలను కూడా వెబ్‌సైట్‌లో ఉంచితే పోస్ట్‌ద్వారా పంపిన సమాచారం అందకపోయినా సంబంధికులు హాజరుకావడానికి వీలు ఏర్పడుతుంది. ప్రజాజీవనంలో విశేష పరిజ్ఞానం, అనుభవంగల ప్రముఖులను కమిషనర్లుగా నియమించాలని సమాచార హక్కు చట్టం పేర్కొంటున్నది.

రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన వ్యక్తులు ఏమాత్రం ప్రముఖులు అంటూ గత సంవత్సరం తమిళనాడు హైకోర్టులో ప్రశ్నించడం జరిగింది. కేవలం అభ్యర్థులు సమర్పించిన వివరాల ఆధారంగా వారు ప్రముఖులు అని భావించలేమంటూ కోర్టులో సవాల్ చేశారు. 35 సంవత్సరాలపాటు ఐ.ఎ.ఎస్.గా పనిచేసి, ప్రధాన కార్యదర్శి హోదాలో ఉద్యోగ విరమణ చేసిన ఒకరిని ప్రజాజీవనంలో ప్రముఖ వ్యక్తిగా భావించి ప్రధాన కమిషనర్‌గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. చట్టప్రకారం, పారదర్శకంగా సభ్యుల ఎంపిక జరిగిందని నాటి డి.ఎం.కె. ప్రభుత్వం తన చర్యను హైకోర్టులో సమర్ధించుకున్నది. ఇంతలో అధికారంలోకి వచ్చిన ఎఐడిఎంకె ప్రభుత్వం చట్టవ్యతిరేకంగా ఎంపిక జరిగిందని, ఎంపిక సమావేశంలో నాటి ప్రతిపక్ష నాయకురాలు పాల్గొనలేదని, ఈ నియామకాలను రద్దుచేయాలని కోరుతూ అఫిడవిట్ దాఖలుచేసింది. అయితే అధికారంలోగల రాజకీయ పార్టీ మారినంత మాత్రంచేత రాజకీయ కారణాలతో ప్రభుత్వాలు తమ వాదనలను మార్చుకోరాదంటూ ప్రభుత్వ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజాప్రయోజనాలకు భిన్నంగా నియామకాలు జరిగినట్లు భావిస్తే మాత్రమే కోర్టుకు రావాలని స్పష్టంచేసింది.

హైకోర్టు ఉద్దేశ్యం ఏమైనా సమాచార కమిషనర్ల నియామకాలు దేశవ్యాప్తంగా సమాచార హక్కు చట్టం స్ఫూర్తిమేరకు జరగడం లేదనడంలో సందేహంలేదు. ఉద్యోగ విరమణచేసిన ప్రభుత్వ ఉద్యోగులకు పునరావాస కేంద్రాలుగా మారడంతో ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారితనం, ప్రజల ప్రాతినిధ్యం అనే వౌలిక లక్ష్యాల సాధనలో నిర్ణయాత్మక పాత్ర పోషించలేకపోతున్నాయి.

ఆధారము: ఆంధ్రభూమి

2.98650927487
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
sreepuram sudheer kumar Apr 01, 2015 02:23 PM

ఈ పాలనా వలన చాలమందికి ఎంతో పయోజనం కలుగుతుంది.

S. Narsimha Reddy Apr 01, 2015 02:19 PM

వేరి ఉసెఫుల్ ఫర్ విల్లగెర్స్ బట్ ప్లీజ్ యాడ్ ఆదార్ ఎన్రోల్మెంట్.

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
పైకి వెళ్ళుటకు