హోమ్ / వార్తలు / ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌ కార్యాలయం గుంటూరు తరలింపు
పంచుకోండి

ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌ కార్యాలయం గుంటూరు తరలింపు

ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌ కార్యాలయం గుంటూరు తరలింపు

నాంపల్లిలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్‌ ఫార్మసీ కౌన్సిల్‌ కార్యాలయాన్ని బుధవారం గుంటూరు జిల్లాకు తరలించారు. రాష్ట్రాల విభజన జరిగిపోయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌, ట్రిబ్యునల్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇంతవరకు జరగలేదు. ఆ ప్రక్రియ పూర్తయ్యేవరకు ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌ జారీ చేసిన ధ్రువపత్రాలే తెలంగాణలోనూ చెల్లుబాటవుతాయని రిజిస్ట్రార్‌ పోల నాగరాజు తెలిపారు. పూర్తి వివరాలకు గూంటూరులోని ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌ కార్యాలయంలో గాని, 83743 79304 నంబరులో గానీ సంప్రదించవచ్చన్నారు. మరోవైపు నాంపల్లిలోని ఫార్మసీ కౌన్సిల్‌ కార్యాలయాన్ని మూసివేయడం పట్ల పలువురు ఫార్మసిస్టులు బుధవారం ఆందోళన వ్యక్తంచేశారు. సమాచారం లేకుండా వేరే రాష్ట్రానికి కార్యాలయం మార్చడమేమిటని ప్రశ్నించారు.

ఆధారం: ఈనాడు

పైకి వెళ్ళుటకు