హోమ్ / వార్తలు / కొత్తగా 90 మైనారిటీ గురుకులాలు
పంచుకోండి

కొత్తగా 90 మైనారిటీ గురుకులాలు

కొత్తగా 90 మైనారిటీ గురుకులాలు

తెలంగాణలో కొత్తగా 90 మైనారిటీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2017 జూన్‌ నాటికి వీటిని సిద్ధం చేయాలని మైనారిటీ సంక్షేమ కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మౌలిక సదుపాయాలు, సిబ్బంది వివరాలు వెంటనే ప్రభుత్వానికి అందజేయాలని మైనారిటీ గురుకులాల సొసైటీ కార్యదర్శికి సూచించారు. శాశ్వత భవనాల నిర్మాణానికి అవసరమైన స్థలాల్ని రెండు నెలల్లోగా గుర్తించి పనులు మొదలు పెట్టాలన్నారు. సర్కారు ఇప్పటికే 70 మైనారిటీ గురుకుల పాఠశాలలకు అనుమతినిచ్చింది. తాజా వాటితో వీటి సంఖ్య 160కి చేరనుంది.

ఆధారం : ఈనాడు

పైకి వెళ్ళుటకు