హోమ్ / వార్తలు / ఏపీపీఎస్సీ గ్రూప్1 పరీక్షల హాల్‌టికెట్లు విడుదల
పంచుకోండి

ఏపీపీఎస్సీ గ్రూప్1 పరీక్షల హాల్‌టికెట్లు విడుదల

ఏపీపీఎస్సీ గ్రూప్1 పరీక్షల హాల్‌టికెట్లు విడుదల

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 13 నుంచి నిర్వహించనున్న 2011 గ్రూప్1 మెయిన్స్ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం నుంచి హాల్‌టికెట్లను విడుదల చేసింది. మెయిన్స్‌కు క్వాలిఫై అయిన అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను www.psc.ap.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని ఏపీపీఎస్సీ కార్యదర్శి సాయి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 13 ఉదయం 8 గంటల వరకు వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వివరించారు. ఈ పరీక్షలు 13 నుంచి 23 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు జరగనున్నాయి. ఇదే తేదీల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా 2011 గ్రూప్1 మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తోంది.

ఆధారం: సాక్షి

పైకి వెళ్ళుటకు