హోమ్ / విద్య / ఉపాధ్యాయ వేదిక / ఉపాధ్యాయులు, బోధన మరియు సమాచారాన్ని చేరవేసే సాంకేతిక పరిజ్ఞానం (ఐ.సి.టి.)
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఉపాధ్యాయులు, బోధన మరియు సమాచారాన్ని చేరవేసే సాంకేతిక పరిజ్ఞానం (ఐ.సి.టి.)

ఐ.సి.టీ. లో పెట్టిన పెట్టుబడికి మంచి ఫలితాలు రావాలంటే, ఉపాధ్యాయుల శిక్షణ మరియు నిరంతరం కొనసాగే సుసంగతమైన వృత్తిగత అభివృద్ధి తప్పనిసరి.

ఉపాధ్యాయుల పాత్ర

అభ్యాస ప్రక్రియలో ఉపాధ్యాయులు ఎప్పటికీ కేంద్ర బిందువుగా ఉంటారు

ఐ.సి.టీ. లను ఉపయోగించే ఉపాధ్యాయుల పాత్ర ఒక అనుసంధాన కర్త (`ఫెసిలిటేటర్' సానుకూల పరిచే వారు)గా మారినంత మాత్రాన వారు తరగతిని నడిపించవలసిన అవసరం ఏ మాత్రం తగ్గదు; ఉపాధ్యాయుల యొక్క సాంప్రదాయ నాయకత్వ నైపుణ్యాలు మరియు పద్ధతులు ఇప్పటికీ ముఖ్యమైనవే (విశేషించి పాఠ్య ప్రణాళిక రూపొందించడంలోనూ, అందుకు తగిన సన్నాహాలు గావించడంలోనూ మరియూ పనిజరిగేటట్టు చూడడంలోనూ).

ఐ.సి.టీ. లు ఉపయోగించేటప్పుడు పాఠ్య ప్రణాళిక రూపకల్పన అత్యంత కీలకం

ఐ.సి.టీ. లు ఉపయోగించేటప్పుడు ఉపాధ్యాయులు పాఠ్య ప్రణాళికను రూపొందించడం ఎంతో ముఖ్యం; ఒక ప్రణాళిక లేని సందర్భాల్లో విద్యార్ధుల పనితీరు చాలా వరకు అస్తవ్యస్తంగా ఉండి అంతగా ఏమీ నేర్చుకోలేక పోయినట్లు పరిశోధనలు తెలియచేస్తున్నాయి.

బోధనా శాస్త్రం

సాంకేతిక పద్ధతులు ప్రవేశ పెట్టినంత మాత్రాన  బొధన  మరియు అభ్యాస ప్రక్రియ మొత్తం మారిపోదు

ఐ.సి.టీ. లు ఉన్నంత మాత్రం చేత ఉపాధ్యాయుల బోధనా పద్ధతులు ఏమీ మారిపోవు. అయితే కొన్ని పరిస్థితులలో ఉపాధ్యాయులు వారి బోధనా పద్ధతులను రూపాంతరీక రించుకోవడానికి ఐ.సి.టీ. లు ఉపకరిస్తాయి. ఉపాధ్యాయుల బోధనా విధానాలు మరియు తార్కిక దృష్టి వారి ఐ.సి.టీ. ల వినియోగంపై ప్రభావం చూపుతాయి, ఉపాధ్యాయులు ఐ.సి.టీ. వినియోగించే పద్ధతి విద్యార్ధుల అవగాహన పై ప్రభావం చూపుతుంది.

`అభ్యాసి - కేంద్రక' అభ్యాసన వాతావరణాన్ని కల్పించడంలో ఉపాధ్యాయులకు ఉపకరించే సాధనాలుగా ఐ.సి.టీ. లను పరిగణించాలి

ఐ.సి.టీ. ల సహాయంతో ఉపాధ్యాయులు తరగతిలోని విద్యార్దులందరితో కాని, చిన్న చిన్న బృందాలుగా కానీ, లేదా ఒక్కొక్కొరితో గానీ చర్చించడం ద్వారా విద్యార్ధుల అవగాహనను మరియు ఆలోచనా శక్తిని సవాలు చేయడం ద్వారా ఐ.సి.టీ. ల వినియోగం అత్యంత సమర్ధవంతంగా ఉంటుందని  ఓఇసిడి (ఆర్ధిక సహకార మరియు అభివృద్ది సంస్థ) దేశాలలోని అధ్యయనాలు ఏకాభిప్రాయానికొచ్చాయి. సాంప్రదాయ  `ఉపాధ్యాయ-కేంద్రక' బోధనా రీతుల నుండి `అభ్యాసి - కేంద్రక'  పద్ధతులకి మారడానికి ఐ.సి.టి. లు ప్రధాన సాధనాలుగా దోహదపడతాయి.

ఇప్పుడు ఆచరణలోఉన్న బోధనాపద్ధతులకు తోడ్పడడానికి లేదా విస్తృతపరచడానికి మరియు మార్పును తేవడానికి  ఐ.సి.టీ. లను వినియోగించవచ్చు

ఐ.సి.టి. వినియోగంలో ఉపాధ్యాయుల బోధనా విధానాలు వివిధ రకాలుగా ఉండవచ్చు. ఉపాధ్యాయులు తమ సాంప్రదాయ బోధనా పద్ధతులకు కేవలం చిన్న చిన్న చేర్పులు చేయవచ్చు, లేదా తమ బోధనా విధానంలో మౌలికమైన మార్పులను తీసుకు రావచ్చు. ఆచరణలో ఉన్న బోధనా విధానాలను  బలోపేతం  చేయడానికే  కాక  ఉపాధ్యాయులు, విద్యార్ధులు  పరస్పరం వ్యవహరించే తీరును మార్చడానికి  సైతం  ఐ.సి.టి. లు  ఉపయోగపడతాయి.

సమాచారాన్ని  ప్రదర్శించడంలో  ఐ.సి.టి. ల వినియోగం మిశ్రమ సాఫల్యతను కనబరచింది

ఓవర్ హెడ్ ప్రొజక్టర్లు మరియు ఎల్.సి.డి. ప్రొజక్టర్లు, టెలివిజన్, ఎలక్ట్రానిక్ వైట్ బోర్డులు, గైడెడ్ వెబ్ టూర్లు (అంటే విద్యార్ధులు ఏక కాలంలో, వారి కంప్యూటర్ తెరల మీద ఒకే రకమైన విషయాలను చూడడం) వంటి ఐ.సి.టి. లు  ప్రదర్శక సాధనాలుగా వినియోగించడం మిశ్రమ సాఫల్యతను కనబరచింది. దీని వలన విద్యార్ధుల యొక్క అవగాహన పెరుగుతుంది, మరియు నమూనాల ప్రదర్శన ద్వారా కష్టతరమైన భావాలను గురించిన చర్చలను ప్రోత్సహిస్తుంది. ఇలాంటి ఐ.సి.టి. లు  సాంప్రదాయ బోధనా పద్ధతులను బలోపేతం చేస్తాయి కానీ విద్యార్ధుల ధ్యాస చర్చిస్తున్న లేక ప్రదర్శిస్తున్న విషయాల మీద నుండి ఉపయోగిస్తున్న సాధనం మీదకు       మరల వచ్చు.

ఉపాధ్యాయుల సాంకేతిక సామర్ధ్యాలు మరియు ఐ.సి.టి. పరిజ్ఞానం

ఐ.సి.టి. వినియోగం వల్ల లబ్ధిపొందేటట్లు ఉపాధ్యాయులను సన్నద్ధం చేయడమంటే కేవలం సాంకేతిక నైపుణ్యాలను పెంచడం మాత్రమే కాక మరింత ఎక్కవ

ఐ.సి.టి నైపుణ్యాలలో ఉపాధ్యాయులు సాంకేతిక పరంగా ప్రావీణ్యత సంపాదించినంత మాత్రాన బోధనలో ఐ.సి.టి. లను సమర్ధవంతంగా కలుపుకొని పోలేరు.

`ఎప్పుడో - ఓసారి' ఇచ్చేశిక్షణ సరిపోదు

సముచితమైన విషయ వనరులను పరీక్ష చేసి అన్నింటిలోకీ మంచి వాటిని ఎంపిక చేయగలగడానికి ఉపాధ్యాయులకు విస్తృతమైన శిక్షణ మరియు ఐ.సి.టి ల గురించి నిరంతరం తెలుసుకుంటూ ఉండడం అవసరం.  అయినప్పటికీ  ఐ.సి.టి. లలో సాంకేతిక పరంగా  ప్రావీణ్యత  సంపాదించడం  కన్నా సరైన బోధనా పద్ధతులను రూపొందించడమే మరింత ముఖ్యం.

కొద్దిమంది ఉపాధ్యాయులకు మాత్రమే వారి బోధనలో  ఐ.సి.టి. లను వినియోగించే విషయంలో విస్తృతమైన ప్రావీణ్యం ఉంది.

ఓ ఇ సి డి దేశాలలోని అత్యంత ఆధునిక పాఠశాలలలో కూడా, సాధారణంగా అతి కొద్ది మంది ఉపాధ్యాయులకు మాత్రమే వివిధ రకాల ఐ.సి.టి.  సాధనాలు మరియు వనరులు గురించిన సమగ్ర పరిజ్ఞానం ఉంటుంది.

ఓ ఇ సి డి దేశాలలో ‘కంప్యూటర్ అక్షరాస్యత' ను  పెంపొందించడంలో  ఐ.సి.టి. ల వినియోగం, బోధన మరియు అభ్యాస సాధనాలుగా ఐ.సి.టి. లను ఉపయోగించడంకన్నా అంత ముఖ్యం కాదు అన్న భావన ఉంది.

ఓ ఇ సి డి అనుభవంలో, రోజువారీ బోధన మరియు అభ్యాస కార్యకలాపాలలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ప్రత్యేకించి `కంప్యూటర్ తరగతుల' లో నేర్పడం కన్నా ముఖ్యమని అనిపిస్తుంది. బోధన మరియు అభ్యాస ప్రక్రియలో సాంకేతిక నైపుణ్యాల అభివృద్ది యొక్క పాత్ర ఉన్నప్పటికీ, అది బోధన మరియు అభ్యాస పద్ధతులను సానుకూల పరిచేదిగా మాత్రమే ప్రాధాన్యతను సంతరించు కుంటుంది తప్ప, దానికై అది అంత ముఖ్యమైనది కాదు. విద్యార్ధుల ఐ.సి.టి. సంబంధిత నైపుణ్యాలు మరియు అనుభవం యొక్క స్థాయిలు అత్యధికంగా ఉన్నాయని చెప్పిన పాఠశాలలు, కంప్యూటర్ కోర్సులు అధికంగా ఉన్నటువంటి పాఠశాలలు కానే కావు. కాగా అవి ఉపాధ్యాయుల వృత్తిగత అభివృద్ది, మరియు బోధన & అభ్యాస ప్రక్రియలలో మొదటి నుండి చివరదాకా ఐ.సి.టి. లను రివాజుగా ఉపయోగించినవి.

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో ఉపాధ్యాయులకన్నా విద్యార్ధులే ఎక్కువ అధునాతనను కలిగి ఉన్నారు

ఓ ఇ సి డి దేశాలలో విద్యార్ధుల విషయ పరిజ్ఞానానికి, ఐ.సి.టీ. ల వినియోగానికి, మరియు ఉపాధ్యాయులు ఐ.సి.టీ. లను ఉపయోగించగలగడానికి ఏ మాత్రం   పొంతన  లేనట్టు కనిపిస్తుంది. దీని వలన ఉపాధ్యాయుల అనుభవ రాహిత్యం మరియు నైపుణ్యాల కొరత, విద్యార్ధులు వారి విద్యలో ఐ.సి.టీ. లను వినియోగించే సామర్ధ్యాన్ని చాలా వరకూ కుంటు పరుస్తున్నాయని తెలియ వస్తోంది.

ఉపాధ్యాయుల ఐ.సి.టి. వినియోగం

ఉపాధ్యాయులు ఐ.సి.టి. లను పరిపాలక కార్య  కలాపాలకు ఎక్కువగా వినియోగిస్తారు
ఉపాధ్యాయులు ఐ.సి.టి. లను `రివాజు పనులకు' (రికార్డులకు, పాఠ్య  ప్రణాళికను రూపొందించడానికి, సమాచారాన్ని ప్రదర్శించడానికి, ఇంటర్నెట్ పైన ప్రాధమిక అన్వేషణలను జరుపడానికి) ఎక్కువగా వినియోగిస్తారు.

అధిక ప్రావీణ్యత గల  ఉపాధ్యాయులు "కంప్యూటర్ అసిస్టెడ్ ఇంస్త్రక్షన్" (కంప్యూటర్ సహాయంతో బోధించడం) పైన తక్కువగా ఆధార  పడతారు.

ఐ.సి.టి. లలో అధిక ప్రావీణ్యత గల ఉపాధ్యాయులు, ఐ.సి.టి. లను ఉపయోగించే ఇతర ఉపాధ్యాయులకన్నా కంప్యూటర్ అసిస్టెడ్ ఇన్స్ట్రక్షన్ ను తక్కువగా ఉపయోగిస్తారు.  అయితే  మొత్తం మీద ఐ.సి.టి. లను ఎక్కువగా ఉపయోగిస్తారు.

ఐ.సి.టి.  లను ఉపాధ్యాయులు ఎలా  ఉపయోగిస్తారన్నది వారి వ్యక్తిగత  బోధనా శైలి పై ఆధారపడి ఉంటుంది
ఐ.సి.టి. వినియోగ విధానాలు ఉపాధ్యాయుల యొక్క బోధనా తత్వాలననుసరించి ఉంటాయి.  ఐ.సి.టి. లను అధికంగానూ, మిక్కిలి సమర్ధవంతంగానూ ఉపయోగించే ఉపాధ్యాయులు సాంప్రదాయకంగా తెలియజేసె  బోధనా రీతులను తక్కువగా ఉపయోగించవచ్చు. పలు రకాల     సాప్ట్ వేర్ లను ఉపయోగించే ఉపాధ్యాయులు మరింత "నిర్మాణాత్మక" బోధనా రీతులను పాటించే అవకాశం ఉంది.

ఐ.సి.టి. లతో   బోధన   ఎక్కువ సమయం తీసుకుంటుంది
బోధన మరియు అభ్యాసానికి తోడ్పడే విధంగా ఐ.సి.టి. లను వినియోగించడానికి ఉపాధ్యాయులకు ఎక్కువ సమయం పడుతుంది. దీనికి వారు వారి బోధనా పద్ధతులను మార్చుకునే ప్రయత్నం చేయడం, ఐ.సి.టి. విధానాలను తరచుగా ఉపయోగించడం, రెండూ కారణం కావచ్చు.
సూక్ష్మంగా చెప్పాలంటే ఐ.సి.టి. లతో బోధనకు ఎక్కువ సమయం పడుతుంది (ఒకే విషయాన్ని చెప్పడానికి ఎంత అదనపు సమయం పడుతుంది అన్న అంచనాలు అటూ ఇటూగా ఉన్నాయి; 10% సాధారణ అంచనా).

ఉపాధ్యాయుల ఆత్మవిశ్వాసం మరియు ప్రేరణ

కొద్దిమంది ఉపాధ్యాయులు మాత్రమే  ఐ.సి.టి. లను   ఆత్మవిశ్వాసంతో   వాడగలరు

కొద్ది మంది ఉపాధ్యాయులు మాత్రమే రకరకాల ఐ.సి.టి. వనరులను ఉపయోగించడంలో సిద్ధహస్తులై ఉంటారు. అలాంటి విశ్వాసం తక్కువైతే వారు పాఠం సరిగా చెప్పలేరు.

భయం వలన కూడా ఉపాధ్యాయులు   ఐ.సి.టి. లను ఉపయోగించలేరు

ఓ ఇ సి డి దేశాలలో  చాలా మంది ఉపాధ్యాయులు ఇప్పటికీ ఐ.సి.టి. లను ఉపయోగించడానికి భయపడుతున్నారు, కాబట్టి వీటిని వారి బోధనలో వాడడానికి అయిష్టంగా ఉన్నారు.

మొదట్లో కనీసం  ఐ.సి.టి. లు   ఉపాధ్యాయులకు (కొంత మందికి)  ప్రేరణనిస్తాయి
మొదట్లోనైనా కనీసం, ఐ.సి.టి. ల గురించి తెలుసుకోవడం అన్నది, ఉపాధ్యాయులకు ప్రేరణ కలిగించడానికి,  మరియు వారి వృత్తిగత అభివృద్ధికి దోహదపడుతుంది.

నిరంతర వృత్తిగత అభివృద్ధి  కార్యక్రమాలలో ఉపాధ్యాయులు సమర్ధవంతంగా  పాల్గొనేటట్లు చేయడానికి ప్రోత్సాహకాలు రూపొందించవలసి ఉంటుంది .
నిరంతర వృత్తిగత అభివృద్ధి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడానికి ఉపాధ్యాయులకు అదనపు ప్రేరణ మరియు ప్రోత్సాహకాలు అవసరం. ధృవీకరణ (సర్టిఫికేషన్), వృత్తిగత అభివృద్ది, జీతం పెంపు, వృత్తిగత అభివృద్దికి జీతంతో కూడిన సెలవు, పాఠశాలలోనూ, సమాజంలోనూ,  మరియు సాటి వారిలోనూ నియత మరియు అనియత గుర్తింపు,  ప్రత్యేకంగా చూడడాన్ని తగ్గించడం,  మరియు ఉత్పాదకత అభివృద్ధి వంటి రకరకాల ప్రోత్సాహకాలను ఉపయోగించవచ్చు.

ఉపాధ్యాయులు ఐ.సి.టి. లను   ఉపయోగిస్తారా   లేదా అన్నదానికి, వారికి   ఐ.సి.టి. ల   అందుబాటు ప్రధానమైన   కారణం
ఉపాధ్యాయుల ఐ.సి.టి. సంబంధిత నైపుణ్యాల అభివృద్ది కొనసాగించడానికి, బాగా పనిచేస్తున్న, సంబంధిత ఐ.సి.టి సామగ్రి నిరంతరం అందుబాటులో  ఉండడం అన్నది ప్రధాన కారణం

విషయ పరిజ్ఞానం

ఐ.సి.టి. లను ఎలా  ఉపయోగిస్తారన్నదాన్ని    ఉపాధ్యాయుల యొక్క విషయ  పరిజ్ఞానం ప్రభావితం చేస్తుంది
ఉపాధ్యాయులకు వారి బోధనా విషయాల్లో ఉండే ప్రావీణ్యత, వారు ఐ.సి.టి. వనరులను వారి బోధనా విషయాలకు ఎలా కలుపుకుని వాడుకుంటారు అన్నదీ,  పాఠాల్లో  ఐ.సి.టి. లను ఉపయోగించే  తీరును ప్రభావితం చేస్తుంది.

ఉపాధ్యాయుల   విషయ   ప్రావీణ్యత మరియు విద్యార్ధులు  విషయాన్ని   ఎలా అర్ధం చేసుకుంటారన్న  అవగాహన    ఐ.సి.టి. వినియోగాన్ని మరింత సమర్ధవంతంగా   చేస్తాయి.
ఉపాధ్యాయులకు విషయ ప్రావీణ్యత మరియు విద్యార్ధులు విషయాన్ని ఎలా అర్ధం చేసుకుంటారన్న  అవగాహన ఉన్నప్పుడు, వారు ఉపయోగించే  ఐ.సి.టి. లకు విద్యార్ధులు నేర్చుకోవడం  పై  మరింత ప్రత్యక్ష ప్రభావం ఉంటాయన్న దాఖలా ఉంది.

ఐ.సి.టి. ల ద్వారా  కొత్త / అదనపు సమాచారం  తెలుసుకున్నంత మాత్రం సరిపోదు
విద్యార్ధులు ఏదైనా నేర్చుకోవాలంటే, వారికి కొత్త మరియు అదనపు సమాచారాన్ని ఇవ్వడం కన్నా, వారిని ఆలోచింపచేసి, వారికి విషయం అర్ధమయ్యిందో లేదో వారిని వారే ప్రశ్నింపచేసుకునేలా  సవాలు చేయడం ద్వారా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

ఉపాధ్యాయులు బోధనా విషయాలు సొంతంగా నేర్చుకోవడానికి  ఐ.సి.టి. లు ఉపకరిస్తాయి
అధునాతనమైన,  అదనపు అభ్యాస వనరులను అందుబాటులో ఉంచడం ద్వారా ఐ.సి.టి. లు ఉపాధ్యాయులు వారి వారి బోధనా  విషయాలు సొంతంగా నేర్చుకోవడానికి దోహదపడతాయి.

ఉపాధ్యాయుల వృత్తిగత అభివృద్ధి

విద్యాబోధనలో ఐ.సి.టి. ల వినియోగం జయప్రదమవ్వాలంటే  నిరంతరం కొనసాగే ఉపాధ్యాయ శిక్షణ మరియు తోడ్పాటు చాలా  అవసరం
విద్యాబోధనలో ఐ.సి.టి. ల వినియోగం జయప్రదమవ్వడానికి ఉపాధ్యాయ శిక్షణ మరియు ఉపాధ్యాయుల వృత్తిగత అభివృద్ధి కీలకమైనవి.

ఉపాధ్యాయుల వృత్తిగత అభివృద్ధి  అన్నది ఒక ప్రక్రియ కానీ  , ఒక సంఘటన కాదు
ఎప్పుడో ఒకసారి నిర్వహించే సాంప్రదాయక ఉపాధ్యాయ శిక్షణా వర్క్ షాపులు, ఐ.సి.టి. లను సమర్ధవంతంగా బోధనలో చొప్పించడానికి  కాదు కదా, కనీసం ఉపాధ్యాయులు వాటిని సౌకర్యవంతంగా ఉపయోగించుకునేలా చేయడానికి కూడా ఉపయోగపడలేదు. నిరంతరం కొనసాగే వృత్తిగత అభివృద్ధి కార్యాక్రమాలతో పోలిస్తే విడిగా, ఎప్పుడో ఒకసారి జరిగే శిక్షణా కార్యక్రమాలు తీసికట్టుగా కనిపిస్తాయి.

ఐ.సి.టి. లను ప్రవేశపెట్టడం వలన  ఉపాధ్యాయులకు నిరంతరం కొనసాగే  వృత్తిగత అభివృద్ధి   కార్యాక్రమాల అవసరం పెరిగింది

విద్యాబోధనలో సమర్ధవంతమైన ఐ.సి.టి. వినియోగం ఉపాధ్యాయుల శిక్షణ మరియు వృత్తిగత అభివృద్ధి అవసరాలను పెంచింది. అయితే ఈ పెరిగిన అవసరాలను తీర్చడానికి, మరిన్ని ఎక్కువ, మరింత శ్రేష్టమైన విద్యా విషయాలను అందుబాటులోనికి తేవడం ద్వారా, రివాజుగా చేసే పరిపాలక పనులకు  తోడ్పడడం ద్వారా, ఉపయుక్తమైన బోధనా పద్ధతుల నమూనాలు అందించడం ద్వారా, మరియు  ముఖా ముఖీ పద్ధతిలోనూ, దూర విద్యా పద్ధతిలోనూ కూడా అభ్యాసకులకు ఏక కాలంలో కానీ, వేరు వేరు కాలాలలో కానీ తోడ్పడే నెట్ వర్కులను ఏర్పరచడం ద్వారా     ఐ.సి.టి. లు ముఖ్యమైన సాధనాలు కాగలవు.

Successful teacher professional development models can be divided into three phases
సత్ఫలితాలనిచ్చే ఉపాధ్యాయ వృత్తిగత అభివృద్ధి నమూనాలను   మూడు దశలుగా విభజించ వచ్చు

నిరంతరం కొనసాగే సత్ఫలితాలనిచ్చే వృత్తిగత అభివృద్ధి నమూనాల ను మూడు దశలుగా విభజించ వచ్చు:
1)  ప్రీ-సర్వీస్: బోధనా శాస్త్రం, విషయ ప్రావీణ్యం, నిర్వహణ నైపుణ్యాలు మరియు వివిధ బోధనా సాధనాల వినియోగం (ఐ.సి.టి. లతో సహా) వంటి వాటి పై ప్రారంభంలో సిద్ధం చేయడం;

2) ఇన్-సర్వీస్, క్రమపధ్ధతిలో ఏర్పరచిన (స్ట్రక్చర్డ్), ముఖా ముఖీ మరియు దూర విద్యా అభ్యాస అవకాశాలు, ప్రీ - సర్వీస్ శిక్షణను వృద్ధి, మరియు ఉపాధ్యాయుల ప్రత్యక్ష అవసరాలు; మరియు

3) ఉపాధ్యాయుల రోజువారీ అవసరాలను, సవాళ్ళను ఉద్దేశించి ఐ.సి.టి. లు సానుకూల పరచిన నిరంతరం కొనసాగే నియుత,  అనియుత బోధనా శాస్త్రం మరియు సాంకేతిక తోడ్పాటు
సమర్ధవంతమైన ఉపాధ్యాయ వృత్తిగత అభివృద్ధి సమర్ధవంతమైన బోధనా పద్ధతుల ననుసరించి ఉండాలి
సమర్ధవంతమైన ఉపాధ్యాయ వృత్తిగత అభివృద్ధి తరగతి వాతావరణానికి సాధ్యమైనంత దగ్గరగా ఉండాలి. బోధన మరియు అభ్యాస ప్రక్రియలో ఐ.సి.టి. లు ప్రముఖ పాత్ర వహించే సందర్భంలో ఐ.సి.టి. ల వినియోగం పై `చేతలతో' కూడిన బోధన తప్పనిసరిగా ఉండాలి. అంతేకాక, వృత్తిగత అభివృద్ధి కార్యకలాపాలు ఉపయుక్తమైన ఆచరణ పద్ధతులను మరియు ప్రవర్తనలను ప్రతిబింబింప చేసి, ఉపాధ్యాయులు కలిసి పని చేసేలా ప్రోత్సహించి, తోడ్పాటునివ్వాలి. పాఠశాల  స్థాయిలో,  అందుబాటులో ఉన్న ఐ.సి.టి. సదుపాయాలను ఉపయోగించుకొని నిరంతరం కొనసాగే వృత్తిగత  అభివృద్ధి,  ముఖ్యంగా  ఉపాధ్యాయుల  రోజువారీ  అవసరాలకు  మరియు  ఆచరణ  పద్ధతులకు  సంబంధించిన  వనరులు, నైపుణ్యాల మీద దృష్టి పెట్టినప్పుడు, అది విజయానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. 

శిక్షణలో నిర్ధారణ   పద్ధతులు ముఖ్యం
వృత్తిగత అభివృద్ధి లో మూల్యాంకన పద్ధతులు, బోధనా శాస్త్ర  పద్ధతుల సవరింపు భాగం కావాలి. ఉపాధ్యాయులను రకరకాల మూల్యాంకన పద్ధతులను తెలియచెప్పాలి.


సమర్ధవంతమైన వృత్తిగత అభివృద్ధికి  పటిష్టమైన ప్రణాళికా  రచన కావాలి
వృత్తిగత అభివృద్ధి సమర్ధవంతంగా ఉండి ఉపాధ్యాయుల అవసరాలను లక్ష్యంగా చేసుకోవాలంటే,  ఉపాధ్యాయ వృత్తిగత అభివృద్ధి కార్యకలాపాలను మొదలుపెట్టే ముందు, వాటిలో పాల్గొనే ముందు  ఒక  అవసరాల మూల్యాంకనం జరపాలి. ఈ కార్య కలాపాలను క్రమం తప్పక పర్యవేక్షించి మూల్యాంకనం చేస్తూ ఉండాలి.

ఉపాధ్యాయులకు నిరంతరం కొనసాగే , క్రమం తప్పని తోడ్పాటు కీలకమైనది
ఉపాధ్యాయుల వృత్తిగత అభివృద్ధికై నిరంతరం కొనసాగే, క్రమం తప్పని తోడ్పాటు ఎంతో అవసరం. ఇది వెబ్ సైట్ ల రూపంలోనూ, చర్చా బృందాలు, ఈ-మెయిల్ కమ్యూనిటీలు, మరియు రేడియో లేక టెలివిజన్ ప్రసారాల వంటి ఐ.సి.టి. ల ద్వారా సానుకూల పరచవచ్చు.

సామర్ధ్యాన్ని కలుగచేసే కారకాలు

ఉపాధ్యాయులు ఐ.సి.టి . లను సమర్ధవంతంగా వినియోగించడానికి ఎన్నో రకాల మార్పులను తీసుకునిరావలసి ఉంటుంది .
బోధనా శాస్త్రాన్ని మార్చడం, పాఠ్య ప్రణాళికకు, మూల్యాంకనకు తిరిగి రూపకల్పన చేయడం, పాఠశాలలకు మరింత స్వతంత్ర ప్రతిపత్తిని  కలిగించడం ఐ.సి.టి. ల వినియోగాన్ని సమర్ధవంతంగా తీర్చి దిద్దడానికి దోహదపడతాయి. సామర్ధ్యాన్ని పెంచే కారకాలు ఉంటే, ఉపాధ్యాయులు వారి బోధనా తత్వ పరిధిలో సాధ్యమైనంత `నిర్మాణాత్మక' రీతిలో ఐ.సి.టి. లను వినియోగించగలరు.

సరిగ్గా పనిచేస్తున్నసాంకేతిక   ఉపకరణ సౌకర్యాలు (సహజంగానే) కీలకం
ఉపాధ్యాయులు ఐ.సి.టి. లను సమర్ధవంతంగా వినియోగించుకోవాలంటే, వారికి సరిగ్గా పనిచేస్తున్న  కంప్యూటర్లు తగినంత అందుబాటులో ఉండాలి మరియు తగిన సాంకేతిక సహాయం కూడా  అందించాలి. 
ఐ.సి.టి. లను ప్రవేశ  పెట్టడానికి సమయం ఎక్కువ  పడుతుంది
ఐ.సి.టి. లను సమర్ధవంతంగా వినియోగించుకోవాలంటే, ఉపాధ్యాయులకు, కొత్త నైపుణ్యాలను పెంచుకునేందుకు, వాటిని అప్పుడు ఆచరిస్తున్న బోధనా పద్ధతులతోనూ మరియు పాఠ్య ప్రణాళికతో సమాకలనం చేయడానికి, మరియు అవసరమైన అదనపు పాఠ్య ప్రణాళికా రచనకు పూనుకోవడానికి, వారికి తగినంత సమయం ఇవ్వాలి.

పాఠశాల యాజమాన్యం మరియు సమాజం యొక్క తోడ్పాటు కూడా ఎంతో ముఖ్యం సమర్ధవంతంగా  మాట అటు ఉంచి,  ఉపాధ్యాయులు ఐ.సి.టి. లను వినియోగించుకోవాలంటేనే, పాఠశాల యాజమాన్యం యొక్క మరియు కొన్ని సందర్భాల్లో చుట్టుపక్కల వారి యొక్క తోడ్పాటు అత్యంత కీలకం. ఈ కారణంగా, విద్యా బోధనలో ఐ.సి.టి. లపై పెట్టిన పెట్టుబడులకు తగిన ప్రతిఫలం రావాలంటే ఈ రెండు వర్గాల వారికి చేరువ కావడం ఎంతైనా అవసరం.

ఉపాధ్యాయుల వృత్తిగత అభివృద్ధికి తోడ్పడడానికి  'కమ్యూనిటీస్ ఆఫ్ ప్రాక్టీస్' ముఖ్యమైన సాధనాలు కావచ్చు
విద్యా సంబంధ యత్నాలలో మరియు కార్యకలాపాల్లో ఐ.సి.టి. కి తోడ్పడడానికి నియత మరియు అనియత `కమ్యూనిటీస్ ఆఫ్ ప్రాక్టీస్' మరియు `పీర్ నెట్వర్క్స్' అన్నవి ముఖ్యమైన సాధనాలు. ఈ ఆధార యంత్రాంగాలను ఐ.సి.టి. ల ద్వారా సానుకూలపరచ వచ్చు.

విద్యాబోధనలో ఐ.సి.టి. లను ప్రవేశపెట్టేటప్పుడు నేర్చుకున్న విషయాలను పంచుకోవలసి ఉంటుంది .
విద్యా బోధనకు సహకరించడానికి ప్రవేశపెట్టిన ఐ.సి.టి. లు సాధారణంగా ఒక పెను మార్పు లేక సంస్కరణలో భాగం కాబట్టి, సఫలీకృతమైన ఐ.సి.టి. ల వినియోగాలను వృద్ధి చేసి ప్రచారం చేయడం అత్యంత కీలకం

3.0987654321
కె. దుర్గా భవాని Dec 12, 2017 03:29 PM

సంగీత ఉపాధ్యాయులు పొట్స్ ఉంటె నోటిఫికేషన్ ఇవ్వడి. సార్

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు