హోమ్ / వార్తలు / ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఆరు కొత్త వైద్య కళాశాలలకు అనుమతి
పంచుకోండి

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఆరు కొత్త వైద్య కళాశాలలకు అనుమతి

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఆరు కొత్త వైద్య కళాశాలలకు అనుమతి

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులకు శుభవార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించేందుకు సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ అనుమతి మంజూరు చేసింది. ఈ కళాశాలల యాజమాన్యాలు 15 రోజుల్లోపు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ సూచించింది. ఒక్కొక్క కళాశాలలో 150 వంతున ఈ ఏడాది మరో 900 ఎంబీబీఎస్‌ సీట్లు పెరగనున్నాయి ఇందులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి నిమ్రా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌- జూపూడి (కృష్ణా జిల్లా), ఆర్‌వీఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(చిత్తూరు), గాయత్రీ విద్యాపరిషత్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌కేర్‌ అండ్‌ మెడికల్‌ టెక్నాలజీ- మరికవలస(విశాఖపట్నం) ఉన్నాయి.లంగాణ రాష్ట్రం నుంచి మహవీర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (వికారాబాద్‌), మహేశ్వర మెడికల్‌ కళాశాల(మెదక్‌), ఆర్‌వీఎం వైద్య కళాశాల ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చి సెంటర్‌- ములుగు (మెదక్‌) ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి మహవీర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (వికారాబాద్‌), మహేశ్వర మెడికల్‌ కళాశాల(మెదక్‌), ఆర్‌వీఎం వైద్య కళాశాల ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చి సెంటర్‌- ములుగు (మెదక్‌) ఉన్నాయి. టితో పాటు విశ్వభారతి వైద్య కళాశాల(కర్నూలు)లో 150 సీట్లు, మహారాజాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నెల్లిమర్ల)లో 150 సీట్లు, అపోలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చి(హైదరాబాద్‌)లో 100 సీట్లు కొనసాగించడానికి అనుమతి మంజూరు చేసింది. ర్నూలు వైద్య కళాశాలలో సూపర్‌ స్పెషాలిటీ కోర్సు డీఎం (గ్యాస్ట్రో ఎంటరాలజీ)లో రెండు సీట్లు, చలమేడ ఆనందరావు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (కరీంనగర్‌)లో డీఎం(న్యూరాలజీ)లో రెండు సీట్లు నూతనంగా ప్రారంభించడానికి అనుమతి ఇచ్చారు.

ఆధారం : ఈనాడు

పైకి వెళ్ళుటకు