హోమ్ / వార్తలు / ఎన్‌సీసీ కోటా అభ్యర్థులకు అర్హత పరీక్ష ఇంటరే
పంచుకోండి

ఎన్‌సీసీ కోటా అభ్యర్థులకు అర్హత పరీక్ష ఇంటరే

ఎన్‌సీసీ కోటా అభ్యర్థులకు అర్హత పరీక్ష ఇంటరే

ఎన్‌సీసీ కోటాలో(ఒక శాతం కోటా కింద) వైద్య సీట్ల భర్తీకి ‘అర్హత పరీక్ష’ ఇంటర్మీడియట్‌ మాత్రమేనని, ‘ఎంసెట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌’ ఏమాత్రం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ వైద్యశాఖ 2015 సెప్టెంబరు 3న జారీ చేసిన జీవోలో ఎన్‌సీసీ కోటాలో వైద్య సీట్ల భర్తీకి అర్హత పరీక్ష ‘ఎంసెట్‌’ అని పేర్కొనడాన్ని తప్పుపట్టింది. ఈ మేరకు ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ అనీస్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ జీవోలోని కొంత భాగాన్ని సవాలు చేస్తూ నెల్లూరు జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం..ఎంసెట్‌ పరీక్ష కేవలం పోటీ పరీక్ష అని, దానిని అర్హత పరీక్షగా పేర్కొనడం సరి కాదని స్పష్టం చేసింది. ఏపీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిబంధనల ప్రకారం ఇంజినీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌, మెడికల్‌, డెంటల్‌, ఫార్మాడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్‌ అర్హత పరీక్షగా పేర్కొన్నారని ధర్మాసనం గుర్తు చేసింది.

ఆధారం : ఈనాడు

పైకి వెళ్ళుటకు