హోమ్ / వార్తలు / ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 2న ప్రజా ఫిర్యాదుల పరిష్కార దినం
పంచుకోండి

ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 2న ప్రజా ఫిర్యాదుల పరిష్కార దినం

ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 2న ప్రజా ఫిర్యాదుల పరిష్కార దినం

ఈ నెల 31 నుంచి నవంబరు 5 వరకు జగరనున్న విజిలెన్స అవగాహన కార్యక్రమాలలో భాగంగా నవంబరు 2న ప్రజా ఫిర్యాదుల పరిష్కార దినాన్ని నిర్వహిస్తున్నట్లు విశాఖపట్నం, విజయవాడ రీజియన్ల చీఫ్‌ కమిషనర్‌ శ్యామప్రసాద్‌ చౌదరి తెలిపారు. నిజాయితీ పెంపుదల, అవినీతి నిర్మూలన అనే అంశంపై విజిలెన్స వారోత్సవాలు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో ఉన్న ఆదాయ పన్ను కార్యాలయంలో 2న ప్రజలు తమ ఫిర్యాదులను, సలహాలను అందజేయవచ్చునని తెలిపారు. విజయవాడ రీజియనకు సంబంధించి కృష్ణా నుంచి అనంతపురం జిల్లాల పరిధిలో ఉన్నవారు 0866-2478485, విశాఖపట్నంలోని రీజనల్‌ పరిధిలో గల పశ్చిమ గోదావరి నుంచి శ్రీకాకుళం జిల్లా పరిధిలోని వారు 0891-2713444 (అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎన.ఎ్‌స.దామోదర్‌)కు ఫోనలు చేసి తమ సందేహాలను తీర్చుకోవలసిందిగా కోరారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు