অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

విడ్డూరాలు కావు వాస్తవాలు

విడ్డూరాలు కావు వాస్తవాలు

  • గది ఉష్ణోగ్రత వద్ద ద్రావాలుగా ఉండే మూలకాలు రెండే రెండు. అవి ట్రోమిన్, పాదరసం (మెర్క్యూరి), కానీ ఒక గాలియం మొక్కను అరచేతిలోకి తీసుకుంటే అది ఆ వేడికే కరిగిపోతుంది. అంటే ముట్టుకుంటే సిగ్గుపడే లోహం అన్నమాట.
  • చాలా పదార్థాలకు భిన్నంగా, నీరు ఘనీభవించినప్పుడు, వ్యాకోచిస్తుంది. ఘనాకృతి (cube)లో ఉన్న మంచుగడ్డ ఘన పరిమాణం, అది తయారయ్యేందుకు ఉపయోగించిన నీటి ఘన పరిమాణం కంటే 9 శాతం ఎక్కువగా ఉంటుంది.
  • ఒక గ్లాసు పూర్తిగా నీటితో నిండి ఉంది. ఆ గ్లాసులో గుప్పెడు ఉప్పు పోస్తే నీరు గ్లాసులోంచి బయటకి పొర్లిపోవడానికి బదలు గ్లాసులో నీటి మట్టం కిందకు దిగుతుంది.
  • ఒక వయోజనుడైన మనిషి శరీరంలో సగటున ½ పౌండ్ లేదా 250 గ్రా. ఉప్పు (NaCl) ఉంటుంది.
  • శుద్ధ స్థితిలో ఒక మూలకం అనేక రూపాల్లో ఉండవచ్చును. ఉదాహరణకు వజ్రం (డైమండ్), గ్రాఫైట్ రెండూ కూడా శుద్ధ కార్బన్ రూపాలే.
  • నీరు (H2O)  రసాయనామం డైహైడ్రోజన్ మోనోక్సైడ్.
  • అవర్తన ప్టటికలో కనిపించని ఒకే ఒక అక్షరం J
  • మెరుపులు ఢీ కొట్టడం వల్ల ఓజోన్ (O3) ఏర్పడి, వాతావరణంలోని స్ట్పాటోస్పియర్ లో ఓజోన్ పొరను బలోపేతం చేస్తుంది.
  • నాన్ సిల్వర్ లోహాలు రెండు మాత్రమే అవి Gold(బంగారం). Copper(రాగి)
  • విశ్వంలో అత్యధిక సమృద్ధిలో ఉండే మూలకం హైడ్రోజన్ కాని భూమి యొక్క వాతావరణం, క్రస్ట్, మహాసముద్రాలు, వీటన్నింటిని అత్యధిక సమృద్ధిలో ఉండే మూలకం ఆక్సీజన్.
  • భూమి క్రస్ట్ (crust)లో అతిస్వల్పంగా లభించే మూలకం అస్టటిన్. క్రస్ట్ మొత్తంలో సుమారు 28 గ్రా. ఆస్టటిన్ మాత్రమే ఉంటుంది.
  • హైడ్రోఫ్లోరిక్ ఆమ్లానికి హరింప చేసే లేదా క్షయం చేసే లక్షణం ఉంది. అది గాజును కూడా కరిగించుకుంటుంది. అంతగా హరింపజేసే లక్షణం (Corrosive) ఉన్నా హైడ్రోఫ్రోరిక్ ఆమ్లం (HF) బలహీణమైన ఆమ్లమే.
  • అట్లాంటిక్ మహాసముద్రంలోని నీటిని బకెట్లతో నింపితే అవి బకెట్ల సంఖ్య కన్నా ఒక బకెట్ నిండా ఉన్న నీటిలో పరామణువుల సంఖ్య ఎక్కువ.
  • వాతావరణంలోని ఆక్సీజన్ లో దాదాపు 20 శాతం అమెజాన్ వర్షారణ్యాల (Rain Forests) వల్ల ఉత్పత్తి అయినదే.
  • హీలియంతో నింపిన బెలూన్ లు గాలిలో తేలుతాయి. ఇందుకు కారణం హీలియం గాలి కన్నా తేలిక కావడమే.
  • తేనేటీగ కొండి (sting) ఆమ్ల లక్షణాన్నికలిగి ఉంటుంది.
  • కారపు మిరియానికి కారం కాప్పైసిన్ అనే ఒక  అణువు వల్ల వస్తుంది. మనుషులతో సహా క్షీరదాలు (mammals) అన్నింటికీ ఈ అణువుల వల్ల కారం రుచి తెలుస్తుంది. కాని పక్షుల్లో అణువుల ప్రభావానికి కారణమైన గ్రాహకాలు (receptors)  పోవడం వల్ల వాటికి ఈ కారం రుచి తెలియదు. కాబట్టి అవి మిరియాలు కొరికిన నాలుక మండదు.
  • ఘన స్థితిలోని కార్బన్ డై ఆక్సైడ్ ను పొడిమంచు (dry ice) అంటారు.
  • ఆక్సీజన్ వాయువుకు రంగులేదు కాని ఆక్సీజన్ యొక్క ఘన ద్రవ రూపాలు నీలి రంగులో ఉంటాయి.
  • మనిషి శరీరంలో ఉండే కార్బన్ సుమారు 9000 లెడ్ (నిజానికి గ్రాఫైట్) పెన్సిళ్ళు తయారు చేయడానికి సరిపోతుంది.
  • ద్రవ స్థితిలోని గాలికి, నీటికి ఉన్నట్లో లేత నీలి ఛాయ (tint) ఉంటుంది.

ఆధారం: ఇ.ఆర్. సుబ్రమణ్యం

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate