పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

పోషకాహర లోపము నివారణ

ఈ విభాగంలోపోషకాహర లోపము నివారణ గురించి వివరించబడింది

పోషకాహరలోపము  ఒక ప్రజారోగ్య సమస్య, అనేక కారకాలు దానితో మిళితమై ఉన్నాయి. వ్యక్తులు, సమాజము మరియు ప్రభుత్వాల మద్దతు, చొరవ దీని నివారణకు అవసరము.

పోషకాహర లోపమును నివారించేందుకు వ్యూహాలు మరియు పోషకాహారాన్ని మెరుగుపరచటం

 • పోషకాహారాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు అవకాశాలను మెరుగు పరచటం
 • ప్రభుత్వం అన్నిస్థాయిలలో-జాతీయ స్థాయి నుండి గ్రామస్థాయివరకూ  వివిధ పధకాల ప్రణాళికలు మరియు అమలు దీనికి అవసరం.

ఆరోగ్య సంరక్షణను మెరుగు పరచటం

వ్యాధి నిరోధక శక్తిని కలిగించటం (టీకాలు వేయించటం) ఓ.ఆర్.యస్ ద్రావకం,నిర్ణీత వ్యవధిలో కడుపులోని నులి పురుగులను నిర్మూలించటం, ప్రాధమిక దశలోనే సాధారణ వ్యాధుల నిర్ధారణ మరియు సక్రమ చికిత్స వంటివి గల ఒక మంచి ఆరోగ్య పరిరక్షణా విధానం సమాజములో ఉండాలి. పోషకాహార లోపాన్ని ప్రాధమిక దశలోనే గుర్తించటం, చికిత్స అందివ్వటం కూడా చాలా ముఖ్యం.

పోషకాహార విద్య

సామాన్య మానవుడిని విద్యావంతుడిని చెయ్యవలసిన అంశాలు

 • సాధారణ ఆహార పధార్ధాల పోషకాహార నాణ్యత, ముఖ్యంగా స్థానికంగా లభించే తక్కువధర అహారపదార్ధాలు.
 • పిల్లలకు తల్లి పాలివ్వటం మరియు అనుబంధ అహారాన్నివ్వటం యొక్క ప్రాముఖ్యత
 • తీసుకునే మొత్తము ఆహారపు మాంసకృత్తుల విలువను పెంచేందుకు గాను సరియైన పరిమాణాల్లో పాలు, గుడ్లు, మాంసము మరియు కాయ ధాన్యాలను కలపాల్సిన అవసరము
 • జబ్బు పడ్డప్పుడు పిల్లలకు, పెద్దలకు ఆహరాన్ని ఇవ్వాల్సిన ప్రాముఖ్యత.
 • వంటకు కావాల్సిన తోటను పెంచటం యొక్క ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు.
 • పిల్లలకు వ్యాధి నిరోధకశక్తిని కలిగించటం దైనందిన జీవితములో సక్రమమైన పారిశుధ్యాన్ని పాటించే ప్రాముఖ్యత
 • పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు వివిధ అహార పదార్ధాల ద్వారా క్యాలరీలు, మాంసకృత్తులు మరియు సూక్ష్మ పోషకాలైన ఐరన్, విటమిన్ ఎ, మరియు జింకు వంటివాటిని తీసుకోవటం ద్వారాలోటు భర్తీ చెయ్యవచ్చు. తద్వారా దుర్బలులైన గర్భిణీ స్త్రీలు, శిశువులు మరియు చిన్నపిల్లలను  పోషకాహార లోపానికి గురయ్యే ప్రమాదం నుంచి కాపాడవచ్చు మరియు చికిత్స చెయ్యవచ్చు.

పునరుత్పత్తి వయసులోని మహిళలు, కౌమార బాలికల (10-19 సంవత్సరాలు) పౌష్ఠికతను మెరుగుపరచేందుకు సిఫారసు చెయ్యబడ్డ పద్ధతులు

అన్ని సమయాలలో

 • బరువు తక్కువ అని కనుగొన్నప్పుడు ఆహారము ఎక్కువగా తీసుకోవాలి
 • నాణ్యతను,సూక్ష్మపోషకాలను ఎక్కువగా తీసుకునేందుకు ఆహారములో వైవిధ్యాన్ని పెంచాలి.
 • రోజువారీ తీసుకునే కూరగాయలు, ఫలాల వాడకాన్ని పెంచాలి
 • వీలయితే పశుఉత్పత్తులైన పాలు లేదా చేపలు లేదా గుడ్లు తీసుకోవాలి
 • ధృఢపరచే ఆహారపదార్ధాలయిన విటమిన్ ఎ తో కూడిన పాలు, ఐరన్ మరియు విటమిన్లతో కూడిన పిండి మొదలైనవి లభించినప్పుడు తీసుకోవాలి.
 • అయోడైజ్ ఉప్పును ఉపయోగించాలి
 • అవసరమైన సూక్ష్మపోషకాలు ఆహారపదార్ధాల ద్వారా లభించనట్లయితే వైద్యులసలహామేరకు అనుబంధాలను ఉపయోగించి లోటుభర్తీ చెయ్యాలి.

నిర్ణీతావసరాల దశలలో సిఫారసులు

 • మహిళలు గర్భంతో ఉన్నప్పుడు, చనుబాలిస్తున్నప్పుడు వారికి అధికంగా పోషకాహారపు అవసరం ఉంటుంది. అలాంటి దశలలో వారు పైన పేర్కొన్న మరియు క్రింద సూచించిన సిఫారసులను పాటించాలి.
 • గర్భంతో ఉన్నప్పుడు
 • పిండ అభివృద్ధి కొరకు మరియు భవిష్యత్తులో చనుబాలిచ్చేందుకు చాలినంత బరువు పెరిగే విధంగా ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి.
 • ఐరన్/ఫాలికామ్లపు బిళ్ళలను తరచూ మింగాలి
 • చనుబాలిస్తున్నప్పుడు
 • ప్రతిరోజూ అదనంగాపోషకాలతో కూడిన సమతుల్య భోజనానికి సమానంగా తినాలి.
 • విటమిన్ ఎ లోపము ఉన్న ప్రదేశాలలో పెచ్చుమోతాదు విటమిన్ ఎ బిళ్ళలను ప్రసవమయిన వెంటనే,ప్రసవమయిన ఎనిమిదివారాల లోపు తీసుకోవాలి.చనుబాలలోని విటమిన్ ఎ సారం పెరుగుతుంది మరియు తల్లీపిల్లలను వ్యాధిగ్రస్తులు కాకుండా సహాయపడుతుంది.
 • సముచితమైన పద్ధతులను ఉపయోగించి తదుపరి గర్భాన్ని జాప్యం చెయ్యటం
 • చనుబాలివ్వటం ఆపేందుకు తరువాతి గర్భధారణకు మధ్య విరామంలో
 • చనుబాలివ్వటం ఆపేందుకు తరువాతి గర్భధారణకు మధ్య కనీసం ఆరుమాసాల విరామం ఉండేలా ప్రణాళిక రూపొందించుకుని అమలుచెయ్యాలి అందువల్ల శక్తిని,సూక్ష్మ పోషకాలను సమకూర్చుకునేందుకు అవకాశం కలుగుతుంది.

జబ్బుపడ్డప్పుడు మరియు కోలుకున్నాక పిల్లలకు ఆహారమివ్వటం

జబ్బుపడ్డప్పుడు పిల్లలకు చాలినంత పోషాకాహారం ఆహారం తక్కువగా తీసుకోవటం,పోషకాలను శోషింపజేసుకునే సామర్ధ్యం సక్రమంగా లేకపోవటం,శక్తి నిల్వలను కోల్పోవటం,మరియు నిర్జలీకరణవల్ల ఉండదు.

జబ్బుపడ్డప్పుడు

 • ఆహారాన్ని ఇస్తూనే ఉండాలి మరియు ద్రవాలను అధికంగా ఇవ్వాలి
 • 6నెలలలోపున్న పిల్లలకు:తరచూ తల్లిపాలివ్వాలి.ఒకవేళ పాపాయి పాలుతాగలేనంత బలహీనంగా ఉంటే తల్లి తనపాలను పిండి ఒక చెంచా ద్వారా పిల్లవానికి పట్టించాలి.

6–24 నెలల వయసున్న పిల్లలకు

 • తరచూ తల్లిపాలివ్వాలి మరియు ద్రవాలను అధికంగా తీసుకోవాలి
 • తరచూ చిన్నచిన్న మోతాదుల్లో ఆహారం ఇవ్వాలి
 • పిల్లలకు యిష్టమయినవి,వివిధరకాలయిన మెత్తని పోషకాలు అధికంగా ఉన్న ఆహారాన్ని ఇవ్వాలి.
 • పిల్లలు మింగేందుకు ఇబ్బందిపడుతుంటే గుజ్జుగా చేసినవి లేదా మెత్తని ఆహారపదార్ధాలను ఇవ్వాలి(పాలను లేదా ఆహారాన్ని  పలచగా చెయ్యకూడదు)
 • పిల్లలకు మెల్లగా,ఓపికగా తినిపించాలి;తినేందుకు పిల్ల్లలను ప్రోత్సహించాలి తప్ప బలవంతపెట్టకూడదు.పాప/బాబు వంగిఉన్నప్పుడు తినిపించకూడదు.అలాచేస్తే వారికి ఊపిరాడకుండా అవుతుంది.
 • ఒకవేళ పిల్లలు వాంతి చేసుకుంటే పదినిమిషాలాగి మరలా ద్రవాలు కానీ ఆహారం కానీ ఇవ్వాలి.

కోలుకుంటున్నప్పుడు

 • బాగా ఎదుగుతున్నంతవరకూ,బరువును తిరిగి పొందేవరకూ,జబ్బుపడ్డాక ఆహార పరిమాణాన్ని పెంచాలి
 • తరచూ ఆహార మిస్తూనే ఉండాలి.
 • ప్రతిరోజూ అదనపు ఆహారంగానీ లేదా చిరుతిళ్ళు గానీ ఇవ్వాలి.
 • కోలుకుంటున్న పిల్లల పెరిగే ఆకలికి అనుగుణంగా స్పందించాలి

సూక్ష్మ పోషకాల పోషకాహార లొపము(గుప్తమైన ఆకలి)

లోటు భర్తీచెయ్యటం

 • లక్షిత ప్రజా బాహుళ్యానికి పోషకాలను ద్రవ-రూపం లోగానీ మాత్రల రూపంలో గానీ నేరుగా ఇవ్వటాన్ని లోటుభర్తీచెయ్యటం అంటారు.
 • లోపమున్న వారిగా గుర్తింపుపొందిన వ్యక్తులకు గాని,సమూహాలకు గానీ వేగంగా లోపాన్ని అరికట్టేందుకు,సులభంగా శోషించే రూపములో ఒక నిర్దిష్ట పోషకాన్ని గాని పోషకాలనుగానీ తగుమోతాదులో సరఫరా చేసేందుకు దీనివల్ల  ప్రయోజనమవుతుంది.
 • కాకుంటే ఇది స్వల్పకాలిక చర్య
 • సరియైన సరఫరాలు లేకపోవటం,సక్రమంగా అమలుకాకపోవటం అన్నవి ఇతర సవాళ్ళు

ఆహార ప్రబలీకరణ

 • సంసాధితమైన ఆహారానికి సూక్ష్మపోషకాలను అదనంగా జతచెయ్యటమనే దాన్ని ఆహారప్రబలీకరణ అంటారు
 • సుసంపన్నత లో కోల్పొయిన పోషకాలను పునరుద్ధరించటం గానీ లేదా ఆ ఆహారములో సహజంగా లేని పోషకాలను అదనంగా జతచెయ్యటంకొరకు(ప్రబలీకరణ)గానీ పోషకాలను కలపటం
 • ఎక్కువగా ప్రబలీకరణ ఉపకరణాలు విటమిన్లు మరియు ఖనిజాలు,మరికొన్ని సందర్భాలలో అత్యవసరమైన ఎమినో ఆమ్లాలు మరియు మాంసకృత్తులు.
ఆహారపదార్ధం ప్రబలీకరణ ఉపకరణం
ఉప్పు అయోడిన్ ఐరన్ పిండి
పిండి,రొట్టె ,బియ్యము విటమిన్లు బి1 బి2 నయసిన్, ఐరన్
పాలు ఎ మరియు బి విటమిన్లు
చక్కెర,టీ, విటమిన్ ఎ
శిశువుల సూత్రాలు   కుకీలు ఐరన్
సోయాపాలు కమలారసం కాల్షియం
తినేందుకు సిద్ధంగా ఉన్న తృణధాన్యాలు విటమిన్లు,ఖనిజాలు
ఆహారస్వాదుపానీయాలు విటమిన్లు,ఖనిజాలు

ఆహార వివిధీకరణ

 • ఆహారవివిధీకరణను పెంచటమంటే తీసుకునే సూక్ష్మపోషకాలతోకూడిన ఆహారపు పరిమాణాన్ని స్థాయిని పెంచటం.ఉదాహరణలు ఆకుకూరలు,ఫలాలు పాలు మరియు పాల ఉత్పత్తులు.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

2.93333333333
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు