অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సహారా ఎడారి నుండి సహాయం

సహారా ఎడారి నుండి సహాయం

265.jpgభూగోళం చుట్టూ వీచే బలమైన గాలుల గురించి అవి అనేక వేలమైళ్ళ దూరం నుంచి తెచ్చే దుమ్ము, ధూళి యొక్క పరిమాణం గురించి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదేశాలలో అమెరికా శాస్త్రజ్ఞులు అంతరిక్ష రాకెట్లు, బెలూన్లు, ఓడలు మొదలైన వాటి సహాయంతో అధ్యయనం చేసి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కనుగొన్నారు. అనేక దేశాలపై గాలి ద్వారా సంవత్సరానికి కొన్ని మిలియన్ల టన్నుల సన్నటి ధూళి అనేక వేలమైళ్ల దూరంలో ఉన్న ఇతర ప్రాంతాలనుంచి వెదజల్లబడుతున్నది.

దక్షిణ అమెరికాలో అమెజాన్ నది ప్రాంతంచుట్టూ కొన్ని మిలియన్ల చదరపు కిలోమీటర్లు వ్యాపించి వున్న దట్టమైన అరణ్యాలలోని చెట్లు, వృక్షాలు పెరగటానికి అవసరమైన మిలియన్ల టన్నుల ఖనిజ లవణాలు అట్లాంటిక్ సముద్రం అవతలి వైపునుంచి ఆఫ్రికా ఖండం నుండి ఆకాశం ద్వారా గాలిలో వస్తాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. అంతేకాక సహారా ఎడారి మధ్యలో వున్న చాద్ అనే దేశం చుట్టూ వున్న పర్వత శ్రేణుల నుండి వచ్చే ఇసుక, దుమ్ము నుండి ముఖ్యంగా ఈ ఖనిజ లవణాలు అమెజాన్ అడవులపై పడుతుంటాయి. సంవత్సరానికి సుమారు 50 మిలియన్లు టన్నుల లవణాలు అమెజాన్ అడవులపై బడి వర్షపు నీటిలో కరిగి చెట్లు, పొదలు, వృక్షాల వేళ్ళచే పేల్చబడి అవి దట్టంగా పెరగటానికి తోడ్పడుతున్నాయి. ఈ విషయాలను అమెరికాలోని Wietsman institute of science వారు అనేక సంవత్సరాల పాటు సేకరించిన సమాచారం ద్వారా తెలుసుకున్నారు. 266.jpgప్రకృతి సహజమైన ఈ చర్య ఎలా జరుగుతున్నదో గమనిద్దాం. ఆఫ్రికాలోని సహారా ఎడారి మద్య ప్రాంతంలో చెట్లులేని ఎత్తైన పర్వత ప్రాంతంలో ఛాద్ రిపబ్లిక్ (chad) అనే దేశం వుంది. ఈ దేశంలోని బోడెల్ లోయలోనికి చుట్టూ వున్న ఎత్తైన పర్వతాలనుంచి అంతులేని ధూళి చేరుతుంది. బలమైన గాలులవల్ల ఈ ధూళి మరల ఆకాశంలో చాలా పైకి వ్యాపించి, చాలా ఎత్తులో ప్రపంచం చుట్టూ వ్యాపించే గాలి ప్రవాహం వీస్తుంది. బోడెల్ లో యకు రెండువైపున ఎత్తయిన పర్వత శ్రేణులు (చెట్లు లేని రాతి కొండలు) వున్నాయి. వృత్తాకారంగా విస్తరించి వున్న ఈ పర్వతాల వరుసల మధ్య బోడెల్ లోయ లోతుగా గరాటులాగా వుంటుంది. అంతేగాక ఈ లోయకి ఉత్తరం వైపు పర్వతాల వరుసల మధ్య చాలా కిలోమీటర్ల వెడల్పు వున్న చదునైన ప్రదేశం వుంది. ఈ భాగం బోడెల్ లోయ అనే గరాటుకు గొట్టం లాగ పని చేస్తుంది. Concave mirror తో ఫోకస్ చేసినట్లుగా లోయలోని అన్ని ప్రాంతాల నుండి బలమైన గాలులు పర్వాతాల గోడలకు తగిలి ఈగరాటు గొట్టంవంటి ప్రాంతంవైపు ఫోకస్ చేయబడతాయి. దట్టమైన దుమ్ము, ధూళి, ఇసుక వంటివి ఈ ప్రాంతానికి గాలి ద్వారా చేరి అక్కడ నుండి మరల ఆకాశంలో పై ప్రాంతాలకు పీల్చబడి ప్రపంచం చుట్టూ వీచే గాలి ప్రవాహాలలోనికి చేరతాయి. అట్లాంటిక్ మహాసముద్రం దిశగా ప్రయాణం చేసి కొన్నివేల కిలోమీటర్లు వున్న సముద్రం దాటి అమెజాన్ అడవులపై మిలిటన్ల టన్నుల దుమ్ము, ధూళిని దానిలో కలిసిన ఖనిజలవణాలను ప్రతిక్షణం సంవత్సరం పొడుగునా వర్షిస్తాయి. సహారా కూడా కొన్ని మిలియన్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కల్గిన ఇసుక ఎడారి ప్రదేశం. 267.jpgకాబట్టి ప్రతి సంవత్సరం ఖనిజ లవణాలతో నిండిన సుమారు 50 మిలియన్ టన్నుల ధూళి చాద్ ప్రాంతం నుండి అమెజాన్ అడవులకు చేరుతుంది. అంటే ఆశ్చర్యం లేదు. ఈ విధంగా కొన్ని వేలు, లేక కొన్ని లక్షల సంవత్సరాల నుండి జరుగుతున్నది.

అంతరిక్షంలో పరిభ్రమించే Scientific satellite ల ద్వారా, అమెజాన్ అడవులో వున్న పరిశోధక కేంద్రాల ద్వారా, అట్లాంటిక్ పై వున్న బెలూన్ల ద్వారా సంవత్సరాల పాటు సమాచారం సేకరించి ధూళి, దుమ్ము కణాల Physical, chemical composition పరిశీలించి wietz institute of science శాస్త్రజ్ఞులు అమెజాన్ కు చేరే ఖనిజ లవణాలలో 56% ఆఫ్రికాలోని చాద్ దేశంలోని దేనిని నిర్ధారించారు. ( హిందూ సౌజన్యంతో)

రచయిత: ఎస్.బి.వి.వి.ఆర్. శాస్త్రి, హన్మకొండ

చివరిసారిగా మార్పు చేయబడిన : 4/3/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate