హోమ్ / వార్తలు / ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీలో బీ-కేటగిరి మెడికల్ కౌన్సెలింగ్‌ ప్రారంభం
పంచుకోండి

ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీలో బీ-కేటగిరి మెడికల్ కౌన్సెలింగ్‌ ప్రారంభం

ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీలో బీ-కేటగిరి మెడికల్ కౌన్సెలింగ్‌ ప్రారంభం

స్థానిక ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీలో బీ-కేటగిరి మెడికల్ కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. ఇవాళ 150 బీ-కేటగిరి సీట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. అయితే... ఇప్పటికే బీ-కేటగిరిలో సీట్లు పొందిన అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు అనర్హులని ఎన్టీఆర్ హెల్త్‌ వర్సిటీ వీసీ రవిరాజ్‌ పేర్కొన్నారు. అలాగే ఎ-కేటగిరిలో మిగిలిన సీట్లకు శుక్రవారం సాయంత్రం కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, సీట్లు పొందిన అభ్యర్థులకు ఇక్కడే అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుందని వీసీ తెలిపారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీలో బీ-కేటగిరి మెడికల్ కౌన్సెలింగ్‌ ప్రారంభం సందర్బంగా వర్సిటీ ఎదుట విద్యార్ధులు బారులు తీరారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు