హోమ్ / వార్తలు / పన్ను ఎగవేత నియంత్రణకు సరికొత్త సాఫ్ట్‌వేర్‌
పంచుకోండి

పన్ను ఎగవేత నియంత్రణకు సరికొత్త సాఫ్ట్‌వేర్‌

పన్ను ఎగవేత నియంత్రణకు సరికొత్త సాఫ్ట్‌వేర్‌

వాణిజ్య పన్నులశాఖకు ప న్నులు ఎగవేస్తూ సర్క్యులర్‌ ట్రాన్సాక్షన్స చేసే వ్యాపారులకు చెక్‌ పెట్టేందుకు త్వరలో సరికొత్త సాఫ్ట్‌వేర్‌ అందుబాటులోకి తీసుకొ స్తున్నట్లు ఆ శాఖ కమిషనర్‌ జె.శ్యామలారా వు తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం గుంటూరు మెడి కల్‌ కళాశాలలోని జింఖానా ఆడిటోరియంలో శుక్రవారం ప్రారంభమైంది.

వాణిజ్య పన్నుల శాఖకు పన్ను ఎగవేస్తూ నలుగురైదుగురు వ్యాపారం నిర్వహించే సర్క్యులర్‌ ట్రాన్సాక్షన్‌కు చెక్‌ పెట్టే సాఫ్ట్‌వేర్‌ పై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన చేశారు. నిపుణుల బృందం ఆ సాఫ్ట్‌వేర్‌ వినియోగా న్ని, విశేషాలను అధికారులకు వివరించింది. కొందరు అక్రమార్కులు చట్టాల్లోని లొసుగు లతో పన్ను ఎగవేస్తూ చేసే వ్యాపార వ్యవ హారాల గుట్టును తెలుసుకునే కీలక అంశాలను అధికారులకు వివరించారు

ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు