অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ప్రాచీనకాలంలో భారతీయుల శాస్త్రజ్ఞానం – మరికొన్ని విశేషాలు

ప్రాచీనకాలంలో భారతీయుల శాస్త్రజ్ఞానం – మరికొన్ని విశేషాలు

yogi.jpg“పిల్లలూ! ప్రాచీనకాలంలోని భారతీయుల శాస్త్ర విజ్ఞానానికి సంబంధించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. ముందుగా వృక్షశాస్త్రజ్ఞడు పరాశరను గూర్చి తెలుసుకుందాం. సిరీ! నీవు చెప్ప" అన్నాడు " మాస్టారు.

“పరాశర క్రీ.శ. 1వ శతాబ్దానికి చెందిన వృక్ష శాస్త్రజ్ఞడు మాస్తారూ! ఈయన మొక్కల లోని వివిధ భాగాల లక్షణాలను తీవ్రంగా పరిశీలించారు, పువ్వులలోని తేడాలను పరిశోధించి మొక్కలను వర్గీకరించాడు. పరాశరుని గొప్పతనం ఏమిటంటే ఆకు నిర్మాణాన్ని గూర్చి అతడు చేసిన వర్ణన, మొక్కలలోని వివిధ భాగాలను వివరించిన తీరు. అది ఈనాటి వృక్ష శాస్త్రజ్ఞల వర్ణనల స్థాయిలో ఉంది. పరాశరుని గూర్చి నాకు తెలిసిన విశేషాలు యింతే మాస్టారూ!” అంది సిరి. “చాలమ్మా! ప్రపంచానికి పరాశరుని గూర్చి తెలిసింది. అంతేనమ్మా! అమ్మా! సౌజన్యా! గణితంలో క్రీ.శ. 3వ శతాబ్దంలో మనవారి అసాధారణ ప్రతిభను వివరించే బకాలీవ్రాత ప్రతిని గూర్చి వివరించమ్మా! అన్నారు మాస్టారు.

talpatralu.jpgబక్శాలి అనే గ్రామం ఇప్పటి పాకిస్తాన్ లోని పెషావర్ కు దగ్గరలో ఉంది. మాస్టారూ! ఆ గ్రామంలో 1881 లో క్రీ.శ మూడవ శతాబ్దం నాటి చెందిన గ్రంధం రాతప్రతి. ఆ పుస్తకం క్రీ.శ మూడవ శతాబ్దం లోనే మానవారికి గణితశాశాస్త్రంలో ఉన్న ఆసాధారణ విజ్ఞానాన్ని గూర్చి తెలియజేస్తోంది. ఆ పుస్తకంలో అంకగణితం, ఆల్ జిబ్రా, వాటి పరిష్కారాలు ఇవ్వబడ్డాయి. ఆ రాతప్రతి లెక్కల పరిష్కరానికి డెసిమల్ స్ధానవిలువ పద్ధతిని ఉపయోగించింది. ప్రపంచంలో మొదటిసారిగా ఋణవిలువను అంటే నెగటివ్ విలువను ఉపయోగించి గణితశాస్త్ర సమస్యలను పరిష్కారించింది. భిన్నాలు, స్క్వేర్ రూట్లు (వర్గాములాలు), ప్రొగ్రేషన్లు మొదలైన గణితశాస్త్ర సమస్యల పరిస్కారానికి నియమాలు సూచించింది. బిజగనితంలో అనేక క్లిస్టమైన విభాగాలను గూర్చి చర్చించడం, పరిష్కారాలు సూచించడం, ఆనాటికే మన గణిత శాస్త్రజ్ఞాలకున్న అద్భుత ప్రతిభకు తార్కాణం మాష్టారూ! అంది సౌజన్య.

“బాగా చెప్పావమ్మా ! మనోహర్ ప్రాచినకాలంలోనే మన శాస్త్రజ్ఞాలు లోహశాస్త్రంలో అద్భుత ప్రతిభ కనపరచారు. దాని విశేషాలు చెప్పు” అడిగారు మాస్టారు.

“మన భారతీయ శాస్త్రజ్ఞాలు క్రీ.పూ. 2000 లోనే కంచులోహాన్ని తయారుచేయడం, ఆ లోహంతో బొమ్మలో తయారు చేయడం నేర్చుకున్నారు. మొహంజోదారో త్రవ్వకాలలో కంచురధం, 10 సెంటిమీటర్ల ఎత్తున్న నాట్యబాలిక విగ్రహం ఎంతో కళాత్మకంగా తయారుచేశారు. తుప్పుపట్టని ఇనుపస్తంభాన్ని క్రీ.శ 400 నాటికే మన లోహశాస్త్రజ్ఞాలు తయారుచేయడం ఘన విజయం. ఢిల్లీ లో ఒక ఇనుపస్ధంభాన్ని క్రీ.శ 400 ప్రాంతంలో ఆరుబయట నిలబెట్టారు. ఆ స్తంభం ఇప్పటకి 1600 సంవత్సరాలుగా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తు ఉంది. అయినా ఇంతవరకూ తుప్పుపట్టలేదు. స్టెయిన్లెస్ బ్లేడును కొని ఒకసారి వాడి, బాత్ రూంలో ఉంచితే స్టెయిన్ అంటే తుప్పుపట్టే పరిస్ధితి ఈనాడు చుస్తునం. అలాంటిది 1600 సంవత్సరాలుగా ఆరుబయట ఉన్న స్ధభం తుప్పు పట్టకుండా ఉండటం ఆనాటి మన లోహశాస్త్రజ్ఞాల గొప్ప ప్రతిభకు తార్కాణం మాస్టారూ ! అన్నాడు జలీల్ .

“ ఆ ఇనుపస్ధంభం కొలతలు చెప్పగలవా?” అడిగారు మాస్టారూ.

“తెలియపు మాస్టారూ!” అన్నాడు మనోహర్.

statue.jpg“నెను చెబుతాను. ఆ స్ధంభం పొడవు 735.5 సెం.మీ మొత్తం బరువు 6096 కిలోలు అంటే దాదాపు 6 టన్నులు క్రిందిభాగంలో చుత్తుకోలత 41.6 సెం.మీ; పై భాగంలో చుట్టుకోలత 30.4 సెం.మీ సరే మన ప్రచీనుల లోహశాస్త్రజ్ఞాల ప్రతిభకు సంబంధించిన వివరాలు ఇంకేమైనా చెబుతావా మనోహర్?”

“చెబుతాను మాస్టారూ ! క్రీ.శ 5వ శతాబ్దంలో ఏడున్నర అడుగుల ఎత్తైన బుద్ధ విగ్రహం ఒకటి తయారు చేయబడింది. అది దాదాపు ఒక టన్ను బరువు ఉంటుంది. అంతపెద్ద విగ్రహాన్ని అవయవాలన్నీ సరియైన కొలతలతో” తయారుచేయడం గొప్ప విశేషం మాస్టారూ! విచారకరమైన విషయం ఏమిటంటే ఆ విగ్రహం ప్రస్తుతం ఇంగ్లాండులోని బర్మింగ్ హాం మ్యూజియంలో ఉండి” అంటూ ముగించాడు జలీల్.

“అవును జలీల్ ! తర్వత ఆనాటి మన శాస్త్రజ్ఞాల రసాయన శాస్త్ర ప్రతిభను గూర్చి, భాస్వన్! నివు వివరించు” అడిగాడు మాస్టారూ.

“రసాయనశాస్తారం భారతదేశంలో వైద్య శాస్త్రజ్ఞాల చేత అభివృద్ధి చేయబడింది మాస్టారూ కొన్ని రసాయనాల తయారిని గూర్చి. శుశ్రుతుడు, చరకుడు వివరించారు. ఐతే రసాయనశాస్త్రానికి మన దేశంలో ఆద్యుడుగా బొద్దుగురువు ఆచార్య నాగర్జుమని పేర్కొంటారు. అయన ఆ శాస్త్రం పై రసరత్మాకర అనే అద్బుత గ్రంధాన్ని రచించాడు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఖనిజ ఆమ్లాలూ, లోహ సంబంధ లవణాలను గుర్చిన విజ్ఞానంలో భారతీయుల విజ్ఞానం అపారమైనదని కొన్ని ప్రాచీనకాలపు చైనా దేశపు గ్రంధాలు తెలియజేశాయి. మన వారి విజ్ఞానాన్ని అందుకోవడానికి ఐరోపా దేశీయులకు కొన్ని శతాబ్దాల కాలం పట్టిందని ఐరోపా దేశీయుల పరిశోధనా పత్రాలు వెల్లడిస్తున్నాయి” అన్నాడు భాస్వన్.

“మంచిది. ఇప్పుడు మన ప్రాచీన కాలపు విశ్వవిద్యాఖ్యాతిని గూర్చి తెలుసుకుందాం. వాటిని గూర్చి నీవు చెప్పమ్మా మేరీ!” అడిగాడు మాస్టారు.

'మనం గర్వించదగిన విషయమేమంటే, ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం భారతదేశంలోనే స్థాపించబడింది. మాస్టారూ! అదే తక్షశిలా విశ్వవిద్యాలయం. దానిని క్రీ.పూ. 7వ శతాబ్దంలో స్థాపించారు. తక్షశిల ప్రస్తుత పాకిస్తాన్లో రావల్పిండికి 50 క్రిమీ. దూరంలో ఉంది. కౌటిల్యుడుగా పిలువబడే ఆచార్య చాణుక్యుడు ఈ విశ్వవిద్యాలయ

ఆచార్యుడే ఈ విద్యాలయంలో సైన్సు, గణితం, వైద్యం, రాజనీతి, ఖగోలశాస్త్రం, జ్యోతిషం, సంగీతం, మతం, తత్వశాస్త్రం మొదలైన 60 సబ్జెక్టులను బోధించేవారు. విద్యారులు దాదాపు 10,500 మంది ఉండేవారు. వారిలో చాలమంది విదేశీ విద్యార్థులు కూడ ఉండేవారు. ఈ విశ్వవిద్యాలయంలో 300 తరగతి గదులూ, పరిశోధనశాలలూ, అబ్జర్వేటరీ, గ్రంధాలయం అన్నీ ఉండేవి. ఇది క్రీ. శ. 100 వరకూ గొప్ప విజ్ఞానకేంద్రంగా విలసిల్లినా, ఆ తర్వాత సరియైన రాజాదరణ లేక క్రమంగా అంతరించింది. తక్షశిలా విశ్వవిద్యాలయం లాగే ప్రాచీనకాలపు మరో గొప్ప విశ్వవిద్యాలయం నలందా విశ్వవిద్యాలయం. ఇది పాట్నాకు దగ్గరలో ఉంది. దీనిని క్రీ.శ. 450లో గుప్తరాజు కుమారగుప్తుడు స్థాపించాడు. దీనిలో కూడ దేశ, విదేశీ విద్యార్శలు 10,000 మంది అభ్యసించేవారు. బోధనా విషయాలు తక్షశిలలోవలే ఉండేవి. అయితే క్రీ.శ. 1193లో భక్తియార్ ఖిల్జీచే కొంతా, ఆ తర్వాత 30 ఏళ్ళకు హిందూ సన్యాసులచే కొంత్రా, ఈ విశ్వవిద్యాలయమూ, దాని బ్రహ్మండమైన గ్రంథాలయమూ నాశనం చేయబడ్డాయి. ఆ రోజుల్లో మన విశ్వవిద్యాలయాల కీర్తి ఆసియా ఖండమంతటా వ్యాపించింది మాస్తారూ! అందువలననే చైనా పండితుడు హ్యూయన్సాంగ్ క్రీ. శ. 7వ శతాబ్దంలో ఈ విశ్వవిద్యాలయంలో కొంతకాలం విద్యార్థిగానూ, బోధకులు గానూ పనిచేశారు మాస్టారూ!” అంది మేరీ.

'మంచిది. బాగా చెప్పావమ్మా! ముస్లిం, హిందూ మతోన్మాదుల మూర్ఖత్వానికి నలందా మహా విశ్వ విద్యాలయం సర్వనాశనం కావడం చాలా బాధాకరం. ఇప్పడు మరో ముఖ్య విషయాన్ని తెలుసుకుందాం. భారతీయ శాస్త్రజ్ఞల ప్రతిభను గూర్చీ ప్రాచీన భారతీయ శాస్రాలు ఇతర దేశాల శాస్రాలపై చూపిన ప్రభావాన్ని గూర్చీ, భారతీయ శాస్త్రజ్ఞల బలహీనతలను గూర్చీ ఆ కాలం నాటి విదేశాలయలేమని భావించేవారో ఆ వివరాలన్నీ తెలుసుకుందాం. ఆ వివరాలను నీవు చెప్ప వెంకట్రావ్" అడిగాడు మాస్టారు.

"క్రీ.శ. 7వ శతాబ్దం నాటి సిరియా దేశపు చరిత్రకారుడు సెబోక్స్ హిందువుల శాస్త్రవిజ్ఞానాన్ని గూర్చి వివరించారు. ఈ రంగంలో వారి పరిశోధనలు గ్రీకుల, బాబిలోనియన్ల పరిశోధనల కంటే ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నాయి. గణితశాస్త్రంలో తొమ్మిది అంకెల పద్ధతి పూర్తిగా స్వదేశీయమైనది. ఈ విజ్ఞానాన్ని గూర్చి తెలిసిన తర్వాత, గ్రీకులు, వేరే దేశంలో కూడా తమంత విజ్ఞానం కలవారు ఉన్నారని అంగీకరించితీరాలి. తామొక్కరమే విజ్ఞానశాస్త్ర శిఖరాలు అందుకున్నామనే గర్వాన్ని పోగొట్టుకోవాలి" అని గ్రీకులు తెలుసుకున్నారు. భారతీయ శాస్రాల విజ్ఞానం టిబెట్, చైనా, జపాన్, ఇండో-చైనా, ఇండోనేసియా దేశాల శాస్త్ర విజ్ఞానంపై, తన ప్రభావాన్ని చూపింది. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, భారతీయు ఉచ్చదశలో ఉండగా, శాస్త్రజ్ఞలలో లేని బలహీనతలు, క్రీ.శ. 10, 11 శతాబ్దాలలో భారత శాస్త్రజ్ఞలలో ప్రవేశించాయి. ఉదాహరణకు, ప్రాచీన ఖగోళశాస్త్ర పరిశోధనలు ఉచ్ఛదశలో ఉండగా మన శాస్త్రజ్ఞలు గ్రీకు శాస్త్రజ్ఞలను గౌరవించారు. art.jpgవరాహమిహరుడు “గ్రీకుల మేచ్ఛులు. అయినా వారిని గౌరవించాలి. ఎందుకంటే వారు శాస్త్ర విజ్ఞానంలో ఇతరులను అధిగమించారు' అని వారి పట్ల తన గౌరవాన్ని ప్రదర్శించాడు. కాని 113 శతాబ్దం నాటికి భారతీయుల ప్రవర్తనలో మార్పు వచ్చింది. వారిలో శాస్త్ర ప్రతిభ సన్నగిల్లి, గర్వం పెరిగింది. దానినే ఆ కాలం నాటి చరిత్రకారుడు ఆల్బెరూనీ మాటల్లో చెప్పాలంటే ‘భారతీయ భ్రాహ్మాణులు ఎంతో గర్వాన్ని ప్రదర్శింస్తుంటారు. ఇతరులెవ్వరూ తమంతటి విజ్ఞానాన్ని సాధించారని వారు అంగీకరించరు" అని వ్రాశారు. ఒక ప్రక్క మతోన్మాదుల దాడులు, రెండో ప్రక్క శాస్త్రకారుల్లో గర్వం అనే కారణాల వలన భారతీయుల శాస్త్ర విజ్ఞాన ప్రతిభ అంతరించి, విజ్ఞానశాస్త్రరంగంలో చీకటి యుగం ప్రవేశించింది" అని ముగించాడు వెంకట్రావు.

“గుడ్! వెంకట్రావ్ పిల్లలూ! ఈ రోజు మనం మన ప్రాచీన భారతీయ శాస్త్రజ్ఞల ప్రతిభనూ, వారి పరిశోధనా ఫలితాలనూ, వారి బలహీనతలనూ, వాటి వలితాన్నీ వివరంగా తెలుసుకున్నాం. అలాగే ఇంతకుముందే ప్రాచీనకాలంలోని ఇతర దేశాల శాస్త్రజ్ఞలను గూర్చీ వారి పరిశోధనా ఫలితాలను గూర్చీ ఆ కాలంలోని సైన్సు చరిత్రను గురించీ తెలుసుకున్నాం. తరువాతి క్లాసుల్లో మధ్యయుగాలలో సైన్సు ప్రగతినీ, చరిత్రనూ గూర్చి తెలుసుకుందాం. ఈ రోజుకు క్లాసు ముగించుకుందాం" అంటూ లేచారు సైన్సు మాస్తారు శ్రీనివాస్.

పిల్లలందరూ సంతోషంగా లేచారు.

రచయిత: కె.ఎల్. కాంతారావు, సెల్: 9490300449

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/2/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate