অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

అంకెల విజ్ఞానం - 5

అంకెల విజ్ఞానం - 5

గణిత ఉపాధ్యాయుడు శేషు తరగది గదిలోనికి వెళ్లి "ఈరోజు ఐదు (5) అనే అంకె గురించి తెలుసుకుందాం. మీకేం తెలుసో చెప్పండి ". అని అడిగారు.

భ్రమరాంబ: చేతికి వేళ్ళు 5 ఉంటాయి.

మధు: ఐదు ను ఇంగ్లీష్ లో "ఫైవ్" అనీ, హిందీ లో "పాంచ్" అనీ, సంస్కృతిలో "పంచ" అనీ, లాటిన్ లో "పెంటా" అనీ పిలుస్తారు.

ప్రసాద్ : అందుకేనా 5 భుజాలు గల బహుభుజిని తెలుగు లో "పంచభుజి" అనీ ఇంగ్లీష్ లో "పెంటేన్" (Pentagon) అనీ అంటారు.

తులసి: అమావాస్య లేక పౌర్ణమి తర్వాత వచ్చే 5వ రోజును పంచమి అంటారు.

కేశవ: సార్ పాండవులు పంచ కటుకునేవారు కాబట్టి  వారిని పంచపాండవులంటారా? సార్!

అన్నరావు: కేశవ! తప్ప. పాండవులు '5' మంది కాబట్టి వారిని పంచపాండవులంటారు.

కేశవ: మరి "పంచ భూతాలు" అంటే 5 భూతాల? (తరగతి గది నిశ్శబ్దం. పిల్లలు ఎవరు సమాధానం చెప్పలేదు.)

శేషు: పంచ భూతాలు అంటే 5 భూతాలు కాదు. నేల, నింగి (ఆకాశం), నీరు, నిప్ప, వాయువు (గాలి). ఈ ఐదిటిని పంచభూతాలు అంటారు.

మహాలక్ష్మి: సంగీతంలో "పంచమం" అంటే ఏమిటి?

శేషు: "స, రి, గ, మ, ప, ద, ని " అనేవి సప్త స్వరాలు. అందులో 5వ అక్షరం 'ప'. అంటే "పంచమం".

సబిత: పంచేంద్రియములు అంటే ఏమిటి సార్?

శేషు: చెవి, కన్ను, ముక్కు, నాలుక, చర్మము. ఈ ఐదింటిని పంచేంద్రియాలు లేక జ్ఞానేంద్రియాలు అంటారు.

వేంకటేష్: ఆసియా, ఐరోపా, అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా అనే 5 కాండములు ఉనాయి.

హరిబాబు: చిన్నయ్య సూరి రచించిన గ్రంధమును "పంచతంత్రము" అనీ ఎందుకంటారు?

శేషు: ఐదు రకాలైన తంత్రములు - అనగా, మిత్రలాభము, మిత్రభేదము, కాకోలూకియము, లబ్ధనాశము, అసం ప్రేక్ష కారిత్వము - వీటి గురించి పరాశస్తు చిన్నయ్య సూరి రచించారు. అందుకే ఈ గ్రంధమును పంచతంత్రము అంటారు.

శేషు: గణితంలో 5 కున్న ప్రాధాన్యతలు చెప్పండి.

మంజుల: మూడవ బేసి సంఖ్య 5.

శశిబిందు: మూడవ ప్రధాన సంఖ్య ఐదు (5).

కేశవ: "ప్రధాన సంఖ్య" అనే పాదములో ఐదు అక్షరాలున్నాయి సార్! పడమర వైపు కూర్చున్న పంచరత్న 'పంచ (ఐదు)' గురెంచి ఏమి చెప్పకుండా ఉంది.

పంచరత్న: "సహజ సంఖ్య, ప్రధాన సంఖ్య, సంయుక్త సంఖ్య, ఆలోచించండి, ఆనందించండి" తో పటు "నోరు మూయండి" కూడా ఐదు అక్షరాలా పదాలే కేశవ!

కేశవా: ఆమ్మో, ఇక నీపేరేతను పంచరత్న !

పార్ధసారధి: "పంచభుజి" లో 5 భుజాలు , 5కర్ణాలుంటాయి.

శేషు: గుడ్, ఇలా ఒక బహుభుజిలో బుజాల సంఖ్య కారణాల సంఖ్య నామానంగా వుండే బహుభుజి పంచభుజి మాత్రమే!

మహాలక్ష్మి: (3,5), (5,7) లు కవల ప్రధానాంకాలు. ఒకే విధమైన తేడా (2) ఉండడం.

శేషు: అవును. రెండు జతల కవల పోరాధనంకాలలో వుండే సంఖ్య 5మాత్రమే.

ఆధారము;చెకుముకి

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate