హోమ్ / వార్తలు / త్వరలో దేశవ్యాప్తంగా 100 ‘అంతర్జాతీయ నైపుణ్య కేంద్రాలు
పంచుకోండి

త్వరలో దేశవ్యాప్తంగా 100 ‘అంతర్జాతీయ నైపుణ్య కేంద్రాలు

త్వరలో దేశవ్యాప్తంగా 100 ‘అంతర్జాతీయ నైపుణ్య కేంద్రాలు

భారతదేశంలో యువతీయువకులకు విద్యార్జన మాదిరిగా నైపుణ్య అభివృద్ధి కూడాముఖ్యమైన అంశమని నైపుణ్యఅభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ ప్రతాప్ రూడీఅన్నారు.  స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలోహైదరాబాద్ లో ఆదివారం నిర్వహిస్తున్న పలు నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలనుమంత్రి ప్రారంభించారు. అలాగే ‘పద్మ’ పురస్కారాల విజేతలను అభినందించి, సన్మానించే కార్యక్రమంలో కూడా మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం‘స్కిల్ ఇండియా’ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యాన్నిఇస్తున్నట్లు శ్రీ రాజీవ్ ప్రతాప్ రూడీ చెప్పారు.

వివిధ రంగాలలో నైపుణ్యం కలిగివున్న వ్యక్తులకు భారీ డిమాండ్ ఉందని శ్రీరూడీ అన్నారు. గుణాత్మకమైన విద్య, ప్రావీణ్యం కలిగిన శ్రమ శక్తి ప్రస్తుతతక్షణావసరాలు అని ఆయన చెప్పారు. ఆంగ్ల భాషలో కనీస స్థాయి ప్రవేశం, చక్కటి వాహన చోదక మెళకువలు ఉంటే చాలు ఊబర్, ఓలా ల వంటి సంస్థలు మంచి జీతాలతో కూడిన వేలాది డ్రైవర్ ఉద్యోగాలనుఇవ్వజూపుతున్నాయని మంత్రి వివరించారు. జంషెడ్ పూర్ లో దేశంలోని తొలి భారీ వాహనాలతయారీ విభాగం ఏర్పడినప్పటికీ, ఈ వాహనాలను నడపడం తెలిసిన వారు ఆపట్టణం పరిసర ప్రాంతాలలో చాలా తక్కువ మందే ఉండేవారు అని మంత్రి గుర్తు చేశారు.యువతలో నైపుణ్య అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గురించి శ్రీ రూడీచెబుతూ, దేశవ్యాప్తంగా 100 అంతర్జాతీయ స్థాయి నైపుణ్యకేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ అంతర్జాతీయ నైపుణ్య కేంద్రాలలో..విదేశాలలో ఉద్యోగం చేయాలనుకుంటున్న అభ్యర్థులకు విదేశీ ప్రయాణం కంటే ముందుగా తగినశిక్షణను అందజేస్తారని మంత్రి చెప్పారు. అంతేకాకుండా, ఆయా దేశాలలోని నియమావళిని గురించి వారికి తెలియజేయడంతో పాటు దౌత్యకార్యాలయాల వైపు నుంచి కూడా అవసరమైన సహాయాన్ని సమకూర్చడం జరుగుతుందని ఆయనతెలిపారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఒక కోటి మందికి నైపుణ్యాల అభివృద్ధిలోశిక్షణను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కూడా మంత్రి వెల్లడించారు. స్వర్ణభారత్ ట్రస్టు చేపడుతున్న కార్యక్రమాలను శ్రీ రాజీవ్ ప్రతాప్ రూడీ ఈ సందర్భంగా అభినందించారు.యువత శ్రేయస్సును కాంక్షిస్తూ, వారి కోసం ఈ ట్రస్టు నిర్వహిస్తున్న శిక్షణకార్యక్రమాలు ప్రభావాత్మకంగా ఉన్నాయని ఆయన అన్నారు.

ఈ ఏడాది ‘పద్మ’ పురస్కారాలకు ఎంపికైన వారిని మంత్రులు శ్రీ రాజీవ్ ప్రతాప్ రూడీ,శ్రీ ఎం. వెంకయ్య నాయుడు సన్మానించారు. సన్మానంపొందిన వారిలో డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి (సివిల్ సర్వీస్), డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ వహీద్ (వైద్యం), ఆచార్య ఎక్కా యాదగిరి రావు (కళ-శిల్పకళ), డాక్టర్ బి.వి.ఆర్. మోహన రెడ్డి (వ్యాపారం & పరిశ్రమ), శ్రీ దరిపల్లి రామయ్య (సంఘసేవ),శ్రీ చింతకింది మల్లేశం (శాస్త్ర విజ్ఞ‌ానం &ఇంజినీరింగ్) ఉన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయజనతా పార్టీ శాసన సభా పక్షనేత, శాసనసభ్యుడు శ్రీ జి.కిషన్ రెడ్డి,ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ కామినేనిశ్రీనివాసరావు, చలనచిత్ర దర్శకులు శ్రీకె. రాఘవేంద్ర రావు, స్వర్ణ భారత్ ట్రస్ట్ మేనేజింగ్ట్రస్టీ  శ్రీమతి దీపా వెంకట్, స్వర్ణ భారత్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు శ్రీ కృష్ణప్రసాద్, ఎల్ అండ్ టి డిప్యూటీ మేనేజింగ్డైరక్టర్ శ్రీ ఎస్.ఎన్. సుబ్రమణ్యం, గ్లోబల్హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ కె. రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.

ఆధారం: పత్రికా సమాచార కార్యాలయము

పైకి వెళ్ళుటకు