పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

దోమల బెడద

దోమలవల్ల వచ్చే వ్యాధులు వ్యాపించకుండా తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు పాటిద్దాం.

లక్ష్యం

 1. దోమలవల్ల వ్యాపించే వ్యాధుల గురించి తెలుసుకుందాం.
 2. దోమలవల్ల వచ్చే వ్యాధులు వ్యాపించకుండా తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు పాటిద్దాం.

నేపథ్యం

దోమల వల్ల అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, బోదకాలు మొదలైన వ్యాధులకు దోమలు వాహకాలుగా పనిచేస్తాయి. ముఖ్యంగా వర్షాకాలం మొదలవగానే ప్రజలు  దోమకాటు వల్ల ఈ వ్యాధులతో బాధపడటం చూస్తుంటాం.

పద్ధతి

 1. ఒక వైద్యుడినిగాని, ఆరోగ్యకార్యకర్తనుగాని కలిసి లేదా పుస్తకాలు లేదా ఇంటర్నెట్ నుండి గాని దోమకాటువల్ల వచ్చే వ్యాధుల పేర్లను తెలుసుకోండి. ఆ వ్యాధులకు కారణమైన సూక్ష్మజీవులేవో కనుక్కోండి.
 2. దోమల్లోని  రకాలను, వాటి పేర్లను, అవి కలుగజేసే వ్యాధులను కనుక్కోండి. వివిధ రకాల దోమల చిత్రాలను, పటాలను, ఫొటోలను సేకరించండి.
 3. ఏ ఏ ప్రదేశాలలో దోమలు ఎక్కువగా ఉంటాయో కనుక్కోండి. (ఉదా: నిల్వ చేసిన నీరు)
 4. మీ ఇంట్లోగాని, పరిసరాల్లోగాని దోమల సంఖ్య పెరుగుటకు దోహదం చేస్తున్న పరిస్థితులను , ప్రదేశాలను గుర్తించండి.
 5. దోమల వల్ల వ్యాపించే వ్యాధులనుండి రక్షణ పొందుటకు ఏ ఏ చర్యలను తీసుకోవాలో కనుగొనండి?

ముగింపు

దోమల వలన కలిగే వ్యాధులకు ప్రజలు తమ ఆదాయంలో అధిక భాగం ఖర్చుచేస్చున్నారని ఆరోగ్య సంస్థల నివేదికలు తెలుపుతున్నాయి. మనం ఇంట్లో దోమల నివారణకు రిపల్లెంట్లు, కాయిల్స్, శరీరం మీద పూతపూసే లేపనాలు ఎన్ని వాడినప్పటికి దోమలనుండి పూర్తి రక్షణ ఉండదు. దోమతెర వాడకం కన్నా దోమలు ఉత్పత్తికాకుండా చూడడమే కీలకం. మరుగు నీరు నిల్వ ఉంటే దోమలు పెరుగుతాయి. కాబట్టి మురుగునీరు పారేలా చూడడం అవసరం. నీరు నిల్వ చేరకుండా చూడడం, మురికి నీటిపై దోమలు గుడ్లు పెట్టకుండా కిరోసిన్ చల్లడం వంటి చర్యలు మనం సొంతంగా చేసుకోగలినవే కాబట్టి ఇలాంటి పద్ధతులను పాటిద్దాం.

దోమల వలన వ్యాపించే వ్యాధుల గురించి సేకరించిన సమాచారంపై ఒక నివేదికను తయారుచేయండి.

తదుపరి చర్యలు

 • మీరు సేకరించిన సమాచారంపై చిన్న ఉపన్యాసాన్ని లేదా ప్రజెంటేషన్ ని తయారుచేసి తరగతిగదిలో ప్రదర్శించండి.
 • దోమలవల్ల వ్యాపించే వ్యాధుల గురించిన సమాచారాన్ని సూక్తులరూపంలో (స్లోగన్స్) చార్డుపై రాసి, పాఠశాల ప్రవేశద్వారం దగ్గర ప్రదర్శించండి.
 • వారాపత్రికలనుండి మలేరియా, డెంగ్యూలకు సంబంధించిన సమాచారం, పటములను సేకరించి, స్క్రాప్ పుస్తకంను తయారుచేయండి.
 • దోమలవల్ల వ్యాపించే వ్యాధులు, వాటి యొక్క లక్షణాలు, నివారణచర్యలను చార్డుపై రాసి ప్రదర్శించండి.
 • మీ ఇంటి దగ్గరగాని/పాఠశాల పరిసర ప్రాంతాలలోగాని నివసిస్తున్న ప్రజలలో దోమలు వ్యాధుల వ్యాప్తి గురించి అవగాహనను కలిగించండి. (ముఖ్యంగా దోమలను అరికట్టే విధానాలపై ప్రజలలో అవగాహన కలిగించాలి.)
 • మీ ఇళ్ళ వద్ద లేదా పాఠశాల పరిసర ప్రాంతాల్లో దోమలు పెరగడానికి దోహదపడే పరిస్థితులను గమనించి, వాటిని నియంత్రించడానికి ప్రయత్నించండి.

ఆధారము: http://apscert.gov.in/

3.02702702703
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు