పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

తెలుగులో బాలల పత్రికలు

తెలుగులో బాలల పత్రికల వివరాలు.

సోనియట్ దేశంలో పిల్లలకు, యువజనులకు కలిపి 250 పైగా పత్రికలున్నాయి. అందులో 'పయనీర్ స్కాయా' అనే పిల్లల పత్రిక సర్క్యులేషన్ 95 లక్షలు. ఇన్ని ప్రతులు అమ్ముడయ్యే పత్రిక ప్రపంచంలో మరోటి లేదు.

మొట్టమొదటిసారి పిల్లలే నిర్వహించిన పిల్లల వారపత్రిక పేరు'లిటిల్ రివ్యూ', దానిని పోలెండ్ దేశస్థుడైన డాక్టర్ కోరాక్ కృషితో వార్సాలోని అనాధ బాలలు వెలువరించారు. 1930నుంచి ధారావాహికంగా వెలువడి 1939లో నాజీలు వార్సాను ఆక్రమించే వరకు పత్రికారంగంలో 'లిటిల్ రివ్యూ' తన ప్రత్యేకతను నిలుపుకుంది. “బాలల్ని వ్యక్తులుగా గౌరవించండి. వారిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి!" అనేది కోరాక్ తపన. దాని ఫలితమే 'లిటిల్ రివ్యూ’.

ఒకప్పుడు భారతి, గృహలక్ష్మి, జనవినోదిని, కృష్ణ పత్రిక మొదలైన తొలితరం పత్రికలు ఇచ్చిన ప్రోత్సాహం బాలలకు ప్రత్యేకమైన పత్రికలు ప్రారంభించటానికి మార్గం ఏర్పడింది. ఆ ఉత్సాహంతో మేడిచర్ల ఆంజనేయమూర్తి 1940లో 'బాలకేసరి’ ప్రారంభించారు. ఆ తరువాత న్యాయపతి రాఘవరావు 1945లో 'బాల', చక్రపాణి 1947లో 'చందమామ' ప్రారంభించి బాలల పత్రికలకు శుభారంభం చేశారు. ఆ స్ఫూర్తితో బాలల కోసం అనేక పత్రికలు వచ్చాయి. 1979లో రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ ప్రచురించిన 'బాలచంద్రిక' విభిన్న శీర్షికలతో వెలువడి బాలలకు విజ్ఞాన వినోదాలను పంచింది. ఈ 69 ఏళ్లలోనూ 90పైగా పిల్లల పత్రికలు వచ్చాయి. నాకు తెలిసిన వివరాల మేరకు 1940 నుండి తెలుగులో బాలల పత్రికలు, వాటి సంపాదకుల వివరాలు:

బాలల్లో చదివే అలవాటును ఆసక్తిని పెంచటం కోసం, కొత్త విషయాలు తెలియజేయడం కోసం పత్రికలు ఎంతగానో తోడ్పడతాయి. బాలల్లోని రచనాసక్తి పఠనాశక్తి, భాషానురక్తి, జ్ఞాపకశక్తి, భావాల అభివృద్ధికి పిల్లల పత్రికలు ఎంతో దోహదం చేస్తాయి. ఆ లక్ష్యంతోనే పిల్లల పత్రికల ప్రచురణ ప్రారంభమయ్యింది.

క్ర. సం.

పత్రిక పేరు

ప్రారంభమయిన సంవత్సరం

సంపాదకులు

1.

బాలకేసరి

1940

మేడిచర్ల ఆంజనేయమూర్తి

2.

బాలమిత్ర

1941

ఎల్.ఎ. బెయిన్

3.

కుమారమిత్ర

1942

పి.బి. కృష్ణమాచార్యులు

4.

బాల

1945

న్యాయపతి రాఘవరావు,

న్యాయపతి కామేశ్వరి

5.

ఆంధ్రవిద్యార్థి

1947

 

6.

చందమామ

1947

చక్రపాణి

7.

బాలబంధు

1947

 

8.

బాలమిత్ర

1949

బి.వి. రాధాకృష్ణ

9.

పాపాయి

1949

డి. అప్పారావు

10.

పాప

1949

 

11.

బొమ్మరిల్లు

1949

జె. రాజారావు

12.

బాబు

1949

విశ్వేశ్వర రావు

13.

బాలవినోదం

1950

గోటేటి రామారావు

14.

బాలప్రభ

1952

పాటిబండ్ల మాధవశర్మ

15.

ఉదయబాల

1952

 

16.

మనసంఘం

1952

లవణం

17.

బాలభారత్

1952

 

18.

శిశువిద్య

1954

ఎన్ పేర్రాజు

19.

బొమ్మరిల్లు

1954

 

20.

జాబిల్లి

1954

 

21.

గుజ్జనగూళ్లు

1955

 

22.

తెలుగు విద్యార్థి

1955

కె. కోటెశ్వర రావు

23.

బాలానందం

1956

న్యాయపతి రాఘవరావు

24.

బాలప్రభ

1957

జి. మునిరత్నం నాయుడు

25.

బాలబంధు

1962

ఆర్.ఎస్. మూర్తి

26.

చంద్రభాను

1962

కోటపాటి, యం.వి. శేషయ్య

27.

బాలరాజ్యం

1963

గోటేటి రామారావు

28.

బాలనందం

1964

ముదునూరి వెంకటేశ్వరరావు,

ముదునూరి రామారావు

29.

నందన

1965

వై.బి. వెంకటరాజు

30.

రఘుబాల

1965

ఎ. ఎల్లయ్య

31.

బాలప్రతిభ

1969

ముదునూరి వెంకటేశ్వర రావు

32.

పసిడిబాల

1969

చింతా హనుమంత రావు

33.

బాలప్రపంచం

1970

మండా సూర్యనారాయణ

34.

ఆనందబాల

1967

బి.కె. విశ్వేశ్వరరావు,

ఎ.ఎస్.ఆర్. ఆంజనేయులు

35.

బొమ్మరిల్లు

1972

విజయబాపునీడు

36.

బాలానందం

1972

సాయి కుమారి

37.

పాలవెల్లి

1974

గిరిజ శ్రీభగవాన్

38.

వసంతబాల

1974

విశ్వ ప్రసాద్

39.

పాదరిల్లు

1974

జి.వి. రంగాచార్యులు

40.

బుజ్జాయి

1975

జి. అప్పారావు

41.

స్నేహబాల

1976

నాయుని కృష్ణమూర్తి

42.

బాల

1977

న్యాయపతి రాఘవరావు,

న్యాయపతి కామేశ్వరి

43.

బాలానందం

1977

వై.బి. వెంకటరాజు

44.

బేబి

1977

సి. నాగేశ్వర రావు

45.

మిక్కీమౌస్

1977

 

46.

చంపక్

1977

విశ్వనాథ్

47.

ఊహాశక్తి

1978

పి. పద్మనాభ రావు

48.

బాలభారతి

1978

వి.వి. సరసింహారావు,

శశిభూషణ్

49.

ప్రమోద

1978

ధనికొండ హనుమంతరావు

50.

మాబడి

1978

నాయుని కృష్ణమూర్తి

51.

పాఠశాల

1978

నాయుని కృష్ణమూర్తి

52.

బాలచంద్రిక

1979

బుడ్డిగ సుబ్బరాయన్,

చొక్కాపు వెంకటరమణ

53.

బాలవాణి

1979

 

54.

విద్యాబాల

1979

కంవుల అంజనేయ శర్మ

55.

మిలియన్ జోక్స్

1979

ఎల్. వెంకటేశ్వర్లు

56.

బాలజ్యోతి

1980

నండూరి రామమోహన రావు,

శశికాంత్ శాతకర్ణి

57.

విస్డమ్

1982

కె.వి. గోవిందరావు

58.

జాబిలి

1982

కె.వి. గోవిందరావు

59.

బాల

1982

సుగుణ కేశవులు (కేశి)

60.

బాలభామ

1982

 

61.

బాలలోకం

1982

రాజవీరు

62.

యంగ్ హీరో

1983

వినుకొండ నాగరాజు

63.

చంద్రసీమ

1984

లక్ష్మీ

64.

చంద్రలోకం

1984

విశ్వేశ్వర రావు

65.

బాలరంజని

1985

కె. రాజేశ్వర రావు

66.

చిన్నారిలోకం

1985

కె. రాజేశ్వర రావు

67.

బాలకిరీటం

1985

 

68.

చిన్నారి

1986

ఎ. సాయి కుమార్

69.

చంద్రబింబం

1986

బి.కె. మోహన్

70.

చిరుమువ్వలు

1986

బి.వి. నరసింహ రావు

71.

సరదాబడి

1989

 

72.

నవ చిత్రకథ

1989

గుమ్మనూరు రమేష్ బాబు

73.

బాలచెలిమి

1990

వేదకుమార్,

చల్లా శ్రీనివాస్

74

చెకుముకి

1990

ఎ. రామచంద్రయ్య

75.

బాలమందిరం

1990

 

76.

బాలవెన్నెల

1992

వి. భూపతి రెడ్డి

77.

బాల ప్రపంచం

1993

జి.ఎ. రావు

78.

ఊయల

1998

చొక్కాపు వెంకటరమణ

79.

లీలాబాల

2000

వి. శ్రీహరి

80.

బాలజోజో

2000

బుర్రా సుబ్రహ్మణ్యం

81.

బాలతేజం

2000

నందూరి సీతారామారావు

82.

చిన్నారులు

2002

జె. గయత్రి

83.

ఆటవిడుపు

2002

మతుకుపల్లి మాధవరావు

84.

చిట్టి వికటన్

2002

 

85.

బాల-ది-కిడ్

2005

కిశోర్

86.

సిసింద్రీలు

2006

కె. బాపిరాజు

87.

మామయ్య

2007

అరిబండి ప్రసాద రావు

88.

చిన్నారి

2007

ఎ. సాయి కుమార్

89.

నాని

2007

ఎన్. కృష్ణబాబు

90.

బాలబాట

2008

కె.ఎస్.వి. రమణమ్మ

91.

కొత్తపల్లి

2008

నారాయణ

92.

బాలబాట

2008

కె.ఎస్.వి. రమణమ్మ

93.

చంద్రబాల

2009

శక్తిదాస్

94.

బాలభారతం

2009

రామేజీ రావు

95.

మొలక

2013

వెదంటసూరి

96.

శ్రీవాణి పలుకు

2014

ఎం.వి.వి. సత్యనారాయణ

97.

బాలల బొమ్మరిల్లు

2014

డార్ల బుజ్జిబాబు

98.

చంద్రప్రభ

2015

డార్ల బుజ్జిబాబు

ఆధారం: చొక్కాపు వెంకటరమణ

3.09523809524
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు