హోమ్ / ఆరోగ్యం / వ్యాధులు / చర్మ సంరక్షణ జాగ్రత్తలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

చర్మ సంరక్షణ జాగ్రత్తలు

కాళ్ళుపగుళ్ళు, ఎక్జిమా (తామర), సోరియాసిస్, చర్మం రంగు మారటం (మచ్చలు రావటం), మొటిమలు, విటిలిగో- బొల్లి, స్కేబీస్ – గజ్జి తామర మొదలైన వ్యాదుల గురించి ఈ విభాగంలో చర్చించబడ్డాయి.

కాళ్ళుపగుళ్ళు

సాధరణంగా పొడిబారిన చర్మము వున్నవారికి వస్తుంది. మడమ  ప్రక్కన, పాదము వెలుపల సాధారణంగా వస్తుంది.

కారణాలు

  • పొడిబారిన చర్మము వున్నవారికి వచ్చే అవకాశం అధికంగా వుంటుంది.
  • కొన్ని రకాల చర్మ వ్యాధుల కారణంగా వస్తాయి.
  • సాధారణ బరువు కన్నా ఎక్కువ బరువు వున్న వాళ్ళకు రావచ్చు.
  • వృత్తి రీత్యా ఎక్కువ సమయం నిలబడి పని చేయు వాళ్ళకు ఈ పగుళ్ళు వచ్చే అవకాశం వుంది
  • పాదాలకు సరియైన సంరక్షణ లేని వారికి వ్యవసాయ, ఇతర కార్మిక వర్గాలకు ఈ పగుళ్లు సాధరణంగా వస్తాయి
  • చలికాలంలో ఈ పగుళ్ళు సాధారణంగా ఎవరికైన వచ్చే అవకాశం వుంది

తీసుకోవలసిన జాగ్రత్తలు

  • గోరు వెచ్చని నీళ్ళలో పాదాలు 10-15 నిమిషాలు వుంచి పొడిబట్టతో శుభ్ర పరచినచో పగుళ్ళు మెత్తబడి నొప్పి తగ్గుతుంది.
  • పగుళ్ళు ఎర్రగావున్నా, దురదలున్నా డాక్టరు ను సంప్రదించి పూత మందులు వాడవలసి వుండును
  • వీలైనంత వరకు పాదాలకు సాక్సువేసుకొని, బూట్లు వాడడం మంచిది

ఎక్జిమా (తామర)

తామర అంటే ఏమిటి?

తామర అనేది (చర్మానికి సంబంధించిన ఒక వ్యాధి) ఒక చర్మ వ్యాధి. దీని వలన చర్మం పైన పొడి బారడం, మచ్చలు పడటం, పొలుసులుగా రాలిపోవడం,దురద పెట్టడం జరుగుతుంది.

కారణాలు?

  • తామర అనేది అతి సంవేదన శీలత, అలర్జీ వల్ల గాని వస్తుంది. దీని వల్ల మంట కలుగుతుంది. ఈ ప్రక్రియ వల్ల చర్మము ఎర్రగా మారడం, దురద పెట్టడం మరియు పొలుసులుగా మారుతుంది.
  • ఈ వ్యాధి శిశువులలో మరియు చిన్న పిల్లలలో సర్వ సాధారణం. పెద్ద వాళ్ళలో కూడా వస్తుంటుంది

చర్మం మీద సాధారణంగా మచ్చలు ఎక్కడ చోటు చేసుకుంటాయి ?

ఇవి ఎక్కువగా మోకాలుకు వెనుక, మోచేయి మరియు మణికట్టు మడతలలో, మెడమీద, మడమలు మరియు పాదాల మీద వస్తుంటాయి. శిశువులలో ఇవి మొదట బుగ్గలమీద దద్దుర్లుగా ఏర్పడతాయి. కొన్ని నెలలు తర్వాత, ఈ దద్దుర్లు చేతుల పైనా,కాళ్ళ పైన ఏర్పడుతాయి.

ఈ వ్యాధి ఎవరికి ఎక్కువగా సంక్రమిస్తుంది?

  • ఎక్జిమా/తామర  ఎక్కువగా ఉబ్బసం, తీవ్రమైన జ్వరాల వంటి వ్యక్తిగత చరిత్ర కలిగి ఉన్న వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది.
  • ఇంకా ఎక్జిమా కసవు వల్ల వచ్చే జ్వరం, ఇతర శ్వాస సంబంధితమైన అలర్జీల వంటి కుటుంబ చరిత్ర కలిగి ఉన్న వ్యక్తులలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది.

దీనికి ప్రేరేపించే కారణాలు ఏమైనా ఉన్నాయా?

  • ఈ ఎక్జిమా లక్షణాలను ప్రేరేపించే కారణాలు ఎన్నో ఉన్నాయి. ఇవి ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వేరుగా ఉంటాయి
  • వాతావరణం మార్పిడికి బయలుపడటం ( సబ్బులు, డిటర్జెంట్, క్లోరిన్ మరియు ఇతర రేపుడు పుట్టించే పదార్దాలు)
  • కొన్ని రకాల ఆహార పదార్దాలు కూడా ఈ లక్షణాలను దుర్బరం చేస్తాయి. ఉదా: పాలు, గుడ్లు
  • ఒత్తిడి వల్ల కూడా ఇది ఎక్కువ అవుతుంది
  • పొడి వాతావరణం మరియు పొడి చర్మం ఈ లక్షణాలను మరింత దుర్బరం చేస్తాయి

ఈ వ్యాధిని అదుపులో ఉంచడానికి అవసరమయ్యే సాధారణ ప్రతిపాదనలు ఏమిటి?

పైన చెప్పబడిన ప్రేరేపిత కారణాలను దూరంగా ఉంచడం వలన ఈ వ్యాధి లక్షణాలు తగ్గించవచ్చు.

ఎక్జిమా ఎలా నిర్ధారిస్తారు?

  • అలర్జీ మరియు దానికి సంబంధించిన ఇతర వ్యాధుల వంటి కుటుంబ చరిత్ర , వ్యక్తిగత చరిత్ర వల్ల నిర్ధారణ జరుగుతుంది.
  • బాహ్య పరీక్ష, అవసరమైతే ఇతర పరిశోధనలు కూడా చేయవలసి ఉంటుంది.
  • ఎప్పుడన్నా అవసరమైతే, చర్మమచ్చలు (నమూనా) పరీక్షించడం (బయాప్సీ) మరియు రక్త పరీక్షలు కూడా నిర్వహించవలసి ఉంటుంది.

ఈ వ్యాధి యొక్క దీర్ఘకాలిక సమస్యలు ఏమిటి ?

  • దీర్ఘకాలిక సమస్యలు:
    • ఇన్ ఫెక్షన్ (క్రిమి సంసర్గము)
    • మచ్చలు పడటం
    • పోస్ట్ ఇన్ఫ్లమేషన్ (ప్రతి ఘాతము తరువాత ) వర్ణక చర్మరంగు
    • పరిణామం తగ్గటం (హైపోపిగ్మెంటేషన్)( చర్మం పాలిపోవటం)

ఈ వ్యాధికి చికిత్స ఏమిటి?

  • చికిత్సలో క్రింద చెప్పబడిన ప్రతిపాదనలు ఉండాలి.
    • వ్యాధి లక్షణాలను దుర్భరం చేసే ప్రేరేపించే పదార్ధాలకు దూరంగా ఉండాలి
    • ఈ వ్యాధి వల్ల వచ్చే వ్రణాలను గోకటం, రక్కటం లాంటివి చేయకూడదు
    • ఎక్కువ సార్లు స్నానం చేయడం కాని, ఎక్కువ సేపు  స్నానం చేయడం కాని చేయకూడదు.
    • సబ్బు వాడకాన్ని తగ్గించాలి.( సబ్బు నురగతో చేసే స్నానాలకు దూరంగా ఉండాలి)
    • ఇటువంటి మచ్చలు వున్నచో చర్మ వ్యాధి సలహా పొందాలి.

సోరియాసిస్

  • సోరియాసిస్ అనేది దీర్ఘకాలపు చర్మ వ్యాధి అంటువ్యాధి కాదు. ఎక్కువగా  వంశపారపర్య కుటుంబాలలో కలిగి ఉన్నవారికి వస్తుంది.
  • ఇది స్వల్పమైన వ్యాధి. దీని వల్ల చర్మం ఎర్ర బారడం,పొలుసులుగా రావడం, మచ్చలు పడటం జరుగుతుంది.
  • ఈ సోరియాసిస్ లక్షణాలు కొన్ని సంవత్సరాల వరకు ఉంటాయి. (క్రానిక్ డిసార్డర్) దీర్ఘకాలపు చర్మ వ్యాధి.
  • ఈ వ్యాధి లక్షణాలు జీవితాంతము వస్తుంటాయి పోతుంటాయి.
  • ఈ వ్యాధి స్త్రీ పురుషులకు సమానంగా వర్తిస్తుంది.
  • ఇది  అన్ని జాతుల వారికి సంక్రమిస్తుంది.
  • సోరియాసిస్ కి కారణాలేమిటి?
  • ఖచ్చితమైన కారణమనేది తెలియదు. ప్రస్తుత సమాచారం మాత్రం సోరియాసిస్ కి సంబంధించి రెండు కారణాలను సూచిస్తుంది.
    1. పూర్వీకుల నుండి పొందడం
    2. ఆటోఇమ్యూన్ ప్రతి స్పందన
  • వ్యక్తులలో కొన్ని జన్యు పరమైన ప్రేరేపణ వల్ల తప్పుడు సూచనలు శరీరంలోని రోగ నిరోధక వ్యవస్ధకు పంపబడతాయి. దీని వల్ల చర్మకణాల పెరుగుదల చక్రం ఎక్కువవుతుంది. ఈ చర్మకణాలు ఒక దానిపై ఒకటి పేరుకుపోతాయి. ఇవి త్వరగా రాలిపోవు. సోరియాసిస్ సంక్రమించిన కొందరు వ్యక్తులకు కుటుంబ చరిత్రతో ప్రమేయం ఉండదు. కొన్ని జన్యువులు దీనికి సంబంధితమైనవి.

ఎర్రటి మచ్చలు, పొలుసులు రాలడం ఎందుకు జరుగుతుంది ?

  • చర్మం మీది పైన పొరలోవున్న చర్మ కణాల సంఖ్య ఎక్కువ అవడం వలన  చర్మం పొలుసులుగా రాలడం ఎర్ర  మచ్చలు పడటం జరుగుతుంది
  • సాధారణంగా చర్మ కణాలు నాలుగు వారాలలో పరిపక్వత చెంది శరీరం మీది ఉపరితలం నుండి రాలిపోతుంటాయి
  • సోరియాసిస్ కలిగి ఉన్న వ్యక్తులలో ఈ ప్రక్రియ ప్రతి 3 -4 రోజుల లోపు త్వరగా జరుగుతుంది
  • అత్యధికంగా చర్మకణాల ఉత్పత్తి జరగడం వలన సోరియాసిస్ లో చర్మం మీద  వ్రణాలు ఏర్పడుతాయి
సోరియాసిస్ ను ఎలా గుర్తిస్తారు ?
  • చర్మం ఎర్ర బారడం, పొలుసులుగా రాలడం, దురద, గట్టిపడటం, పగుళ్ళు, అరిచేయి, అరికాలు మీద బొబ్బలు ఏర్పడటం మొదలగునవి సోరియాసిస్ లక్షణాలు.
  • స్వల్పంగా ఉండచ్చు లేకపోతే ఆకృతి కోల్పోవడం, చేతకాని స్ధితికి రావడం లాంటి తీవ్రమైన స్ధాయికి చేరుకోవచ్చు.
సోరియాసిస్ లో వివిధ రకాలు ఏమిటి ?
  • చర్మ వ్రణాలు తీరు మరియు చర్మంమీది మచ్చలు ప్రకారంగా సోరియాసిస్ పలు విధాలుగా విభజించబడింది.
    1. ఎరిత్రోడెర్మిక్సోరియాసిస్ చర్మంమీద తీవ్రమైన  ఎర్రదనం వాపు వస్తుంది.
    2. ప్లేక్ సోరియాసిస్ ఇది సోరియాసిస్ లో అతిసాధారణమైనది. (80% సోరియాసిస్ ఉన్న ప్రజలకు ఇదే ఉంటుంది.)
  • ఇది చర్మం మీద ఎర్రగా పొంగిన వ్రణాలను కలుగజేస్తుంది.
  • ఈ ఎర్రటి మచ్చలు తెల్లటి పొలుసులను వృద్ధి చేస్తుంది. ఇవి ఎక్కడైనా ఏర్పడినా, మోకాలు, మోచేతులు,తలమీది చర్మం పైన, మొండెము మరియు గోళ్ళమీద ఎక్కువగా ఏర్పడతాయి.
    1. ఇన్వర్స్సోరియాసిస్ ఇది చర్మం ముడతలలో నున్నగా, ఎర్రటి వ్రణాలను కలిగిస్తుంది.
    2. గట్టేట్సోరియాసిస్ ఇది నీటి బొట్లులాంటి చిన్న చర్మ వ్రణాలను కలిగిస్తుంది.
    3. పుస్య్టులార్సోరియాసిస్ ఇది తెల్లటి, చిక్కటి పదార్ధంతో నింపబడిన బొబ్బలను కలిగిస్తుంది.
    4. సోరియాటిక్ఆర్రైటిక్ ఇది రుమటాయిడ్ ఆర్రైటిక్ లాంటి ఒక రకమైన కీళ్ళకు సంబందించిన వ్యాధి.
సోరియాసిస్ ప్రేరేపించే లేక దుర్భరం చేసే కారణాలు ఏమైనా ఉన్నాయా?

సోరియాసిస్ ఉన్న వ్యక్తులలో కొన్ని కారణాలు గారను వృద్ధి చేస్తాయి. వాటిలో కొన్ని కారణాలు చర్మహాని (రసాయనాలు, ఇన్ఫెక్షన్, గోకటం, రక్కుటం,ఎండకు చర్మం కములుట), మద్యము, హార్మోన్ల (అసమౌతుల్యం), పొగత్రాగడం, కొన్నిమందులు బీటాబ్లాకర్స్,నాన్ స్టీరాయిడల్ ఆంటి – ఇన్ ఫ్లమేటరీ డ్రగ్స్, ఒత్తిడి.

సోరియాసిస్ ఎలా నిర్ధారించబడుతుంది ?
  • వ్యక్తి యొక్క వైద్య చరిత్ర మరియు బాహ్య పరీక్ష ఆధారంతో వైద్య నిపుణులు సోరియాసిస్  నిర్ధారిస్తారు.
  • ఈ వ్యాధిలోని ప్రత్యేకమైన వ్రణాలను బట్టి ఆ వ్యక్తికి ఏ రకమైన సోరియాసిస్ ఉందో తెలుసుకోవచ్చు.
  • నీళ్ళలో ఎక్కువగా ఉండకండి. మీ షవర్ స్నానం, స్నానం సమయం తగ్గించండి. ఈత కొట్టడం  తగ్గించుకోండి.
  • చర్మాన్ని గోకటం, రక్కుటం మానుకోవాలి.
  • చర్మాన్ని రుద్దకుండా ఉండే వీలైన దుస్తులను ధరించాలి.
  • ఇన్ఫెక్షన్, కానీ మరే ఇతర అస్వస్ధతకు గురియైన మీ వైద్యుణ్ణి సంప్రదించండి.
సమతుల ఆహారం ముఖ్యమా?
  • ఏ ఆహారమైతే వ్యక్తిని ఆరోగ్యంగా ఉంచుతుందో అదే సమతుల ఆహారం. ఎందుకంటే సోరియాసిస్ తో ఉన్నవ్యక్తులు మిగతా వారికంటే ఆరోగ్యకరమైన జీవన శైలి మరియు ఆహారపుటలవాట్ల నుండి లాభం పొందుతారు.
  • కొన్ని రకాల ఆహార పదార్ధాలు పరిస్ధితిని దుర్బరం కానీ, చర్మ స్ధితిని మెరుగు పరుస్తాయి అని చాలా మంది అంటుంటారు.
  • సోరియాసిస్ కలిగి ఉన్నవ్యక్తులు పాటించవలసిన ప్రత్యేకమైన ఆహారం ఏదీ లేదు.
  • అయినప్పటికీ కొన్ని ఆహార పద్ధతులు సూచించబడ్డాయి.
సోరియాసిస్ వల్ల వచ్చే దీర్ఘకాలిక సమస్యలు ఏమిటి?

సోరియాసిస్ వ్యక్తుల పైన మానసిక మరియు శారీరక ప్రభావం చూపుతుంది. సోరియాటిక్ కీళ్ళవాపు, ఒక రకమైన కీళ్ళరోగం, కీళ్ళరోగం, ఉన్నకొద్ది మంది వ్యక్తులో వచ్చి వారికి నొప్పిని మరియు చేతకాని స్ధితిని తీసుకువస్తుంది.

సోరియాసిస్ అంటు వ్యాధా ?
  • కాదు సోరియాసిస్, అంటు వ్యాధి కాదు. ఒకరి నుండి ఇంకొకరికి అంటదు.

ఈ వ్యాధి అదుపులో ఉంచడానికి ఏది సహకరిస్తుంది ?

  • ఈ క్రింది ప్రతిపాదనలను పాటించండి
  • చర్మానికి హాని కలిగించే దెబ్బల నుండి ,గాయాల నుండి, ఎండ తీవ్రతకు కూడా దూరంగా ఉంచండి.
  • మీ చర్మాన్ని ఎండ తీవ్రతకు కమిలేంతగా బయలు పర్చకండి.
  • మద్యాన్ని మరియు పొగ త్రాగటం మాని వేయండి.
  • మీ పరిస్ధితిని దుర్బరం చేసే మందులకు దూరంగా ఉండండి.
  • ఒత్తిడిని అదుపులో ఉంచుకోండి.
సోరియాసిస్ సమస్యకు పరిష్కారం

చలికాలం రాగానే చాలామంది చర్మ సంబంధిత రోగులలో వ్యాధి తీవ్రత పెరిగి వైద్యుని దగ్గరకు పరుగులు తీస్తుంటారు. ఇందులో అత్యంత క్లిష్టమైన సమస్య ‘సోరియాసిస్’. చాలామంది రోగులు ఇది సాధారణ చర్మవ్యాధి అనుకుంటారు. కాని ఇది రోగనిరోధక వ్యవస్థ వికటించడం వల్ల వచ్చే చర్మ సంబంధిత వ్యాధి అని చాలా తక్కువమందికి తెలుసు. కనుక ‘సోరియాసిస్’ వచ్చిన రోగులలో జబ్బును కేవలం పై పూతలతోనే నయం చేయలేం.

ప్రపంచ జనాభాలో సుమారుగా 3 శాతం మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. రోగి మరణానికి దారి తీయదు. కాని రోగి ఈ జబ్బుతో సంవత్సరాల తరబడి బాధపడటం వలన ఇది సామాజిక రుగ్మతకు, మానసిక అశాంతికి దారితీస్తుంది.

సోరియాసిస్ అంటే...
సోరియాసిస్ అనేది దీర్ఘకాలికంగా కొనసాగే చర్మవ్యాధి. ఇందులో ముఖ్యంగా చర్మంపై దురదలతో కూడుకున్న వెండిరంగు పొలుసులు కనిపిస్తాయి.సోరియాసిస్‌లో ముందుగా చర్మం ఇన్‌ఫ్లమేషన్‌కు గురి అయి ఎర్రగా మారి క్రమంగా చర్మం వెండి రంగు పొలుసుల రూపంలో రాలిపోవడం జరుగుతుంది. సాధారణంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ వ్యాధి లక్షణాలు అధికమవుతాయి.

ఈ వ్యాధి చర్మంతో పాటు గోళ్ళు, కీళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యవంతుడి చర్మం ఉపరితలం కింద కొత్తకణాలు నిరంతరంగా తయారవుతాయి. సుమారు నెలరోజులకు ఇవి వెలుపలకు చేరుకుంటాయి. ఇలా పైపొరగా ఏర్పడిన కణాలు క్రమేణా నిర్జీవమై పొలుసులుగా రాలిపోయి కింది కణాలను బహిర్గతం చేస్తాయి. కాని రోగనిరోధక శక్తి వికటించి శరీర కణాలపై దాడి చేయడం వలన వచ్చే సోరియాసిస్ వ్యాధి వలన ఈ ప్రక్రియ అదుపు తప్పుతుంది. చర్మకణాలు వేగంగా తయారై 3-4 రోజులకే వెలుపల పొరకు చేరుకుంటాయి. ఈ విధంగా పైకి చేరిన కణాలు వేగంగా చనిపోవడం, కొత్త కణాలు లోపల నుండి ఏర్పడటం ... ఈ మొత్తం ప్రక్రియ త్వరత్వరగా పూర్తి కావడం వలన వెలుపలి పొర ఊడిపోక ముందే కొత్త పొర రావడం వలన చర్మం పొలుసులుగా రాలిపోతుంది.

కారణాలు :సోరియాసిస్‌కు గల కారణాలు జన్యుపరమైన కారణాలు లేక మానసిక ఒత్తిడి వలన కాని రావచ్చు అని అనుభవ పూర్వకంగా తెలుస్తోంది. రోగ నిరోధక వ్యవస్థలోని అసమతుల్యతల వలన కూడా రావచ్చు. దీర్ఘకాలికంగా కొన్నిరకాల మందులు వాడటం వలన ‘సోరియాసిస్’ జబ్బు రావచ్చు.

రకాలు :

సోరియాసిస్ వల్గారిస్ :ఇది సాధారణంగా కనిపించేదే. స్కిన్‌పై ఎర్రని మచ్చలుగా మొదలై పెద్ద పొలుసుగా మారడం దీని ప్రధాన లక్షణం.

గట్టేట్ సోరియాసిస్ :ఇది సాధారణంగా పిల్లలలోనూ, యుక్త వయస్కులలోనూ వస్తుంది. దీనిలో చర్మంపై చిన్న పొక్కులు, ఎర్రని మచ్చలు వస్తాయి మొదటి దశలో ఉండగానే చికిత్స ప్రారంభిస్తే దీన్ని సంపూర్ణంగా నయం చేయవచ్చు.

పస్చులర్ సోరియాసిస్ :ఇది అరుదుగా కనిపించే సోరియాసిస్ రకం. దీనిలో సాధారణంగా చర్మంపై చీముతో నిండిన పొక్కులు కనిపిస్తాయి.

ఎరిత్రోడర్మిక్ సోరియాసిస్ :ఇది కొంచెం ప్రమాదకరమైన దే. ఇది శరీరంలో చాలా భాగం చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. దీనిలో పొలుసులు పెద్దగా ఊడిపోతాయి. ఈ వ్యాధి తీవ్రంగా ఉంటే శరీరంలో ఉండే ధాతువుల్లో అసమతుల్యత చోటు చేసుకోవడం, ప్రొటీన్‌లు కోల్పోవటం జరుగుతుంది.

ఇన్వర్స్ సోరియాసిస్ :ఇది ముఖ్యంగా చర్మం మడతలలో వస్తుంది.

కాంప్లికేషన్స్ : సోరియాటిక్ ఆర్థరైటిస్ ఊ మానసిక అశాంతి,  ఊలవణాలు, విటమిన్ లోపాలకు దారి తీస్తుంది.

తీసుకోవలసిన జాగ్రత్తలు :

  • అధికంగా నీరు తాగడం
  • అధికంగా ప్రొటీన్లు కల ఆహారాన్ని తీసుకోవడం
  • చర్మం పొడి బారకుండా కొబ్బరినూనె, మాయిశ్చరైజర్ రాయడం
  • పొడి చేసిన అవిశ గింజలను రోజూ తీసుకోవడం వలన చర్మాన్ని మృదువుగా ఉంచడానికి కావలసిన ఒమెగా 3 కొవ్వు ఆమ్లం సోరియాసిస్‌ని కొంత వరకు అదుపులో ఉంచవచ్చు
  • రోజూ వ్యాయామం చేయడం
  • రోజూ సూర్యరశ్మిలో కొంత సమయం ఉండటం. సూర్యకాంతిలో ఉండే అతినీలలోహిత కిరణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి. పొలుసులు ఏర్పడటం తగ్గిస్తుంది
  • చలికాలం, మానసిక ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, కొన్ని ఇతర ఔషధాల వలన వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది.

నిర్థారణ పరీక్షలు :

  • సీబీపీ
  • ఈఎస్‌ఆర్
  • స్కిన్ బ్లాప్సీ

కీళ్లను ప్రభావితం చేసినప్పుడు ఎక్స్‌రే మొదలగు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలి. కాని సాధారణంగా అనుభవజ్ఞులైన డాక్టర్లు సోరియాసిస్ రోగి చర్మ లక్షణాలను బట్టి రోగ నిర్ధారణ చేస్తారు.

హోమియో చికిత్స: చాలామంది సోరియాసిస్ రోగులు ఆత్రుతతో వైద్యులను, వైద్య విధానాలను త్వరగా మారుస్తూ ఉంటారు. ఇది సరియైన పద్ధతి కాదు. సోరియాసిస్ వైద్యం తీసుకునే రోగి ఏదో ఒక వైద్య విధానాన్ని ఎంచుకొని దీర్ఘకాలం ఓపికగా వైద్యం చేయించుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.
హోమియోకేర్ ఇంటర్‌నేషనల్‌లో జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ సిమిలిమం విధానం ద్వారా, సోరియాసిస్ రోగి వ్యక్తిత్వాన్ని పరిగణనలోకి తీసుకోని వికటించిన రోగ నిరోధక వ్యవస్థను సరిచేసి ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా సంపూర్ణంగా నయం చేయవచ్చు.

లక్షణాలు :
సోరియాసిస్ తల, మోచేతులు, మోకాళ్ళు, అరి చేతులు, అరిపాదాలు, ఉదరంపై చర్మాన్ని ప్రభావితం చేస్తుంది ఊ చర్మం ఎర్రబడటం ఊ సాధారణ నుండి అతి తీవ్రమైన దురద ఊ చర్మంపై వెండిరంగు పొలుసులు ఊడిపోవడంఊ సోరియాసిస్ తలలో ఉన్నప్పుడు పొలుసులు రాలడంతో పాటు జుట్టు రాలిపోవడం ఊ అరిచేతులు, అరిపాదాలు చర్మం పొలుసులుగా ఊడిపోవడం, పగలడం వలన తీవ్రమైన నొప్పి ఉండవచ్చు ఊ సోరియాసిస్ గోర్లను ప్రభావితం చేస్తే అవి పెళుసుబారి దృఢత్వాన్ని కోల్పోయి త్వరగా విరిగిపోతాయి ఊ సోరియాసిస్ వ్యాధి తీవ్రంగా ఉండే కీళ్లను ప్రభావితం చేసి కీళ్లనొప్పులకు దారి తీస్తుంది.

- డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సి.ఎం.డి.,
హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్

సోరియాసిస్ (psoriasis)

సోరియాసిస్ మచ్చలు పింక్ లేక ఎరుపు వర్ణంలో పొలుసులతో కూడి ఉంటాయి. చర్మం దళసరిగా ఉంటుంది. ఈ పొలుసులను బలవంతంగా తీస్తే వాటి కింద ఎర్రటి రక్తపు మచ్చలుగా కనిపిస్తాయి. ఈ సోరియాసిస్ మచ్చలు. కొంచెం కాని, ఎక్కువ సంఖ్యలోగాని ఉంటాయి.

శరీరంలోని చాలా భాగాలలో అంటే చేతులు, కాళ్ళు, తల, వీపుమీద, మోకాళ్ళ ముందుభాగాన, ఉదరం, అరికాళ్ళు, అరిచేతులలో అధికంగా ఈ మచ్చలు వస్తాయి.

పొలుసులు చాలా దట్టంగా, అధికంగా ఉండి కొవ్వొత్తి మైనం లాగా ఉంటాయి. ఒక్కొక్కసారి వాపుతో కూడి ఉంటాయి. ముఖ్యంగా చాతి, కాళ్ళమీద...

సోరియాసిస్ ప్రధానంగా యుక్త, మధ్య వయస్సులో అధికంగా కనిపిస్తుంది. చాలా తక్కువగా చిన్న పిల్లలు, వృద్ధులలో కనిపించవచ్చు.

అధిక వత్తిడి వలన, వంశపారంపర్యంగా తల్లిదండ్రులకు ఉంటే వారి పిల్లలకు ఈ వ్యాధి రావటానికి అవకాశాలుంటాయి.

కాలివేళ్ళు, చేతివేళ్ళ గోళ్లలో గుంటలు పడినట్లు ఉంటాయి.

చికిత్సా విధానం
ప్రధానంగా సోరియాసిస్ (కిటిభ కుష్టం) అనే వ్యాధిలో పంచకర్మ చికిత్సా విధానం ఎంతో ప్రముఖమైనది. ఈ పంచకర్మ విధానంలో వమన కర్మ ప్రధానమైనది. దీనివలన శరీరంలో ఉన్న చెడుభావాలు రసాయనాలు మొదలగు శరీరం నుండి బయటికి పంపబడతాయి.

తక్రధార:  ఈ చికిత్సా విధానంలో ప్రత్యేకంగా ఔషధాలతో తయారు చేయబడిన తక్రము లేదా మజ్జిగ  ధారతో మచ్చలు గల శరీర భాగలను శుభ్రంగా తడపటం జరుగుతుంది. దీనివలన శరీరంపై భాగంలోని పొలుసులన్నీ ఊడిపోతాయి.

నివారణ :

  • మానసిక వత్తిడి నుండి పూర్తిగా విముక్తి వలన
  • పులుపు పదార్థాలు, మాంసాహార సేవన, సముద్ర ఉత్పత్తులు పూర్తిగా నిషేధించటం వలన
  • వాయుకాలుష్యం, జల కాలుష్యం నుంచి దూరంగా ఉండటం
  • పరిశ్రమలలో సరైన రక్షణ విధానాలు పాటించటం వలన నివారించవచ్చు.

- డాక్టర్ దీప్తి ఎం.డి (ఆయుర్వేద), స్టార్ ఆయుర్వేద

ఆధారము: సాక్షి

సోరియాటిక్ ఆర్థరైటిస్‌కు మేలైన చికిత్స

దీర్ఘకాలిక వ్యాధి అయిన సొరియాసిస్‌కు శాస్త్రీయ చికిత్స చేయించుకోకుంటే ఇది మరింత జటిలమై సొరియాటిక్ ఆర్థరైటిస్‌గా రూపాంతరం చెందుతుంది. మానసికంగా, శారీరకంగా రోగి జీవనశైలిని నియంత్రిస్తున్న సొరియాసిస్‌కు సొంత వైద్యం చేస్తే దుష్ఫలితాలు వస్తాయి. సొరియాటిక్ ఆర్థరైటిస్‌కు హోమియోలో మెరుగైన చికిత్స ఉందంటున్నారు సీనియర్ హోమియో వైద్యులు డాక్టర్ శ్రీకర్ మనూ.

సొరియాటిక్ ఆర్థరైటిస్ వ్యాధి బారిన పడిన వారి దైనందిన జీవితం దుర్భరంగా వుంటుంది. చర్మం ఎర్రబడటం, దురద, మంటతో పాటు చర్మం పొలుసులుగా రాలటం సొరియాసిస్ లక్షణాలు. ఈ లక్షణాలతోపాటు కీళ్లవాపు, నొప్పి, బిగుసుకుపోవటం వంటి లక్షణాలు తోడైనపుడు 'సొరియాటిక్ ఆర్థరైటిస్'గా గుర్తించవచ్చు. సొరియాసిస్ రోగుల్లో పదిశాతం మందిలో సొరియాటిక్ ఆర్థరైటిస్ లక్షణాలు కనిపిస్తాయి.

ఈ సమస్య స్త్రీ,పురుష భేదం లేకుండా వయసు పెరుగుతున్న కొద్దీ వస్తుంది. 40 నుంచి 50 సంవత్సరాల వయసు వారిలో ఎక్కువగా ఈ వ్యాధి సోకుతుందని అధ్యయనంలో తేలింది. 80 శాతం మంది సొరియాసిస్ వ్యాధి సోకిన తరువాత ఆర్థరైటిస్ సమస్యకు గురవుతున్నారు. 15 శాతం మందిలో ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత సొరియాసిస్ బారిన పడటం కనిపిస్తుంది.

కారణాలు
జన్యువులు, వాతావరణం, రోగనిరోధక వ్యవస్థ, మానసిక కారణాలు, వాడుతున్న మందుల దుష్ప్రభావం వంటి కారణాల వల్ల సొరియాటిక్ ఆర్థరైటిస్ వస్తుంది. సొరియాటిక్ ఆర్థరైటిస్ సమస్య తో బాధపడుతున్న వారిలో 50 శాతం మందిలో హెచ్ఎల్ఎ-బి27 జీన్స్ ప్రభావం వల్ల ఈ సమస్య వస్తున్నదని తేలింది. రోగనిరోధక వ్యవస్థలోని హెల్పర్ టీ కణాల సంఖ్య తగ్గటం కూడా ఈ వ్యాధి రావటానికి ఒక కారణమని తాజా పరిశోధనలు చెపుతున్నాయి.

ముఖ్య లక్షణాలు
కీళ్ల నొప్పి, వాపు లేదా బిగుసుకు పోవటం ఈ వ్యాధి లక్షణం. కీళ్లపై ఉన్న చర్మం ఎర్ర బడటం, వేడిగా అనిపించటం, కీళ్లు ముఖ్యంగా చేతులు, కాళ్లు వంకర పోవటం వంటి మార్పులు వస్తాయి. చేతులు, కాలి గోర్లలో మార్పులు రావటం, వాపుతో నిర్మాణ మార్పులు వస్తాయి. కీళ్ల చుట్టూ ఉన్న నరాల్లో సొరియాటిక్ ఆర్థరైటిస్ ప్రభావం వల్ల కండరాలు, ఊపిరితిత్తులు, నడుములోని రక్తనాళాల్లో కూడా మార్పులు సంభవిస్తాయి.

దీనివల్ల ఛాతినొప్పి, గుండె సమస్యలు తలెత్తవచ్చు. శరీరాన్ని కాపాడే రోగ నిరోధక కణాలు శరీరంలోని ముఖ్య అవయములపైన దుష్ప్రభావం చూపటం వల్ల ఈ లక్షణాలు మొదలవుతాయి. కేసు హిస్టరీతో పాటు శారీరక పరీక్షలు, రక్తపరీక్షలు, ఎక్స్‌రే వంటివి చేయటం ద్వారా సొరియాటిక్ ఆర్థరైటిస్‌ను నిర్ధారించవచ్చు. ఇవే కాకుండా హెచ్ఎల్ఎ బి-27, సీటీ, ఎంఆర్ఐ వంటి పరీక్షలు కూడా కొన్నిసందర్భాల్లో చేయాల్సి రావచ్చు.

అపోహలు
సొరియాసిస్ లేదా సొరియాటిక్ ఆర్థరైటిస్ గాని అంటువ్యాధులు కావు. రోగితో సహజీవనం చేయటం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు కలగవు. పరిశుభ్రత లేని కారణంగా సొరియాసిస్ రావటం అనేది కేవలం అపోహ మాత్రమే. జన్యుపరంగా వ్యాధి వచ్చే అవకాశం ఉన్న వారికి ఇన్‌ఫెక్షన్, మానసిక ఆందోళన, చర్మానికి గాయం, హార్మోన్‌ల ప్రభావం, కొన్ని రకాల మందుల దుష్ప్రభావం వంటి ప్రేరేపకాలు తోడైనపుడు ఈ వ్యాధి రావచ్చు. సొరియాటిక్ ఆర్థరైటిస్ కేవలం చర్మానికి, కీళ్లకు సంబంధించిన వ్యాధి కాదు.

సరైన చికిత్స చేయించుకోలేక పోయినపుడు ప్రాణాంతకంగా కూడా మారే దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధి నిర్ధారణ అంత సులభం కాదు. ఒక్కో సారి మిగిలిన చర్మవ్యాధులు అంటే డర్మటైటీస్, గజ్జి లేదా ఎలర్జీ వంటి వాటితో తప్పుడు నిర్ధారణ చేస్తారు. సొరియాసిస్ లేదా ఆర్థరైటిస్‌కు చికిత్స లేదనటం కేవలం అపోహ మాత్రమే. మనిషి జన్యు నిర్మాణ వ్యవస్థను బలోపేతం చేసి, ఎలాంటి లోపాన్ని అయినా సరిచేయగలిగిన ఏకైక చికిత్సా విధానం హోమియోపతి. హోమియోపతి వైద్యం ద్వారా ఇలాంటి రుగ్మతల నుంచి సంపూర్ణ విముక్తి పొందే అవకాశముంది.

మేలైన హోమియో వైద్యం
ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా చికిత్స చేయటం హోమియో వైద్యుల అదనపు బలం. సొరియాసిస్ చికిత్సలో హోమియో వైద్యుడు ఎలాంటి తైలాలు, పైపూతలు లేకుండా కేవలం మందులతో నయం చేయవచ్చు. మార్పులు మనిషి జన్యు నిర్మాణాన్ని బట్టి ఉంటుంది. అయితే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం, శారీరక పరిశ్రమ చేయటం, పౌష్టికాహారం తీసుకోవటం లాంటివి చాలా ముఖ్యం.

హోమియో మందులు కీళ్లపై దాడి చేస్తున్న కణాలను నియంత్రించే జన్యువుల సంకేతాలను సరిచేయటం ద్వారా చికిత్సా విధానం ఆరంభమవుతుంది. తద్వారా శరీర అవయవాల్లో జరిగే జీవనక్రియల్లో సమతౌల్యం ఏర్పరచటం వల్ల వ్యాధిని సమూలంగా తగ్గించే వీలుంటుంది. ఈ చి కిత్సా విధానంలో వ్యాధి తిరగబెట్టే ప్రసక్తే వుండదు. దీనికోసం రోగి సహకారం అత్యంత ముఖ్యం.

సొరియాసిస్ లేదా సొరియాటిక్ ఆర్థరైటిస్ గాని అంటువ్యాధులు కావు. రోగితో సహజీవనం చేయటం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు కలగవు. పరిశుభ్రత లేని కారణంగా సొరియాసిస్ రావటం అనేది కేవలం అపోహ మాత్రమే.జన్యుపరంగా వ్యాధి వచ్చే అవకాశం ఉన్న వారికి ఇన్‌ఫెక్షన్, మానసిక ఆందోళన, చర్మానికి గాయం, హార్మోన్‌ల ప్రభావం, కొన్ని రకాల మందుల దుష్ప్రభావం వంటి ప్రేరేపకాలు తోడైనపుడు ఈ వ్యాధి రావచ్చు.
- డాక్టర్ శ్రీకర్ మను
ఫౌండర్ ఆఫ్ డా.మనూస్
హోమియోపతి.

చర్మం రంగు మారటం (మచ్చలు రావటం)

చర్మం రంగు మారటమనేది ఎన్ని రకాలుగా ఉంటుంది?. చర్మం రంగు మారటమనేది (మచ్చలు రావటం) మూడు రకాలుగా ఉంటుంది. అవిః విటిలిగో, పోస్ట్ ఇన్ ఫ్లే మేటరీ హైపో - పిగ్నెంటేషన్, మరియు అల్బినిజం.

విటలిగో - అనేది సమవిభక్తమైన పద్ధతిలో ఏర్పడ్డ మచ్చలని పేర్కొంటారు. చర్మానికి రంగు కలిగించే కణాల లోపం వల్ల ఈ వివర్ణమైన రంగు ఏర్పడుతుంది. ఇవి ఒంటిపై ఒకటి రెండు చోట్ల గానీ లేదా అనేక చోట్ల గానీ చర్మంపై స్పష్టంగా కనిపిస్తాయి. ఈ మచ్చలున్న ప్రదేశాల్లోని వెంట్రుకలు తెల్లబడతాయి.

పోస్ట్ ఇన్ ఫ్లేమేటరీ హైపో-పిగ్మెంటేషన్ - అంటే, వాపు (తాపం) తర్వాత ఏర్పడే అంతర్గత చర్మ విహీనము.  ఒళ్లు కాలిన లేదా చర్మానికి ఇన్ ఫెక్షన్ సోకిన లేదా వాపు కలిగిన తర్వాత కోలుకున్నాక చర్మం రంగు మారుతుంది. ఆ ప్రదేశంలో మచ్చలు లేదా మరకలు ఏర్పడతాయి. చర్మం రంగు లోపాన్ని తగ్గించవచ్చు. కాని, అది పాలలాంటి శ్వేత వర్ణానికి రాదు. అప్పటికప్పుడే, చర్మం కొన్నిసార్లు రంగు విహీనంగా మారగలదు.

అల్బినిజం - అంటే వర్ణ (రంగు) రహితం. చర్మరంగుకు సంబంధించిన కణాలు ఉన్నప్పటికీ అది ఒంటికి రంగు పదార్థాలను అందించలేని అరుదైన లక్షణాలు గలది. ఇది వారసత్వంగా వచ్చే రుగ్మత. ఇందులో పలు రకాలున్నాయి. “టైరోసినాసి నెగిటివ్ అల్బినిజం” తో వెంట్రుకలు తెల్లబడతాయి. చర్మం రంగు కోల్పోతుంది. (కళా విహీనంగా మారుతుంది) కళ్లు గులాబీ రంగులోకి మారతాయి. ఈ రుగ్మతకు గురైన వారు సూర్యకిరణాలనుంచి తప్పించుకోవాలి. తమకు సూర్యరశ్మిని తగలనీయరాదు. కళ్లకు చలువ అద్దాలు ధరించాలి. పగటిపూట ముఖానికి “ఎస్.పి.ఎఫ్.>=15” గల సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి.

పైన పేర్కొన్న మూడు ప్రధాన రకాల హైపో పిగ్మెంటేషన్ కాకుండా, సాధారణమైన మచ్చలు కలిగించే మరో రకమైన డిపిగ్మెంటేషన్ ఉంది. దాని పేరు “పిట్రియాసిస్”

చర్మ వ్యాదులకు గల కారణాలు

* అపరిమితమైన వాయుకాలుష్యం వాళ్ళ చర్మం ముడుతలు పడుతుంది.

* కాలుష్య ప్రభావం వల్ల ఒంటి నిండా మచాలు ఏ ర్పడుతాయి.

* బట్ట థలగూడ వస్తుంది.

* ఏ సి  లలో పనిచేసేవారు, ఎండలలో తిరగాలంటే రెండురకాల వాతావరణానికి హార్మోన్స్ తట్టుకోలేకపోతాయి.

* నిద్ర సరీగా లేకపోవడం వల్ల, కాలుష్యం వల్ల చాలామంది యువతీ, యువకుల మొహాలు కళావిహీనంగా మారుతున్నాయే. బట్ట తలగూడ వస్తుంది.

యవ్వనంగా కనపడాలంటే

* సమయానికి నిద్ర, తిండి అనేది చర్మం పయ్ మంచి ప్రభావం చూపుతుంది.

* బయట తిరిగే సమయంలో తలకు, ముఖానికి కాస్త స్కార్ప్, తదితర దుస్తులు ధరించాలి. నీళ్ళు భాగ తాగాలి.

* యోగా, వ్యాయామం బాగా చేయాలి.

* సీజనల్గా లబించే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తినాలి,

* జంకు ఫుడ్స్ తాగించాలి.

* ఎప్పుడు ఒకయే ఊశ్నో గ్రతలో వుండాలి.

మొటిమలు

ఇది ఒక చర్మవ్యాధి, దీనితో ఎర్రగా ఉన్న పుండ్లు, తిత్తులు, తెరచుకున్న లేక మూసుకొని ఉన్న మొటిమలు, చీముతో కూడుకున్న తిత్తులు లేస్తాయి.

  • సాధారణంగా యౌవ్వనంలో వస్తాయి. 20 నుంచి 30 సంవత్సరాల వయసులో కూడా రావచ్చు
  • శిశువులలో కూడా కనిపిస్తాయి
  • మూసుకొన్న లేక తెరుచుకుని ఉన్న మొటిమలు లేక గుల్లలు
  • చీము తిత్తులు లేక సంచులు
  • చర్మం ఎర్రబడి, కొద్దిగా ఉబ్బినట్టు కనబడే గుల్లలు
  • చీముతో కూడిన గుల్లలు
  • సాధారణంగా మొఖము, ఛాతీ మరియు వీపు మీద కనిపిస్తాయి.
  • కొద్ది రోజులకు మచ్చలు పడవచ్చు
  • నొప్పి, దురద, పచ్చిగా ఉండవచ్చు
  • బహిష్టకు ముందు అధికం కావచ్చు
  • ఎండాకాలం తక్కువగా ఉండవచ్చు
  • పురుషులలో ఆలస్యంగా వస్తాయి,మరియు తీవ్రంగా ఉంటాయి
కారణాలు
  • సరియైన కారణం తెలియదు ఏండ్రోజన్  అను హార్మోనుల మూలాన ప్రేరేపితవుతాయి
  • రోమము యెక్క కుదురులో కెరోటిన్ అను ప్రోటీను చేరడం వల్ల తెల్ల నల్ల  గుల్లలు ఏర్పడుతాయి. ఈ గుల్లలలో కెరోటిన్, చర్మానికి జిడ్డు పుట్టించే క్రొవ్వు, సూక్ష్మక్రిములు కలిసి వుంటాయి. చర్మంలోని కణాలు, కలిసి రోమాలకు కుదురులలో వాపును కలిగిస్తాయి. ఈ వాపు పగలడం మూలాన చర్మం పై వున్న సూక్ష్మక్రిములు అందులో చేరి చీముతో కూడిన గుల్లలు ఏర్పడుతాయి. (మొటిమలు) ఇవి పెరిగి తిత్తులలాగా కూడా తయారవుతాయి
  • రోమాలకు కుదురులలో ఏర్పడే క్రొవ్వుఆమ్లాల మూలాన చికాకు రేకెత్తడం మూలాన, చిరాకు ప్రొప్రైశై అను సూక్ష్మక్రిములు కలిసి మొటిమలు ఏర్పడుతాయి
  • చికాకు కలిగించే నూనెలు, క్రీములు
  • స్టెరాయిడ్ క్రీములు  (చర్మానికి రాసుకునే)
  • కార్డికాస్టీరాయిడ్  మాత్రలు
  • యౌవ్వనం, పురుషులు, కొన్ని మందులు, డైలాంటన్, లిధయకు, సంతాన నిరోధక మాత్రలు, స్టెరాయిడ్ మాత్రలు, వేడి, తేమ అధికంగా వుండే వాతావరణం, తరచూ చర్మంపై రాపిడి (బుగ్గల దగ్గర సెల్ ఫోన్లు, తలపై ధరించే హెల్మెంట్లు) వంటి కారణాల మూలాన అధిమయ్యే అవకాశం
వ్యాధి నిర్ధారణ
  • వైధ్య నిపుణులచే పరీక్ష చేయించుకొని ఇతర వ్యాధులు ఉన్నదీ లేనిదీ తెలుసుకొనవచ్చును
  • నిర్ధారణ తేట తెల్లంగా ఉంటుంది
ఎక్కుగా వచ్చే అవకాశం ఉండే అంశాలు
  • యౌవ్వనం
  • కుషింగ్స్ సిండ్రొమ్
  • పాలిసిస్ట్ క్ వొవేరియల్ వ్యాధి
  • స్త్రీలలో అండాశయాలలో తిత్తులు ఏర్పడే జబ్బు
తేలికైన నివారణ చర్యలు
  • చేతితో గిల్లడం కానీ, ఎప్పుడూ చేతులతో తాకడం కానీ చేయకూడదు
  • ముఖాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి
  • సౌందర్య సాధనాలు ఉపయోగించడంలో జాగ్రత్తలు పాటించాలి
  • కొన్ని ఆహార పదార్దాల వల్ల కూడా మొటిమలు అధికం కావచ్చు

విటిలిగో - బొల్లి

బొల్లి అంటే ఏమిటి?
  • బొల్లి అనేది తన స్వంత కణజాలమును దెబ్బతీసే(ఆటో ఇమ్యూన్) వ్యాధి.  చర్మం లోని రంగు ప్రమాణము తగ్గించుటకు కారణమవుతుంది
  • దీని వల్ల  చర్మం మీద తెల్లటి మచ్చలు ఏర్పడుతాయి. ఇవి పాల తెలుపుతో పదునైన కొన కలిగి ఉంటాయి. చర్మం యొక్క సాధారణ గుణం మరియు గ్రహించే శక్తి సంరక్షించబడుతుంది
  • పొలుసులు రాలడం జరుగదు
ల్యూకోడెర్మా అంటే ఏమిటి?

ల్యూకోడెర్మా అంటే బొల్లికి ఇంకొక పేరు. ల్యూకో - తెల్ల, డెర్మా - చర్మ(గ్రీకు)

బొల్లికి గల కారణాలు ఏమిటి?
  • బొల్లి చర్మానికి హాని జరగడం వల్ల కాని, చర్మం లోని మెలనిన్ కణాలు మృతి చెందడం వల్ల వస్తుంది
  • బొల్లి కారణాలు గురించి వివిధమైన సిధ్దాంతాలు తెలుపబడ్డాయి
  • శరీర రోగ నిరోధక వ్యవస్ధ మెలనిన్ కణాలను నాశనం చెయ్యెచ్చు
  • శరీరం తనకు అనుగుణంగా లేని పదార్ధం అనుకొని స్పందించటం వలన వర్ణకము నాశనం అవుతుంది. (ఎక్కువగా ఆమోదింపబడిన సిధ్ధాంతము)
  • జన్యుపరమైన లోపాలు  మెలనిన్ కణాలను (గాయాలకు) లోను కావటానికి గురిచేస్తుంది
  • నరాల కణములు అసాధారణంగా పని చేయుట వలన విష పూరితమైన పదార్ధాలు వెలువడి అవి మెలనిన్ కణాలను హానికి గురిచేస్తాయి
  • మెలనిన్ కణాల - స్వవినాశనం మెలనిన్ వెలువడే సమయంలోనే కొన్నివిషపూరిత పదార్ధాలు వెలువడి మెలనిన్ కణాలను హాని చేసి, నాశనం చేస్తాయి
  • ఈ పరిశోధకులు ఈ అన్ని సిధ్దాంతాల కలయిక వల్ల మంచి వివరణ లభిస్తుంది అని విశ్వసిస్తారు
బొల్లి ఇతర వ్యాధులతో కూడినదా?
  • అవును ఇది ఇతర ఆటో ఇమ్యూన్ వ్యాధులతో కూడినది.

స్కేబీస్ – గజ్జి తామర

స్కాబీస్ (గజ్జి లేదా గజ్జి పుండ్లు) అనగా ఏమి?

స్కాబీస్ (గజ్జి లేదా గజ్జి పుండ్లు) అనేది ఒక చర్మ వ్యాధి. ఇది సార్కో ప్టస్ స్కాబీస్ అన్న పరాన్నజీవి వలన సంక్రమిస్తుంది. చిన్న సూక్ష్మ జీవి అయిన ఈ పరాన్నజీవి 0.3 మిల్లీ మీటర్ల పొడవు వుండే ఒక కీటకం (మైట్). ఆడ పరాన్న జీవి మానవ శరీరంలోని చర్మం కింద బొరియ( కలుగు) లేదా చిన్న కన్నం ఏర్పరుచుకుని అక్కడ గుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంది. ఈ గుడ్లు 2-3 గంటల్లోగా వృద్ధి చెంది గజ్జి అంటువ్యాధిగా వ్యాపిస్తుంది. ఈ పరాన్నజీవి సుమారు 2 నుంచి 3 గుడ్లు పెడుతుంది. గుడ్లు పొదగబడి అవి పెద్ద కీటకాలుగా (ఈ పరాన్నజీవికి ఉపయోగించే పదం) 10 రోజులలో అవుతాయి. ఈ గజ్జి అనేది అంటువ్యాధి, అతి చిన్న సూక్ష్మజీవి (సార్కోప్టస్ స్కాబీస్) ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.

వ్యాప్తి

ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి దగ్గరగా చర్మ సంబంధం కలిగి వుండడం వలన సోకుతుంది. భార్యా భర్తలు ఒకరితో ఒకరు రాత్రి వేళల్లో శారీరిక సంపర్కం కలిగి వుండడం వలన సోకుతుంది. అలాగే ఈ వ్యాధి సోకిన వారు నిద్రించిన పరుపులను, పక్కలను ఉపయోగించినా, వారు ధరించిన దుస్తులు ధరించినా లేదా వారితో కరచాలనం చేసినప్పుడు లేదా వారితో చేయి చేయి పట్టుకున్నప్పుడు ఈ వ్యాధి ఇతరులకు సోకుతుంది.

ఆడ కీటకం చర్మం కింద భాగంలో ఆవాసం ఏర్పరుచుకుని రోజుకు 2-3 గుడ్ల చొప్పున కొన్ని గంటలలోనే గుడ్లను పెడుతుంది. 10 రోజుల లోపుగానే ఆ గుడ్లు పొదగబడి పెద్దవిగా మారతాయి. ఈ వ్యాధి లక్షణం ప్రథమ దశలో దురదతో ప్రారంభమవుతుంది. ఈ వ్యాధి వున్న వారితో సంబంధంవున్న కారణంగా పెద్దవిగా పెరగని కీటకాలు సంబంధం పెట్టుకున్న వారికి వ్యాపించి 4 వారాలలోగా దురద ప్రారంభమౌతుంది.

గజ్జి వ్యాధి వున్న వారి ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. వారికి తగిన చికిత్స జరగనంత వరకు వారితో సంబంధం వున్న వారికి ఈ వ్యాధి (ఇతరులకు) సోకుతూవుంటుంది. వ్యాధి వున్న వారి యొక్క దుస్తులు, పడుకున్న పక్కలు, పరుపులు ఈ వ్యాధి సోకడానికి ముఖ్యకారకాలుగా వుంటాయి వీటిని శుభ్రపరిచేవరకు. తగిన చికిత్స పొందిన తర్వాత కూడా ఒక వ్యక్తి తిరిగి ఈ వ్యాధి కలిగియున్న అదే వ్యక్తితో సంబంధం కలిగివున్నా లేదా ఈ వ్యాధి వున్న మరొక వ్యక్తితో సంబంధం కలిగివున్నా ఈ వ్యాధి మరలా సోకే అవకాశముంటుంది.

వ్యాధి లక్షణాలు

ఈ కీటకాలు (సూక్ష్మజీవులు) నివసిస్తున్న చర్మం మీద చిన్న చిన్న ఎరుపు రంగు కలిగిన పొక్కులు లేదా పుండ్లు ఏర్పడతాయి. తర్వాత ఆపలేని దురద పుడుతుంది. రాత్రి వేళల్లో ఈ దురద విపరీత స్థాయిలో వుంటుంది. ఈ ఆపలేని దురద గజ్జి పుండ్ల వలన ఎల్లప్పుడు వుంటుంది. చర్మం మీద జరిగే ప్రతిచర్య వలన ఈ ఆపలేని దురద పుడుతుంది. మొదటి సారిగా గజ్జి సోకిన వ్యక్తి ఆమె లేదా అతడు కాని ఎన్నో నెలలు ఈ దురదకు కారణం తెలుసుకోలేరు. (అనగా 4 లేదా 6 వారాల లోపు) ఆ తర్వాత వచ్చిన అంటువ్యాధుల వలన ఈ కీటకం చేరిన కొన్ని గంటలలోపు ఆపుకోలేని దురద ప్రారంభమవుతుంది. ఈ కీటకాలు మూడు రోజులు మాత్రమే మానవ శరీరం మీద జీవించి వుంటాయి. అయితే అవి వారి దుస్తులపైన, వారి పక్క బట్టలకు మరి కొన్ని జీవులను వారి యొక్క కుటుంబ సభ్యులకు లేదా దగ్గరి సంబంధీకులకు, చుట్టాలకు వ్యాపింపజేస్తాయి. 2002వ సం// మే నెలలో వ్యాధులను నియంత్రించే లేదా నివారించే కేంద్రాలు (సిడిసిలు) ఈ గజ్జి వ్యాధిని కూడా లైంగిక సంబంధ వ్యాధుల జాబితాలో కొత్తాగా చేర్చి వైద్య చికిత్సకు మార్గదర్శక సూత్రాలను నిర్దేశించాయి.

ఈ వ్యాధి సోకే మానవ చర్మభాగాలు ఇవి: వ్రేళ్ల మధ్య గల చర్మం మరియు వేలి పక్కన గల చర్మం, కాలి వేళ్ల వద్ద, తొడల మధ్య బహిరంగ ప్రదేశాలలో, గజ్జలలో, చంకల మధ్య, మోకాలు, మోచేయి కింద భాగంలో, మణికట్టు వద్ద, మరియు పొత్తి కడుపు వద్ద. అరచేయు కింది ప్రాంతంలో ఎప్పుడో కాని గజ్జి పుండ్లు కనపడవు. అలాగే కాలి పాదాల మీద ఎప్పుడో కాని కనపడవు. అలాగే మెడ మీద కూడా కనపడవు. అతి దగ్గరి సంబంధం కలిగినప్పుడు ఈ వ్యాధి సోకుతుంది. 2002 వ సంవత్సరం మే నెలలో వ్యాధి నిరోధక లేదా వ్యాధి నివారణ కేంద్రాలు ఈ గజ్జి వ్యాధిని లైంగిక సంబంధిత వ్యాధుల జాబితాలో కొత్తగా చేర్చి, ఈ వ్యాధి నివారణకు చేసే చికిత్సకు మార్గదర్శక సూత్రాలు నిర్దేశీంచాయి. గజ్జి పుండ్లను గోకి లేదా గీరి వాటి పెచ్చులను తీసి వేయడం వలన ఈ కీటకాలు తొలగిపోయి కొంతవరకు ఈ వ్యాధిని ఉపశమింప చేయవచ్చునని అనిపించి నప్పటికీ ఈ కీటకాలను పూర్తిగా నశింపచేయ వలసిన అవసరముంది. ఈ అంటు వ్యాధి రమారమి మొత్తం 15 కీటకాల కంటే తక్కువ వాటి వలనే సోకుతుంది.

ఎక్కువ సంఖ్యలో వున్న ఈ కీటకాల వలన వ్యాధి వ్యాపిస్తే (వేల నుంచి లక్షల సంఖ్యలో ఈ క్రిముల వలన) ఏ వ్యక్తి అయినా ఆ పుండ్లను గీకి లేదా గోకక పోయినట్లయితే, లేదా ఆ వ్యక్తిలో రోగ నిరోధక శక్తి బలహీనంగా వుండి వుంటే ఈ వ్యాధి తీవ్ర స్థాయిలో వ్యాపిస్తుంది. ఇటువంటి వారు ఎక్కువ మంది వైద్యశాలలలో వున్నవారుగా, బుద్ధి మాంద్యులుగా, లేదా శారీరకంగా బలహీనులైన వారిగా వుండి వుంటారు లేదా శారీరక వ్యాధులతో బాధ పడుతున్నవారుగా అనగా చక్కెర వ్యాధి గలవారుగా లేదా రక్త క్యాన్యర్ మరియు మందులు వాడటం వలన రోగ నిరోధక శక్తి తగ్గిన వారుగా వుంటారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్థులు, కెమో థెరపీ చికిత్స పొందుతున్నవారుగా, శారీరక అవయవాలను శస్త్ర చికిత్స ద్వారా మార్పిడి చేయించుకుని మందులు వాడుతున్నవారిలో లేదా ఇతర జబ్బులు అనగా రోగ నిరోధక శక్తి అతి తక్కువగా వున్న వారిలో (ఎయిడ్స్ అనగా ఎక్వయిరిడ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్) గల వారై వుంటారు. ఈ తరహా గజ్జి దాని యొక్క తీవ్ర వ్యాప్తి వలన వాటిని క్రస్టడ్ స్కాబీస్ (గజ్జి పుండ్లు గుత్తులు గుత్తులుగా ఏర్పడి వుండి) లేదా నార్వీజీయన్ స్కాబీస్ అని పిలువబడుతుంది. ఇటువంటి రోగులలో ఈ గజ్జి పుండ్లు మందంగా, గుత్తులు గుత్తులుగా వుండి వారి శరీరం అంతా వ్యాపించి రసి కారుతూ చూడాడానికి అసహ్యకరంగా వుంటుంది. ఇవి తలపై భాగంతో సహా వ్యాపిస్తాయి. వారి శరీరం అంతా పొలుసులు పొలుసుల్లా వ్యాపిస్తుంది. వాళ్ల యొక్క వేలి గోళ్ళు మందంగా లేదా దళసరిగా ముల్లుల్లాగ వాడిగా వుంటాయి.

వ్యాధిని గుర్తించడం ఎలా?

శరీరం పై ఈ వ్యాధి కలిగించే కీటకాల ఆవాస ప్రాంతాలను చూచి పరీక్షించి అక్కడ వున్న లక్షణాలను బట్టి ఈ వ్యాధిని గుర్తించి నిర్ధారించవచ్చు. ఏ ప్రాంతంలో ఈ క్రిములు వ్యాపించి ఉన్నాయో వాటిని బయటికి రప్పించేందుకు మరిగే వేడి నీటిలో పరిశుభ్రపరిచిన సూదిని గుచ్చి ఆ పుండ్లలొని రసిని తీసివేస్తారు. ఆ రసిలోనే ఈ సూక్ష్మ క్రిములు వుంటాయి. ఆ రసిని ఒక అద్దం ముక్క (సయ్లిడ్) మీద వేసి సూక్ష్మదర్శిని (మైక్రో స్కోప్) సహాయంతో పరిక్షీంచడం ద్వారా ఈ క్రిములు గుర్తింపబడతాయి.

ఈ సూక్ష్మ క్రిములు అప్పుడప్పుడు కుక్కల శరీరం మీద కనిపిస్తాయి. (వీటిని సార్కోప్టస్ స్కాబీఐ వర్ కానీస్) అంటారు. ఇవి మానవ శరీరం మీదకు వ్యాపించే అవకాశముంది. అయితే ఈ క్రిములు మానవ శరీరం మీద ఎక్కువ కాలం జీవించవు, అందుచేత ఈ గజ్జి వ్యాధి తీవ్రత అతి తక్కువగా వుంటుంది.

వ్యాధికి చికిత్స

అనేక రకాల ద్రవాలు (లోషన్స్) (సాధారణంగా 5% కలిగిన పెరిమిథిన్) ను శరీరం మీద పూస్తారు, ఈ ద్రవాన్ని శరీరం మీద పూసి 12 నుండి 24 గంటలు వుంచాలి. శరీరమంతా ఒకసారి పూస్తే చాలు. ఒకవేళ ఈ క్రిములు ఒక వారం తర్వాత కూడా శరీరంపైన ఇంకా జీవించి వుంటే అప్పుడు స్కాబీసైడ్ ను తిరిగి రాయాలి. అప్పటికీ కాలమైన్ ద్రవం లేదా యాంటి హిస్తమిన్ మందులు పూత పూయడం వలన దురద కొంత వరకు ఉపశమిస్తుంది.

నివారణ లేదా నియంత్రణ

ఈ గజ్జి వ్యాధి నివారణకు లేదా నియంత్రణకు మంచి పరిశుభ్రత పాటించడం అవసరం. రోజూ స్నానం చేయడం, అలాగే ఉతికిన దుస్తులు ధరించడం మరొకరు ధరించిన దుస్తులు ధరించకపోవడం చేయాలి. కుటుంబంలోని అందరు సభ్యులు ఈ వ్యాధికి చికిత్సను ఒకేసారిగా చేయించుకోవాలి. కుటుంబంలోని ఎవరికైనా ఈ గజ్జి వ్యాధి ఉన్నదని తెలిస్తే, ఇటీవల అతడు/ఆమె ధరించిన దుస్తులు, అతడు/ఆమె నిద్రించిన పడక, పక్క దుస్తులు బాగా మరిగించిన వేడి నీటిలో తడిపి ఉతకాలి. ఆ తర్వాత వాటిని మండే ఎండలో ఆరవేయాలి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

అలర్జీ

అలర్జీలు రావడానికి కారణాలు తెలియనప్పటికీ వంశపారపర్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ అలర్జీల బెడద ఎక్కువగా ఉంటుంది. దుమ్ము, ధూళి, మంచు, కొన్ని రకాల ఆహార పదార్థాలు, కొన్ని రకాల చెట్లు, పూల పుప్పొడి, పెర్‌ఫ్యూమ్స్, కాస్మొటిక్స్ మొదలైన వాటి వల్ల అలర్జీ వచ్చే అవకాశం ఉంది.

అలర్జిక్ రైనైటిస్
మనకు సరిపడని ప్రేరణలు ముక్కుకు తగిలి, అలర్జీ మొదలైతే హిస్టామిన్ విడుదలవుతుంది. దీంతో ముక్కులోని పొరలు ఉబ్బిపోతాయి. తుమ్ములు, ముక్కు వెంట నీరు కారడం, తరువాత ముక్కులు బిగుసుకుపోవడం(నాసల్ బ్లాక్), కళ్లలో దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి. దుమ్ము, ధూళి, చల్లటి పదార్థాలు, ఘాటు వాసనలు, వాతావరణ మార్పుల మూలంగా ఈ బాధలు అధికమవుతాయి. ముఖ్యంగా ముక్కులోని పొరలు వాచిన కొద్దీ వాసన పీల్చే శక్తి తగ్గిపోతుంది.

అలర్జిక్ సైనసైటిస్
ముక్కుకు ఇరువైపులా నుదుటిపైన సైనస్ గదులు ఉంటాయి. ఈ గదుల గుండా గాలి స్వేచ్ఛగా లోపలికి రావడం, బయటకు వెళ్లడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉండే మ్యూకస్ గాలిలోని సూక్ష్మక్రిములను అడ్డుకుంటుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గినపుడు లేక ఇతర ఇన్‌ఫెక్షన్ల వల్ల ఈ గదుల్లో చీము చేరి నొప్పి ఏర్పడుతుంది. చీముతో గదులు మూసుకునిపోవడం వల్ల గాలి తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడుతుంది.

దీనివల్ల తీవ్రమైన తలనొప్పి, ముక్కు దిబ్బడ ఏర్పడుతుంది. దీన్నే సైనసైటిస్ అంటారు. తలనొప్పి, కళ్ల మధ్య, బుగ్గలపైన, నొసటిపైన నొప్పితో పాటు, ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, చెవి నొప్పి వంటి లక్షణాలు సైనసైటిస్‌లో కనిపిస్తాయి. గొంతు ఇన్‌ఫెక్షన్‌కు గురి కావడం కూడా జరుగుతుంది. తరచుగా జలుబు చేయడం, వైరల్, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లకు గురికావడం, అలర్జీ కారణాల వల్ల సైనసైటిస్ వస్తుంది. చల్లటి గాలికి తిరగడం, కూల్‌డ్రింక్స్ తీసుకోవడం కూడా కారణమే. ఆల్కహాల్, స్మోకింగ్, కొన్ని రకాల ఫర్‌ఫ్యూమ్‌లు సైనసైటిస్‌కు కారణమవుతాయి. అలాగే ముక్కులోపల పాలిప్స్ పెరగడం, ముక్కు దూలం వంకరంగా ఉండటం కూడా కారణమవుతుంది.

ఆస్తమా
ముక్కుల్లో వచ్చే అలర్జీ, ఊపిరితిత్తులలోనికి పాకితే ఆస్తమా,బ్రాంకైటిస్ వంటివి మొదలవుతాయి. శ్వాసకోశ మార్గం కుచించుకుపోవడం వల్ల ఆస్తమా ఏర్పడుతుంది. సాధారణ జలుబు, తమ్ములు, ముక్కుకారడంతో మొదలయి దగ్గు. ఆయాసం, పిల్లి కూతలు వంటి లక్షణాలు ఆస్తమాలో కనిపిస్తాయి. చల్లగాలి, దుమ్ము, ధూళి, అలర్జీ కారకాలు, వైరల్ ఇన్‌ఫెక్షన్, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్స్, మానసిక ఒత్తిడి ఆస్తమాకు కారణమవుతాయి. ఆస్తమా త్రీవమైతే శ్వాసకు ఇబ్బంది ఏర్పడుతుంది.

నాసల్ పాలిప్స్
ముక్కులోపల నీటి తిత్తుల్లా పెరుగుతాయి. వీటివల్ల ముక్కు మార్గాలు మూసుకుపోయి, శ్వాస ఆడక, రాత్రిపూట ఇబ్బందిపడతారు. శస్త్రచికిత్స చేసినా ఇవి తిరిగి ఏర్పడుతుంటాయి.

చికిత్స
అలర్జీ సమస్యకు అల్లోపతిలో యాంటీ హిస్టామైన్స్, డీకంజెస్టంట్స్, కార్టికోస్టిరాయిడ్స్ ఇస్తారు. వీటివల్ల తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. వ్యాధి పూర్తిగా తగ్గిపోదు. అంతేకాకుండా ఈ మందుల వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీన పడి కొన్ని సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ హోమియో మందుల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. పైగా రోగనిరోధక వ్యవస్థను పెంపొందించి అలర్జీని తగ్గించడంలో తోడ్పడతాయి. హోమియో చికిత్స తీసుకోవడంతో పాటు ఏయే పదార్థాల అలర్జీ వస్తుందో గుర్తించి వాటికి దూరంగా ఉండాలి. శస్త్రచికిత్సతో ప్రయోజనం ఉంటుంది కానీ, మూల కారణాన్ని గుర్తించి, నివారించకపోతే జీవితాంతం అలర్జీ సమస్య బాధిస్తూనే ఉంటుంది. అలర్జీని సమూలంగా తొలగించాలంటే హోమియో మందుల వల్లే సాధ్యమవుతుంది.

డా. మధు వారణాసి, ఎం.డి
ప్రముఖ హోమియో వైద్యుల

శోభి మచ్చలు

శోభి మచ్చలు హాని చేయవు. కానీ వికారంగా కనిపించేలా చేస్తాయి. చాలామట్టుకు వాటంతట అవే తగ్గుతాయి. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం తగ్గకుండా ఇబ్బంది పెడతాయి. కొన్ని సూచనలు, మరికొన్ని జాగ్రత్తలు పాటిస్తే అసలు మచ్చలు రాకుండా చూసుకోవచ్చు. వచ్చినా తేలిగ్గా తగ్గించుకోవచ్చు. అలా మచ్చ రాకుండా తీసుకోవాల్సిన ‘ముందుజాగ్రత్త’లు...

శోభి లేదా తెల్లమచ్చలు అనేది చర్మానికి వచ్చే అతి సామాన్యమైన వ్యాధి. ఇది చాలా సందర్భాల్లో దానంతట అదే తగ్గిపోయినా... ఒక్కోసారి ఎక్కువరోజులు ఉంటుంది. ఇది చర్మం పైపొరమీద వచ్చే ఒక రకమైన ఫంగల్ ఇన్‌ఫెక్షన్. సాధారణంగా పెద్ద వయసు వారిలోను, మధ్యవయస్సు వారిలోను కనిపిస్తుంది. దీనికి ఆడమగ భేదం లేదు. చర్మం మీద రంగులో మార్పులు వచ్చే కారణంగా దీనిని వెర్సికలర్ అని, తెలుగులో శోభి లేదా తెల్లమచ్చలు అని అంటారు.
ఎవరిలో ఎక్కువ...!
తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో, వేడి వాతావరణంలో ఉండేవారిలో

స్టెరాయిడ్లు తీసుకునేవారిలో

పౌష్టికాహార లోపం ఉన్నవారిలో

ధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో (ఈస్ట్, చర్మం మీద ఫంగస్ మొదలైనవి రాకుండా వ్యాధినిరోధక వ్యవస్థసరిగా రక్షణ కల్పించ లేకపోయినప్పుడు)

గర్భవతులలో

చెమటపట్టే శరీరధర్మం ఉన్నవారిలో

జిడ్డు చర్మం ఉన్న వారిలో

హార్మోన్ల అసమతౌల్యత ఉన్నవారిలో... ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

కొందరిలో వంశపారంపర్యంగా వస్తుంది. అంతేకాక ఆరోగ్యవంతులకు కూడా ఒక్కోసారి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అయితే పెద్దగా కంగారుపడవలసిన అవసరం లేదు.
కారణాలు:చర్మం లోపల ఉండే మెలసీజియా ఫర్‌ఫర్ అనే ఫంగస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇది చర్మం మీద ఉండే నూనెలను, మృతకణాలను ఆహారంగా తీసుకుంటుంది. ఈ ఫంగస్ మాత్రం అందరి చర్మంలోనూ ఉన్నా కొంతమందిలో మాత్రం ఇబ్బందులకు గురి చేస్తుంది. దీని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు కొందరి శరీరం మీద మచ్చలు వస్తాయి. వాతావరణం తేమగా, వేడిగా ఉన్నప్పుడు ప్రధానంగా వేసవిలో ఈ వ్యాధి కనిపించడానికి అవకాశం ఉంది. అయితే వాస్తవానికి ఇది ఫలానా కారణంగా వస్తుందని ఇప్పటికీ నిర్ధరించలేదు.

తెల్లమచ్చలు కనిపించడం వల్ల నలుగురిలో కి వెళ్లడానికి కొంత ఇబ్బందిగా అనిపించడం సాధారణం. ఈ వ్యాధిలో చర్మం సహజరంగును కోల్పోయి, మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు ముదురు ఎరుపు, లేత గోధుమ, తెలుపు వర్ణాలలో ఉంటాయి. ఒక్కోసారి ఈ మచ్చలున్న చోట దురదగా అనిపించి చికాకుగా అనిపించవచ్చు. అయినప్పటికీ దీనివల్ల ఇబ్బంది ఉండదు. ఎక్కువ చెమట పట్టడం, అధికవేడి కారణంగా ఈ దురదలు రావచ్చు. ఈ మచ్చలు సాధారణంగా వీపు, భుజాలు, చేతులు, ఛాతీ, మెడ ప్రాంతాలలో కనిపిస్తాయి. అప్పుడప్పుడు ముఖం మీద కూడా కనిపిస్తాయి. చిన్నపిల్లలలో ఈ లక్షణాలు ముఖం మీద కనిపిస్తాయి. చర్మం మీద ముదురురంగు మచ్చలు ఏర్పడినప్పుడు, ఆ ప్రాంతంలో చర్మం సహజరంగు కోల్పోవడం సర్వసాధారణం.

వాతావరణం బాగా వేడిగా ఉన్నప్పుడు దాని ప్రభావం ఈ మచ్చల మీద ఎక్కువగా ఉంటుంది. ఈ మచ్చల తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటుంది. కొందరిలో తెల్ల రంగులో చిన్న చిన్న చుక్కలుగా కనిపిస్తే, మరికొందరిలో ఇవి ఎక్కువగా ఉంటాయి. అవి చూడటానికి సహజంగానే అనిపించినప్పటికీ ఒక్కోసారి సమస్యాత్మకంగా ఉంటాయి.
చికిత్స, నివారణ:ఈ సమస్యను చాలా తేలికగా నివారించవచ్చు. చికిత్స చాలా సులభం. ఈ మచ్చలు తొందరగా తగ్గిపోవడానికి అనేక మార్గాలున్నాయి. వేడి నీటితో స్నానం చేయడం, వ్యాయామం చేయడం వంటి చిట్కాలు పాటించడం వల్ల ఈ మచ్చలు త్వరగా తగ్గుముఖం పడతాయి. అయితే చర్మపురంగు యథాస్థితికి రావడానికి మాత్రం చాలారోజులు పడుతుంది. వాతావరణం సాధారణస్థితిలోకి అంటే అధిక ఉష్ణోగ్రత నుంచి సాధారణ ఉష్ణోగ్రత స్థాయికి వచ్చేసరికి రంగులో మార్పు వస్తుంది. అదృష్టవశాత్తూ, శోభి లేదా తెల్లమచ్చలు అంటువ్యాధి కాదు. ఒకవేళ ఈ వ్యాధి వచ్చినప్పటికీ కొద్దిరోజులకే తగ్గిపోతుంది.

ఈ వ్యాధి సోకిన వారందరికీ చికిత్స ఒకేలా ఉండదు. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స సూచిస్తారు. ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు, వ్యాధి సోకిన వ్యక్తికి సంబంధించిన మెడికల్ హిస్టరీ... వంటి వాటిని ఆధారం చేసుకుని చికిత్స ఉంటుంది. అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నివారణకి తేమ వాతావరణం అనేది తప్పనిసరి. వాటితోటు శరీరంలో సహజంగా ఉండే నూనెలు కూడా దీనిని తగ్గించడానికి ఉపయోగపడతాయి.

కొందరు శోభిని చూసి తామర (రింగ్‌వార్మ్) గా భ్రమపడుతుంటారు. తామర వ్యాధి సోకిన భాగంలో మచ్చకు చుట్టూ అంచులు స్పష్టంగా కనపడతాయి. అలాగే దురద కూడా ఉంటుంది. వీటినే కొందరు విటిలిగో, పిటీరియాసిస్ ఆల్బా, సోరియాసిస్‌గా కూడా భ్రమపడుతుంటారు. అందువల్ల డెర్మటాలజిస్టులు ‘కెఓహెచ్’ పరీక్ష ద్వారా ఇది ఏ రకమైన చర్మవ్యాధి అనేది నిర్ధరించి, దానికి తగిన చికిత్స సూచిస్తారు.

ఇన్‌ఫెక్షన్ తగ్గాక కూడా శరీరపు రంగు యథాస్థితికి రావడానికి కొన్ని నెలలు పడుతుంది. ఇది మళ్లీ మళ్లీ రాకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు పాటించడం మంచిది. ఎక్కువచెమట పట్టకుండా చూసుకుంటూ, కెటొకోనటోల్ ఉండే పౌడర్‌ను కొన్ని నెలలు వాడితే మంచిది. ఈ సూచనలు పాటించి అందమైన, ఆరోగ్యకరమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోండి.
జాగ్రత్తలు
ఈ వ్యాధి రాకుండా నివారించడానికి కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. అవి...

చర్మాన్ని నిరంతరం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి

శరీరం మీద అధిక తేమ ఉండకుండా జాగ్రత్తపడాలి

గోరువెచ్చని నీటితో కాని, కొద్దిగా వేడిగా ఉన్న నీటితో కాని స్నానంచేయాలే కాని వేడివేడి నీటితో స్నానం చేయకూడదు. మరుగుతున్న నీటితో స్నానం చేయటం వలన చర్మం చిట్లినట్టుగా అయ్యి లోపల ఉండే నూనె పదార్థాలు ఉత్తేజితమయ్యి, నూనె గ్రంథులు ఏర్పడి, అధిక నూనెను బయటకు విడుదల చేస్తాయి. దీని వల్ల చర్మం మీద ఉన్న ఫంగస్ రెట్టింపవుతుంటుంది

ఎక్కువ చెమట పట్టకుండా జాగ్రత్తపడాలి

శరీరం మీద నూనె కాని నూనెకు సంబంధించిన పదార్థాలను కాని పూయకూడదు

బిగుతుగా, గాలిచొరకుండా ఉండే వస్ర్తాలను ధరించకూడదు.
మందులు
ఫంగస్ చర్మపు పైపొర మీద ఉంటుంది కనుక, చర్మానికి పై పూతగా వాడే మందులు బాగా పనిచేస్తాయి. ఒకవేళ ఈ మచ్చలు ఎక్కువగా ఉంటే, యాంటీ ఫంగల్ మందులను కడుపులోకి తీసుకోవలసి ఉంటుంది. మందులు వాడాక ఈ మచ్చలు తగ్గినట్టు అనిపించినప్పటికీ, కొంతకాలం తరవాత మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. కనక ఈ ఫంగస్ పూర్తిగా తగ్గడానికి మందులు వాడడం తప్పనిసరి.

లులిఫిన్ వంటి యాంటీ ఫంగల్ క్రీమ్‌ను ఉపయోగించవచ్చు. దీనిని సుమారు పదిరోజుల పాటు రోజుకి ఒకసారి చొప్పున మచ్చలున్న చోట అప్లై చేయవలసి ఉంటుంది. అలాగే క్లోట్రిమాజోల్, కెటొకోనజోల్ వంటి క్రీమ్స్‌ను రెండు వారాలపాటు రోజుకి రెండుసార్లు చొప్పున వాడవచ్చు. ఒకవేళ ఇన్‌ఫెక్షన్ అధికంగా ఉంటే, ఓరల్ ట్యాబ్లెట్లను తీసుకోవలసి ఉంటుంది. ఏ మందులనైనా నిపుణులైన డెర్మటాలజిస్టు సలహా, సూచనల మేరకు తీసుకోవలసి ఉంటుంది.

ఆధారము: ఆయురారోగ్యాలు బ్లాగ్

ప్రకాశించే చర్మసౌందర్యానికి 5హోంమేడ్ ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్

"ఆరెంజ్ క్లాటస్ ఆరంటమ్" అనే శాస్త్రీయ నామం కలిగిన నారింజ పండ్లు చలికాలంలో ఎక్కువగా దొరుకుతుంటాయి. ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచే సుగుణాలను తనలో నింపుకున్న నారింజను ఇంగ్లీషులో ఆరెంజ్, సంస్కృతంలో "నారంగ-ఐరావతి", హిందీలో "నారంగీ, సంతరా", బంగ్లాలో "కమలా రేఖ" అనే పేర్లతో పిలుస్తుంటారు.

అందం అనేది చూసే కళ్ళల్లో వుంటుంది అన్నారు పెద్దలు. అయితే చూపు తిప్పుకోలేని అందాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు నేటి మహిళలు. ఎన్నో బ్యూటీ ప్రోడక్ట్స్, వ్యాయామాలు, ఫేస్ప్యాక్లతో డబ్బును, సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఈ బిజీలైఫ్, కాంపిటివ్ ప్రపంచంలో ప్రతి మహిళకు ఇంత సమయాన్ని కేటాయించడం సాధ్యం కాదు. అటువంటి వారికి ఓ శుభవార్త. తమ అందాన్ని ఎటువంటి కష్టంలేకుండా, సమయం వృధా చేయకుండా పెంపొందించుకోవచ్చు. మరి ఆ సులువైన పద్ధతి ఏమిటన్నది తెలుసుకుందామా!

మనకు తక్కువ ఖర్చుతో మార్కెట్లో ఈజీగా దొరికే కమలాపండు (ఆరెంజ్). ఆదేమిటి ఆరెంజ్తో మరింత అందంగా ఎలా అవుతారు? అబ్బా! ఆరెంజ్ తొక్కలను ఎండబెట్టాలి, పౌడర్ చేయాలి, దానిలో ఏవేవో కలపాలి అంటూ ఆలోచిస్తున్నారు కదూ! వద్దు! వద్దు!! మీరు అంత కష్టపడటం మాకు ఇష్టం లేదు. అందుకే మీకో సునాయాస మార్గం.

ప్రతి రోజు క్రమం తప్పకుండా ఓ గ్లాసు ఆరెంజ్ జ్యూస్ సేవించండి చాలు. ఈజీ కదా!! బ్యూటీ ఎక్స్పర్ట్స్, న్యూట్రీషనిస్టుల ప్రకారం ఆరెంజ్ జ్యూస్ను సేవించడం వల్ల మీ చర్మమే కాక జుట్టు, గోళ్ళు కూడా అందంగా వుంటాయి. ఆరెంజ్లో వున్న విటమిన్ ''సి'', ఫోలిక్ యాసిడ్, పొటాషియం మీ అందాన్ని రెట్టింపు చేయడంలో తమవంతు తోడ్పాటును అందిస్తాయి. వీటి వల్ల మీ చర్మం రెట్టింపు అందాన్ని సంతరించుకుంటుంది. దీనికి తోడు జుట్టు, గోళ్ళు కూడా అందంగా మారుతాయి. ఆరెంజ్లో వున్న ఎల్లోపిగ్మెంట్ చర్మ నిగారింపుతో పాటు, దాని ఎలాక్టిసిటీని కూడా కాపాడుతుంది. మీరు చేయాల్సిందల్లా రోజూ ఒక గ్లాసు అంటే 200మిలీ.ల ఆరెంజ్ జ్యూస్ తాగడమే. అలాకాకుండా మేము ప్యాక్ వేసుకోవడానికి కూడా సిద్దమే అనుకొనే వారికోసం కొన్ని ఆరెంజ్ హోం మేడ్ ఫేస్ ప్యాక్ లాను ఈక్రింది విధంగా అందిస్తున్నాము...

నారింజ తో పేస్ ప్యాక్:

మీరు దీనిని మెత్తగా చేయాల్సిన పని లేదు. మీరు చేయాల్సిందల్లా నారింజ గుజ్జుని తీసుకొని ముఖం మీద రుద్దడమే. రుద్దిన తర్వాత ఒక 5 నిముషాలు వదిలి వేయాలి. తర్వాత చల్లని నీటితో కడగాలి. ఈ ముకం ప్యాక్ వాళ్ళ చర్మాన్ని బిగిస్తుంది ఇంకా చర్మం లోని ఆయిల్ నీ తీసివేస్తుంది. దీని వలన వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం అవుతది. మీరు స్నానం చేసుకునే ముందు క్రమం తప్పకుండా దీనిని వేసుకోవచ్చు.

పాలు మరియు ఆరంజ్ జ్యూస్ తో పేస్ ప్యాక్:

ఇది చేర్మాన్ని బాగా శుభ్ర చేస్తుంది. ఇది చనిపోయిన కణాలు, దుమ్మధూళిని చర్మం నుంచి తీసివేస్తాది. మాంచి ప్రకాశించే చర్మం కోసం ఈ పేస్ ప్యాక్ ని మొహానికి వేసుకొని ఒక నిమిషం మసాజ్ చేయాలి. తర్వాత చల్లని నీటితో కడిగివేయాలి.

పెరుగు మరియు నారింజ తొక్కతో పేస్ ప్యాక్:

దీన్ని విశ్రుతంగా మహిళలు మరియు పురుషులు ఉపయోగించే ఫేస్ స్క్రబ్. నారింజ తొక్కలని ఎండలో బాగా ఎండబెట్టాలి. ఇలా కొన్ని రోజులు చేసిన తర్వాత వాటిని పౌడర్ చేసి పెట్టుకోవాలి. దీనిని ఇంట్లో వేసుకొనే పేస్ ప్యాక్స్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ పేస్ ప్యాక్ కోసం ఒక టీ స్పూన్ పెరుగును ఒక కప్ లో తీసుకోవాలి దీనికి అర టీ స్పూన్ నారింజ తొక్క పౌడర్ కలుపుకోవాలి దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు గనక మొటిమలు ఉంటె కొన్ని చుక్కలు నిమ్మ రసం కూడా వేసుకోవచ్చు. ఇపుడు దీనిని మొహానికి వేసుకొని కొంచెం సేపు అరేదాకా వెయిట్ చేయండి తర్వాత చల్లని నీటితో కడిగేయండి.

నిమ్మ, పెరుగు తో ఆరెంజ్ జ్యూస్:

నిమ్మ మరియు పెరుగు ఇంట్లో దొరికే వస్తువులు. వీటితో మనం ఇంట్లోనే పేస్ ప్యాక్స్ తయారుచేసుకోవచ్చు. విటితో కనక నారింజ రసం కలిపి పేస్ ప్యాక్ లాగా వేసుకుంటే చెర్మం ఎంతో బాగుంటుంది. ఈ ప్యాక్ వల్ల చెర్మం తెల్లగా మరియు సన్ టాన్ నుండి కాపాడుతుంది.

నారిజ తొక్క మరియు వోట్ తో పేస్ ప్యాక్:

ఇది సహజ మైన పేస్ ప్యాక్ ఇది చాల సులబమైన పేస్ ప్యాక్. ఈ ప్యాక్ వల్ల చెర్మం లోని చనిపోయిన కణాలు తీసివేస్తాది. సన్ టాన్ నుంచి కూడా కాపాడుతుంది. ఈ కొన్ని చిట్కాలు పాటించి మనమే ఇంట్లో మాంచి పేస్ పాక్స్ తయారుచేసుకోవచ్చు.

ఆధారము: తెలుగు.బోల్డ్ స్కై.కం

చర్మాన్ని కాంతివంతంగా మార్చే వెజిటేబుల్ జ్యూసులు

క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అంటే మనందరికీ ఇష్టమే కదా? అయితే కొంత మందికి మాత్రం ఇటువంటి చర్మ సౌందర్యాన్ని దేవుడు వారికి ఒక వరంగా నేచురల్ గా అందించి ఉంటారు. అలాంటి వారు చూడటానికి అందంగా మరియు స్వచ్చమైన చర్మ సౌందర్యం కలిగి ఉంటుంది. మిగిలిన వారు ఇటువంటి చర్మ సౌందర్యాన్ని మరియు రేడియంట్ స్కిన్ పొందడానికి నానా తంటాలు పడుతుంటారు. ఐడియల్ గా చెప్పాలంటే, ఒక ప్రకాశవంతమైన చర్మ సౌందర్యం పొందాలంటే మంచి పౌష్టికాహారం మరియు వివిధ రకాల ద్రవాలు తీసుకుంటే ఆరోగ్యకరమైన శరీరంతో పాటు మంచి చర్మం సౌందర్యాన్ని కూడా అందిస్తుంది. మొటిమలను శాశ్వతంగా మాయంచేసే ఫ్రూట్ ఫేస్ ప్యాక్: క్లిక్ చేయండి సమతౌల్య ఆహారం అంటే మీరు తీసుకొనే రెగ్యులర్ ఆహారాల్లో తగినన్ని న్యూట్రీషియన్స్ మరియు విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా అందే విధంగా చూసుకోవాలి. ముఖ్యంగా శరీర ఆరోగ్యానికి మరియు చర్మ సౌందర్యానికి ఉపయోగపడే కొన్ని అద్భుతమైనటువంటి పండ్లు మరియు వెజిటేబుల్స్ కొన్ని ప్రత్యేకంగా ఉన్నాయి . సహజంగా కొన్ని రకాల జ్యూసులు ఆకలిని కంట్రోల్ చేయడంతో పాటు కొన్నిసందర్భాల్లో శరీరానికి ఇవే పొటెన్షియల్స్ మీల్స్ గా పనిచేస్తాయి. అదే ఆహారపానీయంలో ఉంచే మంచి న్యూట్రీయంట్స్ వల్లే అలా జరుగుతుంది. మీ చర్మం ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడే కొన్ని వెజిటేబుల్ జ్యూసులు ఈ క్రింది విధంగా ఉన్నాయి..

క్యారెట్ జ్యూస్:

గ్లోయింగ్ స్కిన్ కు ఒక ఉత్తమ వెజిటేబుల్ జ్యూస్ క్యారెట్ జ్యూస్. ఎందుకంటే ఈ క్యారెట్ జ్యూలస్ లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది . అంతే కాదు, ఫైబర్ అధికంగా ఉండే బౌల్ మూమెంట్ ను మెరుగుపరిచి, పొట్టను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుంది. ఇది దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది, వృద్ధాప్య ఛాయలను ధరిచేరనివ్వదు. ఇది మిమ్మల్ని యంగ్ గా మరియు రేడియంట్ గా మార్చేస్తుంది.

టమోటో జ్యూస్:

చాలా సహజంగా ప్రతి ఇంట్లోనే తయారుచేసుకొనే జ్యూస్ లలో కామన్ జ్యూస్ ఇది. టమోటోను ఫ్రూట్స్ గాను మరియు వెజిటేబుల్ గాను భావిస్తుంటారు. వీటిని వివిధ రకాల వంటలో ఉపయోగిస్తుంటారు. టమోటో జ్యూస్ మన శరీరానికి చాలా గ్రేట్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇందులో కొలెస్ట్రాల్ ను వేరు చేసే మూలకం పొటాషియం అధికంగా ఉంటుంది. దీనితో పాటు లైకోపిన్ అనే లక్షణాలు కూడా అత్యధికంగా ఉంటాయి. ఇవి యాంటీక్యాన్సేరియస్ లక్షణాలను నివారిస్తుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల చర్మానికి చాలా గ్రేట్ గా భావిస్తారు.

బేబీకార్న్ జ్యూస్:

ఇది చాలా ఎక్కువగా పాపులర్ అయినటువంటి సూప్ లేదా జ్యూస్. దీన్ని తీసుకోవడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఫ్లూయిడ్ డైట్ ను ఎక్కువగా ఇష్టపడే వారికి ఒది ఒక హెల్తీ డైట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో అధిక క్యాలోరిక్ వాల్యు కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా ఉపయోగకరమైనదిగా భావిస్తారు. ఇందులో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉండటం వల్ల చర్మం ప్రకాశవంతంగా మార్చడంలో గ్రేట్ గా సహాయపడుతుందని చెప్పవచ్చు.

పచ్చిబఠానీ జ్యూస్:

ఈ వెజిటేబుల్ సీడ్స్ ను వివిధ రకాల వంటాల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు. పచ్చిబఠానీల్లో విటమిన్ బి6 మరియు కె పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది మన శరీరానికి అత్యవసరమైన ఆహారంగా భావిస్తారు . పచ్చిబఠానీలతో తయారుచేసే జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ మిరయు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని గ్లోయింగ్ గా మరియు రేడియంట్ గా మార్చడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

ఆకుకూరల రసాలు:

ఆకుకూరలతో సూప్స్ తయారుచేయడం ఒక ఉపాయం అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రసాల్లో విటమిన్ కె పుష్కలంగా ఉండే బోన్ హెల్త్ కు గ్రేట్ గా సహాయపడుతుంది. మరో మూలకం ఐరన్ కూడా పుష్కలంగా ఉండటం వల్ల ఇది చర్మసౌందర్యం పెంపొందించడంలో ఒక ఐడియల్ ఫుడ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ ను పెంచుతుంది. విటమిన్ సి మరియు ఇ మరియు మినిరల్స్ మరియు మెగ్నీసియం గొప్ప యాంటీఆక్సిడెంట్స్ గా పనిచేసి శరీరంలో ఫ్రీరాడిక్ల్స్ నుండి దూరంగా ఉంచుతుంది. ఈ ఫ్రీరాడికల్స్ వల్ల చర్మం దెబ్బతింటుంది మరియు డల్ గా మారుతుంది.

బ్రొకోలీ జ్యూస్:

గ్రీన్ కాలీఫ్లవర్ బాగా పాపులర్ వెజిటేబుల్, ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ద ఉన్నవారు దీన్ని ఎక్కువ గా తీసుకుంటుంటి. అన్ని రకాల వెజిటేబుల్స్ కంటే ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ఎక్కువ పోషకాంశాలను అందిస్తుంది. ఇందులో ఫైబర్ మరియు విటమిన్ సి పుష్కలంగా ుంటుంది . ఇదిహెల్తీ స్కిన్ కోసం చాలా అవసరమైనటువంటివి. ఇందులో కొలెస్ట్రాల్ తక్కువ మరియు న్యూట్రీషియన్స్ ఎక్కువ కాబట్టి, చర్మానికి మరియు శరీరానికి చాలా ఉపయోగకరమైనది

ఆధారము: తెలుగు.బోల్డ్ స్కై.కం

ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ వ్యాధి

ఆరోగ్యమే మహాభాగ్యము. మనిషికి ఏమిటి ఉన్నా, ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు. ఆరోగ్యముగా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు. మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యముగా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము. ఇప్పుడు -Acanthosis-nigricans , ఎకాంతోసిస్ నైగ్రికాన్స్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం!. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి.

ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ అనేది ఒక చర్మసంబంధ సమస్య. చర్మపు ముడతలు, పల్లాలు ముదురు రంగులో వెల్‌వెట్ మాదిరిగా మందంగా తయారవటం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. వ్యాధి ప్రభావానికి లోనైన చర్మం దళసరిగా మారడమే కాకుండా చెడు వాసన కూడా వస్తుంటుంది. ఈ వ్యాధిలో సాధారణంగా చంకలు, గజ్జలు, మెడ వెనుక చర్మపుముడతలు నలుపుగా, మందంగా తయారవుతుంటాయి. సాధారణంగా అధిక బరువు కలిగిన వ్యక్తుల్లోనూ, షుగర్ వ్యాధిగ్రస్తుల్లోనూ ఈ లక్షణం కనిపిస్తుంటుంది.

చిన్నతనంలో ఈ లక్షణాలు కనిపిస్తుంటే, పెద్దయిన తరువాత షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. చాలా చాలా అరుదైన ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ అనేది అమ్లాశయపు క్యాన్సర్‌కిగాని లేదా కాలేయపు క్యాన్సర్‌కిగాని హెచ్చరిక లక్షణంగా కనిపించవచ్చు. ఈ లక్షణం కనిపిస్తున్నప్పుడు సాధారణంగా దీనికి దారితీసే వ్యాధి స్థితిని సరిదిద్దితే సరిపోతుంది.

లక్షణాలు
చంకలు, గజ్జలు, మెడలోని చర్మపు ముడుతలు, పల్లాలు ముదురురంగులోకి మారతాయి మందంగా, వెల్‌వెట్ గుడ్డ మాదిరిగా తయారవుతాయి ఈ మార్పులు వెంటనే కాకుండా నెమ్మదిగా, కొన్నినెలలు, సంవత్సరాలపాటు చోటుచేసుకుంటాయి. వ్యాధి ప్రభావానికి గురైన చర్మం నుంచి చెడు వాసన వస్తుంటుంది. కొద్దిగా దురదగాకూడా అనిపిస్తుంటుంది.

కారణాలు ఇన్సులిన్ హార్మోన్‌ని శరీరం వినియోగించుకోలేకపోవటం (ఇన్సులిన్రెసిస్టెన్స్): క్లోమగ్రంథి (ప్యాంక్రియాస్) ఇన్సులిన్ హార్మోన్‌నివిడుదల చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఇన్సులిన్ అనేది షుగర్‌నిశరీరం వినియోగించుకోవడానికి సహాయపడుతుందన్న సంగతికూడా తెలిసిందే. ఒకవేళ ఈ ఇన్సులిన్ శరీరం గుర్తించలేకపోతే దానిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దీనివల్లచర్మం ముడతలు మందంగా, నలుపుగా తయారవుతాయి.ఇన్సులిన్ రెసిస్టెన్స్‌వల్ల మున్ముందు కాలంలో షుగర్ వ్యాధివచ్చేఅవకాశం ఉంటుంది.

అధిక బరువు : స్థూలకాయుల్లో చర్మం ముడతలు మందంగా నల్లగాతయారవుతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కి ప్రధాన కారణం అధికబరువు. స్థూలకాయం షుగర్ వ్యాధికి ఒక ముఖ్యమైన ప్రేరకం.

హార్మోన్ సమస్యలు : అండాశయాల్లో నీటి బుడగలు పెరగటం, థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గటం, కిడ్నీల మీద ఉండే ఎడ్రినల్ గ్రంథులు వ్యాధిగ్రస్తం కావటం వంటి కారణాలవల్ల చర్మపు ముడుతలు మందంగా, నల్లగా తయారవుతాయి.

మందులు : సంతాన నిరోధక మాత్రలు, కార్టికోస్టీరాయిడ్ మందులు, నియాసిన్ వంటి మందుల వాడకం వల్ల కూడా చర్మపు ముడతలు నల్లగా మందంగా తయారై ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ రావచ్చు.

క్యాన్సర్ : శరీరపు అంతర్గ భాగాల్లో పెరిగే కాన్సర్ కణితులవల్ల కూడా చర్మం మీద ముడతలు నల్లగా మందంగా తయారవుతాయి. ఆమాశయం, పెద్దప్రేగు, కాలేయానికి సంబంధించిన క్యాన్సర్లలో ఇలాంటి లక్షణం కనిపిస్తుంటుంది.

ప్రేరకాలు (రిస్కులు):
అధిక బరువు, వంశపారంపర్యత, జన్యువులు.

పరీక్షలు- నిర్థారణ
ఈ వ్యాధిని నిర్థారించడానికి కొంత సమాచారాన్ని మీరు డాక్టర్‌కి ఇవ్వాల్సి ఉంటుంది.

ఉదాహరణకు:

  • మీ కుటుంబంలో నలుపుదనంతోకూడిన మందపాటి చర్మం ముడతలు ఉన్నాయా?
  • మీ కుటుంబంలో షుగర్ వ్యాధి ఉందా? -మీకు అండాశయానికి, లేదా థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన సమస్యలు ఉన్నాయా?
  • మీరు ఇతర వ్యాధులకు ఏవన్నా మందులు వాడుతున్నారా?
  • ఎప్పుడైనా స్టీరాయిడ్ మందును వాడాల్సిన అవసరం వచ్చిందా?
  • ఈ లక్షణాలు ముందుగా ఎప్పుడు మొదలయ్యాయి?
  • సమయం గడిచే కొద్దీ ఇవి తీవ్రతరమవుతున్నాయా?
  • మీ శరీరంలో ఏ భాగాలు వ్యాధి లక్షణాలను ప్రదర్శిస్తున్నాయి?
  • మీకు గాని లేదా మీ కుటుంబంలో ఇతరులకు ఎవరికైనా గాని క్యాన్సర్ వచ్చిన ఇతివృత్తం ఉందా?

ఆయుర్వేద చికిత్సా వ్యూహం--/ -డాక్టర్ చిరుమామిళ్ల మురళీమనోహర్

చికిత్సల ఉద్దేశ్యం-లక్షణాలను కలిగించే అంతర్గత వ్యాధిని ముందుగా గుర్తించి అదుపులో ఉంచటం. చర్మం ఎబ్బెట్టుగా కనిపించకుండా మచ్చల గాఢతను తగ్గించటం -ఆహారంలో మార్పులు చేర్పులను సూచించటం -ఒకవేళ అధిక బరువు కలిగి ఉంటే బరువు తగ్గేలాఆహార, విహార, ఔషధాపరమైన చికిత్సలను సూచించటం చర్మంమీద నలుపు రంగు మందపాటి వైద్య సలహాతో వాడుకోవాల్సిన ఔషధాలు--పంచతిక్తఘృత గుగ్గులు, మహామంజిష్టాది క్వాథం, మహాభల్లాతక రసాయనం, అమృత భల్లాతక లేహ్యం, లంకేశ్వర రసం, అరగ్వదాది ఉద్వర్తనం, మహా మరీచ్యాది తైలం, శే్వత కరవీరాది తైలం

అల్లోపతిక్ చికిత్స :

కారణాన్ని బట్టి ట్రీట్ మెంట్ చేయాలి . మదుమేహము అదుపులోఉండేటట్లు , కాన్సర్ అయితే దానికి తగిన వైద్యాన్ని ఇవ్వవలసి ఉంటుంది. సాధారణముగా ఇది దానంతట అదే తగ్గిపోవును. దాని మూలాన్ని బాగుజేసుకుంటే Restoderm or Total derm వంటి ఆయింట్ మెంట్స్ బయట మచ్చలు పైన పూతగా రాస్తే కొద్దికాలములో ఇది పూర్తిగా మామూలు చర్మము రంగులోనికి మారిపోవును.

ఆధారము: వైద్య రత్నాకరం బ్లాగ్

చర్మ వ్యాధులు - చికిత్స

సొరియాసిస్.. ఉపేక్షిస్తే ప్రాణాంతకమే

సొరియాసిస్ అనగానే చాలా మంది అదేదో చ ర్మానికే పరిమితమయ్యే వ్యాధి అనుకుంటారు. ముందు పైపైనే కనిపించినా ఆ తరువాత చర్మం కింద ఉండే నాళాల్లో కూడా వాపు ఏర్పడుతుంది. ఈ సమస్య దీర్ఘకాలికంగా కొనసాగితే ప్రధాన రక్తనాళాల్లో వాపు ఏర్పడి ఒక్కోసారి గుండెపోటుకు, పక్షవాతానికి దారితీసే ప్రమాదం కూడా ఉంది. అందుకే సొరియాసిస్‌ను నిర్లక్ష్యం చేయడం అంటే ఒకరకంగా ప్రాణాల మీదికి తెచ్చుకోవడమే. అందుకే, సమస్యను తొలిదశలోనే గుర్తించి వైద్య చికిత్సలు తీసుకోవడం ఎంతో ఉత్తమం అంటున్నారు సొరియాసిస్ వైద్య నిపుణులు డాక్టర్ పూజారి రవికుమార్.

ఎంతో సున్నితంగా, మృదువుగా ఉండే చర్మం కొందరిలో ఉన్నట్లుండి తన సహజ వర్ణాన్ని కోల్పోతుంది. రోజులు గడిచే కొద్దీ ఏనుగు చర్మంలా మారి ఆ తరువాత చేపపొట్టులా రాలడం మొదలవుతుంది. ముందు కాస్త కలవరపడినా, కొందరు చాలా కాలం దాకా ఆ సమస్యను పట్టించుకోకుండానే ఉండిపోతారు. సమస్య మరీ ఎక్కువగా ఉన్నప్పుడు తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చే మాత్రలు వేసుకుని సరిపెట్టుకుంటారు. అన్నింటినీ వేరు వేరుగా, విడి విడి భాగాలుగా చూసే ధోరణి వల్ల చాలా మంది చర్మం సమస్య చర్మానిదే అనుకుంటారు.

ఒకవేళ కన్ను, చెవి, గుండె, కిడ్నీలు, లివర్ ఈ అవయవాల్లో ఏదైనా సమస్య వస్తే సాధారణంగా అది ఆ అవయవానికే పరిమితమై ఉంటుంది. కానీ, చ ర్మం విషయం పూర్తిగా వేరు. సమస్య మొదలవడం,చర్మం మీదే అయినా దాని దుష్ప్రభావాలు శరీరంలోని దాదాపు ఇతర భాగాలన్నింటి మీదా పడతాయి. రక్తనాళాల్లోని వాపు కారణంగా కొందరికి గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలు కూడా వచ్చి ఒక్కోసారి మొత్తం జీవితమే శిధిలమైపోయే ప్రమాదం ఉంది.

మౌలికంగా సొరియాసిస్ రావడానికి శరీరంలో వ్యర్థపదార్థాలు పేరుకుపోవడం, వాత, పిత్త, కఫాల్లోని దోషాలు ఏర్పడటం ఒక ప్రధాన కార ణం. వీరిలో వ్యర్థపదార్థాలు శరీరంలో మరీ ఎక్కువైపోవడం వల్ల వాటిని శుద్ధిచేసే భారం పెరిగి ఒక్కోసారి కిడ్నీలు దెబ్బ తినే ప్రమాదం ఉంది. సొరియాసిస్ రావడానికి శరీరంలో వ్యర్థపదార్థాలు పేరుకుపోవడంతో పాటు, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం కూడా ఒక బలమైన కారణమే.

ఎలా తెలుస్తుంది?

సొరియాసిస్, ఎక్కువ మందిలో తల మీదే మొదలవుతుంది. తలమీద చుండ్రులా కనిపించి కొందరిలో దానికదే తగ్గిపోవచ్చు. అలా కాకుండా ఎక్కువ కాలం కొనసాగుతూ, ఎర్రటి మచ్చలు, దురదతో పాటు మంట ఉన్నప్పుడు సొరియాసిస్ ఏమోనని అనుమానించాలి. ఒక్క రోజు తలస్నానం చేయకపోయినా సమస్య బాగా ఎక్కువైపోవడం, తలమీద అట్టలు కట్టడం, దువ్వితే పొట్టు రాలడం వంటి లక్షణాలు కనిపిస్తే, సొరియాసిస్‌గా భావించవచ్చు.

తలనుంచి మొదలై ఆ తరువాత మెడ, వీపు, కాళ్లూ చేతుల మీదికి పాకవచ్చు. కొందరిలో అయితే, గోళ్లమీద గీతలు పడటం, వంగిపోవడం, గోళ్లు పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒక దశలో గోళ్లు పొట్టులా రాలిపోతాయి . కొందరిలో ఈ మార్పు సొరియాసిస్ వ్యాధి లక్షణాల్లో భాగంగా కనిపిస్తే, కొందరిలో మునుముందు సొరియాసిస్ రాబోతోందని చెప్పే సూచికగా కూడా కనిపించవచ్చు.. వైద్య చికిత్సలు అందక సమస్య ఇంకా అలాగే కొనసాగితే, ఇది కీళ్లు దెబ్బ తినే సొరియాటిక్ ఆర్థరైటిస్‌గా కూడా పరిణమించవచ్చు.. దీనివల్ల రోజువారి పనులేవీ సక్రమంగా నిర్వర్తించలేని స్థితి ఏర్పడుతుంది.

సొరియాసిస్‌కు ఎక్కువకాలం సరియైన చికిత్స ఏదీ అందకపోతే, రక్తనాళాల్లో ఏర్పడిన వాపు కారణంగా గుండెకు, మెదడుకు రక్తసరఫరా సరిగా అందక గుండెపోటు లేదా పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. సొరియాసిస్ చాలా తీవ్రంగా ఉన్న సమయంలో గర్భం ధరిస్తే వారికి పుట్టే పిల్లలు తక్కువ బరువుతో పుడతారని కూడా ఇటీవల అమెరికాలో జరిగిన ఒక పరిశోధనలో తేలింది.

అసలు కారణాలేమిటి?

సొరియాసిస్ రావడానికి శరీరంలో మలినాలు పేరుకుపోవడంతో పాటు, వాత, పిత్త కఫాలు సమస్థితి కోల్పోవడం, మానసిక ఒత్తిళ్లు, ప్రధాన కారణంగా ఉంటున్నాయి. అల్లోపతి వారు సొరియాసిస్ చికిత్సలో, స్టెరాయిడ్స్, యాంటిబయాటిక్స్, కొన్ని రకాల లోషన్స్ ఇస్తూ ఉంటారు. ఇవి తాత్కాలికంగా కొంత ఉపశమనాన్ని ఇచ్చినా, వీటిని దీర్ఘకాలికంగా వాడటం వల్ల శరీరంలో విషపదార్థాలు మరింతగా పెరిగిపోతాయి. నిజానికి సొరియాసిస్‌కి మూల కారణమైన ఈ విషపదార్థాలను తొలగించకుండా ఎన్ని రకాల వైద్య చికిత్సలు చేసినా అవి పెద్ద ప్రయోజనాన్ని ఇవ్వవు.

అందుకే, ఆయుర్వేదం, వ్యాధికారకమైన శరీరంలోని విషపదార్థాలను బయటికి పంపడానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంది. రోగి వైద్య చికిత్సలకు వచ్చినప్పుడు ముందు వ్యాధి లక్షణాలను తొలగించే చికిత్సలు చేస్తాం. రోగిని తీవ్రంగా బాధిస్తున్న నొప్పి, వాపు, దురద, నిద్రలేమి, ఇంకా మరేవైనా సమస్యలు ఉన్నప్పుడు ముందు వాటినుంచి ఉపశమనం కలిగే చికిత్సలే చేస్తాం. అదే సమయంలో శరీర అంతర్భాగాల మీద దృష్టి సారిస్తాం. అందులో భాగంగా లోపలున్న మలినాలను బయటికి పంపించడానికీ, నొప్పికి కారణమైన వాతాన్ని హరించడానికి పంచకర్మ చికిత్సలు, వస్తి చికిత్సలూ చేస్తాం.

అదే సమయంలో కడుపులోకి కూడా కొన్ని మందులు కూడా ఇస్తాం. ఈ క్రమంలో రక్తశుద్ధికీ, వాతాన్ని హరించడానికీ, చికిత్సలు కూడా ఉంటాయి. అలాగే వ్యా«ధి నిరోధక శక్తిని పెంచే మందులు కూడా ఇస్తాం. ఏకకాలంలో ఇన్ని కోణాల్లోంచి చికిత్సలు చేయడం వల్లే ఎంతో తీవ్రంగా ఉన్న సొరియాసిస్ కూడా కేవలం ఓ 30 రోజుల్లోనే తగ్గుముఖం పడుతుంది.

వస్తి చికిత్సలో కీళ్లనొప్పులకు కారణమయ్యే ఆమం తొలగిపోతుంది. వస్తికర్మ చికిత్సలు, పంచకర్మ చికిత్సలు తీసుకోవడం ద్వారా వ్యా«ధి నయం కావడంతో పాటు, సమస్య మరోసారి వచ్చే అవకాశం లేకుండా పోతుంది.. వీటితో పాటు ఆహార పదార్థాల నియంత్రణ కూడా ఆరోగ్యాన్ని నిలబెడుతుంది. సోరియాసిస్ వంటి సమస్యలు రావడానికి జీర్ణవ్యవస్థలోని లోపాలే ప్రధాన కారణంగా ఉంటాయి. ఈ లోపాల వల్ల ముందు రసధాతువు దెబ్బ తింటే ఆ తరువాత సప్తధాతువుల్లోని మిగతా ఆరుకూడా దుష్ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఇందుకు కారణమైన వాత, పిత్త, కఫాల్లోని దోషాలను కూడా తొలగించవలసి ఉంటుంది.

మానసిక సంబంధితం కూడా...

సొరియాసిస్ రావడానికి శారీరక కారణాలతో పాటు, దిగులు, ఆందోళన, మానసిక ఒత్తిళ్లు కూడా మౌలిక కారణాలుగా ఉంటాయి. అప్పటికే ఉన్న సొరియాసిను పెంచడమే కాదు. కొత్తగా సొరియాసిస్ రావడానికి కూడా కొన్నిసార్లు ఈ ఒత్తిళ్లు కారణమవుతాయి అందుకే సొరియాసిస్‌ను వైద్యశాస్త్రం, సైకోసొమాటిక్ వ్యా«ధిగా పరిగణిస్తుంది.

శరీరానికే కాకుండా మనసుకు కూడా చికిత్సలు అందించడం ఒక ప్రధాన అవసరంగా ఆయుర్వేదం భావిస్తుంది. ఈ క్రమంలో మానసిక ఒత్తిళ్లను తగ్గించే శిరోధార చికి త్సకు ఎంతో ప్రాధాన్యతనిస్తుంది. దీనికి అనుబంధంగా యోగా, ధ్యానాలను కూడా వైద్య చికిత్సలో భాగం చేస్తుంది. మౌలికంగా ఆయుర్వేదం సొరియాసిస్‌ను పైపైన ఉండే ఒక చర్మ సమస్యగా కాకుండా, మొత్తం శరీర వ్యవస్థకు సంబంధించిన సమస్యగా గుర్తిస్తుంది. అందుకే ఆయుర్వేద వైద్య చికిత్సలతో సొరియాసిస్ శాశ్వతంగా తొలగిపోతుంది.

- డాక్టర్ పూజారి రవికుమార్

ఆర్ కె ఆయురే ్వదిక్ అండ్ సొరియాసిస్ సెంటర్

క్లినిక్స్: హైదరాబాద్,విజయవాడ, వైజాగ్, హన్మకొండ,కర్నూలు, తిరుపతి

ఫోన్స్:98492 54587, 040-23057483

చిన్న వయసులోనే సోరియాసిన్

మా బాబుకు తొమ్మిదేళ్లు. పుట్టిన ఏడాదికేవాడికి సోరియాసిస్ సమస్య మొదలయ్యింది. చాలా కాలం దాకా నిదానంగా పెరగుతూవచ్చిన మచ్చలు గత రెండేళ్లుగా తీవ్రమయ్యాయి. ఓ 14 నెల పాటు ఆయుర్వేద మందులుఇప్పించాం.కానీ, వ్యా«ధి 60 శాతం మాత్రమే ఆ తరువాత అలాగే ఉండిపోవడంతోమందులు మానేశాం. ఆ వెంటనే మళ్లీ నిలువెల్లా మచ్చలు వచ్చేశాయి. ఇటీవల ఆరుమాసాలపాటు ఆలోపతి మందులు వాడాం. వీటి వల్ల సమస్య తగ్గకపోగా మరింతపెరిగింది. బాబు విపరీతమైన దురద, మంటతో బాధపడుతున్నాడు. చర్మం పగుళ్లుబారింది. ఏ రోజూ సరిగా నిద్ర పోవడం లేదు. ఆహారం తీసుకోవడం కూడాతగ్గిపోయింది. చిన్న వయసులోనే ఈ సమస్య రావడానికి కారణమేమిటి? ఈ వ్యాధినుంచి బాబు పూర్తిగా బయటపడే మార్గం ఏదైనా చెప్పండి.

బాల్యంలోనే సోరియాసిస్ రావడానికి వంశానుగతమైన కారణాలు ఒక కారణం. దీర్ఘకాలికంగా ఉంటున్న ఇన్‌ఫెక్షన్లు వాటి చికిత్సగా వాడే యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్‌తోనూ కొందరిలో ఈ సమస్య మొదలవుతుంది. అయితే, శరీరమంతా చేపపొట్టులా కనిపించడం వల్ల చూడటానికి ఇది భయంకరంగా అనిపించవచ్చు గానీ, వైద్య చికిత్సలు ప్రారంభించిన వారం రోజుల్లోనే బాగా తగ్గిపోతుంది. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఈ వ్యాధి ఎంత వేగంగా పెరుగుతుందో అంతే వేగంగా తగ్గిపోతుంది కూడా. పెద్ద వారిలో అయితే 20 రోజుల పైనే పడుతుంది.

వ్యాధికి గురైన పిల్లలకు వెంటనే చికిత్స అందకపోతే అది మరికొన్ని ఇతర సమస్యలకు కూడా దారి తీయవచ్చు. తరుచూ జ్వరం రావడంతో పాటు , మూత్రాశయ సంబంధమైన ఇన్‌ఫెక్షన్లు కూడా రావచ్చు. వీటి నివారణగా తీసుకునే మందుల్ని ఎక్కువ కాలం వాడటం వల్ల కాలేయం దెబ్బ తినే ప్రమాదం కూడా ఉంది. దురద, మంటల కారణంగా నిద్ర సరిగా లేకపోవడం వల్ల నాడీ సంబంధమైన సమస్యలు తలెత్తే పరిస్థితి కూడా రావచ్చు. బాల్యంలోనే కొంత మందికి అధిక రక్తపోటు, మధుమేహం, హృద్రోగ సమస్యలు రావడానికి ఇదీ కారణమే. ఈ వ్యాధికి గురైనవారికి సహజంగానే తోటి పిల్లలంతా దూరంగా ఉంటారు. ఇది వారిని మానసికంగా బాగా కుంగదీస్తుంది.

వైద్యచికిత్సలు అందక ఈ వ్యాధి ఎక్కువకాలం అలాగే ఉండిపోతే ఆ తరువాత వ్యాధి తగ్గినా వీరిలో ఆ ఆత్మన్యూనత చాలా కాలం దాకా వెంటాడుతూనే ఉంటుంది. చర్మం బిగుసుకుపోయి పగుళ్లు రావడం వల్ల వచ్చే నొప్పి కారణంగా కీళ్ల కదలికలు తగ్గిపోతాయి. ఇది క్రమంగా కీళ్లనొప్పులకు కూడా దారి తీయవచ్చు. కొంతమంది పిల్లల కంటిరెప్పల అంచుల్లోంచి ఒక రకమైన ద్రవం వస్తూ రెప్పలు కొట్టడం కూడా కష్టమవుతుంది. వ్యాధి నిరోధక శక్తి వీరిలో బాగా తక్కువగా ఉంటుంది. అందుకే వీరికి ముందుగా ఆకలి పెంచే విషయమై శ్రద్ధ వహించాలి. వీరిలో కాస్త శక్తి పెరిగాక ఎనిమా ఇస్తూ తైల మర్థనతో పాటు కడుపులోకి కొన్ని మందులు ఇస్తాం. చర్మం మీద రాయడానికి కొన్ని రకాల క్రీములు కూడా ఉపయోగిస్తాం. ఈ అన్నింటి ఫలితంగా రెండు మూడు మాసాల్లో ఈ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.

నా వయసు 35. నా శరీరమంతా నల్లటి మచ్చలు వచ్చాయి. చాలా కాలం అల్లోపతి మందులు వాడాను. కానీ, పెద్ద ఫలితమేమీ రాలేదు. మచ్చలు వర్షాకాలం, చలికాలం ఎక్కువగానూ, ఎండాకాలం కాస్త తక్కువగానూ ఉంటాయి. ఇటీవల ఒకటి రెండు సార్లు విదేశాలకు వెళ్లాను. వెళ్లిన 15 రోజుల్లో సమస్య తీవ్రమైపోయింది. మళ్లీ మనదే శానికి రాగానే ఆ తీవ్రత తగ్గింది. కొన్ని కారణాల వల్ల నేను తరుచూ విదే శాలకు వెళ్లే అవసరం ఏర్పడుతుంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఇది నాకో అదో పెద్ద ఆటంకం అవుతుంది. ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడే పరిష్కారం చెప్పండి.

సాధారణంగా శరీర కణాల పనితనం త గ్గినప్పుడే సోరియాసిస్ సమస్య వస్తుంది. హానికారకమైన ఆహార పానీయాలు, వ్యాయామం లేకపోవడం, నిద్రలేమి, మలబద్ధకం, దీర్ఘకాలికంగా వాడిన కొన్ని మందులు ఈ కారణంగా శరీరంలో నిలిచిపోయిన వ్యర్థపదార్థాలు సోరియాసిస్‌కు మూలమవుతాయి. ఈ స్థితిలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. అందుకే ఈ వ్యాధి చికిత్సలో శరీరంలోని వ్యర్థపదార్థాలను తొలగిస్తూ వ్యాధినిరోధక శక్తిని పెంచడం ప్రధాన లక్ష్యమవుతుంది.

మీకున్న సమస్యకు ప్రాధమిక చికిత్సగా చర్మం పొడిబారిపోకుండా శరీరమంతా తైల మర్థనం చే సుకోవాలి. ఆ తరువాత శరీరంలోని వ్యర్థపదార్థాల్ని తొలగించడానికి డిటాక్సికేషన్ మందులు వాడటం, వ్యాధి నిరోధక శక్తిని పెంచే జాగ్రత్తలు అవసరం. ఈ విధానాల్లో ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. ఒకవేళ ఫలితాలు తొందరగా రావాలనుకుంటే పంచకర్మ చికిత్స తప్పనిసరి. ఈ చికిత్స వల్ల మూడు నాలుగు వారాల్లోనే ఎంతో మార్పు వస్తుంది. హానికారకమైన ఫ్రీర్యాడికల్స్‌ను శరీరం నుంచి బయటికి పంపే చికిత్సలు ఎంతో అవసరం. ఈ క్రమంలో రక్తశుద్ధికి తోడు జీర్ణవ్యవస్థను చక్కదిద్దే మందులు కూడా ఇస్తాం. ఆ పైన వ్యాధి నివారణ కోసం కడుపులోకి కొన్ని మందులు ఇస్తాం.

సోరియాసిస్ రావడానికి మానసిక ఒత్తిళ్లు కూడా కారణంగా ఉంటాయి. అందుకే ఈ వ్యాధిని సైకోసొమాటిక్ వ్యాధి అంటారు. అందుకే వ్యాధి చికిత్సలో యోగ, ప్రాణాయామాలకు కూడా స్థానం ఉంటుంది. నిజానికి తైల మర్ధన, ప్రాణాయామాలతోనే సగం వ్యాధి తగ్గిపోతుంది. వీటితో పాటు కొన్ని రకాల మందులు కలిపి చేసిన మజ్జిగతో చేసే తక్రదాన చికిత్స మంచి ఫలితాన్నిస్తుంది. దీని వల్ల మానసిక ఆందోళన, దిగులు తగ్గుతాయి. వైద్య చికిత్సల తరువాత కూడా ఆహార నియమాలు పాటిస్తూ, విరేచనాల విషయంలో శ్రద్ధ వహిస్తూ, తరుచూ తైల మర్థనం చేసుకుంటూ ఉంటే ఈ వ్యాధి శాశ్వతంగా పోతుంది.

నెల రోజుల్లో సొరియాసిస్ మాయం

ఆమె పేరు ఎన్. సురేఖ. వయసు 25. సాఫ్ట్‌వే ర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. చర్మం మీద ముందు స్వల్పంగా మొదలైన దురద, మంట క్రమంగా పెరుగుతూ చర్మమంతా పెద్ద పెద్ద మచ్చలుగా తయారయ్యాయి. అల్లోపతి డాక్టర్‌ను సంప్రదిస్తే సొరియాసిస్ అన్నారు. ఆమె చెప్పిన వివరాలు ఇంకా ఇలా ఉన్నాయి. డాక్టర్ సూచన మేరకు దాదాపు ఒక సంవత్సరం పాటు అల్లోపతి మందులు వాడారు. అయితే, మాత్రలు వేసుకున్నాక ఓ ఏడెనిమిది గంటల పాటు దురద ఉండేది కాదు. ఆ వ్యవధి దాటగానే మళ్లీ దురద, మంటలు ఉండేవి. కొద్ది కాలం స్టెరాయిడ్స్ కూడా వాడారు. అయినా ఫలితం రాలేదు. చర్మం పగుళ్లలోంచి చీము రావడం, ఈ స్థితిలో చేతులు మడుచుకోవడం కూడా బాధగానే ఉండేది. చేతి వేళ్ల చివర్లలో సూదులతో గుచ్చినట్లు కొన్ని ఎర్రటి చుక్కలు వచ్చాయి. ఈ కారణంగా కంప్యూటర్ మీద పనిచేయడం కూడా కష్టమయ్యింది. ఆ దశలో తెలిసిన వారెవరో సొరియాసిస్‌కు ఆయుర్వేద చికిత్స మేలు అని చెప్పగా విని మా వద్దకు వచ్చారు.

సొరియాసిస్ అప్పటికే తీవ్రదశకు చేరుకున్నందువల్ల వెంటనే ఆమెకు పంచకర్మ చికిత్స ప్రారంభించాం. వ్యాధి బాగా ముదిరిన వారికి ఈ చికిత్స చాలా అవసరం. వమనం, విరేచనం, వస్తి, నస్య, రక్తమోక్షణం అనే ఐదు ప్రక్రియల్లో పంచకర్మ ఉంటుంది. రోగి శ రీర ధర్మాన్ని, సమస్య తీవ్రతను అనుసరించి పంచకర్మలో ఐదింటిని కానీ, లేదా వాటిలో ఏవో కొన్ని కానీ అవసరమవుతూ ఉంటాయి. పంచకర్మ చికిత్సకు 25 రోజుల దాకా పడుతుంది. ఆ కాలంలో రోజుకు ఒకసారి హాస్పిటల్‌కు వచ్చి రెండు గంటల పాటు తైల మర్ధన చేయించుకుని వెళ్లిపోవచ్చు. మిగతా సమయాల్లో తైలాలతో ఇంటి వద్దే మర్ధన చేసుకుంటే సరిపోతుంది. ఈ సమయంలో ఉద్యోగానికి కూడా వెళ్లవచ్చు.

సొరియాసిస్ చికిత్సలో స్నేహపానం ఒక కీలక ప్రక్రియ. ఇందులో వరుసగా ఏడు రోజులు కడుపులోకి ఒకరకమైన నూనె ఇవ్వవలసి ఉంటుంది. నూనెను జీర్ణించుకునేందుకు వీలుగా శరీరాన్ని సిద్ధం చేయడానికి ఆమపాచన చికిత్స చేస్తాం. ఇందులో మొదటి మూడు రోజులు 'చిత్రకాదివటి' అనే మాత్రను ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక్కో మాత్ర చొప్పున అలా మూడు రోజులు ఇస్తాం. స్నేహపానంలో మహాతిక్తక గృతం (ఔషధాలు కలిపిన నెయ్యి) ఇచ్చాం. ఆమె శారీరక స్థితిని అనుసరించి ఇచ్చే నెయ్యి మోతాదును క్రమంగా పెంచుతూ వెళ్లాం. అలా నాలుగు రోజుల పాటు ఈ చికిత్స కొనసాగింది. మామూలుగా అయితే నెయ్యితో చేసినవి అంత సులువుగా జీర్ణం కావు. అయితే ప్రతి అరగంటకూ ఒకసారి గ్లాసు గోరు వెచ్చని నీళ్లు ఇవ్వడం వల్ల నెయ్యి జీర్ణం కావడంలో ఇబ్బంది ఏమీ రాదు.

వమన, విరేచనాల వైనం

తైల మర్ధన చికిత్స మొదలైన ఎనిమిది రోజులకు శరీరంలోని మలినాలను వాంతి ద్వారా బయటికి పంపించే వమన చికిత్స చేశాం. ఇలా చేయడం వల్ల శరీరంలోని రోగకారకమైన వాత,పిత్త, కఫ సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. నెయ్యిని కడుపులోకి ఇవ్వడం వల్ల కణజాలానికి అంతటికీ తైల లక్షణం వచ్చి శరీరంలోని మలినాలు సులభంగా జారి కడుపులోకి చేరిపోతాయి.

వమనం ద్వారా గానీ, విరేచనం ద్వారా గానీ శరీరంలోని దోషాలు, మలినాలు పూర్తిగా బయటికి వెళ్లిపోవడాన్నే స్నిగ్థత్వం అంటారు. అయితే ఆ వ్యక్తి బలంగా ఉన్నప్పుడు వమన చికిత్స చేస్తాం. ఆ తరువాత ఎనిమిది రోజులకు విరేచన చికిత్స చేస్తాం. ఒకవేళ రోగి బలహీనంగా ఉంటే విరేచన చికిత్స చేస్తాం. వమన చికిత్స చేసిన ఎనిమిది రోజుల్లో అప్పటి వరకూ ఆమెకు ఉన్న దురద, మంట తగ్గాయి. ఎండిపోయి పగుళ్లు పట్టిన చర్మం కాస్త మామూలు స్థితికి వచ్చేసింది.

వేళ్లు కూడా చక్కబడటంతో ఆమె కంప్యూటర్ మీద పనిచేయడం సులువైపోయింది. కాకపోతే అప్పటికి ఇంకా ఆమెలో ఇంకా పూర్తి స్నిగ్థత్వం రాలేదు. అందుకే మరోమారు విరేచన చికిత్స చేయవలసి వ చ్చింది. ఆ తరువాత స్నేహపానం ఇచ్చి, మూడు రోజులు తైల మర్థనలు కూడా చేయడంతో ఆమెకు పూర్తి స్థాయి స్నిగ్ధత్వం వ చ్చింది. ఫలితంగా అప్పటిదాకా చర్మం మీద మందంగా, ఉబ్బెత్తుగా ఉన్న మచ్చలు క్రమంగా పలుచబారాయి. చీము రావడం కూడా తగ్గింది. ఆమ పాచనం పెట్టినప్పటి నుంచే ' చిత్రకాది వటి'మాత్రలు ఇస్తూ విరేచనం తరువాత రోజూ రెండుసార్లు తైలమర్థనం కొనసాగించడం వల్ల నలుపు మచ్చలు తొలగిపోవడంతో పాటు చర్మంలో ఎంతో మార్పు కనిపించింది.

ఒత్తిళ్లకు బ్రేక్

సొరియాసిస్ చికిత్సలో మానసిక సమస్యలను నయం చేయడం ఒక ప్ర«ధాన అంశం. సొరియాసిస్‌కు గుయిన కొంత మంది మెదడులోంచి క్యాటిచోకెలామైన్స్ అనే ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లు చాలా ఎక్కువగా పుడుతూ ఉంటాయి. ఇవి ఎక్కువ య్యే కొద్దీ సొరియాసిస్ మరింత తీవ్రమవుతూ ఉంటుంది. సురేఖ పరిస్థితి కూడా అదే. అందుకే ఆమెలోని హార్మోన్ల ఉత్పత్తిని తగ్గించేందుకు శిరోధార చికిత్స చేశాం. బ్రాహ్మీ తైలాన్ని ఓ 45 నిమిషాల పాటు రెండు కనుబొమ్మల మీదుగా ధారగా పోయడం ఈ చికిత్సా విశేషం.

ఈ సమయంలో మనసును ప్రశాంత పరిచే సంగీతం ప్రసారమవుతూ ఉంటుంది. తైల మర్ధనం, వమన విరేచనం, శిరోధార ఈ మూడు చికిత్సల ద్వారా ఆమెకున్న సొరియాసిస్ సమస్య పూర్తిగా త గ్గిపోయింది. చికిత్స కొనసాగే మొత్తం 30 రోజుల కాలంలో శరీరాన్ని శుద్ధి చేసే ప్రక్రియలే తప్ప వేరే మందులేమీ ఇవ్వలేదు. కాకపోతే, చికిత్సా కాలం ముగిసిపోయాక ఆర్కిలేహ్యం అనే మాత్రలు నెల రోజుల పాటు వేసుకొమ్మని చెప్పాం. ఇవి చర్మం దారుడ్యాన్ని పెంచడానికి ఉద్ధేశించినవి. ఇప్పుడింక ఏ మందులూ అవసరం లేదు.

చలికాలం కాస్తంత జాగ్రత్త

కాకపోతే అరుదుగా కొందరిలో చలికాలం రాగానే సొరియాసిస్ లక్షణాలు కొన్ని స్వల్పంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ స్థితి రాకుండా నివారించడానికి ప్రతి ఏటా చలికాలానికి ఒక నెల ముందు ఒకసారి విరేచన చికిత్స తీసుకుంటే చాలు. అలాగే చలికాలంలో రోజూ ఉదయం, రాత్రి ఇలా రెండు పూటలా మంజిష్టాది తైలంతో శరీరమంతా మర్ధన చేసుకుని గంట తరువాత వేడినీళ్లతో స్నానం చేస్తే చాలు. ఈ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే జీవితంలో ఇంకెప్పుడూ సొరియాసిస్ దరిదాపుల్లోకి కూడా రాదు.

ఆధారము : హెల్త్ కేర్ తెలుగు బ్లాగ్

2.97580645161
రాజు Apr 29, 2019 10:03 PM

ring worm ki శాశ్వత పరష్కారా నికి ట్రీట్మెంట్ చెప్పండి

సీద్దార్ధ May 13, 2018 09:01 PM

చాలా బాగుంది

భాష Apr 06, 2017 08:58 PM

హలో అండి నాకు శరీరం పై ఎర్రన్ని గుల్లలు వచ్చి నల్ల మచ్చలు

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు