హోమ్ / వార్తలు / ఏపీ గ్రూప్‌-2 మెయిన్స్‌ సిలబస్‌ ఖరారు
పంచుకోండి

ఏపీ గ్రూప్‌-2 మెయిన్స్‌ సిలబస్‌ ఖరారు

ఏపీ గ్రూప్‌-2 మెయిన్స్‌ సిలబస్‌ ఖరారు

గ్రూప్‌-2 సర్వీసెస్‌ మెయిన్స్‌ సిలబస్‌ ఖరారైంది. తప్పులు, పునరుక్తులకు తావులేకుండా స్వల్ఫ మార్పులతో దీనిని రూపొందించారు. గతంలో ఒకసారి సిలబస్‌ను ఏపీపీఎస్సీ తన వెబ్‌సైట్లో పెట్టింది. అందులో పునరుక్తులు ఉన్నట్లు గుర్తించి .. వెబ్‌సైట్‌ నుంచి తొలగించారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన నేపథ్యంలో.. గ్రూప్‌-2 సిలబస్‌లో చాలా మార్పులు జరిగాయి. పలు విభాగాల్లో రిపీట్‌ అయిన సిలబస్‌ను సరిచేసి తుది సిలబస్‌ను  ఏపీపీఎస్సీ సమావేశంలో ఖరారు చేశారు. త్వరలో 750 పోస్టులతో గ్రూప్‌-2 సర్వీసెస్‌ కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు కమిషన్‌ కసరత్తు చేస్తోంది. స్ర్కీనింగ్‌ టెస్ట్‌కు సంబంధించిన సిలబస్‌ను ఇప్పటికే ఖరారు చేసింది

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు