অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఫ్లోరోసిస్‌

ఫ్లోరోసిస్‌

  • ఫ్లోరైడ్‌ అధికంగా తీసుకోవడంవల్ల ఈవ్యాధి వస్తుంది.ఇది చాల బాధాకరమైన జబ్బు.
  • ఫ్లోరైడ్లు ఫ్లోరిన్‌ యొక్క సంయోగ పదార్ధాలు. భూఉపరితలంలో లభించే నీటిలోకన్నా భుగర్భ జలాలలో ఫ్లోరైడ్లు అధికంగా ఉంటాయి.
  • త్రాగే నీరు ఆహరం ద్వారా , టూత్‌ పేస్ట్‌, నోటిని శుభ్రం చేసుకునే ద్రవాలు, ఇతర దంత సంబంధమైన ఉత్పత్తుల నుంచి , మందులు, పరిశ్రమలనుంచి వచ్చే ఫ్లోరైడ్‌  దుమ్ము, పొగలద్వారా, ఫ్లోరైడ్ గల లవణాన్ని మరియు హైడ్రోఫ్లోరిక్‌ ఆమ్లాన్ని వినియోగించడం వలన ఫ్లోరైడ్‌ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది.

మన శరీరంలో ఫ్లోరైడ్‌ ఉండవలసిన మోతాదు: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్‌ ఒ)మరియు భారతీయ ప్రమాణం(ఐఎస్‌)10500(1991) 1.5మిల్లీ గ్రాములు/ఎల్‌ మరియు 1.0 మిల్లీ గ్రాములు/ఎల్‌ మాత్రమే పరిమితమైనదిగాను మానవునిలో శోషణకు రక్షిత హద్దుగా ఉన్నది.

భారత దేశంలో ఫ్లోరోసిస్‌ గల ప్రాంతాలుః భారతదేశంలో కనీసం 17 రాష్ట్రాలలో వ్యాపించింది. అందులో  ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌ ఐదు రాష్ట్రాలలో 50-100శాతం జిల్లాలపై ప్రభావంపడి ఒకేచోట ఉండే ప్రజలలోఅతిగా వ్యాపించి ఉంది.

ఫ్లోరైడ్‌ విషతత్వం

తీవ్రమైన విష ప్రభావం

  • పరిశ్రమలనుండివచ్చే ఫ్లోరిన్‌ పొగల ద్వారా ఇది ఎక్కువగా వస్తుంది. 6-9 మిల్లీగ్రాములు ఎఫ్‌/కిలో గ్రాముల కన్నా ఎక్కువ ఉంటే తీవ్రమైన ప్రభావం ఏర్పడుతుంది.
  • ఫ్లోరైడ్‌ యొక్క  తీవ్రమైన విష  ప్రభావ చిహ్నాలు మరియు లక్షణాలుః
  • కడుపులో తిప్పడం, వాంతులు కావడం, అతిసారవ్యాధి, పొత్తి కడుపులోనొప్పి, శ్వాస సంబంధమైన బాధలు,  హృదయ సంబంధితమైన పనులు తగిన విధంగా లేకపోవడం, బలహీనత, పక్షవాతం, స్పృహలేకపోవడం(కోమా)కు గురి కావడం జరుగుతుంది.
  • దీర్ఘకాలిక ఫ్లోరైడ్‌ విష ప్రభావం

ఫ్లోరోసిస్‌ రావడానికి గల కారణాలు

  • తాగడానికి, వంటకు ఫ్లోరైడ్‌ అధికంగా గల భూగర్భ జలాన్ని వినియోగించడం వలన ప్రధానంగా ఫ్లోరోసిస్‌ వస్తుంది.
  • ఫ్లోరైడ్‌ లభించే వనరులన్నింటి నుండి సంబంధంలేకుండా శరీరంలోనికి తీసుకోవడంవల్ల, పోషకాహరలోపంవలనకూడ ప్రజలలో ఫ్లోరోసిస్‌ తీవ్రత పెరుగుతుంది.

దీర్ఘకాలిక ఫ్లోరైడ్‌ విష ప్రభావ చిహ్నాలు

దీర్ఘకాలిక ఫ్లోరైడ్‌ విష ప్రభావ చిహ్నాలు  రెండు రూపాలుగా ఉన్నాయి.

  • దంత సంబంధిత ఫ్లోరోసిస్‌
  • అస్థి సంబంధిత ఫ్లోరోసిస్‌

దంత సంబంధిత ఫ్లోరోసిస్‌

  • పిల్లల దంతాలలో మొదటి చిహ్నంగా ఎ నామిల్‌ పూత పోవడం
  • దంత మినర లైజేషన్‌ ఏర్పడడానికి ముందుగానే అధిక ఫ్లోరైడ్‌కు బహిర్గతమైనప్పుడు దంత ఫ్లోరోసిస్‌ వస్తుంది. దంతాలు క్షీణించడం, పుచ్చిపోవడంవంటి రెండు రకాలైన దంతఫ్లోరోసిస్‌కి కొలమానాలు క్రింద ఇవ్వబడ్డాయి. ఎనామిల్‌ పైన రంగు కోల్పోయిన  అడ్డగీతలు ఏర్పడతాయి; పంటి ఇగురుపైన రంగులేకపోవడం ఉండదు.  జతల దంతాలలో రంగుకోల్పోవడం ( ద్విపార్శ్వ సౌష్టవంతో)

అస్థి సంబంధిత ఫ్లోరోసిస్‌

  • లక్షణాలుఃశరీరమంతటా వ్యాపించే అస్పష్టమైన నొప్పులు, మరియుకీళ్ళు బిగబట్టి కదలికలు తగ్గ డం సామాన్యమైన ప్రారంభ లక్షణాలు. ముందస్తు పరిశీలనలో కండర అస్థి సహిత లక్షణాలు  ఉంటాయి.

అస్థి సంబంధితంలేని అంశాలు

  • నరాల బలహీనత, మానసికంగా కృంగుట  చేతివేళ్ళు , కాలి వేళ్ళలో కంపనాలు , కండర బలహీనత మరియు బిగుసుకు పోవడం , కండరలలోనొప్పి, కండరశక్తి తగ్గడం, చర్మంపై బాధాకరమైన దద్దుర్లు , 7-10రోజులలో ఇవి పోతాయి.

జీర్ణనాళ సంబంధిత సమస్యలుః

  • పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి, అతిసారం, మలబద్దకంమల విసర్జనలో రక్తంపడడం తలనొప్పి
  • చాలచిన్న వయస్సులోనే దంతాలు ఊడిపోవడం రక్తహీనత చిన్న వయస్సులోనే వృద్ధాప్యం.

రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు

ఫ్లోరోసిస్‌ ప్రజారోగ్య సమస్య దీనిని వైద్య, మరియు ప్రజారోగ్య ఇంజనీరింగు నిపుణులు (నీటి సరఫరాను అమలు పరచే సంస్థలు) నిర్వహించవలసి ఉంటుంది.

ఫ్లోరోసిస్‌ నిర్వహణలో మెలకువలు

  • భూగర్భ జలాలు, ఉపరితలనీటిలో ఎక్కడైతే ఫ్లోరైడ్‌ తక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాలను తెలుసుకొని  ఆయా వనరులను తాగడానికి వంటకు వినియోగించుకోవాలని ప్రజలకు అవగాహన కల్గించడం.   స్థానికంగా ఉన్న  అధిక ఫ్లోరైడ్‌ జలాలను తక్కువ ఫ్లోరైడ్‌ జలాలుగా మార్చి  ఇళ్ళకు సామాజిక స్థాయీలకు   ఫ్లోరైడ్‌ లేని నీటిని అందించడం.
  • ఇంటి డాబాల నుండి వాన నీటిని, కొండ వాలు నుంచి నీటిని సేకరించి తదుపరి వినియోగానికి వాడుకోవడం.
  • బావుల లోనికి నేరుగా వాననీటిని పంపించి సజల ఫ్లోరైడ్‌ ఉండేటట్లు బావి నీళ్ళను మార్చడం.
  • వంటకు, తాగడానికి ఒక వ్యక్తికి దాదాపుగా రోజుకి 10లీటర్లు కావాలి. రక్షితనీటిని మెలకువగా వినియోగించాలి. పరిశుభ్రం కాని నీటిని ఇంటి పనులకు స్నానానికి, బట్టలుతకాడానికి, శుభ్ర పరచుకోవడానికి మోదలగు వాటికి ఉపయోగించు కోవచ్చు.
  • మరగించడంవలన ఫ్లోరైడును తొలగించలేము. వ్యతిరేక ద్రవాభి సరణక్రమత (ఆర్‌ ఒ) సాంకేతికతా విధానం తప్ప,  ప్రస్థుతమున్న నీటి వడపోత సామగ్రులు లేదా నీటిని శుద్ధిపరచే విధానాలు
  • ఏవికూడ ఫ్లోరైడ్‌ను  తొలగించలేవు.

సామాజిక పరంగా ఫ్లోరైడ్‌ లేకుండా చేసే సాంకేతిక విధానాలు

నల్గొండ సాంకేతిక విధానం

  • సున్నం- పటిక వినియోగం- ఖర్చు తక్కువ విధానం. కొంత శిక్షణతోఇంటి కొరకు, సామాజికస్థాయీలకు సరిపడుతుంది.

ప్రశాంతి సాంకేతికత

  • చురుకైన అల్యూమినను నీటిలోకి పంపించడం.చేతి పంపులకు కలపడానికి ఇంటికొరకు సామాజిక అవసరాలకు వినియోగించే వడపోతలు అందుబాటులోఉన్నాయి.

ఇది సులభంగా పనిచేయించవచ్చు.

  • ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఐసిఒహెచ్‌ టెక్నిక్‌:  బొగ్గుగా మారిన ఎముక పదార్ధంమరియు బొగ్గు దుంగలు వినియోగిస్తారు.ఇది సరళమైన, తక్కువఖర్చు విధానం. ఈ విధానం(యూనిట్‌ ) 1-3 నెలల వరకు పనిచేస్తుంది.
  • వ్యతిరేక ద్రవాభిసరణక్రమతా-నీటిని శుభ్రపరచే విధానం:  ఎక్కువ ఖరీదైనది. నిర్వహణకూడ ఖర్చుతో కూడినది. అయినప్పటికినీచిన్న పరిశ్రమలకు లేదా సామాజికస్థాయి కూర్పులకు ఇది ఆదర్శమైనది.

ఆహారనియమాల అనుబంధ ప్రక్రియ

  • ముఖ్యంగా  పిల్లలు, ఎదిగే వయస్సులో గలవారు మాంసకృత్తులను, కాల్షియమ్ను మరియు విటమిన్‌ సి ని ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి.
  • అధికంగా ఫ్లోరైడ్గల వాటిని ఉదాహరణకు తేనీరు, నల్ల ఉప్పు ( కాలానమక్‌ ) , రాతి ఉప్పు, పొగాకు వక్క అధిక ఫ్లోరై డ్‌ గల భుగర్భ జలాలను వినియోగించి ఆహారాలను పెంచడం వంటి విధానాలను మానివేయాలి .
  • దంతాలకు ఉపయోగించే ఫ్లోరై డ్‌తో  ఉన్న దంత సంబంధిత పేస్టుల తయారీలో జాగ్రత్త వహించాలి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate