పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

గుడ్డును మింగిన సీసా

అంతా చూస్తుండగానే గుడ్డును సీసా మింగినట్లుగానే సీసాలో పడిపోయింది.

10మెజిషియన్ సుబ్బు మరో మేజిక్ చేసేందుకు సిద్ధపడుతున్నాడు. విద్యార్తులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సారి ఏం మేజిక్ చేస్తాడోనని. మెజిషియన్ చేతిలో ఒక గాజు సీసా ఉంది. దాన్ని పైకెత్తి అందరికీ చూపించాడు. “ఈ సీసా చూడండి. ఇదో ఖాళీ సీసా. కాని దీనికి కోడిగుడ్డును మింగే అలవాటు ఉంది. మీలో ఎవరైనా వేదిక మీదకు వస్తే మీరే స్వయంగా చేసి చూడచ్చు.” అన్నాడు. ప్రతీ మేజిక్ ను జాగ్రత్తగా గమనిస్తున్న సాకేత్ ”నేను వస్తున్నా సార్” అంటూ స్టేజిమీదికి వెళ్ళాడు. ”వెరీగుడ్.” అంటూ మెజీషియన్సాకేత్ ను అభినందించాడు.

గాజు సీసాను టేబుల్ మీద పెట్టి , సాకేత్ చేతికి ఒక గుడ్డును ఇచ్చాడు. ”అప్పుడు గుడ్డును సీసా మూతి మీద పెట్టు.” అన్నాడు. మెజిషియన్ చెప్పినట్టే చేసాడు సాకేత్. సీసా మూతికంటే గుడ్డు పెద్దది కావడం వల్ల గుడ్డు సీసా లోపల పడకుండా, సీసా మూతి మీదనే ఉండిపోయింది. ”ఏం సాకేత్, గుడ్డు సీసాలోకి పడిందా? ” అన్నాడు మెజిషియన్. ”లేదు సార్, చేతితో లోపలికి తోయాలేమో.” సాకేత్ అనుమానిస్తూ చెప్పాడు. ”అదేంకాదు, నేను ముందే చెప్పాను, ఈ సీసా గుడ్డును మింగుతుందని. కానీ ఇందుకో మంత్రం వేసి, అగ్ని పూజ చేయాలి. మీరంతా గమనించండి.” అంటూ సీసా మూతి మీదున్న గుడ్డును తీసి సాకేత్ చేతికిచ్చాడు మెజిషియన్. ఒక కగితాన్ని తీసుకొని దాని మీద ఏదో రాసినట్లు కనిపించాడు. కాగితాన్ని నిలువుగా మడతలు పెట్టి లైటర్ తో అంటించాడు. ఈ మండుతున్న కాగితాన్ని సీసాలో పడేస్తాడు. వెంటనే నీకు ఇచ్చిన గుడ్డును సీసా మూతి మీద పెట్టు అంటూ మండుతున్న కాగితాన్ని సీసాలో పడేశాడు మెజిషియన్. సాకేత్ వెంటనే గుడ్డును సీసా మూతి మీద పెట్టాడు. ఆశ్చర్యం! అంతా చూస్తుండగానే గుడ్డును సీసా మింగినట్లుగానే సీసాలో పడిపోయింది. గుటుక్కుమన్నట్లుగా శబ్దం వినపడింది. అంతా చప్పట్లు కొట్టారు.

సాకేత్ కు ఒక అనుమానం వచ్చింది. ”సీసాను పగలగొట్టకుండా, గుడ్డు పగలకుండా గుడ్డును పైకి తీయగలరా సార్? ” అన్నాడు. అలాగే దానికీ మంత్రం వుంది. గాలి అంటూ సీసాను తలక్రిందులు చేసి పైకెత్తి సీసా మూతిలోపలికి నోటితో గాలి ఉదాడు.గుడ్డు సీసా మూతి లోపలికి నోటితో గాలి ఉదాడు. గుడ్డు సీసా మూత నుండి సగానికి పైగా బయటకి వచ్చేసింది. దాన్ని చేతితో బైటికి తీసి అందరికీ చూపించాడు మెజీషియన్. అందరూ మళ్లీ చప్పట్లు కొట్టారు.

మేజిక్ ను మనం కూడా చెయ్యొచ్చు.

ఇందుకు కావలసినవి:

పాలసీసా (గాజు), ఉడకబెట్టిన కోడిగుడ్లు, లైటర్, గిన్నె, నీరు, కాగితం.

ముందుగా కొన్ని కోడిగుడ్లను ఉడకబెట్టాలి. ఒక గిన్నెలో చల్లని నీరు తీసుకొని ఉడకబెట్టిన గుడ్లను పది నిమిషాలపాటు నీటిలో ఉంచాలి. ఒక గుడ్డును తీసుకొని దాని పెంకును జాగ్రత్తగా తీసివేయాలి. ఈ గుడ్డును తిరిగి గిన్నెలోని నీటిలో ఉంచాలి.

శుభ్రంగా ఉన్న ఖాళీ గాజు పాలసీసాను నీటిలో ముంచి తడివేళ్ళతో సీసా మూతి లోపల తడివేళ్లతో సీసా మూతిలోపల తడి చేయాలి. లా చేస్తే గుడ్డు సీసాలోకి జారేందుకు వీలుగా ఉంటుంది. ఒక కాగితాన్ని తీసుకొని మడతబెట్టి లైటర్ తో అంటించాలి. మండుతున్న కాగితాన్ని పాలసీసాలో పడేసి ది రిపోయేలోగానే గుడ్డును సీసా మూతిమీద వుంచాలి. చూస్తుండగానే గుడ్డు సీసాలోకి పడిపోతుంది. లోపలికి పీల్చుకున్న శబ్దం కూడా వినిపిస్తుంది. గుడ్డును బయటకి తీసేందుకు, సీసా మూతి లోపలివైపున తడివేళ్ళతో మళ్ళీ తడిని చేయాలి. సీసాను తలక్రిందులు తేసి సీసా మీతిలో గుడ్డు పడేటట్లు చేయాలి. సీసాను తలకిపైగా ఎత్తి పట్టుకుని, సీసా మూతిని నోటిలో పెట్టుకొని, గుడ్డు మీదుగా సీసాలోకి గాలిని గట్టిగా ఉదాలి. మింగిన గుడ్డు కక్కినట్లుగా, గుడ్డు మూడొంతులు పైకి వస్తుంది.

ఇలా ఎందుకు జరిగింది? నిజానికి ఇందులో మెజీషియన్ చేసిన మాయ గానీ, మంత్రం గానీ ఏమి లేదు. ఉన్నదల్లా గాలి పీడనంలో వచ్చే తేడాలే. ఈ సైన్సును అర్థం చేసుకోవాలి.

మండే కాగితాన్ని సీసాలో డేసినప్పుడు సీసా లోపలి గాలి వేడెక్కి వ్యాకోచిస్తుంది. కొంత గాలి బయటకి పోతుంది. మంట రినప్పుడు గాలి చల్లబడుతుంది. సీసా మూతిమీద వున్న గుడ్డు బయటి గాలిని సీసాలోకి రానీయకుండా అడ్డుపడుతుంది. అంటే సీసాలోపల కంటే బయట పీడనం ఎక్కువగా ఉంటుంది. అందుచేతనే బయటిగాని గుడ్డును లోపలికి తోస్తుంది. అలాగే, నోటితో సీసాలోపలికి గుడ్డు మీదుగా గాలిని ఉదినప్పుడు లోపలి గాలి పీడనం ఎక్కువై గుడ్డును బయటకి తోస్తుంది.

ఆధారం: ఇ.ఆర్. సుబ్రమణ్యం

3.00835654596
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు