పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

శరీర పోషకాలు

పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును.

 

శరీరం మరియు పోషకాహారం

పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును. అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

Body and Nutrients.jpgమన శరీరం ఒక యంత్రం లాంటిది. ఇంధనం లేకపోతే యంత్రం ఎలా పని చేయలేదో అలా మన శరీరం కూడ ఆహారం లేకపోతే పని చేయదు. మనం తీసుకొనే ఆహారం శరీరం సక్రమంగా పని చేయడానికి అవసరమైన శక్తిని అందిస్తూ ‘ఇంధనం’ లా పని చేస్తుంది.

ఆహారం మన శరీరానికి ఈ క్రింది మూడు విధాలుగా ఉపయోగపడుతుంది.

శరీర నిర్మాణానికి:

మనం తీసుకున్న ఆహారం శరీర నిర్మాణానికి దోహద పడుతుంది. 2.7 కిలోల నుంచి 3.2 కిలోల మధ్య బరువుండే కొత్తగా పుట్టిన పాపాయి పెరిగి పెద్దయే సరికి 55 నుంచి 70 కిలోల బరువుకు చేరుకుంటాడు. అంటే ఈ ఎదిగిన బరువంత కూడా అతనికి తను పుట్టిన దగ్గరి నుంచి నిత్యం తీసుకొంటున్న ఆహారం ద్వారానే లభించుతుంది. దీనిని బట్టి తేలేది ఏమిటంటే ఆహారం యొక్క అతి ముఖ్యమైన ఫంక్షన్‌ శరీర నిర్మాణానికి సహకరించటం! పుట్టిన దగ్గరనుంచి పెరిగి పెద్దయేదాకా -అంటే అడల్ట్‌హుడ్‌ దాకా మీరు ప్రతిరోజు ఆహారాన్ని సరెైన పరిమాణంలో తీసుకుంటే అది మీ శరీరంలో అరిగిపోయిన కణజాలం స్థానంలో కొత్త కణాల్ని నిర్మించుతూ, మీ శరీరం సక్రమమైన రీతిలో ఎదుగుతూ ఆరోగ్యంతో విలసిల్లుతూ పరిపూర్ణస్థాయికి చేరుకొనేటట్లు చేస్తుంది.

శక్తిని చేకూర్చటానికి:

ఆహారం మన శరీరానికి అందజేసే రెండవ ఉపకరణం ఏమిటంటే - మన శరీరం చేసే సంకల్పిత, అసంకల్పిత చర్యలకు అవసరమైన శక్తిని అందించటం. సంకల్పిత చర్యలు అంటే ఇంటిపని నుంచి ఆఫీసు పని దాకా నిత్య జీవితంలో మనం తెలిసి చేస్తుండే - ప్రయత్నపూర్వకంగా చేసే పనులు.
అసంకల్పిత చర్యలు: అంటే మన ప్రయత్నం మన ప్రమేయం లేకుండా మన శరీరంలో యాంత్రికంగా జరిగిపోయే చర్యలు! ఉదాహరణకు గుండె కొట్టుకో వడం, జీర్ణం కావడం, శరీరంలో టెంపరేచరు క్రమబద్దీకరించబడటం మొదలెైనవి.

శరీర కార్యక్రమాన్ని క్రమబద్దీకరించటం:

మన శరీరంలో యాంత్రికంగా జరిగిపోయే, జరగాల్సిన, కార్యక్రమాల క్రమబద్ధీకరణ ఈ కోవలోకి వచ్చే చర్యలు:

  • గుండె కొట్టుకోవటం
  • కండరాల సంకోచవ్యాకోచాలు
  • నీటి సమతుల్యాన్ని కాపాడటం
  • రక్తం గడ్డ కట్టటం
  • శరీరం నుంచి వ్యర్థపదార్థాల్ని తొలగించటం మొదలెైనవి.

శరీరం సక్రమంగా ఆరోగ్యంతో ఉండాలన్నా, శరీరానికి అవసరమైన శక్తి సరిప డా లభించాలన్నా మనం అన్ని పోషక విలువలు కలిగిన సమతుల్యాహారాన్ని రెగ్యులర్‌గా తీసుకొంటూ ఉండాలి.
మన మనుగడకు అవసరమైన ఆహారం ద్వారా మనకు లభించే పోషక విలువలు:

  • కార్బోహైడ్రేట్స్‌
  • మాంసకృత్తులు
  • కొవ్వు పదార్థాలు
  • విటమిన్‌లు
  • ఖనిజ లవణాలు
  • నీరు
  • పీచు పదార్థం
  • సమతులాహారం

మీరు నోట్లో ఆహారాన్ని పెట్టుకున్నప్పుడల్లా ‘మానవ శరీరం’ అనబడే అత్యంత తెలివెైన రసాయన యంత్రాంగానికి మీరు రీ-ఫ్యూయల్‌ చేస్తున్నారన్నమాట! మన శరీరం పని చేయటానికి ఆహారం, నీరు - ఈ రెండూ అతి ముఖ్యమైన పోషకావసరాలు.మన శరీరంలోకి ప్రవేశించే ప్రమాదకరమైన బాక్టీరియాలతో పోరాటం సల్పటానికి, శరీరానికి అవసరమైన నీటి సమతుల్యతను కాపాడటానికి, ఇతరత్రా మరెన్నో శరీర ధర్మ నిర్వహణల కోసం ఆహారం ద్వారా లభించే అనేక రసాయనాలు శరీరానికెంతగానో అవసరమవుతాయి.

కొన్ని ఆహార పదార్థాలలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. కొన్నింటిలో తక్కువ పోషక విలువలు ఉంటాయి. అలాగని ఏ ఆహారాన్ని తీసి పారేయటానికి వీలులేదు. మనం ఎంత తింటు న్నామన్నది మాత్రమే కాదు. ఏమి తింటున్నామన్నది కూడా ముఖ్యమైన అంశమే.కొన్ని కొన్ని ఆహార పదార్థాలు కొన్ని కొన్ని వ్యాధుల్ని నిరోధించగలవు. నియంత్రించగలవు. ఇందుకు
ఉదాహరణ: పండ్లు, కూరగాయలు క్యాన్సర్‌ వ్యాధిని నిరోధించగలవు. ఆహార పదార్థాలలోని పీచు (ఫెైబర్‌) కొలెస్టరాల్‌ నియంత్రణకు సాయపడుతుంది. వృద్ధాప్యంలో వచ్చే ‘అస్టియోపొరాసిస్‌’ వ్యాధిని నిరోధించటానికి కాల్షియం అధికంగా లభ్యమయ్యే పాలులాంటి వాటిని తీసుకోవాలి. ‘ఆస్టియోపొరా సిస్‌’ కారణంగా ఎముకలు బోలుబారి తేలికగా విరుగుతాయి.

ఈ రకంగా...
శరీరారోగ్యానికి అవసరమైన ఇలాంటి అంశాలన్నిటినీ పరిగణలోకి తీసుకుం టూ, ప్రాధాన్యతనిస్తూ, మనం సక్రమమైన ఆరోగ్యంలో ఉండటానికి ఏ ఏ ఆహార పదార్థాలను ఏఏ మేర తీసుకోవాలన్న విషయమై అమెరికా శాస్త్రజ్ఞులు ‘ఫుడ్‌ గెైడ్‌ పిరమిడ్‌’ అన్న పేరుతో ఆహార నియమావళిని రూపొందించారు.

‘ఫుడ్‌ గెైడ్‌ పిరమిడ్‌’
ప్రకారం మనం: అన్నం, రొట్టె, బ్రెడ్‌ వగెైరాలు: వీటిని ఎక్కువగా వాడుకోవాలి. ఈ ఆహార పదార్థాలలో ఫెైబర్‌, ‘బి’ విటమిన్‌లు, ఖనిజలవణాలు పుష్కలంగా ఉండటమే కాకుండా కాంప్లెక్స్‌ కార్బొహైడ్రేట్స్‌ కూడా లభిస్తాయి.

పళ్ళు: వీటిలో కొవ్వు, ఉప్పు తక్కువగా ఉంటాయి. విటమిన్‌లు ‘ఎ’,‘సి’ లాంటివి అధికంగా లభిస్తాయి. పొటాషియం, మరికొన్ని ఖనిజ లవణాలు కూడా లభించటమే కాక ఫెైబర్‌ అధికంగా లభిస్తుంది. వీలెైనప్పుడల్లా తాజా పళ్ళను తినటం మేలు.

కాయగూరలు: వీటిలో కూడా కొవ్వు తక్కువగానూ, ‘ఎ’, ‘సి’ విటమిన్‌లు ఎక్కువగానూ లభిస్తాయి. ఫెైబర్‌, ఖనిజ లవణాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. మాంసం, చేపలు, చికెన్‌, గుడ్లు, జీడిపప్పు, వగెైరాలు: వీటిలో సాధారణంగా ప్రొటీన్లు ఎక్కువ ఉంటాయి. ఐరన్‌, ‘బి’ విటమిన్‌, మరికొన్ని ఖనిజ లవణాలు కూడా బాగానే ఉంటాయి. కొవ్వు కూడా అధికంగానే ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి.

పాలు, పెరుగు, వెన్న: డెైరీ ఉత్పత్తులలో కాల్షియం, ప్రొటీన్‌లు, విటమిన్‌లు, కొన్ని ఖనిజ లవణాలు ఎక్కువగా లభిస్తాయి. కొవ్వు కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి తక్కువగా వాడటం మంచిది.

స్వీట్లు, నూనెలు: ఈ ఆహారపదార్థాలలో పోషకవిలువలు అంతగా ఉండవు కాని కేలరీలు (శక్తి) మాత్రం సమృద్ధిగా లభిస్తాయి. కేకులు, స్వీట్లులాంటి వాటిని ఎంత తక్కువగా తింటే అంత మంచిది.

ఆహారాన్ని అసలు తీసుకోకపోతే...కొందరు చానాళ్ళపాటు ఏ ఆహారం తీసుకోకుండా ఉండాల్సి వస్తుంది. నిరాహారదీక్ష వల్ల, అనోరెగ్జియా నెర్వోసా వల్ల, జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఏ భాగానన్నా తీవ్రమైన వ్యాధితో బాధ పడుతున్నప్పుడు, పక్షవాతం వల్ల, కోమాలోకి వెళ్ళిపోయినప్పుడు...

ఇలాంటి సందర్భాలలో మనుషూలు ఆహారాన్ని తీసుకోకుండా నిరాహారా నికి గురి కావల్సి వస్తుంది.

ఎన్నాళ్ళకూ ఆహారాన్ని తీసుకోని ఇలాంటి సందర్భాలలో శరీరం శక్తికోసం తనలోని కణజాలాన్నే కేలరీల కింద హరాయించుకోవటం మొదలెడు తుంది. ఫలితంగా శరీరంలో నిలవ ఉంచుకున్న కొవ్వు దాదాపు అదృశ్యమై పోతుంది. అంతర్గతావయవాలు, కండరాలు,క్రమేపీ డామేజ్‌ కావటం మొదలెడతాయి.నిరాహారానికి గురెైన సందర్భంలో పెద్దవాళ్ళు తమ శరీరానికి చెందిన బరువులో సగానికి పెైగా కోల్పోయే ప్రమాదం ఉంది. పిల్లలు ఇంకా ఎక్కువ బరువును కోల్పోతారు.

శరీరపు బరువును కోల్పోతున్న నిష్పత్తిలోనే లివరు, పేగులు అధికంగా కృశించుతాయి. కిడ్నీలు, గుండె కాస్త తక్కువ స్థాయిలో కృశించుతాయి.

ఇంకా జరిగే మార్పులు ఏమిటంటే:

  • కండరాలు కరిగిపోయే ఎముకలు పొడుచుకు వస్తాయి.
  • చర్మం పల్చగా అయి పొడిబారిపోతుంది. చర్మంలో సాగేగుణం తగ్గిపోతుం ది. తెల్లగా పాలిపోతుంది .చల్లగా అవుతుంది.
  • వెంట్రుకలు పొడిబారి చిట్లుతుంటాయి. తేలికగా రాలిపోతుంటాయి.
  • పూర్తిగా నిరాహారంగా ఉంటే ఆ మనిషి 8 నుంచి 12 వారాల లోపు చనిపోతాడు.

ట్రీట్‌మెంట్‌
ఎక్కువ రోజుల పాటు నిరాహారంగా ఉన్న మనిషిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావటానికి కొంత వ్యవధి పడుతుంది. ఎంతకాలం పడుతుందనేది అతను ఎన్నాళ్ళనుంచి నిరాహారంగా ఉన్నాడు, దాని ప్రభావం అతని శరీరం మీద ఎంతగా పడింది అన్న వాటిమీద ఆధారపడి ఉంటుంది.అధిక రోజులపాటు నిరాహారంగా ఉండటం వల్ల జీర్ణయంత్రాంగా ముడుచుకు పోతుంది. మామూలు సమయాలలో తీసుకునేంత ఆహారాన్ని అది ఇముడ్చుకోలేదు.

మనం తీసుకున్న ఆహారం శరీర నిర్మాణానికి దోహదపడుతుంది. 2.7 కిలోల నుంచి 3.2 కిలోల మధ్య బరువుండే కొత్తగా పుట్టిన పాపాయి పెరిగి పెద్దయే సరికి 55 నుంచి 70 కిలోల బరువుకు చేరుకుంటాడు. అంటే ఈ ఎదిగిన బరువంత కూడా అతనికి తను పుట్టిన దగ్గరి నుంచి నిత్యం తీసుకొంటున్న ఆహారం ద్వారానే లభించుతుంది.

అసంకల్పిత చర్యలు: అంటే మన ప్రయత్నం మన ప్రమేయం లేకుండా మన శరీరంలో యాంత్రికంగా జరిగిపోయే చర్యలు! ఉదాహరణకు గుండె కొట్టుకో వడం, జీర్ణం కావడం, శరీరంలో టెంపరేచరు క్రమబద్దీకరించబడటం మొదలెైనవి.

- డాక్టర్‌ సి.ఎల్‌. వెంకట్రావు, హైదరాబాద్‌

స్పిరులినా

పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును. అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

స్పిరులినా అంటే...........స్పిరులినా అనేది చారిత్రకంగా ఏనాటి నుంచో వాడుకలో ఉన్న ఆకుపచ్చటి ఆహారం. భూమిపై మొక్కల ఆవిర్భావానికి సంబంధించి వాటి తొలి రూపంగా దీన్ని భావిస్తారు. ఆదిమకాలంలో మనిషి ఆహారంలో ఇది భాగంగా ఉండింది. శతాబ్దాలు గా కూడా ఇది మనిషి ఆహార వనరుగా ఉపయోగపడుతూనే ఉంది. ఇప్పటికీ ఎన్నో దేశాల్లో దీన్ని ప్రజలు తమ ఆహారంలో భాగంగా చేసుకున్నారు. ఆఫ్రికాలో కరువు కాటకాలు నెలకొన్న సందర్భాల్లో కొన్ని దేశాల ప్రజలు తమకు అవసరమైన పోషకాల కోసం ప్రధానంగా స్పిరులినా పైనే ఆధారపడ్డారు.

స్పిరులినాకు ఎందుకింత ప్రత్యేకత

స్పిరులినా పోషకాల పుట్ట లాంటిది. మహిళకు ప్రతి దశలోనూ అవసరమైన సూక్ష్మపోషకాలను ఇది అందిస్తుంది. ప్రపంచం లోనే పోషకాలు సమృద్ధిగా గల ఆహారవనరుల్లో ఇది కూడా ఒకటిగా గుర్తింపు పొందింది.
ప్రొటీన్లలో సంపన్నం
ఐరన్‌కు చక్కటి వనరు
సూక్ష్మపోషకాలతో శక్తివంతం


స్పిరులినాలో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. ఐరన్‌ లోపంతో వచ్చే అనీమియా (రక్తహీనత)తో బాధపడేవారికి రోజుకు 1-2 గ్రాముల స్పిరులినా ఎంతగానో తోడ్పడుతుంది. శాకా హారులకు, ఆహారం నుంచి ఐరన్‌ పొందడం కష్టమవుతుంది. పాలకూర లాంటి వాటిల్లో ఐరన్‌ ఎక్కువగా ఉన్న ప్పటికీ, స్పిరులినా ద్వారానే దాని కంటే ఎక్కువగా ఐరన్‌ శరీరానికి అందుతుంది. ఇందుకు కారణం పాలకూరలో ఐరన్‌ శరీరానికి అందకుండా నిరోధించే ఆక్సలేట్‌ లాంటివి ఉంటాయి.

స్పిరులినాలో బెటా కరొటెన్‌ (ప్రో విటమిన్‌ ఎ) పుష్కలంగా ఉంటుంది. ఒక గ్రాము స్పిరులినా 2ఎంజీల బెటా కరొటెన్‌ను అందిస్తుంది. ఒక వ్యక్తి రోజువారీ అవసరాలకు సరిపడా బెటా కరొటెన్‌ను ఇది అందించ గలుగుతుంది. సాధారణవిధానాల్లో దీన్ని పొందడం కష్టమవుతుంది.

స్పిరులినాతో ఎన్నెన్నో ప్రయోజనాలు

స్పిరులినాతో పలు ప్రయోజనాలున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది.

  • రోగ నిరోధకత, హిమోగ్లోబిన్‌ స్థాయిలను పెంచుతుంది.
  • కెమోథెరపీ, రేడియేషన్‌ థెరపీ చేయిం చుకున్న వారిలో తెల్లరక్తకణాలపై గుణాత్మక ప్రభావాన్ని కనబరుస్తుంది.
  • కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో తోడ్పడుతుంది.
  • ఐరన్‌ లోపంతో ఏర్పడే రక్తహీనతను ఎదుర్కొంటుంది.
  • నరాల సంబంధిత నష్టాన్ని నివారిస్తుంది.
  • కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఆరోగ్యదాయక గర్భధారణకు అండగా...గర్భం దాల్చిన 7వ నెల నుంచి ప్రసవం అయ్యేదాకా స్పిరులినా తీసుకుంటే, విటమిన్‌ ఎ స్థాయి పెరగడంతో పాటు ఆరోగ్యదా యక శిశు జననానికి తోడ్ప డుతుంది. గర్భధారణ అనంతరం మూడో త్రైమాసికం నుంచి స్పిరులినా తీసుకుంటే తల్లిపాలు కూడా చక్కగా పడుతాయి.ప్రత్యేకించి గర్భధారణ కాలంలో బీఎంఐ ని మెరుగ్గా నిర్వహిం చుకునేందుకు తోడ్పడుతుంది. స్పిరులినా పోషకాలు, యాంటీఆక్సిడెంట్స్‌, ఫైటోపిగ్మెంట్స్‌ను సమృద్ధిగా కలిగి ఉన్నందున సౌందర్యసాధనాల రంగంలో కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. స్పిరులినాను ఫేస్‌ ప్యాక్‌గా లేదా హెయిర్‌ కండీషనర్‌గా ఉపయోగించి నప్పుడు చర్మానికి, వెంట్రుకలను పోషకాలను అందించి వాటిని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.స్పిరులినా సహజ అనుబంధ ఆహారం. ఔషధం కాదు. దీనికి అలవాటు పడడం అంటూ ఉండదు. దీన్ని రోజుకు సుమారు గా 2 గ్రాముల వరకు తీసుకోవచ్చు. స్పిరులినాతో గరిష్ఠస్థాయిలో ప్రయో జనాలు పొందేందుకు దీన్ని కనీసం 6 -8 వారా ల పాటు ఉపయోగించాల్సి ఉంటుంది. నిర్దిష్ట కాలం పాటు దీన్ని వాడాలనే పరిమితులంటూ ఏవీ లేవు. కోరుకున్నంత కాలం కూడా దీన్ని వాడవచ్చు. స్పిరులినా మార్కెట్లో కాప్సుల్‌ లేదా మాత్రల రూపంలో లభ్య మవుతుంది. నాణ్యమైన ఉత్పాదనను ఎంచుకోవడం ముఖ్యం. ప్యారీ స్పిరులినా లాంటి బ్రాండు అనేకం అందుబాటులో ఉన్నాయి.

స్పిరులినా మహిళల ఆరోగ్యానికి ఆవశ్యకమైన అనుబంధ ఆహారం-భారతీయ మహిళ ఆరోగ్యం, సంక్షేమం నేటికీ ఆందోళన కలిగించేవిగానే ఉన్నాయి. భారతీయ మహిళల్లో 36 % మంది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. మరో 55% మంది రక్తహీనతతో బాధ పడుతున్నారు. ప్రస్తుత, భవిష్యత్తు తరాలకు మధ్య వారధిగా ఉంటున్న నేపథ్యంలో మహిళ పోష కాహారం ఎంతో కీలక ప్రాధాన్యం సంతరిం చుకుంది. ఆమె పోష కాహార స్థాయిలో ఏ చిన్నపాటి లోపం ఉన్నా కూడా అది తీవ్ర పరిణా మాలకు దారి తీస్తుంది.

-పోషకాహార లోపంతో బాధపడే బాలికలు పోషకాహార లోపం ఉన్న తల్లులుగా మారి పోషకాహార లోపంతో ఉండే పిల్లలకు జన్మనిస్తారు. చివరకు ఇదొక విషవల యంగా మారుతుంది. తగినంత పోషకాహారం లభించకపోతే అది ఆ రోజుకు వారికి కావాల్సిన శక్తిని వారు పొందలేకపోతారు. అంతేగాకుండా రక్తహీనత (ఎనీమియా), రోగనిరోధకత తక్కువ గా ఉండడం, ఎముకల్లో ఖనిజ లోపాలకు, చిన్న వయస్సు లోనే వయస్సు పైబడినట్లుగా మారి పోవడం లాంటివాటికి గురి అవుతారు. ఎంతో మంది మహిళలు తమ ఆహారాన్ని పిండిపదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు వంటి స్థూల పోషకాల తోనే సరిపుచ్చుకుంటారు. సూక్ష్మ పోషకాల అవసరాన్ని వారు గుర్తించరు. వాటిపై అవగాహన ఉండదు. నిజానికి ఆరోగ్యానికి కీలకమైన వాటిలో సూక్ష్మ పోషకాలు కూడా ఎంతో ముఖ్యం.

శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు అవసరమైన విటమిన్లు, మినరల్స్‌, పలు యాంటీఆక్సిడెంట్స్‌ ఈ సూక్ష్మపోషకాల కిందకు వస్తాయి. సూక్ష్మపోషకాల లోపం మహిళల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం కనబరుస్తుంది. ఈ సమస్యను గనుక పట్టించుకోకుంటే, అది జాతి సామాజిక ఆర్థికాభి వృద్ధిపై ఎంతో ప్రభావం కనబరుస్తుంది. ఇవే గాకుండా, విటమిన్‌ ఎ, ఐర న్‌, అయోడిన్‌, ఫోలేట్‌ లాంటివి చిన్నారుల జీవన అవకాశాల ను, మహిళల ఆరోగ్యాన్ని, విద్యా పరమైన విజయాలను, సంతాన సామర్థ్యాన్ని, రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తాయి.

అందుకు మహిళ జీవితంలో ప్రతి దశలోనూ పోషకా లపై తగు శ్రద్ధ వహించడం ఎంతో ముఖ్యం. యుక్త వయస్సుకు రావడం అనేది ఆమెలో ఐరన్‌ లోపాన్ని పెంచుతుంది. గర్భం, పాలు ఇవ్వాల్సి రావడం ఆమెకు కావాల్సిన కాల్షియం, ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ అవసరాలను మరింత పెంచుతాయి. అవి తీరాలంటే సంపూర్ణ సమతుల్యాహారం తీసుకోవాల్సి ఉంటుంది. స్పిరులినా అనేది పోషకాహార సప్లిమెంట్‌కు అత్యుత్తమ ఎంపిక మాత్రమే గాకుండా మహిళల పోషకాల అవసరాలను అత్యుత్తమంగా తీర్చే మార్గం.

డాక్టర్‌ ఆర్‌.ఎజ్‌హిల్‌ అరాసన్‌

ఆకాకర కాయలు

 

పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును. అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

ఆకాకర కాయలు

కాకరకాయ జాతికి చెందినదే ఆకాకరకాయ. ఈ కాలంలో విరివిగా దొరుకుతాయి. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలెన్నో..!

జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేసేందుకు ఇవి ఎంతగానో తోడ్పడతాయి. వంద గ్రాముల ఆకాకరకాయ ముక్కల్లో చాలా తక్కువ సంఖ్యలో కెలొరీలుంటాయి. పీచూ, విటమిన్లూ, యాంటీ ఆక్సిడెంట్లూ అధికంగా లభిస్తాయి. గర్భిణులకు ఈ కాకరకాయ చాలా మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఫొలేట్‌లు శరీరంలో కొత్త కణాల వృద్ధికీ, గర్భస్థ శిశువు ఎదుగుదలకూ తోడ్పడుతుంది. గర్భిణులు రెండు పూటలా భోజనంలో ఈ కూరను తీసుకోవడం వల్ల దాదాపు వందగ్రాముల ఫొలేట్‌ అందుతుంది. మధుమేహంతోబాధపడే వారికి ఆ కాకరకాయ మేలు చేస్తుంది. రక్తంలో ఇన్సులిన్‌ స్థాయుల్ని పెంచుతుంది. చక్కెర శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది. దీనిలో ఉండే ఫైటో న్యూట్రియంట్లు కాలేయం, కండరాల కణజాలానికి బలాన్ని చేకూరుస్తాయి.

తరచూ తీసుకోవడం వల్ల దీనిలోని పోషకాలు శరీరంలో ఏర్పడే కాన్సర్‌ కారకాలను నాశనం చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. ఆకాకరకాయలోని విటమిన్‌ 'సి' శరీరంలోని ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది. దీనిలో ఫ్లవనాయిడ్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి యాంటీ ఏజింగ్‌ కారకాలుగా పనిచేస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనిలో లభించే విటమిన్‌ 'ఎ' కంటి చూపునకు మేలు చేస్తుంది. మూత్రపిండాల సమస్యలున్న వారు ఈ కూరకు ఎంత ప్రాధాన్యమిస్తే అంత మంచిది.

రోగనిరోధకాలుగా ఆహారపదార్ధాలు

 

పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును. అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

రోగనిరోధకాలు గా ఆహారపదార్ధాలు

శరీరంలో రోగ నిరోధక శక్తి ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. వానాకాలం వచ్చే వర్షాలు, కలుషిత నీటివల్ల తరచుగా జలుబు, జ్వరం, అలసట, ఎలర్జీల బారిన పడే అవకాశం ఉంది. వీటన్నింటి నుండి తప్పించు కోవాలంటే రోజూ తినే ఆహార పదార్థాల ద్వారానే రోగనిరోధక శక్తిని పెంచు కోవాలి.

సరైన ఆహాహాన్ని తీసుకుంటే ఈ సమస్యను తేలికగా అధిగమించ వచ్చంటున్నారు పోషకాహార నిపుణులు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా సరైన పోషకాహారాన్ని తీసుకోవాలి. విటమిన్లు, మినరల్‌‌స, పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

విటమిన్లు:

విటమిన్‌ సి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల వైరస్‌పై పోరాడి ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. టమాట, బంగాళదుంప వంటి కూరగాయల్లో, నారింజ, నిమ్మ, కమలా, కివి పండ్లలో విటమిన్‌ సి ఉంటుంది.

జింక్‌:

శరీరం కోల్పోయిన యాంటీ బాడీ కణాలు తిరిగి పున…ఃనిర్మితం కావడంలో తోడ్పడుతుంది. గుడ్లు, మాసం, పెరుగు, పాలు, బీన్‌‌స, సీఫుడ్‌లలో జింక్‌ లభిస్తుంది.

పెరుగు:

ప్రతిరోజూ ఒక కప్పు తాజా పెరుగును తీసుకోవాలి. ఇది జీర్ణాశయంలో ఉండే బాక్టీరియాను నిర్మూలిస్తుంది.

కెరోటిన్‌‌‌:

ప్రతిరోజు అరకప్పు తాజా క్యారెట్‌ను తినాలి. దీనిలో ఉండే బీటా కెరోటిన్‌, విటమిన్‌ బి6లు యాంటీ బాడీ కణాలు ఉత్పత్తిని ఉత్తేజపరుస్తాయి.

వెల్లుల్లి:

దీనిలో ఉండే మినరల్‌‌స బాక్టీరియా, ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌లపై పోరాడేలా చేస్తాయి. ప్రతిరోజూ ఆహారంలో ఒక స్పూన్‌ వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.

ఐరన్‌:

రోజూ నాలుగు లేదా ఐదు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల శరీరంలో సరిపడా ఐరన్‌ పెరుగుతుంది.

పొటాషియం:

దీనిలో విటమిన్‌ సి, పొటాషియం అధిక మోతాదులో ఉంటాయి. దీని వల్ల అధిక రక్తపోటుని తగ్గించి శక్తిని పెంచుతుంది.

చర్మ సౌందర్యానికి ఆహారము

 

యగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును. అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

చర్మ సౌందర్యానికి ఆహారము

కొన్ని ఆహారపదార్థాలు వయసు కనిపించనీయకుండా చర్మం మెరిసేలా చేస్తాయి. సాధారణంగా మనం తీసుకునే ఆహారమే మన అందాన్ని, ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. మన శరీరానికి రక్షణ కవచమైన చర్మం మన ఆరోగ్య స్థితిని చెప్పకనే చెబుతుంది. పుట్టిన నాటి నుంచి మన శరీరంతో పాటు చర్మంలో కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. చిన్నపిల్లలప్పుడు లేత చర్మం పెద్దవాళ్లయ్యేప్పటికి పూర్తిగా మారిపోతుంది. ఇది ప్రకృతి సహజంగా జరిగే మార్పే అయినా సరైన ఆహారం, చక్కటి జీవనశైలి ద్వారా వృద్ధాప్యపు జాడలని మన దరికి చేరనీయకుండా చర్మాన్ని కాపాడుకోవచ్చు.

ముట్టుకుంటే గరుగ్గా... చూడటానికి కాంతిహీనంగా కనిపించే చర్మం సరైన పోషణ, సంరక్షణ లోపాన్ని ఎత్తి చూపుతుంది. అయితే అందంగా, ఆరోగ్యమైన చర్మం కోసం ఖరీదైన క్రీములు, ట్రీట్ మెంట్లు అవసరం అనుకుంటే మీరు పొరబడుతున్నట్టే! చర్మం, దాని పని తీరు వంటి అంశాలపై అవగాహనతో పాటు దానిని సంరక్షించుకోవటంలోని మెళకువలు తెలుసుకుంటే నిగనిగలాడే చర్మం ప్రతి ఒక్కరి సొంతం అవుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు.మృతకణాల పొరలు : మన శరీరంలో అతి పెద్ద అవయవం ‘చర్మం'. లోపలి భాగాలను కప్పిఉంచటమే కాదు, ఒక కవచంలా మనల్ని అంటి పెట్టుకుని ఉంటుంది. పైకి కనిపించే చర్మం పూర్తిగా 25- 30 అతిసన్నటి పొరల మృతకణాలతో తయారై ఉంటుంది . ప్రతీ 28-30 రోజులకోసారి కొత్త కణాలను తయారుచేసుకుంటుంది మన శరీరం. వాతావరణ కాలుష్యం, దుమ్మ ధూలితో చర్మం మలినమైనప్పుడు మృతకణాలు పూర్తిగా తొలగించుకునే శక్తి చర్మానికి లేదు. ఈ పరిస్థితిలో మృతకణాలు గనక పేరుకుపోతే చర్మం గరుగ్గా మారుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా సున్నిపిండి లాంటి పదార్థాలతో స్క్రబ్బింగ్ చేసుకొని మృతకణాలను తొలగించేందుకు మనవంతు సహాయం చేయాలి.

మెలనిన్ ‌: శరీర ఛాయను నిర్దేశించేది చర్మంలో ఉన్న మెలనిన్ శాతం. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత నల్లగా ఉంటుంది శరీర ఛాయ. ఎండలో తిరిగినప్పుడు సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల నుండి చర్మాన్ని కాపాడటం కోసం శరీరం మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. అందుకే ఎండలో తిరిగినప్పుడు సన్‌టాన్ (చర్మం నల్లబడటం) అవుతుంది. అయితే మెలనిన్ ఎంత శక్తివంతమైనా సూర్యుడి ప్రతాపం నుంచి పూర్తిసంరక్షణ మాత్రం మనకందించలేదు. అందుకే ఎండలో తిరిగినప్పుడు తప్పనిసరిగా సన్‌టాన్ లోషన్‌ని వాడటం అలాగే సరైన దుస్తులతో సంరక్షించుకోవటం చేయాలి.

మృతకణాలు : చర్మం లోపలిపొర కింద ఉండే పొరని డెర్మిస్ అంటారు. ఇది మన చర్మానికి జీవాన్నిస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ ఉండే నరాల చివర్లు, రక్తనాళాలు, నూనె, శ్వేత గ్రంధులు స్పర్శని కల్పించటంతోపాటు చర్మం ఊపిరి పీల్చుకోవటానికి సహాయపడతాయి. అయితే వీటితోపాటు కొలాజెన్, ఎలాస్టిన్, కెరటిన్ అనే అతి ముఖ్యమైనవి కూడా డెర్మిస్ పొరలో ఉంటాయి. పీచులాగా సాగే గుణం ఉన్న మాంసకృత్తులు ఇవి. మన శరీర పటుత్వం, ఆరోగ్యం, వంచ గలిగే శక్తిని ఎలాస్టిన్ నిర్దేశిస్తే, కొలాజన్ వృద్ధాప్యపు జాడలతో పోరాటం చేస్తుంది. కెరటిన్ శరీర దారుఢ్యాన్ని పెంచి హుషారుగా ఉంచుతుంది .

కొలాజెన్ : కొలాజెన్ మన చర్మాన్ని శరీరంతో పాటే పట్టివుంచేలా దోహదపడుతుంది. కెరటిన్‌ తో కలిసి ఇది మన శరీరానికి ఎంతోమేలు చేస్తుంది. శరీరంలో, చర్మంలో జరిగే మార్పులకి కొలాజెన్ ప్రమేయం ఉంది. కనుక దీన్ని తయారు చేసుకోగలిగే శక్తి శరీరానికి ఉంటే అమృతం తాగిన దేవతల్లా నిత్యయవ్వనంతో ఉండిపోవచ్చు. వృద్ధాప్యపు ఛాయ కూడా దరిచేరకుండా చేస్తుంది. అయితే దురదృష్టవశాత్తు వయసు పైబడే కొద్దీ కొలాజెన్ తగ్గిపోవటం వలన చర్మం పలచగా తయారవ్వటమే కాదు పటుత్వం కోల్పోయి ముడతలు పడుతుంది. ఇలా జరగకుండా మనం తినే ఆహారం ద్వారా మన శరీరానికి అవసరమైనంత కొలాజెన్‌ను అందించవచ్చు. కొన్ని రకాల విటమిన్లు, యాంటిఆక్సిడెంట్స్, అమినో యాసిడ్స్...అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవటం ద్వారా దీన్ని సాధించవచ్చు.

కొన్ని ఆహారపదార్థాలు వయసు కనిపించనీయకుండా చర్మం మెరిసేలా చేస్తాయి. అవి నిత్యయవ్వనంగా మార్చే కొలాజెన్ ఆహారాలు.

పాలకూర:

విటమిన్‌ ఎ, బీటా కెరాటిన్‌లు వయసు ఛాయలు రాకుండా చర్మాన్ని కాపాడతాయి. ఇవి పాలకూరలో పుష్కలంగా ఉంటాయి. దీనిని రోజూ ఆహారంలో తీసుకుంటే నలభైలలో కూడా చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.

 

సబ్జా గింజలు:

చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో సబ్జాగింజలు ముందుంటాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. రోజూ ఒక స్పూను సబ్జాగింజల్ని తింటే చర్మం యౌవనంగా ఉంటుంది.

 

 

టొమాటోలు:

ఇందులో లైకోపీన్‌ చర్మానికి మంచి మెరుపుని అందిస్తుంది. ఇందులో యాంటీ ఏజింగ్‌ లక్షణాలు చాలా ఎక్కువ. కాలుష్యం నుంచి, హానికారక సూర్యకిరణాల నుంచి లైకోపీన్‌ కాపాడుతుంది.

 

బాదం:

చర్మ సౌందర్యానికి ఎంతో అవసరమయ్యే విటమిన్‌ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు బాదం పలుకుల్లో పుష్కలంగా ఉంటాయి. రోజూ నాలుగు బాదం పలుకుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన తింటే మంచిది.

 

 

బ్లూ బెర్రీస్:

ఇందులో ఉండే యాంటిఆక్సిడెంట్స్... కణాలు ఆక్సిజన్‌ను ఉపయోగించుకున్న తరవాత విసర్జించిన ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే హానిని రిపెయిర్ చేయటానికి ఉపయోగపడతాయి. ఇవి సమృద్దిగా ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల కొలాజెన్ ఉతపత్తి పెంచవచ్చు. కిస్‌మిస్, టమాటా, వెల్లుల్లి, ద్రాక్షా, పప్పుదినుసులు, సోయా, గ్రీన్ టీ, పాలకూర...

 

సాల్మన్ ఫిష్:

సాల్మన్ ఫిల్ లో ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటాయి. ఈ ఒమేగా యాసిడ్స్ మన శరీరానికి ఎంతో ఉపయోగపడి, కొలాజెన్ ఉత్పత్తి పెరగటానికి తోడ్పడే వీటిని మన శరీరం తయారుచేసుకోలేదు. మనం తినే ఆహారం ద్వారానే వీటిని సమకూర్చాలి. చేపలు (ముఖ్యంగా సాల్మన్, ట్యునా వెరైటీ), జీడిపప్పు, బాదాం పప్పు. ఇది కొలాజెన్ ఉత్పత్తికి ఎంతో కీలకమైనది.

సోయా ప్రొడక్ట్స్:

సోయా ప్రొడక్ట్ లో కూడా విటమిన్ సి తో పాటు జింక్ కూడా అధికంగా ఉంటుంది. సోయా మిక్క్ మొటిమలు, మచ్చలు పోగొట్టి, చర్మసమస్యలను దూరం చేస్తుంది. నిర్జీవమైన చర్మాన్ని తాజాగా చేసి ఫ్రెష్ గా మార్చుతుంది. కాబట్టి సేయాబేస్డ్ ప్రొడక్ట్, సోయా పాలు తాగడం మంచిది.

 

క్యారెట్స్:

క్యారెట్స్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇంకా ఇందులో ఉండే బీటా కెరోటీ అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు ఇవ్వటంతో పాటు చర్మానికి, కురులకు మంచి ప్రయోజనాలను చేకూర్చుతాయి. కాబట్టి మెరిసేటటువంటి చర్మ సౌందర్యం పొందాలనుకుంటే ప్రతి రోజూ క్యారెట్ తినడం కానీ, లేదా క్యారెట్ జ్యూస్ తాగడం కానీ చేయాలి.

 

కీర దోస:

దోసకాయను తొక్కుతో తినడం మంచిది. తొక్కులో విటమిన్‌ 'కె' సమృద్ధిగా ఉంటుంది. చర్మానికి మేలు చేసే గుణం దోస తొక్కులో వుంది. దోసకాయ మంచిది కదా అని ఊరగాయల రూపంలో తినకూడదు. కీరదోసకాయ రసాన్ని ముఖానికి పట్టిస్తే నల్లటి మచ్చలు పోతాయి.

అరటి:

ముఖానికి రిఫ్రెషనస్ బనానా అరటిపండును చర్మ సంరక్షణ గ్రేట్ మాయిశ్చరైజర్ అని చెప్పవచ్చు. బనానా మాయిశ్చరైజర్ తో ముఖానికి రిఫ్రెషనస్ వస్తుంది.

 

ఆరెంజ్:

వృద్ధాప్య ప్రక్రియలో ఆరెంజ్ ఆరెంజ్ లో సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని బాగా ఉపయోగపడుతుంది. సి విటమిన్ చర్మానికి మంచి మెరుగును అందిస్తుంది. విటమిన్ ఇ, ఎ, సి . కొలాజెన్ ఉత్పత్తికి,మెయింటెన్ చేయటానికి సహాయపడే వీటిని తినే ఆహారం ద్వారా సులువుగా శరీరానికి అందించవచ్చు.

 

బొప్పాయి:

బొప్పాయి బొప్పాయిన మన పూర్వీకుల నుండి ఉపయోగిస్తున్నారు. పాపాయలో ఎక్కువగా యాంటీఆక్సిడెంట్స్ మరియు ఎంజైములను ఫుష్కలంగా...

 

 

ఆపిల్స్:

యాపిల్ ను ఆహరంలో ఓ భాగంగా చేసుకోవాలి. ఈ పాండులో లబించే పోtaశియం, ఫాస్ఫరస్ చాల మేలు చేస్తుంది.

 

వేరు శనగ:

వేరు శనగల్లో అధిక మోతాదులో ఉండే విటమిన్ ఇ, సిలీనియం, జింక్ శరీర సౌందర్యానికి కావలసిన హార్మోన్ ల ఉత్పత్తిలో సహకరిస్తాయి. రక్తప్రసరణ మెరుగుపరచి మంచి ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యానికి ఉపకరిస్తాయి.

 

బీట్ రూట్:

రూట్ దుంపల్లో అధిక శాతంలో ఐరన్ మరియు విటమిన్స్ ఉండి, చర్మగ్రంధులను శుభ్రం చేయడానికి, రక్త ప్రసరణ జరగడానికి, ముఖంలో పింక్ గ్లో తేవడానికి సహాయపడుతాయి. కాబట్టి ప్రతి రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగాలి. అలాగే దీన్ని ఫేస్ ఫ్యాక్ గా కూడా వేసుకోవచ్చు. జింక్, సల్ఫర్ పళ్లు,కాయగూరల్లో లభ్యమయ్యే ఈ ఖనిజాలు కొలాజెన్ ఉత్పత్తిని పెంచి సంరక్షిస్తాయి.

కివి:

కివి ఇది ఒక సిట్రస్ ఫ్రూట్. ఇందులో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది సహజంగా చర్మ ఛాయను మార్చడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ కివి పండును తాజాగా తినవచ్చు. మరియు ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు, ముఖంలో రంద్రాలు తొలగిపోయి, ముఖ్యం బ్యూటిఫుల్ గా కనబడుతుంది.

నీరు:

వయస్సును తగ్గించడంలో ప్రతి రోజూ మనం తీసుకొనే డైయట్ లో నీరు కూడా ఒక భాగమే. నీరు ఇంటర్నల్ గాను, ఎక్సటర్నల్ గాను మంచి ప్రయోజనకారి. ప్రతి రోజూ ఎనిమిది నుండి పది గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరానకి కావల్సిన తేమ అంది ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజు క నీసం 6-8 గ్లాసుల నీళ్లు తాగటం అన్నది స్వేదగ్రంథుల నుంచి విషపదార్థాలను బయటికి విసర్జించటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

గ్రీన్ ఆపిల్

 

పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును. అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

గ్రీన్ ఆపిల్:

రోజుకు ఒక ఆపిల్ తింటే వైద్యుడి అవసరం ఉండదు" అని ఒక సామెత ఉన్నది. అయితే ఖచ్చితంగా ఆకుపచ్చ ఆపిల్ లో ఈ వాస్తవం కలిగి ఉంది. ఆపిల్ అనేది మనకు ప్రకృతి ప్రసాదించిన వరం. అత్యంత అసాధారణ మరియు అద్భుతమైన పండ్లలో ఒకటిగా ఉన్నది. ప్రతి వ్యక్తి తమ రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. దీనిలో అవసరమైన పోషకాలు మరియు చాలా విటమిన్లు ఉంటాయి. ఆపిల్స్ లో చాల రకాలు ఉన్నాయి. సాదారణంగా ఎరుపు మరియు ఆకుపచ్చ ఆపిల్స్ పుల్లని మరియు తియ్యటి రుచిని కలిగి ఉంటాయి. గ్రీన్ యాపిల్ దీర్ఘ కాల ఆరోగ్యవంతమైన పండ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది అంతర్లీన ప్రోటీన్లు, విటమిన్లు,ఖనిజాలు మరియు ఫైబర్ వంటి అవసరమైన పోషకాలను కలిగి ఉంటుంది. జీర్ణవ్యవస్థ లోపాలు నుండి ఉపశమనం మరియు రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించటం,BP తగ్గించడం,రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడం & ఆకలి మెరుగుపరచడం వంటి వాటికీ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.

సూపర్ మర్కెట్ లో నేడు ప్రత్యేకం గా కనిపిస్తున్న పండ్లలో ఒకటి" గ్రీన్‌ యాపిల్" సాధారణ యాపిల్ పండు రంగుకు భిన్నం గా కనిపించే ఈ యాపిల్ పండును చూసిన చాలా మంది అది పచ్చి యాపిల్ గా భావించే అవకాశముంది. అయితే ఈ పచ్చ యాపిల్ పండుకు మన దేశములో లభించే యాపిల్ పండుకు సంబంధములేదు. లేత ఆకుపచ్చ రంగులో నిగనిగ లాడుతూ కనిపించే ఈ గ్రీన్‌ యాపిల్ ఆస్ట్రేలియా కు చెందిన యాపిల్. పండ్ల అన్నింటా అత్యంత అధిక ఆరోగ్యాన్ని అందించే పండు గా దీనిని పేర్కొంటారు. ఇతర యాపిల్ పండుకు దీనికి జన్యుపరంగా అంతగా తేడాలు లేకపోయినా రుచి విషయము లో స్పస్టమైన తేడా ఉంది. సిమ్లా యాపిల్ పండులా గ్రీన్‌ యాపిల్ లో తియ్యదనము ఉండదు. కొంత వగరు రుచి కలిగి ఉంటుంది. ఈ రుచి వల్లనే దానికి ప్రత్యేకత సంతరించుకుందంటారు. . . వ్యాపారులు. సిమ్లా యాపిల్ కు గ్రీన్‌యాపిల్ కు ముఖ్యమైన తేడా దాని రంగు. యాపిల్స్ లో ఎరుపు, గ్రీన్‌ తరహావే కాక పసుపు రంగు యాపిల్స్ కూడా ఉంటాయి. వీటిలో దేని రుచి దానిదే.

గ్రీన్ ఆపిల్: ఆరోగ్య ప్రయోజనాలు
ఎక్కువ ఫైబర్ కంటెంట్:

దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండుట వల్ల జీర్ణవ్యవస్థను శుభ్రపర్చడానికి సహాయపడి తద్వారా జీవక్రియను పెంచుతుంది. అందువలన ఇది స్వేచ్ఛా ప్రేగు కదలికలో సహాయపడుతుంది. ఆపిల్ ను దాని చర్మంతో సహా తినటం ఎల్లప్పుడూ మంచిది. మీ ప్రేగు మరియు వ్యవస్థలను శుభ్రపర్చి మీరు సంతోషముగా మరియు ఆరోగ్యవంతులుగా ఉండటానికి సహయ పడుతుంది.

ఖనిజాల కంటెంట్:

ఇనుము,జింక్,రాగి,మాంగనీస్,పొటాషియం మొదలైన ఖనిజాలను కలిగి ఉంటుంది. మానవ ఆరోగ్యం మరియు శ్రేయస్సు ఖనిజాల మీద ఆదారపడి ఉంటుంది. ఆపిల్ లో ఉన్న ఇనుము రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాక జీవక్రియ రేటు పెంచటానికి సహాయపడుతుంది.

తక్కువ కొవ్వు కంటెంట్:

బరువు తగ్గాలని అనుకొనే వారికీ గొప్ప ఆహారం అని చెప్పవచ్చు. ప్రతి వ్యక్తీ తమ రోజు వారి ఆహారంలో తప్పనిసరిగా ఆపిల్ ఉండేలా చూసుకోవాలి. ఇది రక్తనాళాలలో కొవ్వును సేకరిస్తుంది. అంతేకాక స్ట్రోక్స్ అవకాశాలు నివారించడం,గుండెకు సరైన రక్త ప్రవాహం నిర్వహణలో సహాయపడుతుంది.

చర్మ క్యాన్సర్ నిరోధిస్తుంది:

దీనిలో విటమిన్ C ఉండుటవల్ల ఫ్రీ రాడికల్స్ ద్వారా చర్మ కణాలకు వచ్చే నష్టాన్నినిరోధించడంలో సహాయపడుతుంది. అందువలన చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

సమృద్ధిగా యాంటీ ఆక్సిడంట్:

యాంటీ ఆక్సిడంట్ లు కణాల పునర్నిర్మాణం మరియు కణాల పునరుత్తేజం నకు సహాయం చేస్తాయి. ఆరోగ్యకరమైన మరియు ప్రకాశించే చర్మ నిర్వహణలో కూడా సహాయపడతాయి. యాంటీ ఆక్సిడంట్ మీ కాలేయం రక్షించడానికి మరియు దాని యొక్క సరైన కార్యాచరణ నిర్ధారించడానికి సహయపడతాయి.

ఆరోగ్యకరమైన,బలమైన ఎముకలు:

ఇది థైరాయిడ్ గ్రంథి సరైన కార్యాచరణకు సహాయం చేయడం ద్వారా కీళ్లవ్యాధులను నిరోధిస్తుంది.

అల్జీమర్ నిరోధిస్తుంది:

ప్రతి రోజు ఒక ఆపిల్ తింటే అల్జీమర్ వంటి వృద్ధాప్య నరాల సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాన్ని అడ్డుకుంటుంది.

ఆస్త్మా నిరోధిస్తుంది:

క్రమం తప్పకుండా ఆపిల్ రసం తీసుకుంటే తీవ్ర సున్నితత్వం కలిగిన అలెర్జీ రుగ్మత అయిన ఆస్త్మాని నిరోధించటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

డయాబెటిస్ నిరోధిస్తుంది:

యాపిల్స్ మధుమేహంను నిరోధిస్తుంది. ఇది మధుమేహం కోసం తప్పక కలిగి ఉండాలి.సమృద్ధిగా విటమిన్ A,B మరియు C ఫ్రీ రాడికల్స్ హానికరమైన ప్రభావాల నుండి చర్మంను రక్షించటానికి గ్రీన్ ఆపిల్ లో విటమిన్లు A,B మరియు C సమృద్ధిగా ఉంటాయి. అంతేకాక ప్రకాశించే చర్మం నిర్వహించడం కొరకు సహాయపడుతుంది.

మైగ్రేన్‌ తలనొప్పికి విరుగుడు:

మహిళల్లో ఒత్తిడి శాతం పెరిగిపోయి అది క్రమంగా మైగ్రేన్‌ తలనొప్పిగా తయారయ్యే ప్రమాదం లేకపోలేదని వెైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు అటువంటి మైగ్రేన్‌ తలనొప్పికి విరుగుడుగా ఆకుప చ్చని యాపిల్స్‌ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటిని తింటే మైగ్రేన్‌ తలనొప్పిని దూరం చేయవచ్చని వెైద్యు లు చెబుతున్నారు.

గ్రీన్ ఆపిల్: స్కిన్ ప్రయోజనాలు:

గ్రీన్ ఆపిల్ ఒక అద్భుతమైన సౌందర్యాన్ని పెంచుతుంది. చర్మ సంరక్షణ మరియు జుట్టు సంరక్షణ ప్రయోజనాలు గ్రీన్ ఆపిల్ తో చాలా సంబంధం కలిగి ఉంటాయి.

చర్మ ఛాయను పెంపొందిస్తుంది గ్రీన్ ఆపిల్ లో విటమిన్ కంటెంట్ ఎక్కువగా ఉండుట వల్ల మీ చర్మం నిర్వహణలో సహాయపడుతుంది. మీ ఛాయతో మంచి తెల్లబడటం మరియు పెంచే ప్రభావాలను కలిగి ఉంటుంది. ముఖ్యమైన విటమిన్లు వలన వివిధ రకాల చర్మవ్యాధులను నిరోధించడంలో సహాయపడుతుంది.

మొటిమలను నివారిస్తుంది గ్రీన్ ఆపిల్ అత్యంత ప్రభావవంతమైన యాంటీ మోటిమలు చికిత్సకు సహయ పడుతుంది. గ్రీన్ ఆపిల్ యొక్క సాధారణ వినియోగం వలన మొటిమలను నిరోధిస్తుంది.

కళ్ళ ఆరోగ్యానికి-నల్లటి వలయాలను తగ్గిస్తుంది అదనంగా మీ కళ్ళు రిఫ్రెష్ మరియు డార్క్ వలయాలు తొలగింపునకు సులభతరం చేస్తుంది.

చుండ్రును నివారిస్తుంది: గ్రీన్ ఆపిల్ చర్మం కొరకు మాత్రమే కాకుండా జుట్టు కొరకు కూడా చాలా మంచి ప్రయోజనాలను కలిగి ఉంది.. గ్రీన్ ఆపిల్ ఆకులు మరియు దాని తొక్కతో కలిపి చేసిన పేస్ట్ చుండ్రును పరిష్కరించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఈ పేస్ట్ ను ఒక షాంపూ లాగ వాడాలి. గ్రీన్ ఆపిల్ రసంను కూడా జుట్టు లోకి క్రమం తప్పకుండా మసాజ్ చేస్తే చుండ్రు తగ్గటానికి బాగా ఉపయోగపడుతుంది.
జుట్టు రాలడాన్ని అరకడుతుంది: పటిష్టమైన జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తూ జుట్టు నష్టం నిరోధించడానికి గుర్తించబడిన గొప్ప పరిష్కారం.

గ్రీన్ ఆపిల్ ఒక గొప్ప యాంటీ వృద్ధాప్య పదార్ధం. గ్రీన్ ఆపిల్ లో ఉండే యాంటీ ఆక్సిడంట్ మరియు ఫైబర్స్ దీర్ఘకాలం పాటు మీ చర్మంను స్థితిస్థాపక మరియు యవ్వనంగా ఉంచేందుకు సహయ పడతాయి. గ్రీన్ ఆపిల్ ఉపయోగించి మీ ముఖంనకు మాస్క్ వేసుకొంటే మీ చర్మానికి తేమ,మీ చర్మం యొక్క మొత్తం ఆకృతి అభివృద్ధి మరియు ముడుతలు తగ్గటానికి సహాయపడుతుంది.

ఆపిల్‌... ఔషధఫలం

ఆపిల్‌ పోషకాల గురించి మనకు తెలిసిందే. అయితే అందులోని ఔషధగుణాలవల్ల చాలా రకాల వ్యాధుల్ని నివారించవచ్చంటున్నాయి ఈ సరికొత్త పరిశోధనలు...
* రోజూ కనీసం ఓ ఆపిల్‌ తినేవాళ్లలో (తినని వాళ్లతో పోలిస్తే) మధుమేహం కూడా తక్కువే. ఆపిల్‌ని కొందరు తొక్క తీసి తింటారు. కానీ అందులోని ట్రిటర్‌పినాయిడ్లు కాలేయ, పేగు, రొమ్ము క్యాన్సర్ల కణాలు పెరగకుండా అడ్డుపడతాయి.
* ఆపిల్‌ జ్యూస్‌కి ఆల్జీమర్స్‌ని నిరోధించే శక్తి ఉంది. మెదడులోని ఎసిటైల్‌ కోలీన్‌ స్రావాన్ని పెంచడం ద్వారా న్యూరోట్రాన్స్‌మిటర్ల పనితీరుని మెరుగుపరుస్తుంది.

ఎముక పుష్టికి క్యాల్షియం - ఆహార మార్గం

 

పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును. అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

ఎముక పుష్టికి క్యాల్షియం - ఆహార మార్గం

క్యాల్షియం మన ఎముకల, దంతాల పటుత్వంలో కీలక పాత్ర పోషిస్తుంది. కండరాలు, కణాలు, నాడులు సరిగా పనిచేయటానికీ ఇది తోడ్పడుతుంది. అందుకే పెద్దవాళ్లు రోజుకి వెయ్యి మిల్లీగ్రాముల క్యాల్షియం తీసుకోవటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. క్యాల్షియం ప్రధానంగా పాలు, పాల పదార్థాల నుంచి లభిస్తుంది. అయితే పాలు ఇష్టం లేనివారు, లాక్టోజ్‌ పడనివారి సంగతేంటి? ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చుకుంటే సరి. వీటితో క్యాల్షియంతో పాటు ఇతరత్రా విటమిన్లు, ఖనిజాలు కూడా లభిస్తాయి.

*అంజీర: ఎండిన అంజీర పండ్లను అరకప్పు తీసుకుంటే 121 మి.గ్రా. క్యాల్షియం లభించినట్టే. ఇందులో పొటాషియం, పీచు కూడా దండిగా ఉంటాయి. కండరాల పనితీరును, గుండెలయను నియంత్రించటం వంటి పలురకాల పనుల్లో పాలు పంచుకునే మెగ్నీషియమూ వీటితో లభిస్తుండటం విశేషం.

 

 

 

*నారింజ: ఒక పెద్ద నారింజ పండులో 74 మి.గ్రా. క్యాల్షియం ఉంటుంది. ఇందులో రోగనిరోధకశక్తిని పెంచే విటమిన్‌ సి కూడా పుష్కలంగా ఉండటంతో పాటు కేలరీలూ తక్కువే.

 

 

 

*సార్‌డైన్‌ చేపలు: వీటిని 120 గ్రాములు తీసుకుంటే 351 మి.గ్రా. క్యాల్షియం లభిస్తుంది. మెదడు, నాడీ వ్యవస్థల ఆరోగ్యానికి కీలకమైన విటమిన్‌ బీ12 కూడా అందుతుంది. క్యాల్షియం ఎముకల్లోకి ప్రవేశించటానికి తోడ్పడే విటమిన్‌ డి సైతం వీటిల్లో ఉంటుంది.

 

 

 

*బెండకాయ: మలబద్ధకాన్ని నివారించే పీచుతో నిండిన బెండకాయలను ఒక కప్పు తింటే 82 మి.గ్రా. క్యాల్షియం అందుతుంది. అలాగే వీటిల్లో విటమిన్‌ బీ6, ఫోలేట్‌ వంటివీ ఉంటాయి.

 

 

 

 

*టోఫు: ప్రోటీన్‌తో పాటు క్యాల్షియంతో కూడిన ఇది శాకాహారులకు ఎంతగానో మేలు చేస్తుంది. సగం కప్పు టోఫులో 434 మి.గ్రా. క్యాల్షియం ఉంటుంది.

 

 

 

 

 

*బాదంపప్పు: ఆరోగ్యానికి మేలు చేసే పప్పుగింజల్లో (నట్స్‌) భాగమైన బాదం మంచి క్యాల్షియం వనరు. 30 గ్రాముల బాదంపప్పుతో 75 మి.గ్రా. క్యాల్షియం లభిస్తుంది. అయితే వీటిని పొట్టు తీయకుండా తినటం మంచిది. బాదంపప్పులో విటమిన్‌ ఈ, పొటాషియం కూడా ఉంటాయి. మితంగా తింటే చెడ్డ కొలెస్ట్రాల్‌ తగ్గటానికీ తోడ్పడతాయి.

సబ్జా గింజలు

 

 

పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును. అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

సబ్జా గింజలు

సబ్జా గింజల్ని ఆంగ్లంలో "బేసిల్ సీడ్స్" అంటారు. బేసిల్ తులసి మొక్కలాంటిదే. ఒకటే జాతి. ఆకులు వేరుగా ఉంటాయి. వీటి గింజలను రకరకాలుగా వాడతారు. కూల్డ్రింక్స్ లో, జల్లో పీచు పుష్కలంగా ఉంటుంది. వీటిని వంటల్లో వాడటం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. మలబద్దకం రాకుండా ఉంటుంది. ఒక మోస్తరు క్యాబేజీతో సమానమైన పీచుని నాలుగు గ్రాముల సబ్జా గింజల నుంచి పొందవచ్చు.ఈ గింజల్ని నానబెట్టి ఆహారపదార్థాల్లో, జ్యూసుల్లో వేసుకుని తీసుకోవచ్చు. అంత సమయం లేదనుకొనేవారు నీటిలో పదినిమిషాలు నానబెట్టి, తరవాత వడకట్టి ఆ నీటి ఐస్క్రీంస్ లో, "ఫలూదా" అనే ప్రఖ్యాత డ్రింక్ లో.. ఇలాగన్నమాట. సబ్జా గింజల ముఖ్య గుణం శరీరంలో వేడిని తగ్గించటం. బజార్లో చాలా చోట్ల తక్కువ ధరలో ఈ గింజలు మనకు లభ్యమౌతాయి.అనేక సమస్యలను పరిష్కరించి శరీరానికి ఎంతో మేలు చేస్తాయివి.. అదెలాగంటే..చూడ్డానికి చిన్నగా, నలుపురంగులో ఉండే ఈ గింజలు నీటిలో నానితే పెద్దగా ఉబ్బుతాయి. ఈ గిని తాగొచ్చు లేదా ఆ గింజల్ని తినొచ్చు.ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉండేవారు ఆ అలవాటు నుంచి బయటపడాలంటే సబ్జాగింజలు నానబెట్టిన నీటిని తాగాలి. ఇలా చేస్తే అతిగా తినాలనే కోరిక అదుపులోకి వస్తుంది. పైగా కెలొరీలు పెద్దగా ఉండవు.రోజూ ఈ సబ్జానీటిని తాగితే శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. వీటిల్లోని అల్ఫాలినోలెనిక్‌ యాసిడ్‌ చర్మంలో వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకొంటుంది. ముఖం కళగా కనిపిస్తుంది. అదే సమయంలో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ కూడా అదుపులో ఉంటుంది. వినికిడి సంబంధిత సమస్యలు రాకుండా తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సబ్జా గింజల్లోని ఔషధ గుణాలేంటి..?
  1. సబ్జా గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సబ్జా గింజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. వేసవిలో చెమటకాయలు రాకుండా కాపాడుతుంది. చికెన్ పాక్స్ వచ్చిన వారికి శరీర తాపం అధికంగా ఉంటుంది. పొక్కుల వల్ల మంట అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు సబ్జాగింజలు నీళ్లలో నానబెట్టి కొబ్బరినీళ్లలో కలిపి తాగిస్తే సత్వర ఫలితం ఉంటుంది.
  2. అజీర్తి చేసిన వారికి ఈ గింజలను నానబెట్టిన నీటిలో చెంచా నిమ్మరసం వేసి పంచదార కలిపి తాగిస్తే ప్రయోజనముంటుంది. గ్లాసుడు నీళ్లలో సబ్జా గింజల గుజ్జు వేసి రోజుకు మూడు లేక నాలుగు సార్లు ఇచ్చినా ఫలితముంటుంది. వీటి గుజ్జును పైనాపిల్, ఆపిల్, ద్రాక్ష రసాల్లో కలిపి పిల్లల చేత తాగిస్తే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. ధనియాల రసంతో ఇస్తే జ్వరం తగ్గుముఖం పడుతుంది.
  3. మహిళలూ బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే సబ్జాను నానబెట్టిన నీటిని తాగండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సబ్జా గింజలతో నానబెట్టిన గ్లాసుడు నీటిని నిద్రపోయే ముందు తాగితే చక్కటి ఫలితాలుంటాయి. ఈ నీరు యాంటీ బయాటిక్‌లాగా పనిచేస్తుంది.
  4. బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఈ నీటిని రాత్రిపూట తాగడం వల్ల మరునాటికి శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు తొలగిపోతాయి. ఈ నీరు టైప్‌ 2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అంతేకాదు... ఈ నీరు దాహార్తిని తీర్చి డీహైడ్రేషన్‌ రాకుండా చూడడంతోబాటు బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది. శరీరంలోని కేలరీలను కరిగించడంలో సబ్జాగింజలు పెట్టింది పేరు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు సబ్జా వాటర్‌ను సేవించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
  5. ఇంకా సబ్జా ఈ గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీర జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. సబ్జా గింజలు నీటిలో వేయగానే కొంతసేపటికి ఉబ్బి జెల్‌ మాదిరిగా తయారవుతాయి. శరీర పనితీరుకు ఉపకరించే ఫ్యాటీ ఆమ్లాలతోబాటు అధికంగా పీచుని ఇవి కలిగివుంటాయి.
  6. ఇందులో మహిళలకు అవసరమైన ఫొలేట్‌, నియాసిన్‌, ఇంకా చర్మాన్ని అందంగా ఉంచే విటమిన్‌ 'ఇ' లభించడంతోబాటు, శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించడానికి కూడా ఇవి తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
  7. సబ్జా వాంతుల్ని తగ్గించి అజీర్తిని తొలగిస్తాయి. హానికరమిన టాక్సిన్లు పొట్టలోకి చేరకుండా చేస్తాయి.గొంతు మంట, దగ్గు, ఆస్తమ, తలనొప్పి, జ్వరం ఉన్నప్పుడు సబ్జా గింజల్ని నీళ్ళలో నానబెట్టి తిన్నా, తాగినా ఫలితం ఉంటుంది. గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టిన సబ్జాలకు అల్లం రసం, తేనె కలిపి తాగితే, శ్వాసకోస వ్యాధులు తగ్గుముఖం పడతాయి.

ఆధారము: ఫుడ్ హెల్త్ డిసీస్ బ్లాగ్ స్పాట్

విటమిన్ -E

మహిళల్లో గర్భధారణ కోసం... ఇ విటమిన్ అవసరం.

పురుషుల్లో వంధ్యత్వం నివారించడానికి ఇదే కావాలి.

అందరిలో చర్మసౌందర్యాన్ని ఇదే ఇనుమడింపజేస్తుంది

హానికరమైన ఫ్రీ రాడికల్ అణువులను తొలగించే యాంటీ ఆక్సిడెంట్ గుణం ఇందులోనే ఎక్కువ.

విటమిన్-ఇ వల్ల ఉపయోగాలు, అది లభ్యం కానప్పుడు వచ్చే నష్టాలు, అవి పుష్కలంగా దొరికేపదార్థాలు వంటి అనేక అంశాలపై సమాచారం కోసం ఈ కథనం.

అందానికి, చర్మసౌందరానికి కీలకం ‘విటమిన్ ఇ’. గ్రీకు భాషలో టోకో... అంటే పిల్లలు, ఫెరోస్ అంటే గర్భధారణ. గర్భధారణ తర్వాత పిండం ఎదుగుదలకు ఇ విటమిన్ ఒక పోషకంలా అవసరం కాబట్టి ఆ పేరు పెట్టారు. అది యాంటాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అంటే దీర్ఘకాలం యౌవనంగా ఉంచడానికి దోహదపడుతుంది. మానవ రక్తంలో, కణజాలంలో ఎక్కువ పాళ్లలో కనిపిస్తుంది. కొవ్వులో కరిగే విటమిన్ ఇది.

ఇది పోషకాహార రూపంలో తన భూమిక ఎక్కువగా పోషిస్తుంటుంది.

దీనికి ఎనిమిది వేర్వేరు రూపాలు ఉన్నాయి. (ఆల్ఫా టోకోఫెరాల్, బీటా టోకోఫెరాల్, గామా టోకోఫెరాల్, డెల్టా టోకోఫెరాల్... మొదలైనవి). అయితే వైద్య నిపుణులు దీన్ని ఎక్కువగా ‘ఆల్ఫా టోకోఫెరాల్’ రూపంలో ఇస్తుంటారు.

విటమిన్-ఇ నిర్వహించే విధులు:

యాంటీ ఆక్సిడెంట్: మనం ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత జీవక్రియల కోసం అది శక్తిగా మారుతుంది. ఈ ప్రక్రియలో కొన్ని హానికరమైన అణువులు వెలువడతాయి. వాటిని ఫ్రీరాడికల్స్ అంటారు. అవి శరీరానికి చెరుపు చేస్తాయి. ఇవి సిగరెట్ పొగలో, వాయు కాలుష్యాల్లో, అల్ట్రా వయొలెట్ కిరణాల్లో కూడా ఉంటాయి. ఈ హానికరమైన ఫ్రీ రాడికల్ అణువుల తీవ్రతను యాంటీ ఆక్సిడెంట్స్ హరిస్తాయి. శరీరంలో వెలువడే హానికరమైన ఫ్రీరాడికల్స్‌ను హరించే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు విటమిన్-ఇ లో ఉండటం వల్ల అవి జీవక్రియల్లో వెలువడి చెరుపు చేసే పదార్థాలను తొలగిస్తాయని చెప్పవచ్చు.

వ్యాధి నిరోధక శక్తిని పెంచడం: విటమిన్-ఇ ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు అవి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.

జన్యు పదార్థాల తయారీలో: మన స్వభావాలు, పోలికలు ఒక తరం నుంచి మరో తరానికి చేరడానికి జన్యువులు దోహదపడతాయన్న సంగతి తెలిసిందే. ఈ జన్యు పదార్థం రూపొందడానికి, తయారీకి విటమిన్-ఇ అవసరం.

శరీర జీవక్రియల కోసం: మన శరీరంలో జరిగే అనేక కార్యకలాపాలను మెటబాలిక్ యాక్టివిటీస్ అంటారు. ఈ జీవక్రియలు సక్రమంగా జరగడానికి విటమిన్-ఇ దోహదపడుతుంది.

ప్రయోజనాలు:విటమిన్-ఇ ఉండే పదార్థాలు పుష్కలంగా తీసుకునేవారిలో రక్తం త్వరగా గడ్డకట్టే స్వభావం తగ్గుతుంది. దాంతో గుండెజబ్బులు (కరొనరీ హార్ట్ డిసీజెస్) తగ్గుతాయని పరిశోధనల్లో తేలింది.

క్యాన్సర్ రిస్క్ నివారణ: విటమిన్-ఇ అనేక రకాల క్యాన్సర్ రిస్క్‌లను గణనీయంగా తగ్గిస్తుంది. ఉదాహరణకు రొమ్ము క్యాన్సర్, పెద్దపేగుల క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటివి. మన శరీరం కొన్ని జీవక్రియలు నెరవేర్చే సమయంలో ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ వెలువడుతాయి. వీటి వల్ల పెరిగే క్యాన్సర్ వ్యాధుల రిస్క్‌ను విటమిన్-ఇ తగ్గిస్తుంది.

కంటి ఆరోగ్య సంరక్షణకు: మన కంటికి వచ్చే మాక్యులార్ డీజనరేషన్ అనే వ్యాధిని విటమిన్-ఇ చాలావరకు నివారిస్తుంది. కంటిలో ఏర్పడే శుక్లాలను (క్యాటరాక్ట్‌ను) కూడా ఇది చాలావరకు నిరోధిస్తుంది.

మెదడు: మతిమరపు వంటి అనేక వ్యాధులను నివారిస్తుంది. ఒక ప్రాయం దాటాక వచ్చే అల్జైమర్స్ డిసీజ్ వంటి వాటిని కూడా ఇది చాలావరకు తగ్గిస్తుంది.

ఊపిరితిత్తులకూ దీనితో ప్రయోజనం చేకూరుతుంది. పొగ తాగే అలవాటు ఉన్నవారికి వచ్చే క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ అనే ఊపిరితిత్తుల వ్యాధి రిస్క్‌ను ఇది తగ్గిస్తుంది.

ప్రీ-మెనోపాజ్ లక్షణాల నివారణ: మహిళలు ఒక వయసుకు చేరాక రుతుస్రావం ఆగిపోతుంది. రుతుస్రావం ఆగడానికి ముందు మహిళల్లో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. ఉదాహరణకు శరీరం నుంచి ఆవిర్లు వస్తున్నట్లు అనిపించడం, త్వరత్వరగా స్వభావంలో మార్పులు, తేలిగ్గా భావోద్వేగాలకు లోనుకావడం, అలసటగా అనిపించడం వంటి ఎన్నో లక్షణాలను నివారిస్తుంది.

చర్మసౌందర్య సంరక్షణ కోసం: కలబంద (అలొ వెరా)తో పాటు ఎన్నో ఉత్పాదనలతో దీన్ని కలుపుతారు. వాటిల్లో ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అంటే వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలో వచ్చే అనేక మార్పులను ఇది సమర్థంగా నివారించి దీర్ఘకాలికంగా యౌవనంగా కనిపించడానికి దోహదపడుతుంది.

మరికొన్ని ఉపయోగాలు...

వంధ్యత్వం నిరోధించడానికి:విటమిన్-ఇ తో పురుషుల్లో వంధ్యత్వం నిరోధించవచ్చు. పురుషుల్లో వంధ్యత్వం ఉన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు వారికి రోజూ 100 మైక్రోగ్రాముల విటమిన్-ఇ ఇస్తుంటారు.

డిస్‌మెనోరియా:మహిళల్లో రుతుస్రావం అయ్యే సందర్భాలలో కలిగే తీవ్రమైన నొప్పిని నివారించేందుకు దీన్ని ఇస్తారు. వయసు పెరిగిన మహిళల్లో రుతుచక్రంలో క్రమం తప్పినప్పుడు కూడా దాన్ని సరి చేయడానికి విటమిన్-ఇ ఉపయోగిస్తారు.

పుట్టుకతో వచ్చే సమస్యల నివారణకు: పిల్లల్లో పుట్టుకతో వచ్చే సమస్యలు (కంజెనిటల్ అనామలీస్) నివారించడానికి విటమిన్-ఇ ఉపయోగపడుతుంది.

వేరికోస్ వెయిన్స్: విటమిన్-ఇ పాళ్లు తగ్గినప్పుడు రక్తం గడ్డకట్టే అవకాశాలు ఎక్కువ. దాంతో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి అక్కడి సిరలలోని వాల్వ్స్‌ను దెబ్బతీయవచ్చు. కొందరిలో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టినప్పుడు రక్తానికి ఎలాంటి అడ్డూ లేకుండా ప్రవహింపజేయడానికి రక్తనాళాలు విశాలం (డయలేట్) అవుతుంటాయి. దాంతో మరింత రక్తం అక్కడ ప్రవహిస్తుంది. ఫలితంగా రక్తనాళాల సమస్యలు రావచ్చు.

ఈ సమస్యల నివారణ కోసం తగినంత విటమిన్-ఇ తీసుకోవడం అవసరం.

మోతాదు మించితే... విటమిన్-ఇ వల్ల వచ్చే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని అవసరమైన మోతాదు కంటే ఎక్కువగా తీసుకుంటే అలాంటి వారిలో రక్తస్రావ సమస్యలు (బ్లీడింగ్ డిజార్డర్స్) రావచ్చు.

విటమిన్-ఇ లోపం వల్ల...

ఇ విటమిన్ లోపం రావడం చాలా అరుదు.

విటమిన్‌లలో రెండు రకాలు ఉంటాయి. నీళ్లలో కరిగేవి. కొవ్వులలో కరిగేవి. ఉదాహరణకు విటమిన్-సి నీటిలో కరుగుతుంది. అలాగే విటమిన్-ఇ కొవ్వులలో కరుగుతుంది. కాబట్టి కొవ్వులు సరిగా జీర్ణం కానివారిలో విటమిన్ ఇ లోపాలు రావచ్చు. శరీరానికి తగినన్ని కొవ్వులు కూడా అవసరమని గుర్తించి వాటిని తీసుకోవాలి దీని లోపం వల్ల గర్భస్రావం కావడం, ప్రసవం ముందుగానే కావడం, బిడ్డ 1500 గ్రాములకంటే తక్కువగా ఉండటం వంటి సమస్యలు రావచ్చు పెరిఫెరల్ న్యూరోపతి అనే నరాల సమస్య రావచ్చు.

కండరాల కదలికల్లో లోపం వచ్చే నరాల సమస్య (అటాక్సియా) రెటినోపతి వ్యాధినిరోధక శక్తి లోపించడం చర్మం పొడిబారినట్లుగా ఉండటం.

ఇవి ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు

  • ఆకుపచ్చగా ఉండే ఆకుకూరల్లో
  • గింజ ధాన్యాలలో (హోల్‌గ్రెయిన్స్) తృణధాన్యాలలో
  • నట్స్ (బాదం, వాల్‌నట్స్ వంటివి)
  • కాటన్ సీడ్ ఆయిల్, పొద్దుతిరుగుడు నూనె, ఆలివ్ ఆయిల్, కుసుమ నూనె, గోధుమ గడ్డి నూనెలో
  • మాంసాహారం, కోడిగుడ్లు, చేపలలో
  • ఆకుకూరల్లో, బ్రకోలీలో మామిడి వంటి పండ్లలో

ఆధారము: హెల్త్ కేర్ తెలుగు బ్లాగ్

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు